రేవంత్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా | Revanth Reddy's bail petition case adjourned today afternoon | Sakshi
Sakshi News home page

రేవంత్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

Published Fri, Jun 26 2015 10:49 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

రేవంత్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా - Sakshi

రేవంత్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేసింది. దాంతో బెయిల్ పిటిషన్పై వాదనలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే విచారణ వాయిదా పడింది.

 

కాగా తాను ఎమ్మెల్యేగా ఉన్నానని,  ఎక్కడికీ పారిపోనని, ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement