బెంగళూరు: కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంధన ధరలు పెరిగినప్పటికీ పొరుగు రాష్ట్రాల ధరల కంటే తక్కువగానే ఉందని సమర్ధించుకున్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, సీఎం సిద్ధరామయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై మూడు రూపాయల సేల్స్ ట్యాక్స్ పెంచాం. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల కంటే తక్కువే ఉంది. బీజేపీ నేతలు దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు మాట్లాడే ముందు కేంద్రం పెంచిన అదనపు సుంకాలపై కామెంట్స్ చేస్తే బాగుండేది.
పలు సందర్భాల్లో రాజకీయ కారణాల దృష్ట్యా ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్‌పై అదనపు సుంకాన్ని పెంచారు. దాదాపు పది కంటే ఎక్కువ సార్లే పెంచారు. కేంద్రం అదనంగా సుంకాలు విధించినప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు. మోదీని ఎందుకు ప్రశ్నించలేదు. కేంద్రం పన్నలు విధించిన కారణంగా మేము దాదాపు 1,87,00,000 కోట్లు పోగొట్టుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ట్యాక్స్ పెంచామని’ చెప్పుకొచ్చారు.
#WATCH | Bengaluru: On fuel price hike, Karnataka CM Siddaramaiah says, "We have raised sale tax by Rs 3, both on petrol and diesel. Still, we are less than the rates that our neighbouring states have. The BJP people are making it an issue for political reasons. When Narendra… pic.twitter.com/oIbmbYGqLY
— ANI (@ANI) June 17, 2024
ఇదిలా ఉండగా.. ఎన్నికల ఫలితాలు వెలువడిని అనంతరం కర్ణాటకలో ఇంధన ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలపై అదనంగా మూడు రూపాయలు ట్యాక్స్ విధించారు. దీంతో, పెరిగిన ఇంధన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment