తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్ | High court grants bail to areti satyavathi and others | Sakshi
Sakshi News home page

తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్

Published Fri, Oct 28 2016 11:10 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్ - Sakshi

తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఉద్యమకారులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఏడుగురికి  బెయిల్ మంజూరు చేస్తూ నిర్మాణంలో ఉన్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు 50 మీటర్ల దూరంలో ఉండాలని న్యాయస్థానం షరతు విధించింది. బెయిల్ రావడంతో తణుకు సబ్జైలులో ఉన్న ఆరేటి సత్యవతి శుక్రవారం సాయంత్రం విడుదల కానుండగా, కోర్టు ఉత్తర్వులు అందగానే మిగిలిన ఆరుగురు నరసాపురం సబ్ జైలు నుంచి విడుదల అవుతారు.

కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తణుకు సబ్ జైలులో సత్యవతిని పరామర్శించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉద్యమకారులకు వైఎస్ఆర్ సీపీ అండతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేతపై ఇవాళ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఆక్వా ఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆరేటి సత‍్యవతి సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement