తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ కేంద్ర పర్యావరణ పరిధిలోకి రాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆక్వాఫుడ్ పార్క్‌పై సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్ష వర్ధన్ సమాధానం చెప్పారు. తుందుర్రులో నిర్మాణంలో ఉన్న మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ 100 ఎకరాల విస్తీర్ణానికి లోబడి ఏ, బీ క్యాటగిరీలో ఉందని, దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులు మంజూరు చేసే అధికారం రాష్ట్రంలోని పర్యావరణ నియంత్రణ బోర్డుకు మాత్రమే ఉందని వెల్లడించారు. మొగల్తూరులోని ఆనంద సీఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో విషవాయువుల కారణంగా అయిదుగురు కార్మికులు చనిపోయిన విషయం తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.
Published Mon, Jul 31 2017 2:29 PM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM
Advertisement
Advertisement
Advertisement