ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు వద్దు
ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు వద్దు
Published Thu, Aug 18 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
ఆగని పశు వైద్య విద్యార్థుల ధర్నా
ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం
గన్నవరం :
పశువైద్యులకు నష్టం కలిగించే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని స్థానిక ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. పశువైద్యుల నియామకాలను పశుసంవర్ధక శాఖ ద్వారానే చేపట్టాలని కోరుతూ వెటర్నరీ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళనను కొనసాగించారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘ నాయకులు ఎం. బసవయ్య, ఎన్. శివరామకృష్ణ, ఎన్. మునికుమార్, కె. మనోజ్‌కుమార్‌లు మాట్లాడుతూ...ఇప్పటివరకు పశువైద్యుల నియామకాలను మెరిట్ ఆధారంగా డిపార్ట్‌మెంట్ సెలక్షన్స్ ద్వారానే నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం కొత్తగా జారీచేసిన జీవో నెం 110 ప్రకారం 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారని తెలిపారు. దీనివల్ల పశువైద్య విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గత వారం రోజులుగా రాష్ట్రంలోని మూడు పశువైద్య కళాశాల విద్యార్థులు పరీక్షలు, తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి సంఘ నాయకులు సుభాష్‌చంద్రబోస్, ఎల్. ఫణికుమార్, గోపినా«ద్, జాస్మిన్, సూర్యకుమారి, మౌనిక, లక్ష్మీప్రసన్న, దీప్తి, విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement