రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు... | Revanth reddy gets relief in high court over bail conditions | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు...

Published Tue, Sep 8 2015 11:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు... - Sakshi

రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు...

హైదరాబాద్ : కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.  ఆయన బెయిల్ ఆంక్షలను హైకోర్టు సడలించింది. రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం ఆయన ఏసీబీ కార్యాలయానికి విధిగా హాజరై సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు డబ్బులు ఇస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డికి  బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ...ఆయన తన సొంత నియోజకవర్గంలోనే ఉండాలని  షరతులు విధించింది. దాంతో  బెయిల్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement