vetarnary
-
ఆగస్టు నుంచి వెటర్నరీ కళాశాలలో అడ్మిషన్లు
భీమదేవరపల్లి: ఆగస్టు మాసం నుంచి జిల్లాలోని మామునూర్ వెటర్నరీ కళాశాలలో అడ్మిషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయని వీసీఐ (వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృంద చైర్మన్ డాక్డర్ జేవీ రమణ, సభ్యులు డాక్డర్ ఉషా కుమారి, డాక్టర్ ఎస్ ఎస్ చోప్టే తెలిపారు. మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్లో వెటర్నరీ కళాశాల మంజూరు అయినట్లు కళాశాల నిర్మాణం కోసం రూ. 370 కోట్లు సైతం మంజూరు చేసినట్లు తెలిపారు. పోలీస్ హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. కళాశాలలో ఏర్పాట్లు, వసతులు తదితర వాటిని పరిశీలించామని, నివేదికను హైదరాబాద్, ఢిల్లీ అధికారులకు పంపినట్లు వారు వెల్లడించారు. దాదాపుగా ఆగస్టులో కళాశాలలో అడ్మిషన్లు జరిగే అవకాశాలున్నట్లు వారు చెప్పారు. వారి వెంట పీవీఆర్, వీరోజీరావు, నర్సింగరెడ్డి, ప్రదీప్, ఆలయ ఈఓ హరిప్రకాష్రావు, అర్చకులు తాటికొండ వీరభద్రయ్య, రాజన్న, రాంబాబు ఉన్నారు. -
మా డబ్బులు మాకివ్వాలి
చిట్యాల(నకిరేకల్) : చిట్యాల పశువైద్యశాలలో పనిచేసిన అటెండర్ సబ్సిడీ పరికరాలు ఇప్పిస్తామని, పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తామని రైతులు, పశువుల పెంపకందారుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఊడాయించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం బాధితులు చిట్యాల పశువైద్యశాల ఎదుట ఆందోళనకు దిగారు. చిట్యాల పశువైద్యశాలలో ఆరు నెలల క్రితం వరకు అటెండర్గా పనిచేసిన కిరణ్ మండలంలోని పదిమంది రైతుల వద్ద నుంచి సబ్సిడీపై ఇచ్చే గడ్డికోసే యంత్రాలను ఇప్పిస్తానని ఒక్కొక్క రి వద్ద నుంచి రూ.11 వేల చొప్పున వసూలు చే శాడు. అంతేకాకుండా సబ్సిడీపై కోళ్లు ఇప్పిస్తానని మరికొందరి దగ్గర నుంచి రూ. 15 వేలు వసూలు చేశాడు. పదుల సంఖ్యలోని రైతులకు చెందిన పశువులకు బీమా సౌకర్యం కల్పిస్తామని ఒక్కోక్క పశువుకు రూ.290 చొప్పున వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసి పరికరాలు ఇవ్వకపోవడం, ఆ తర్వాత అకస్మాత్తుగా వేరే గ్రా మానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. దీంతో కొద్దిరోజులుగా బాధితులు స్థానిక పశువైద్యాధికారి అమరేందర్కు తెలియజేసి తగిన న్యాయం చేయాలని కోరారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. చిట్యాల పశువైద్యాధికారి మరో రెండు మూడు రోజుల్లో బదిలీ కానున్నట్లు తెలియడంతో సోమవారం బాధితులు పశువైద్య శాల ఎదుట నిరసనకు దిగారు. అటెండర్ వద్ద నుంచి తమకు రావల్సిన డబ్బులు ఇప్పించాలని బాధితులు పశువుల డాక్టర్ను కోరారు. కాగా గడ్డి యంత్రం కోసం డబ్బులు ఇచ్చిన వారిలో చిట్యా ల జెడ్పీటీసీ శేపూరి రవీందర్ సైతం రూ.4వేలు ఇవ్వడం కొస మెరుపు. పశువైద్యాధికారి వివరణ అటెండర్ కిరణ్ గత ఆక్టోబర్ నెలలో బదిలీపై వేరే పశువైద్యాశాలకు వెళ్లాడని చిట్యాల పశువైద్యాధికారి జెల్లా అమరేందర్. పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు తనకు తెలిపారని, అతనితో ఫోన్లో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించిన అందుబాటులోకి రావడం లేదన్నారు. జరిగిన విషయాన్ని పైఅధి కారులకు తెలియజేస్తానని తెలిపారు. -
పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ధర్నా
హైదరాబాద్ : వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని, ఫలితాల వెల్లడికి అడ్డుగా ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని పశు సంవర్థక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు అభ్యర్థుల ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.గణేష్ రెడ్డి ప్రసంగించారు. వెటర్నరీ అసిస్టెంట్ నియామకాల పరీక్ష రాసి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఫలితాల ప్రస్తావన లేకుండా పోయిందని ఆరోపించారు. కోర్సులు పూర్తి చేసుకుని నోటిఫికేషన్ కోసం పదేళ్లుగా వేచి చూశామని అన్నారు. అలాంటి సందర్భంగా కొత్త రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకుని పరీక్షలు రాసిన అభ్యర్థులందరూ అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి.ప్రణయ్ భరత్, దివాకర్, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీను, పి.మహేందర్, అనిల్, ఎం.చక్రవర్తి, తెలంగాణ డాక్టర్ల సంఘం అధ్యక్షులు కె.శ్రీధర్ పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు వద్దు
ఆగని పశు వైద్య విద్యార్థుల ధర్నా ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం గన్నవరం : పశువైద్యులకు నష్టం కలిగించే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని స్థానిక ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. పశువైద్యుల నియామకాలను పశుసంవర్ధక శాఖ ద్వారానే చేపట్టాలని కోరుతూ వెటర్నరీ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళనను కొనసాగించారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘ నాయకులు ఎం. బసవయ్య, ఎన్. శివరామకృష్ణ, ఎన్. మునికుమార్, కె. మనోజ్కుమార్లు మాట్లాడుతూ...ఇప్పటివరకు పశువైద్యుల నియామకాలను మెరిట్ ఆధారంగా డిపార్ట్మెంట్ సెలక్షన్స్ ద్వారానే నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం కొత్తగా జారీచేసిన జీవో నెం 110 ప్రకారం 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారని తెలిపారు. దీనివల్ల పశువైద్య విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గత వారం రోజులుగా రాష్ట్రంలోని మూడు పశువైద్య కళాశాల విద్యార్థులు పరీక్షలు, తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి సంఘ నాయకులు సుభాష్చంద్రబోస్, ఎల్. ఫణికుమార్, గోపినా«ద్, జాస్మిన్, సూర్యకుమారి, మౌనిక, లక్ష్మీప్రసన్న, దీప్తి, విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.