VoteForCash
-
రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు...
-
రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లొచ్చు...
హైదరాబాద్ : కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ ఆంక్షలను హైకోర్టు సడలించింది. రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ సహా దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రతి సోమవారం సాయంత్రం ఆయన ఏసీబీ కార్యాలయానికి విధిగా హాజరై సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు డబ్బులు ఇస్తూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ...ఆయన తన సొంత నియోజకవర్గంలోనే ఉండాలని షరతులు విధించింది. దాంతో బెయిల్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. -
ఓటుకు కోట్లుపై దద్దరిల్లిన అసెంబ్లీ
-
ఓటుకు కోట్లుపై దద్దరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్ : ఓటుకు కోట్లుపై ఏపీ అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టడంతో అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే పది నిమిషాల పాటు వాయిదా పడింది. కాగా ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ఆరంభమయ్యాయి. ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ...వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ...స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఓటుకు కోట్లు కేసుపై చర్చ జరపాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. సభ జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ...ఫలితం లేకపోవటంతో సమావేశాలను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. -
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : ఐదోరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం సభ ఆరంభం కాగానే ఓటుకు కోట్లు అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. -
ఓటుకు కోట్లుపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓటుకు కోట్లు అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా శాసనసభ,మండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో ఒక పక్క కరువు, రైతుల ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలు, మరోపక్క ప్రభుత్వ నిర్వాకంతో గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతి చెందడం, పట్టిసీమలో మోసాలు లాంటి పలు కీలకాంశాలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులతో ముగించేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష పార్టీ సమావేశాలను పొడిగించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. దీంతో నేటితో ఏపీ అసెంబ్లీ ముగియనుంది. -
ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిల్
హైదరాబాద్ : ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ న్యాయవాది పీవీ కృష్ణయ్య సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 8 అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ సందర్భంగా న్యాయస్థానం... పిటిషన్ విచారణ అర్హతను ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటే రెండు వారాల్లోగా రూ.లక్ష డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
'టీడీపీని వీడను, కేసీఆర్‌ను వదలను'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం తనను కుట్ర పూరితంగా ఓటుకు కోట్లు కేసులో ఇరికించిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలైన తర్వాత విచారణలో ప్రభుత్వ కుట్రలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో శుక్రవారం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దె దించేంతవరకూ తన పోరాటం కొనసాగుతుందని, టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. మరో 25 ఏళ్లు కొడంగల్ నియోజకవర్గం నుంచి తానే గెలుస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయపరిచి ముందుకు సాగుతానని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ సర్కార్ తీరును ఎండగడతానని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సదారాం నియామకంపై నిబంధనలకు విరుద్ధమని, హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. -
'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక 'సాక్షి' సంపాదించింది. ఓటుకు కోట్లు కేసులో నడిచిన వ్యవహారమంతా వాస్తవాలేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. ఏసీబీ దాడులు చేసిన సమయంలో రెడ్హాండెడ్గా పట్టుకున్న వీడియో, ఆడియో టేపులపై ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషించింది. దాదాపు 12 రోజులపాటు నిశితంగా విశ్లేషించి... అవన్నీ వాస్తవాలేనని నిర్ధారించింది. వీడియో, ఆడియో టేపులను ఎవరూ ఎడిట్ చేయలేదని, కల్పితాలు కాదని కూడా ల్యాబ్ విస్పష్టంగా ప్రకటించింది. ఈ ఫోరెన్సిక్ నివేదిక ఓటుకు కోటు కేసులో కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ...నగదు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన విషయం తెలిసిందే. రెండు సెల్ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్‌కు పంపారు. అలాగే మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్‌కు పంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్‌కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 14 ఆడియోలో, వీడియో టేపుల్లో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేశారు. *మొత్తం మూడు ఫైల్స్‌లో వీడియో దృశ్యాలు * మొదటి వీడియో ఫైల్ నిడివి 86 నిమిషాల 21 సెకండ్లు *రెండో వీడియో ఫైల్ నిడివి 10 నిమిషాల 38 సెకండ్లు *మూడో వీడియో ఫైల్ నిడివి 43 నిమిషాల 9 సెకన్లు * తొలి ఆడియో ఫైల్ నిడివి 45 నిమిషాల 12 సెకన్లు * రెండో ఆడియో ఫైల్ నిడివి 44 నిమిషాల 52 సెకన్లు *మూడో ఆడియో ఫైల్ నిడివి 47 నిమిషాల 18 సెకన్లు ఎవరు ఎవరితో ఏం మాట్లాడారో మొత్తం విపులంగా రిపోర్టులో పేర్కొన్న ఎఫ్ఎస్ఎల్ ఏసీబీ నుంచి జులై 14న టేపులు అందుకున్న ఎఫ్ఎస్ఎల్, జులై 24న నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ -
