'సాక్షి' చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు | Sakshi gets sandra venkata veeraiah's remand report | Sakshi
Sakshi News home page

'సాక్షి' చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు

Published Tue, Jul 7 2015 12:16 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

'సాక్షి' చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు - Sakshi

'సాక్షి' చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి కీలక రిమాండ్‌ రిపోర్ట్‌ 'సాక్షి' సేకరించింది. అందులో ఏసీబీ వెల్లడించిన వివరాలు మొత్తం రాజకీయ వ్యవస్థ విస్తుబోయేలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ ఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నదానిపై సండ్ర సవివరంగా మాట్లాడారు.

 ప్రధానంగా  సెబాస్టియన్‌ - సండ్ర వెంకట వీరయ్యల మధ్య సంభాషణలను  ఏసీబీ అధికారులు సవివరంగా సేకరించి మరీ కోర్టుకు సమర్పించారు. మే 27 నుంచి మే 31 మధ్య అయిదు రోజుల గడువులో ఏకంగా 32 సార్లు సెబాస్టియన్‌, సండ్ర మధ్య సంభాషణలు జరిగాయి. సండ్ర 23 సార్లు కాల్‌ చేస్తే.. సెబాస్టియన్‌ 8 సార్లు కాల్‌ చేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల రికార్డులను పరిశీలిస్తే.. మొత్తం వ్యవస్థ ఏ స్థాయిలో అవినీతి ప్రవాహిస్తుందో అర్థమవుతుంది. మరోవైపు సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement