రేవంత్కు మరోసారి చుక్కెదురు
రేవంత్కు మరోసారి చుక్కెదురు
Published Mon, Aug 3 2015 12:25 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మరోసారి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్ నిబంధనలపై మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు సోమవారం కొట్టేసింది. మరోవైపు ఈకేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ నిబంధనలను కోర్టు స్వల్పంగా సడలించింది. వారిరువురు సోమ, మంగళ, శుక్రవారాల్లో కోర్టుకు హాజరు అయితే చాలని న్యాయస్థానం సూచించింది.
కాగా గతంలో కూడా బెయిల్ షరతులు సడలించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో తను సీనియర్ నాయకుడినని, రాజధానిలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సిన అవసరం ఉందని అందువల్ల బెయిల్ షరతులను సడలించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. దాంతో మరోసారి ఆయన కోర్టును ఆశ్రయించినా ...ఉపశమనం లభించలేదు.
Advertisement
Advertisement