Aareti satyavati
-
తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్
-
తుందుర్రు ఉద్యమకారులకు బెయిల్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఉద్యమకారులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. ఏడుగురికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్మాణంలో ఉన్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు 50 మీటర్ల దూరంలో ఉండాలని న్యాయస్థానం షరతు విధించింది. బెయిల్ రావడంతో తణుకు సబ్‌జైలులో ఉన్న ఆరేటి సత్యవతి శుక్రవారం సాయంత్రం విడుదల కానుండగా, కోర్టు ఉత్తర్వులు అందగానే మిగిలిన ఆరుగురు నరసాపురం సబ్ జైలు నుంచి విడుదల అవుతారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తణుకు సబ్ జైలులో సత్యవతిని పరామర్శించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉద్యమకారులకు వైఎస్ఆర్ సీపీ అండతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేతపై ఇవాళ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆరేటి సత్యవతి సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఆరేటి సత్యవతికి వైఎస్ జగన్ పరామర్శ
ఏలూరు: మెగా ఆక్వాఫుడ్కు వ్యతిరేకంగా పోరాడి 36 రోజులుగా తణుకు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో బుధవారం వైఎస్ జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు గ్రామానికి వెళ్లనున్నారు. ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కలుసుకుని ముఖాముఖీ మాట్లాడనున్నారు.