రేవంత్‌కు మరోసారి చుక్కెదురు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మరోసారి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్ నిబంధనలపై మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టేసింది. మరోవైపు ఈకేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ నిబంధనలను కోర్టు స్వల్పంగా సడలించింది. వారిరువురు సోమ, మంగళ, శుక్రవారాల్లో కోర్టుకు హాజరు అయితే చాలని న్యాయస్థానం సూచించింది. కాగా గతంలో కూడా బెయిల్ షరతులు సడలించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో తను సీనియర్ నాయకుడినని, రాజధానిలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం ఉందని అందువల్ల బెయిల్ షరతులను సడలించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. దాంతో మరోసారి ఆయన కోర్టును ఆశ్రయించినా ...ఉపశమనం లభించలేదు. -
ఏసీబీ అధికారులు వేధిస్తున్నారు: ఉదయసింహ
హైదరాబాద్ : ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న ఉదయసింహ అన్నారు. ఆయన సోమవారం ఉదయం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయసింహ...' ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో నేర అంగీకార పత్రంపై బలవంతంగా సంతకం చేయాలని వేధిస్తున్నారని, తాను చెప్పిన అంశాలు కాకుండా ఏసీబీ ఇష్టానుసారంగా నేర అంగీకార పత్రాన్ని రూపొందించిదని' ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. కాగా కేసు తదుపరి విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదా పడింది. -
కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు వాయిదాకు ఆయన కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదాఇ పడింది. కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ రాలేకపోతున్నట్లు రేవంత్ తరపు న్యాయవాదులు గతంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసినా... వాయిదాకు రేవంత్ రెడ్డి కచ్చితంగా హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌సింహా కోర్టుకు హాజరు అయ్యారు. -
'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన 'నోటుకు కోట్లు' కేసుకు సంబంధించిన ఛార్జ్షీటులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేర్చినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనం ప్రచురించింది. 'క్లైయిమ్స్ బాస్ ఈజ్ ఏపీ సీఎం' అంటూ ఆ పత్రిక మొదటి పేజీలో వార్తను వేసింది. ఓటుకు కోట్లు కేసు ఛార్జ్షీటులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చినట్లు ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.సురేందర్ రావు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణతోపాటు చంద్రబాబు ఆదేశాల మేరకే తాను మాట్లాడేందుకు వచ్చానంటూ రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన సంభాషణల ఆధారంగా బాబు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఫోన్ కాల్స్ సంభాషణల ఆధారంగా 'బాస్' చంద్రబాబు నాయుడే అని నిర్థారించిన ఏసీబీ..ఈ మేరకు ఆయన పేరును ఛార్జ్షీటులో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి చంద్రబాబే సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్న నేపథ్యంలో బాబు పేరు ఛార్జ్‌షీట్‌లో చేర్చినట్లు సమాచారం. అలాగే ఓటుకు కోట్లు ప్రలోభాల పర్వం వెనుక ఉన్న కీలక వ్యక్తుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మరో వారం రోజుల్లో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం తన నివాసంలో డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ, పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ ఛార్జిషీటు, భవిష్యత్ పరిణాలపై పోలీస్ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగుతుందన్న వార్తలతో చంద్రబాబు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగా ఓటుకు కోట్లుతో సంబంధమున్న అనేక మంది ఫోన్ సంభాషణల సారాంశాన్ని డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు హ్యారీ సెబాస్టియన్, ఉదయ సింహ, మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లను నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు)లోని సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్లు 120(బి)(నేరపూరిత కుట్ర), 34 (కామన్ ఇంటెన్షన్) కింద అభియోగాలను మోపుతూ బుధవారం 25 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన ఏసీబీ ఇందులో 39 మందిని సాక్షులుగా పేర్కొంది. -
రేవంత్ అనుచరులకు ఏసీబీ నోటీసులు
-
రేవంత్ అనుచరులకు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు సైదులు, అల్లూరి నారాయణరాజుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రేవంత్ డ్రైవర్‌కు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఫోరెన్సిక్ తుది నివేదక నేడు ఏసీబీ కోరుకు చేరనుంది. ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా ఉన్న ఆడియో, వీడియో టేపులను పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికను గతంలోనే కోర్టుకు అందజేసింది. అయితే వీటిపై మరింత శోధన చేసిన ల్యాబ్... సమగ్ర వివరాలతో కూడిన తుది నివేదికను కోర్టుకు అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో వేగం పెంచనున్నట్లు సమాచారం. మరికొంత మందిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. -
ఏసీబీ విచారణకు హాజరైన టీడీపీ నేత ప్రదీప్
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ నేత ప్రదీప్, సుధీర్, మనోజ్, పుల్లారావు, రాఘవేందర్ రెడ్డి సోమవారం ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌కు ప్రదీప్ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేందర్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద వీరందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఐదుగురు తెలుగు యువత నేతలకు కూడా ఓటుకు కోట్లు వ్యవహారంలో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
టీడీపీ నేత డ్రైవర్లకు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో మరో ఇద్దరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డి ...ఇద్దరి డ్రైవర్లకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా సీఆర్పీసీ 160 కింద...టీడీపీ నేత డ్రైవర్లకు నోటీసులు ఇచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండురోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు వేం నరేందర్‌రెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కృష్ణకీర్తన్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలతో నరేందర్‌రెడ్డి పాత్రపై ఏసీబీకి పలు అనుమానాలు కలిగినట్లు సమాచారం. -
సండ్ర బెయిల్‌పై వాదనలు పూర్తి, నిర్ణయం రేపటికి
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. విచారణ పూర్తయినందున సండ్రకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తే...కేసు కీలక దశలో ఉందని, సండ్రకు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. దాంతో వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. -
'ప్రధాన సూత్రధారుల్లో సండ్ర ఒకరు'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే విచారణ పూర్తయినందున సండ్రకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తే... సండ్రకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సండ్ర వెంకట వీరయ్య ప్రధాన సూత్రధారుల్లో ఒకరని, ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత సండ్ర పాత్ర బయటపడిందని, కేసు కీలక దశలో ఉందని, దర్యాప్తు సంస్థకు సరైనంత సమయం ఇవ్వాలని, కేసులో సూత్రధారి సండ్రకు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని, దర్యాప్తుకు ఏమాత్రం సహకరించకుండా సండ్ర తప్పించుకుని తిరిగారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. -
'ఎఫ్ఐఆర్లో సండ్ర పేరు లేకున్నా అరెస్ట్'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో అరెస్ట్ అయిన సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కస్టడీ పూర్తయినందున సండ్రకు బెయిల్ మంజూరు చేయాలని సండ్ర తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే విచారణ పూర్తయిందని, స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారని, ఎఫ్ఐఆర్లో ఎక్కడా సండ్ర పేరు లేదని, అయినా సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని సండ్ర తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. విచారణలో A-1,A-2, A-3 నిందితులు కూడా సండ్ర పేరును ఎక్కడా ప్రస్తావించలేదని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. -
రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందే..
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సోమవారం కోర్టు వాయిదాకు గైర్హాజరు అయ్యారు. దాంతో ఏసీబీ కోర్టు సీరియర్ అయింది. ఆగస్టు 3న వాయిదాకు రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ రాలేకపోతున్నట్లు రేవంత్ తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అయితే సరే వాయిదాకు రేవంత్ రెడ్డి కచ్చితంగా హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌సింహా కోర్టుకు హాజరు అయ్యారు. 'ఓటుకు కోట్లు' కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తన నియోజకవర్గం కొడంగల్ దాటి బయటకు రాకూడదని, ముగ్గురు నిందితులు పాస్‌పోర్టులు స్వాధీనం చేయడంతోపాటు రూ.5లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అయిదో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనకు ఈనెల 21 వరకూ రిమాండ్ విధించటంతో అధికారులు చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు సండ్ర కస్టడీతో పాటు, బెయిల్ పిటిషన్లు బుధవారం విచారణకు రానున్నాయి. ఎమ్మెల్యే అయినందున సండ్రను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
సాక్షి చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు
-
'సాక్షి' చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి కీలక రిమాండ్ రిపోర్ట్ 'సాక్షి' సేకరించింది. అందులో ఏసీబీ వెల్లడించిన వివరాలు మొత్తం రాజకీయ వ్యవస్థ విస్తుబోయేలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ ఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నదానిపై సండ్ర సవివరంగా మాట్లాడారు. ప్రధానంగా సెబాస్టియన్ - సండ్ర వెంకట వీరయ్యల మధ్య సంభాషణలను ఏసీబీ అధికారులు సవివరంగా సేకరించి మరీ కోర్టుకు సమర్పించారు. మే 27 నుంచి మే 31 మధ్య అయిదు రోజుల గడువులో ఏకంగా 32 సార్లు సెబాస్టియన్, సండ్ర మధ్య సంభాషణలు జరిగాయి. సండ్ర 23 సార్లు కాల్ చేస్తే.. సెబాస్టియన్ 8 సార్లు కాల్ చేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల రికార్డులను పరిశీలిస్తే.. మొత్తం వ్యవస్థ ఏ స్థాయిలో అవినీతి ప్రవాహిస్తుందో అర్థమవుతుంది. మరోవైపు సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
మత్తయ్య బాటలోనే జిమ్మిబాబు!
-
మత్తయ్య బాటలోనే జిమ్మిబాబు!
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న మత్తయ్య బాటలోనే తాజాగా జిమ్మిబాబు కూడా పయనిస్తున్నట్లు సమాచారం. తనపై మోపిన అభియోగాలను కొట్టివేయాలంటూ జిమ్మిబాబు ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ నోటీసులు అందుకున్న జిమ్మిబాబు ఈరోజు సాయంత్రం అయిదు గంటల్లోగా ఏసీబంఈ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో జిమ్మిబాబుకు ఉన్న సాన్నిహిత్యంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరగుతోంది. జిమ్మిబాబు విచారణతో కేసులో కీలక ఆధారాలు సేకరించవచ్చని ఏసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జిమ్మిబాబు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దగ్గరకు సెబాస్టియన్‌ను తీసుకు వెళ్లటంలో జిమ్మిబాబు కీలక పాత్ర పోషించారు. ఇక మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
ముందస్తుగానే సమాచారమిచ్చిన చంద్రబాబు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వెంకటేశ్వరరావు నియమితులయిన విషయం తెలిసిందే. అయితే విజయవాడ సీపీ వెంకటేశ్వరరావు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉండగా, వెళ్లవద్దని ఆయనకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. కాగా ఓటుకు కోట్లు కేసులో ముందస్తు సమాచారం లేకపోవటంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. ఇంత పక్కాగా పథకం వేసినా ఉప్పందించలేకపోయారని ఐపీఎస్ అధికారణి అనురాధపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డీజీగా బదిలీ చేశారు. -
ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు ప్రభావం ఏపీ ఐపీఎస్ అధికారులపైన పడింది. ఏపీ నిఘా విభాగం చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో విజయవాడ కమిషనర్ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. మరోవైపు అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్‌గా గౌతం సవాంగ్ నియమితులయ్యారు. కాగా ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ అడ్డంగా దొరికిన వీడియోలు, ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటపడిన వ్యవహారం ముందుగా పసిగట్టి సమాచారం ఇవ్వడంలో వైఫల్యం చెందారనే సాకుతో అనురాధను తప్పించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఇంటెలిజెన్స్ అధికారులపై అసంతృప్తిగా ఉన్నారు. దాంతో అనుకున్నట్లుగానే ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు పడింది. -
ఏసీబీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే సండ్ర
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం విచారణకు హాజరు అయ్యారు. ఆయన ఈరోజు ఉదయం ఏసీబీ కార్యాలయానికి విచారణకు వచ్చారు. కాగా అనారోగ్య కారణాలతో సండ్ర వీరయ్య గతంలో ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. దాంతో ఆయనకు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సండ్రకు సీఆర్పీసీ సెక్షన్ 41(A) కింద ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇక ఓటుకు కోట్లు కేసులో మరో సూత్రధారి తెరపైకి వచ్చాడు. అతడే తాజాగా ఏసీబీ నోటీసులు అందుకున్న జిమ్మిబాబు. నేడు అతడు ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. జిమ్మిబాబుకు రెండు రోజుల క్రితం ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కాగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో జిమ్మిబాబుకు ఉన్న సాన్నిహిత్యంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరగుతోంది. జిమ్మిబాబు విచారణతో కేసులో కీలక ఆధారాలు సేకరించవచ్చని ఏసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జిమ్మిబాబు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
'అలా అంటే..ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు'
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంటే ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు, ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు అన్న రీతిలో రాష్ట్రపతి ప్రసంగించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శనివారం కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య సెక్షన్-8 అంశాన్ని ముడిపెట్టే విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలను గౌరవించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలసి మెలసి ఉండాలని, రెండు రాష్ట్రాలు సామరస్య వాతావరణంలో పనిచేయాలని, దేశభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆకాంక్షించారు. -
ఓటుకు కోట్లు కేసు సమసిపోయినట్లు కాదు
-
మ.2.15గంటలకు రేవంత్ బెయిల్‌పై విచారణ
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణను హైకోర్టు ఈరోజు మద్యాహ్నం 2.15 గంటల వరకూ వాయిదా వేసింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున కేసు విచారణను వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ రెండుసార్లు వాయిదా పడింది. కాగా ఈ నెల 5వ తేదీన ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. దాంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. -
రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేసింది. దాంతో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే విచారణ వాయిదా పడింది. కాగా తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎక్కడికీ పారిపోనని, ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.