ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణను హైకోర్టు ఈరోజు మద్యాహ్నం 2.15 గంటల వరకూ వాయిదా వేసింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున కేసు విచారణను వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ రెండుసార్లు వాయిదా పడింది. కాగా ఈ నెల 5వ తేదీన ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. దాంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.