రేవంత్‌రెడ్డి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బంధువుకు చెందిన ఫామ్ హౌస్‌ను అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ రోజు విడుదల కానున్నారు. ( ‘రేవంత్‌కు మేము మద్దతుగా ఉన్నాం’ )
కాగా, చట్ట వ్యతిరేకంగా డ్రోన్‌లను వినియోగించారన్న కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నెల రోజులు మాత్రమే జైలు శిక్ష పడే కేసులో రేవంత్‌రెడ్డిని ఇప్పటికే తొమ్మిది రోజులుగా జైల్లో పెట్టారని, చాలా చిన్న కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయకుండా విచారణను వాయిదా వేయవద్దని ఆయన తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ హైకోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణ నాటికి సగం శిక్షాకాలం పూర్తవుతుందని, వెంటనే బెయిల్ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం ఆయన కోర్టును కోరారు.
చదవండి : తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
Comments
Please login to add a commentAdd a comment