గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కడప : గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కడప నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్కే నగర్, ఏఎస్‌ఆర్ నగర్, బుడగజంగాల కాలనీ, మృత్యుంజయ కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
సదరు ప్రాంతాల్లో ఇళన్నీ నీట మునిగాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం కనీసం పరామర్శించిన పాపాన పోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వైఖరికి నిరసనగా వర్షపు నీటిలో కాలనీ వాసులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు.