టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్ : వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని, ఫలితాల వెల్లడికి అడ్డుగా ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని పశు సంవర్థక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.గణేష్ రెడ్డి ప్రసంగించారు.
వెటర్నరీ అసిస్టెంట్ నియామకాల పరీక్ష రాసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఫలితాల ప్రస్తావన లేకుండా పోయిందని ఆరోపించారు. కోర్సులు పూర్తి చేసుకుని నోటిఫికేషన్ కోసం పదేళ్లుగా వేచి చూశామని అన్నారు. అలాంటి సందర్భంగా కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు.
ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకుని పరీక్షలు రాసిన అభ్యర్థులందరూ అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి.ప్రణయ్ భరత్, దివాకర్, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీను, పి.మహేందర్, అనిల్, ఎం.చక్రవర్తి, తెలంగాణ డాక్టర్ల సంఘం అధ్యక్షులు కె.శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment