ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
నిజామాబాద్ సిటీ : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రభారం పడుతోందని డీసీసీ అధ్యక్షుడు తాహెర్ అన్నారు. శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఆటోను తాడుతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ చమురు సంస్థలు ఇష్టానుసారంగా ధరలు పెంచటంతో వాహనదారులపై తీవ్ర భారం పడుతోందన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ మాట్లాడుతూ యూపీఏ హయంలో 140 డాలర్లుకు లభించే బ్యారల్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉండేవని, ప్రస్తుతం 80 డాలర్లకే బ్యారల్ ఉన్న ఆల్ టైం ధరలు ఉన్నాయన్నారు.
పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిగి బతుకు భారంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పా గంగారెడ్డి, యూత్ నాయకులు నాగరాజు, కిషోర్, రాథోడ్, బిన్ని, ఆకుల మహేందర్, మధుకర్, విజయ్, నరేందర్, దత్తాద్రి, చింటు, అదర్స్, మున్నా, ఏఎల్ రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
వర్నిలో ఆటోలను లాగుతూ..
వర్ని(బాన్సువాడ): రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోకు తాడు కట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్ని క్రాసింగ్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ హరిబాబుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు.
ఈ సందర్భంగా వర్నిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్లం సాయరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో డీజిల్ ధరలను నియంత్రించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రంజ్యానాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గంగా ప్రసాద్, ఎస్‌ఎన్‌పురం టౌన్ అధ్యక్షుడు ప్రశాంత్ పటేల్, విండో మాజీ డై రక్టర్ సురేష్ బాబా, మండల నాయకులు మో స్రా లక్ష్మణ్, గైని గోపి, మల్లికార్జునప్పా, నాగేశ్వర్రావ్, సలీం, ఖాసీం, ఆటో యూనియన్ నాయకు లు ఫెరోజ్, ఆజాం తదితరులు పాల్గొన్నారు.
ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో..
వర్ని మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పెట్రో ధరల పెంపుపై ఆటో కార్మికుల నిరసన తెలిపారు. ప్రతి రోజు ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం తహసీల్ కార్యాలయానికి తహసీల్దార్ హరిబాబుకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ట్రాలీ ఆటో యూనియన్ సంఘం అధ్యక్షుడు కె శ్రీనివాస్, ఉపాద్యాక్షుడు మారుతి, మాణిక్యం, బాబుమియా, సాయిలు, కృష్ణ, వసంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment