ఓటుకు కోట్లు కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. వీరి సంభాషణల్లో చాలా సార్లు జనార్దన్ పేరు వినిపించింది. ప్రతి విషయాన్ని సండ్ర జనార్దన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొన్ని కీలక భేటీలు జరిగాయి. అయితే జనార్దన్ ఎవరు అన్న విషయం తెలాల్సివుంది. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.