CashForVote
-
రేవంత్ బెయిల్ రద్దు చేయండి.
-
'అసెంబ్లీ జరిగిన తీరు దారుణం'
-
'అసెంబ్లీ జరిగిన తీరు దారుణం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభా సమావేశాలు 5 రోజులే నిర్వహించడం దారుణమన్నారు. చివరి రోజున ఓటుకు కోట్లుపై చర్చకు డిమాండ్ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... అసెంబ్లీ జరిగిన తీరును మీరంతా గమనించే ఉంటారు ఐదు రోజుల పాటు అసెంబ్లీ పెట్టడం అన్నది దారుణం 15 రోజులు పెట్టమన్నా 5 రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అన్యాయం ఓటుకు కోట్లుపై వాయిదా తీర్మానం, 344 కింద నోటీసు ఇచ్చాం సరైన పద్ధతిలో నోటీసు ఇవ్వలేదన్న వాదన పూర్తిగా అవాస్తవం మొట్టమొదటి సారి దేశంలో ఎక్కడా జరగని విధంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే డబ్బు ఇస్తూ పట్టుబడటం జరిగింది. ఇంత హార్ట్ కోర్ ఎవిడెన్స్ తో డబ్బు ఇస్తూ పట్టుబడితే అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వకపోవటం దేశ చరిత్రలో తొలిసారి అనుకుంటా. అధికారం ఉందని, స్పీకర్ స్థానం కూడా వారిదేనని. చర్చకు అవకాశం ఇవ్వకుండా చేయటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడితే...దొంగతనం చేస్తూ పట్టుబడటం తప్పుకాదు. నన్ను పట్టుకోవటం తప్పు అన్నట్లు ఉంది. చంద్రబాబు ఏపీలో లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బు నల్లధనం. ఆ డబ్బును విరజిల్లుతూ పట్టుబడిన పరిస్థితి. 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి సన్నద్ధం చేసుకోని 150 కోట్లు స్కామ్ చేశారు. పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా సాక్షాత్తూ సీఎంకే పర్సంటేజ్‌లు. మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా వాటాలే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి భాగస్వామి కావటం. లంచాలు తీసుకోవటం. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీట్ లో 22సార్లు చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావిస్తే...సీఎం అసెంబ్లీలో ఉండి. తన గది నుంచి బయటకు రాలేదు అసెంబ్లీకి వచ్చి చర్చ ఇనిషియేట్ చేసి...చర్చలో తన వెర్షన్ ఏంటో చెప్పాల్సిన బాధ్యతను దాటవేశారు వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే. ఇక్కడే ఉండి కూడా సీఎం తప్పించుకున్నారు. మరి ఇదేంది? డైరెక్ట్‌గా సీఎం ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయినా... చివరికి అసెంబ్లీకి వచ్చి ఆ గొంతు తనది కాదని చెప్పుకునే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. ఏ నైతిక హక్కుతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నారో...తన మనస్సాక్షిని అడగాలి. ఇవాళ స్పీకర్ న్యాయంగా ప్రవర్తించి ఉంటే... వాయిదా తీర్మానంతో పాటు 344 ఇచ్చాం కాబట్టి తాను ఒక గంటసేపు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే...సభ వాయిదా వేయాల్సిన పనేముంది? ఉదయం నుంచి నివరధిక వాయిదా పడేవరకూ ఓటుకు కోట్లు అంశంపై చర్చ ఎందుకు జరగకూడదని పట్టుబడితే... ఆ అంశం కోర్టులో ఉందని చెప్పారు. అదే జగన్ మీద చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మీద కూడా కనీసం ఆరుమందితో తిట్టిస్తారు. ఒక్కడ్ని చేసి మైక్‌లు ఇవ్వరు. తిట్టించిన తర్వాత సభను వాయిదా వేస్తారు. ప్రత్యేక హోదాపై చర్చ జరగాలి. ఆ చర్చ వల్ల మంచి జరుగుతుందని వారికి అర్థం కావాలి పోలవరం ప్రాజెక్ట్ నత్తనడకన జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని...కేంద్రం తిడుతూ లేఖలు రాసినా ఫలితం శూన్యం. ఈ అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడకూడదట. అన్ని ప్రాజెక్టులకు సంజీవని పోలవరం పట్టిసీమ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్పాం. కారణం స్టోరేజ్ లేదు ఆ ప్రాజెక్ట్‌లో పెట్టే ఖర్చు వేస్ట్. ఇదే డబ్బుతో పులిచింతల,గాలేరు-నగరి ప్రాజెక్ట్‌లు పూర్తి అవుతాయి కేవలం పోలవరం టెండర్లలో గోల్మాల్, ఏపీలో కాంట్రాక్టర్లు లేరట. ఇద్దరు మాత్రమే ఉన్నారట 30 పంపులు, 15 పైప్ లైన్లు ఉంటే... వాటిని తగ్గించి చూపారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కనీసం ఈ అంశంపైనా అసెంబ్లీలో చర్చించలేదు రూ. 1000 కోట్లతో పెడతానని ప్రకటించిన ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? రాష్ట్రం విడిపోయిన 15 నెలలు గడుస్తున్నా ప్యూన్ పోస్టు కూడా ఇవ్వలేదు డిఎస్సీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఇంతవరకు రిక్రూట్ మెంట్ కేలండర్ ప్రకటించలేదు ఉద్యోగుల జీతాల గురించి పట్టించుకోవడం లేదు నిరుద్యోగులకు వయో పరిమితి పెంచిన పాపాన పోలేదు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట మార్చారు నిరుద్యోగ భృతి ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు ప్రత్యేక హోదాపై గందరగోళంగా మాట్లాడతారు. ప్రజలను తికమక పెడతారు. అసెంబ్లీ సజావుగా సాగక పోవడానికి చంద్రబాబు, స్పీకర్ బాధ్యులు అసెంబ్లీ వేదికను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ప్రత్యేక హోదాపై నిరాహారదీక్ష కచ్చితంగా చేస్తా. బహుశా 20న ఉండొచ్చు. 19న 20న అనేది పార్టీలో చర్చించి ఖరారు చేస్తాం. -
కేసీఆర్ ఫోన్ చేసినట్టు రుజువుచేస్తే....
హైదరాబాద్: కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్టు రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రుజువు చేయకపోతే లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏదైనా సమాచారం సభకు చెబుతున్నామంటే, ఆరోపణలు చేస్తున్నామంటే అందులో నిజాయితీ ఉండాలన్నారు. కేసీఆర్ తో చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. కేసీఆర్, చంద్రబాబు పొత్తు పెట్టుకున్న ఫోటోలను స్పీకర్ కు వైఎస్ జగన్ చూపించారు. దొంగతనం చేస్తూ పట్టుబడి పట్టుకున్నవారిదే తప్పన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసును రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుది అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 'వీటికి ఎవరూ సమాధానాలు చెప్పరు. సీఎం లంచాలు తీసుకుని, ఆ డబ్బును ఎమ్మెల్యేలకు ఇస్తూ పట్టుబడితే ఈ సభలో చర్చ జరగకూడదా? వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నా.. చంద్రబాబు పేరు చార్జిషీట్ లో 22 సార్లు ఉన్నా చర్చ జరపారా? కానీ రోజూ నా గురించి ఎవరంటే వాళ్లు మాట్లాడొచ్చా? ఎవరంటే వాళ్లు తిట్టొచ్చా? అక్కడితో ఆగరు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా విడిచిపెట్టకుండా దూషణలు చేస్తారు. మైకు అధికారపక్ష సభ్యులకు ఎక్కువసార్లు వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు' అని వైఎస్ జగన్ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. చంద్రబాబు సభలోకి వచ్చి ఎందుకు సమాధానం చెప్పరని నిలదీశారు. ఈ అంశంపై తప్పుదోవ పట్టించేందుకు సభను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. -
కేసీఆర్ ఫోన్ చేసినట్టు రుజువుచేస్తే....
-
'షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇస్తే టీడీపీ ఎందుకు ఉలిక్కిపడుతోందని నగరి ఎమ్మెల్యే ఆర్కో రోజా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... తామిచ్చిన తీర్మానంపై టీడీపీ నేతలు షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసు కోర్టులో ఉన్నందున చర్చించబోమని స్పీకర్ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. కోర్టులో ఉన్న వైఎస్ జగన్ కేసుల గురించి టీడీపీ నాయకులు ప్రతిరోజు మాట్లాడుతుంటే స్పీకర్ మౌనంగా ఉండడం బాధాకరమన్నారు. ఓటుకు కోట్లు కేసు తెలంగాణ సంబంధించిందని అంటున్నారని... అలాంటప్పుడు మత్తయ్యకు ఏపీ ప్రభుత్వం ఎందుకు రక్షణ ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసుతో ఏపీకి సంబంధం ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్సీలను కొనడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆడియోలో ఉన్న 'వ్యాట్ అయామ్ సేయింగ్' వాయిస్ మీదా, కాదా చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి బయటపడే మార్గాలు అన్వేషించేందుకు 15 సార్లు డీజీపీతో చంద్రబాబు భేటీ అయ్యారని తెలిపారు. రిషితేశ్వరి, వనజాక్షి కేసులో ఎన్నిసార్లు పోలీసులతో సమావేశమయ్యారని ప్రశ్నించారు. బ్రీఫిడ్ విత్ సీఎం బ్రీఫ్ కేసులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు దమ్ము ధైర్యంవుంటే 'ఓటుకు కోట్లు'పై చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. -
'షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారు'
-
'మనసు చంపుకుని అసెంబ్లీలో ఉన్నా'
హైదరాబాద్: తాను ఏ తప్పు చేయలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ... తాను నిప్పులా బతికానని చెప్పారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయలేకపోయారని చెప్పారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు. శాసనసభలో హుందాగా ప్రవర్తించాలని, సభా గౌరవం కాపాడాలని తమ ఎమ్మెల్యేలను కోరారు. ఓటుకు కోట్లు అంశంపై శాసససభలో ప్రస్తావనకు రావడంతో గందరగోళం చెలరేగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీఆర్ ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిలో తనపై విచారణ ఎలా చేయిస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమల్లో ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. మనసు చంపుకుని ప్రజల కోసం అసెంబ్లీలో ఉంటున్నామని చెప్పారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తనకు మైక్ ఇవ్వలేదని, కనీసం మీకు మైకు అయినా తీస్తున్నారు సంతోషించండి అని వైఎస్సార్ సీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. -
రాజీనామా చేస్తారా.. ఛాలెంజ్!
-
రాజీనామా చేస్తారా.. ఛాలెంజ్!
ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కూడా తానే పంపానని అంటారేమోనంటూ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు కోట్లు విషయమై సభలో గందరగోళం జరిగిన తర్వాత టీడీపీకి చెందిన రావెల కిశోర్ బాబు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు వ్యక్తిగత విమర్శలు చేయడంతో... వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ఎవరు టాపిక్‌లో ఉన్నారు, ఎవరు లేరన్నది ప్రజలంతా చూశారు. ఒక్కడిని చేసి ఇంతమంది వెంట పడుతున్నారన్నది అంతా చూస్తున్నారు నేను ఒక్కడిని మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతారు, ఈయన మాట్లాడతారు, అడ్డుపడతారు, బురద జల్లుతారు వాళ్లంతా ఎంత బాగా తిట్టారో అర్థమైంది. అబద్ధాలు చెబుతూ అచ్చెన్నాయుడు ఏమన్నారు.. టీఆర్ఎస్కు నేను మద్దతు ఇచ్చానా నేను, కేసీఆర్‌కు లెటరిస్తే ఆ విషయం నీకెలా తెలిసింది.. కేసీఆర్ నీకిచ్చారా? స్టీఫెన్సన్ ఎవరో నాకు తెలియదు. నేను లెటర్ ఇస్తే ఆయనకు పదవి ఇచ్చారంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే నువ్వు రుజువు చెయ్యి.. నేను రాజీనామా చేస్తా. లేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని నిండు సభలో ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్... ఛాలెంజ్.. ఛాలెంజ్... చంద్రబాబు రాజీనామా చేస్తారా నేను ఎవరినైనా ఎమ్మెల్సీ చేయాలన్నా.. ఎవరినైనా రాజ్యసభకు పంపాలన్నా నాకు ఇంతమంది ఎమ్మెల్యేలున్నారు. నేను కోరుకున్నవాళ్లను పంపుతాను ఇంకా నయం.. రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపాను, నేనే డబ్బులిచ్చానని చెప్పలేదు. ఆ ఫోన్లలో కూడా మాట్లాడింది, వీడియోల్లో ఉన్నది కూడా నేనేనని చెప్పలేదు. అప్పటివరకు సంతోషం. ఎమ్మెల్యేలను కొనడానికి 150 కోట్ల బ్లాక్ మనీ పెట్టి మీరు సిద్ధమయ్యారు మోదీ గారి దగ్గర చంద్రబాబు సాష్టాంగపడ్డారని చెప్పడానికి ఈ విషయం ప్రస్తావనకు తీసుకు రావాల్సి వచ్చింది. ఆయన కళ్లు పెద్దవి చేసి వేళ్లు చూపించి భయపెడుతున్నారు.. మేమంతా భయపడుతున్నాం మాకు మీ నుంచి రక్షణ కావాలి ప్రత్యేక హోదా మీరు తెస్తారా, తేలేరా కేంద్రానికి మీరు ఏవైనా హెచ్చరికలు చేయగలరా లేరా మా మంత్రులను ఉపసంహరించుకుంటామని గట్టిగా అడగగలరా 15 నెలల తర్వాత మేం ఈ మాటలు మాట్లాడుతున్నాం. ఎందుకయ్యా మాట్లాడతావు ఊరికే.. చనిపోయినవారి గురించి ప్రేమ చూపించారు చనిపోయినవాళ్లకు నివాళులు అర్పించే తీర్మానం ఇదేననుకుంటా ప్రత్యేక హోదా కోసం చాలామంది చనిపోయారు. వీళ్లకు పరిహారం ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు శవాన్ని కాల్చడానికి 10 వేలు మాత్రమే ఇచ్చారు మీ ప్రకటనల వల్లే వీళ్లంతా చనిపోయారు ప్రత్యేక హోదా సంజీవని కాదని ఢిల్లీలో చంద్రబాబు అన్నారు హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పింది, దానికి మించిన లబ్ధి కల్పిస్తామన్నారని స్వయంగా చంద్రబాబే చెప్పారు. కోడలు మగబిడ్డను కంటామంటే అత్త వద్దంటుందా అని ఆయన అంటారు ఇలాంటి కన్ఫ్యూజింగ్ ప్రకటనలు ఇస్తే పిల్లలు చనిపోకుండా ఏం చేస్తారు మళ్లీ హైదరాబాద్ వచ్చి, హోదా కోసం పోరాడతాం అంటారు. మేం అసభ్యంగా మాట్లాడామంటారు. కళ్లు ఎవరు పెద్ద చేశారో, ఎవరు వేళ్లు చూపించారో ప్రజలంతా టీవీలో చూస్తున్నారు సబ్జెక్టులో ఎవరెంత సేపు ఉన్నారో రికార్డులలో చూద్దాం మనం ఇక్కడినుంచి తీర్మానం చేసి పంపిస్తే, మీరు టైం బౌండుగా వార్నింగ్ ఇవ్వాలి నెల రోజుల్లోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా మంత్రులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించకపోతే ఫలితం ఉండదని చెబుతున్నా ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న యావత్ యువతకు చెప్పేది ఒకటే చనిపోయి సాధించేది ఏమీ ఉండదు. పోరాడైనా సాధిద్దాం. బతికుందాం.. పోరాడుదాం -
బాగా ‘ప్యాక్ ’చేయండి
-
చంద్రబాబు ఇంటి సమీపంలో పోలీసుల విచారణ
-
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోచింగ్!
-
ఏసీబీ ముందుకు శ్రీనివాస్ నాయుడు
-
చార్జిషీట్లో చంద్రబాబు
-
‘ఓటుకు కోట్లు’లో శ్రీనివాసులునాయుడికి నోటీసులు
-
చార్జిషీట్లో చంద్రబాబు!
-
డబ్బు సమకూర్చిన బడాబాబుల కోసం వేట
-
‘బాస్’పై ఏసీబీ దృష్టి!
-
ఏసీబి దూకుడుతో బెంబేలెత్తుతున్నపొలిటిషన్లు
-
’వీడియో, ఆడియో టేపులన్నీ వాస్తవాలే’
-
'సాక్షి' చేతికి ఫోరెన్సిక్ నివేదిక
-
కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు
ఓటుకు కోట్లు కేసులో నోటీసులు టెన్నిస్ కోర్టులో బంతిలా అటూ.. ఇటూ తిరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్‌రెడ్డికి తెలంగాణ ఏసీబీ బుధవారం నాడు నోటీసులు ఇవ్వడంతో.. అదే రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు డ్రైవర్‌కు, గన్ మన్కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్యను బెదిరించినట్లు వీరిద్దరిపైనా కేసు నమోదు చేశారు. దీంతో గన్ మన్ జానకిరామ్, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులు జారీ చేశారు. -
నారా లోకేశ్ కారు డ్రైవర్‌కు నోటీసులు
-
నారా లోకేశ్ కారు డ్రైవర్ కు నోటీసులు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని 160 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహ, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్, జిమ్మిబాబు, తదితరులను ఏసీబీ విచారించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌తో పాటు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు హ్యారీ సెబాస్టియన్, ఉదయ సింహ, మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లను నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి విదితమే. -
చంద్రబాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంతో పాటు టీడీపీ కార్యాలయానికి తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు ఇద్దరు వెళ్లినట్లు సమాచారం. గత రాత్రి 8.30 గంటలకు కానిస్టేబుళ్లు ....బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఓటుకు కోట్లు కేసులో డ్రైవర్ కొండలరెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కానిస్టేబుళ్లను ఇంట్లోకి అనుమతించడంపై నివాస భద్రతా అధికారి క్లాస్ పీకినట్లు సమాచారం. అయితే కొండలరెడ్డి అక్కడ లేకపోవటంతో ...కానిస్టేబుళ్లు...టీడీపీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏసీబీ విచారణకు హాజరు కావాలని సమాచారం అందించినట్లు సమచారం. చంద్రబాబు తనయుడు లోకేష్‌కు కొండలరెడ్డి డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ కొండలరెడ్డిని ఏసీబీ విచారించే అవకాశం ఉంది. కాగా ఓటుకు కోట్లు కేసులో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఏసీబీ... సాంకేతిక అడ్డంకులు తొలగిపోవడం, కీలకమైన సమాచారం లభించటంతో దర్యాప్తును వేగవంతం చేయనుంది. గతనెల టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు నోటీసులు జారీచేసిన తెలుగు యువత రాష్ట్రనాయకుడు జిమ్మిబాబు ఇప్పటివరకు ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో జిమ్మిబాబు పాత్ర కీలకం కావటంతో ఆయనను పట్టుకోవడానికి ఏసీబీ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. త్వరలోనే జిమ్మిబాబును అరెస్ట్ చేసి...కేసులోని ఆర్థికమూలాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. -
చంద్రబాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లు
-
విజయవాడ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే
-
విజయవాడ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ సరికొత్త మలుపు తిరిగింది. ఫోన్ ట్యాపింగ్ రికార్డులను తమకు ఇవ్వాలని అడిగే హక్కు విజయవాడ కోర్టుకు లేదంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 4 వారాలకు వాయిదా పడింది. కాగా, ఈ విషయంలో ఇంతకుముందు విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కాగా, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్ డేటాను హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందించాలని కోర్టు ఆదేశించింది. సర్వీస్ ప్రొవైడర్లు తమ కాల్ డేటా వివరాలను సీల్డ్ కవర్లో విజయవాడ కోర్టుకు సమర్పించాలని, ఆ సీల్డ్ కవర్‌ను హైకోర్టు రిజిస్ట్రార్‌కు యథాతథంగా అందజేయాలని తెలిపింది. -
'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ
-
సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలకు ఊరట
-
ఏసీబీ ఎదుట హాజరైన ఐదుగురు
-
నాకే సంబంధం లేదు.. అంతా కక్షే
-
టీడీపీ నేత ప్రదీప్‌కు ఏసీబీ నోటీసులు
-
కృష్ణను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ
-
ఏసీబీ ఎదుట హాజరైన కృష్ణ కీర్తన్
-
ఏసీబీ ఎదుట హాజరైన కృష్ణ కీర్తన్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ బుధవారం ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు మంగళవారం సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఏసీబీకి లభించిన ఆధారాలతో పాటు కస్టడీలో నిందితులు వెల్లడించిన అంశాల్లో కృష్ణకీర్తన్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మే 31న నామినేటెడ్ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇవ్వడానికి వెళ్లే ముందు రేవంత్, ఉదయసింహలు కృష్ణకీర్తన్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్యలను ఏసీబీ ప్రశ్నించింది. -
సండ్ర బెయిల్‌పై వాదనలు పూర్తి, నిర్ణయం రేపటికి
-
రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందే..
-
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
-
'గొంతు నీదని ఒప్పుకో.. కాదంటే విచారణకు సిద్ధంకా'
-
ముగిసిన సండ్ర తొలిరోజు విచారణ
-
ఓటుకు కోట్లు కేసుపై కేసీఆర్ ఆరా
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేయడం, మరో వ్యక్తి జిమ్మీ బాబు కోసం గాలిస్తున్న నేపథ్యంలో.. కేసు పురోగతి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరా తీసినట్లు తెలుస్తోంది. తన క్యాంపు కార్యాలయంలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఈనెల 12వ తేదీన నిజాం కాలేజిలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు పర్యవేక్షణ బాధ్యతలను కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏకే ఖాన్‌కే సీఎం కేసీఆర్ అప్పగించారు. దాంతో ఆ విందు గురించి కూడా కేసీఆర్ ఆయనతో చర్చించినట్లు సమాచారం. -
'కుట్రపూరితంగానే మా ఫోన్ ట్యాపింగ్'
-
మోకాలి నొప్పా.. బ్రెయిన్ వాషా?
-
మోకాలి నొప్పా.. బ్రెయిన్ వాషా?
మొదట నోటీసు జారీచేసిన తర్వాత.. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎక్కడెక్కడకు వెళ్లారు? అసలు రాజమండ్రిలో సండ్ర ఏం చేశారు? ఈ పది రోజుల పాటు సండ్రకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు? విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఇలా ఉంది.. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అత్యంత కీలక పాత్రధారులని ఏసీబీ నిగ్గుతేల్చింది. సండ్ర రిమాండ్ రిపోర్టులో కొన్ని ఆధారాలను కూడా ఏసీబీ పొందుపరించింది. జూన్ 16 నుంచి జులై 1 వరకూ సండ్ర ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో అజ్ఞాతంలో ఉన్నారు. కనీసం 8 రోజులపాటు ఆయన రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నట్టు స్వయంగా ఆయనే తెలిపారు. నిఘా వర్గాలు , దర్యాప్తు బృందాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సండ్రకు బాగానే బ్రెయిష్‌వాష్ చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తు సందర్భంగా అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోడానికి, ఈ పథకం వెనుక ఎవరున్నారో వెల్లడించకుండా బ్రెయిన్ వాష్ చేశారని సమాచారం. ఈ కేసులో అరెస్టు తప్పదని టీడీపీ అత్యున్నత వ్యక్తులు సహా, సండ్ర కూడా ముందుగానే ఊహించారు. దీనికి అనుగుణంగా ప్లాన్‌ను రెడీ చేశారు. ఆస్పత్రిలో ప్రత్యేక గది రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో పై అంతస్తులో ఒక గదిని సండ్ర కోసం కేటాయించారు. ఒక రకంగా ఇది గెస్ట్‌హౌస్. జైలు లాంటి వాతావరణాన్ని ముందుగానే అక్కడ సృష్టించారు. రెండు రోజులపాటు ఎవ్వరూ ఆగదిలోకి ప్రవేశించలేదు. ఆహారం, ఇతర సామగ్రి కూడా కిటికీ ద్వారానే అందించారు. మానసికంగా జైలు వాతావరణంలో ఉండేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఒకవేళ అరెస్టు చేస్తే, మానసికంగా ఆందోళనకు గురై.. ఎక్కడ పెద్దల పేర్లు వెల్లడిస్తానెనన్న భయంతో.. సండ్రను ఈ పరిస్థితుల మధ్య ఉంచారు. నిపుణులతోనే శిక్షణ విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చనే మార్గాలనూ సండ్రకు ఇక్కడే బోధించారు. ఇలాంటి కేసుల సందర్భంలో నేరుగా దర్యాప్తులో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు సండ్రకు ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మానసికంగా సున్నితత్వం ఉన్న వ్యక్తులకు ఇలా బ్రెయిన్ వాష్ చేస్తారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ల పరిభాషలో దీన్ని ఎమోషనల్ ఎస్కేపిజం, లేదా ఎమోషనల్ ట్రాన్స్‌మైండింగ్ అంటారు. అంతా చెప్పినట్లే చేశారు అరెస్టు చేసిన తర్వాత రోజు విచారణలో సండ్ర... ఇలానే వ్యవహరించారని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మీరు సెబాస్టియన్‌తో మాట్లాడారా అంటే.. గుర్తులేదు, నేను మాట్లాడి ఉంటానా? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం. ఫలానా సమయంలో మాట్లాడారంటూ సండ్ర ముందు ఆధారాలు ఉంచితే, మాట్లాడి ఉండొచ్చు, గుర్తులేదని సమాధానం చెప్పారట. ఏ ప్రశ్నలు వేసినా తెలియదు, గుర్తులేదు అని మాత్రమే చెబుతున్నారన్నది విశ్వసనీయవర్గాల సమాచారం. సెబాస్టియన్ ఫోన్లో ఈ సంభాషణలు రికార్డు కావడం ఓ రకంగా కేసును మరింత బలపరిచిందని ఏసీబీ బృందాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర వెంకటవీరయ్య
ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి పంపుతూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. రేపు, ఎల్లుండి .. అంటే 9, 10 తేదీలలో ఆయనను ఏసీబీ విచారణ చేసేందుకు కోర్టు అనుమతించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణ చేసుకోవచ్చు. కస్టడీ అనంతరం సండ్ర వెంకట వీరయ్యను కోర్టులో హాజరు పరచాలని కూడా ఆదేశించారు. విచారణ సమయంలో న్యాయవాదులు కూడా అక్కడే ఉండాలని కోర్టు తెలిపింది. కాగా, ఈ కేసులో సండ్ర వెంకట వీరయ్యను సమగ్రంగా విచారించి.. మరింత సమాచారన్ని రాబట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. వాస్తవానికి వెంకట వీరయ్యను ఐదు రోజుల కస్టడీకి పంపాలని ఏసీబీ కోరింది. అయితే కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీని మాత్రమే మంజూరు చేసింది. -
ఎవరీ జనార్దన్?
-
’ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా’
-
ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్
-
ఇరుపక్షాల వాదనలు పూర్తి, 1.30కి ఉత్తర్వులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఇరుపక్షాల వాదనలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విన్నారు. దీనిపై మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ కేసులో అయిదో నిందితుడిగా ఉన్న సండ్ర తన వాదనలు కోర్టుకు వినిపించారు. 'నా పిల్లలు విశాఖపట్నంలో చదువుకుంటున్నారు కాబట్టి మార్గమధ్యలో రాజమండ్రిలో చికిత్స పొందాను. నేను సత్తుపల్లి ఎమ్మెల్యేను కాబట్టి ఏసీబీ ...నా క్వార్టర్స్‌లో నోటీసు ఇచ్చిన విషయం తెలియదు. మీడియా ద్వారా విషయం తెలుసుకుని ఏసీబీకి లేఖ రాశాను. ఏసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత విచారణకు సిద్ధంగా ఉన్నానని రెండోసారి నేనే లేఖ రాశాను. రెండోసారి నోటీసులిచ్చిన సమయానికి విచారణకు హాజరయ్యాను. నిన్న 8 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ విచారణలో నాకు తెలిసిన అన్ని విషయాలు వెల్లడించా' అని తెలిపారు. ఎమ్మెల్యే సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులు హాజరు పరిచారు. ఆయనను అయిదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు. -
ఎవరీ జనార్దన్?
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. వీరి సంభాషణల్లో చాలా సార్లు జనార్దన్ పేరు వినిపించింది. ప్రతి విషయాన్ని సండ్ర జనార్దన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొన్ని కీలక భేటీలు జరిగాయి. అయితే జనార్దన్ ఎవరు అన్న విషయం తెలాల్సివుంది. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
'తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించారు'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కీలక పాత్ర వహించారని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. సండ్ర తెర వెనుక ఉండి ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారాన్ని మొత్తం నడిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సండ్ర పక్కా వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. మే 30న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, ఇదే కేసులో A-4 నిందితుడైన మత్తయ్యకు సండ్ర వీరయ్య.. 8 కాల్స్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును సాక్షి సేకరించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల మధ్య మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. సండ్ర మాట్లాడిన సంభాషణలు.. ఎమ్మెల్యేలు ఎవరెవరు డబ్బులకు లొంగుతారో సండ్ర ఆరా ఎంత డబ్బు పెడితే ఏ ఎమ్మెల్యే వస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల గైర్హాజరు, మరికొందరు టీడీపీకి ఓటు వేసేలా వ్యూహం మైనార్టీ ఎమ్మెల్యేల లక్ష్యంగా బేరసారాలకు వ్యూహం మహానాడు సభా వేదికల్లోనూ కుట్ర సంభాషణలు బాస్ తరపున వ్యవహారం నడిపించాలంటూ సెబాస్టియన్ కు సండ్ర సూచన ఎమ్మెల్యేల కొనుగోలుకు బాస్‌తో మాట్లాడి డబ్బులు అరెంజ్ చేస్తా డబ్బులకు లొంగకుంటే అధికారం ఆశ చూపాలి ఏపీలో చంద్రబాబు సర్కార్ ఉంది ఏపీలో ఆంగ్లో ఇండియన్ పోస్టులు ఖాళీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ పేరు చంద్రబాబుకు చెబుతా ఏపీలో ఏ పని కావాలన్నా బాబుతో చెప్పి చేయిస్తా ఎవరైనా చుట్టాలుంటే చెప్పు.. బాబుకు చెప్పి పని చేయిస్తా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మాదే అధికారం -
'ఆ ముగ్గురూ మా పార్టీకి చెందిన వారే'
-
'అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు'
తమ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును తెలుగు దేశం పార్టీ నాయకులు ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తోందని అన్నారు. అసలు ఈ కేసుతో సండ్ర వెంకట వీరయ్యకు సంబంధం లేకపోయినా ఆయనపై ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని ఆరోపించారు. సండ్ర వెంకట వీరయ్యను సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సుమారు 7 గంటల పాటు విచారించిన తర్వాత ఏసీబీ వర్గాలు ఆయనను అరెస్టు చేశాయి. ఆయన అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. -
పవన్ మాటల వెనుక....
హైదరాబాద్: ఓటుకు కోట్ల కుంభకోణం కేసులో త్వరలో నోరు విప్పుతా... విప్పుతా అంటూ ఊరించి, ఉడికించిన సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నోరు విప్పనే విప్పారు. మాటకు మాట పొంతన లేకుండా, మాట్లాడుతున్న సందర్భానికి, చెబుతున్న ఉదాహరణకు సమన్వయం లేకుండా ఎవరికీ ఏమీ అర్థం కాకుండా జాగ్రత్త పడ్డట్టు కనిపించారు. కాసేపు నరేంద్ర మోదీతో భేటీ గురించి, అంతట్లో ఆంధ్ర ఎంపీల అలసత్వం గురించి, తెలంగణ త్యాగధనులు ఫలితం తెలంగాణ అంటూ, ఆంధ్రకు అన్యాయం జరిగిందంటూ, మరి కాసేపు తెలుగు ప్రజల సమైక్యతను కోరుకుంటున్న నిజమైన తెలుగువాడు కేసీఆర్ అని ప్రశం సిస్తూ... సెక్షన్ 8 వద్దే వద్దు, ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఇద్దరు లేక ముగ్గురు, ముగ్గురు లేక ఐదుగురితో కమిటీ వేయాలని....ఇలా, అలాని ముందుగా స్క్రీన్ ప్లే రాసుకోకుండా తెరమీదకు వచ్చిన నటుడిలా మాట్లాడి వచ్చిన పని అయిందనిపించారు. కానీ ఆయన మాటల తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తే తన ఎజెండా ఏమిటనే విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో రేవంతి రెడ్డి గురించి ఒకటి రెండు సార్లు మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించిన పవన్ కళ్యాణ్... నేటి సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఇలాంటి అవినీతి సర్వ సాధారణమేనని, దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని పదే పదే చెప్పారు. తెలంగాణ, అంధ్రకు పదేళ్లపాటు హైదరాబాదే రాజధాననీ చెప్పారు. సెక్షన్ 8కు తాను పూర్తిగా వ్యతిరేకినంటూ, సెక్షన్ 8ను అమలు పరిస్థితులు తీసుకరావద్దని తాను కోరుకుంటున్నానని అన్నారు. అంటే గతంలో చంద్రబాబు హెచ్చరించినట్టుగానే ఓటుకు కోట్లు కేసులో ముందుకెళితే ఆ పరిస్థితి రానే వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ముక్కుసూటిగా మాట్లాడలేని తన డొల్లతనాన్ని తెలివిగా తప్పించుకునేందుకు తన మాటలను ఎలాగైనా రాసుకునే స్వేచ్ఛ మీడియాకు ఉందని ముక్తాయించారు. ఎవరు ఎలా రాసినా ‘అబ్బే నా ఉద్దేశం అది కానే కాదు’ అని సమర్థించుకునేందుకు ముందు జాగ్రత్త పడ్డారు. మీడియాకు కూడా తనకు నచ్చిన అర్థంలో పవన్ ప్రసంగాన్ని రాసుకునేందుకు అవకాశం ఇచ్చారు. -
సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్ !
-
'సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 విధించడానికి తాను వ్యతిరేకమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. సెక్షన్ 8 పేరుతో మరోసారి కేంద్రానికి అధికారం కట్టబెట్టేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఈ అంశాలపై ఏమన్నారంటే.. * ప్రజల మధ్య అంతర్యుద్ధాలు జరిగితే అప్పుడు సెక్షన్ 8 పెట్టాల్సిన అవసరం వస్తుంది తప్ప చంద్రబాబు మీద కేసు పెడితే సెక్షన్ 8 అవసరం లేదు * హైదరాబాద్‌లో సెక్షన్ 8 విధించడానికి నేను వ్యతిరేకం * విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది * ఎటూ ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఇప్పుడు హైదరాబాద్‌లో సెక్షన్ 8 పేరుతో కేంద్రానికి అప్పగిస్తే మళ్లీ అన్యాయం జరుగుతుంది * ఉద్యమాల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమైనా చెల్లుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం.. తర్వాత పక్షపాతం వహిస్తున్నారని అనిపిస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది * ఎన్డీయే, యూపీఏలు ఒక కమిటీ వేసి, ఇక్కడి వ్యవహారాలు పరిశీలించేలా చూడండి * చంద్రబాబు చెప్పిన లాంటి సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ మార్గాలు సూచించాలి * మీడియా స్వేచ్ఛను హరించకండి. అలా హరించినంత మాత్రాన వాస్తవాలు బయటకు రాకుండా ఉండవు * ఎమర్జెన్సీ సమయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛమీద నియంత్రణ విధించినప్పుడు రాంనాథ్ గోయెంకా సంపాదకీయం స్థానంలో తెల్ల కాగితం వదిలేసి ప్రచురించారు * రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని చానళ్లను అనధికారికంగా ఆపినట్లు తెలిసింది. అలా చేయకండి * హైదరాబాద్ తెలంగాణ రాజధాని.. అందులో తిరుగులేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు ఇది ఉమ్మడి రాజధాని. ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయకండి. * ఎంతసేపూ హైదరాబాద్ లాంటి నగరాన్ని తయారుచేయాలని ఏపీ పాలకులు చూడొద్దు. భవనాలు కట్టొచ్చు గానీ ప్రజలను తీసుకెళ్లలేరు * విభజన సమస్యలు తీర్చాల్సిన వాళ్లు కొట్టుకుంటూ కూర్చుంటే ఇబ్బంది * అందరి కళ్లలో దూలాలున్నాయి.. సైజులే తేడా * దీన్ని పరిష్కరించకపోతే అంతర్యుద్ధాలు జరుగుతాయి * రాజధాని ఇచ్చి తెలంగాణను సంతోషపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ, ఎన్డీయే రెండ చెప్పాయి * తిడితే కేసీఆర్‌లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని ఆంధ్రప్రదేశ్ ఎంపీల్లా పడాలి * వాళ్లకు పౌరుషం, ఆత్మగౌరవం లేవా అని అనిపిస్తోంది * ఉత్తరాది ఎంపీలతో కొట్టించుకుని పార్లమెంటు నుంచి బయటకు వచ్చారు * కేశినేని నాని తనకు ఎంపీ సీటు కావాలని బలంగా ఊగిపోయారు. ఇప్పుడేం చేస్తున్నారు? పార్లమెంటు గోడలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారా.. ప్రత్యేక హోదా కోసం ఏమైనా చేస్తున్నారా? * బీజేపీ తరఫున ఇద్దరు ఎంపీలున్నారు.. మీరు ఏం చేస్తున్నారు * హైకమాండ్ మీద నమ్మకం ఉందంటూ కాలం గడిపేస్తున్నట్లు కనిపిస్తోంది. -
సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య ఈ ఉదయం ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి ఏసీబీ నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఏసీబీ ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసింది. సమాచారం కావాలంటే ఆయనను అరెస్టు చేసి ప్రశ్నించాల్సిందేనని ఏసీబీ భావించింది. ఈ పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతోనే ఆయనను ఏసీబీ అరెస్టు చేసినట్లు తెలిసింది. ఓటుకు రూ. 5 కోట్లు చెల్లించడానికి సిద్ధపడిన కేసులో ముందుగానే వీరయ్యకు నోటీసులు వెళ్లాయి. అయితే, అప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన జెరూసలెం మత్తయ్యకు 9 సార్లు ఫోన్ చేసినట్లు సమాచారం వచ్చింది. ఆయన చేసిన ప్రతి కాల్ గురించి అడిగినట్లు తెలిసింది. ఈయన నుంచి ఫోన్ వెళ్లిన వెంటనే.. తర్వాత మత్తయ్య నేరుగా స్టీఫెన్సన్కు ఫోన్ చేశారు. ఉదయం నుంచి 75 వరకు ప్రశ్నలు ఆయనకు వేసినట్లు తెలుస్తోంది. ఆయనను సోమవారమే మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఏసీబీ వర్గాలు ప్రశ్నించినప్పుడు ఆయన సహకరించలేదని కూడా సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలులో సండ్ర వెంకట వీరయ్య కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. మత్తయ్యతో ఈయనే వ్యవహారం నడిపారని, కొందరు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. చార్జిషీటు దాఖలు చేయడానికి మరో 24 రోజుల గడువు మాత్రమే ఏసీబీ వద్ద ఉంది. దాంతో ఈలోపు వీలైనంత వేగంగా దర్యాప్తు ప్రక్రియను పూర్తిచేయాలన్న ఆలోచనలో ఏసీబీ వర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ చేయాలి: పవన్ కల్యాణ్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును కోర్టులే తేల్చాలని, ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. * నాకు అభిప్రాయం లేక కాదు.. నా అభిప్రాయాలు నాకున్నాయి * రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూబాధ్యతగా మాట్లాడాలి * ఎలా పడితే అలా మాట్లాడేందుకు నేను ఇష్టపడను * నోరుచేసుకు బతుకు బిడ్డా అని ఒక తల్లి చెప్పిందట.. నాయకులు నోరు పారేసుకోవడం వల్ల ప్రజలకు అనర్థాలు జరుగుతున్నాయి * మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నేను ఆయనను కలిశాను * తెలుగుజాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని ఆయన అన్నారు. * తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు తెలుగుజాతి ఐక్యతకు తొలి అడుగు వేశారా అనిపించింది. * యాదాద్రి గుడికి విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి అనే ఆర్కిటెక్టును పెట్టడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం * తెలంగాణ సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం * అవినీతి గురించి మాట్లాడాతానన్నావు.. ఎందుకు మాట్లాడలేదని ఎంపీ వి.హనుమంతరావు అన్నారని నా దృష్టికి వచ్చింది * వర్తమాన రాజకీయాలు నీతి, నిజాయితీలకు పుట్టినిల్లు కావని చిన్న పిల్లాడు కూడా చెబుతాడు * రేవంత్ రెడ్డి విషయం తప్పా.. ఒప్పా అనేది కోర్టులు నిర్ణయించాలి * ఇలాంటి సమయంలో ఇంత రాజకీయ క్రీడలు ఆడే పద్ధతి రెండు రాష్ట్రాలకు ఉందా అనిపిస్తోంది * రెండు రాష్ట్రాలకు చాలా సమస్యలు, బాధ్యతలు ఉన్నాయి * సరిహద్దు సమస్యలున్నాయి, ఆస్తుల సమస్యలున్నాయి * ప్రజల అవసరాల కంటే పార్టీ ప్రయోజనాలను ముందుకు నెట్టడం వల్లే సమస్యలు వస్తున్నాయి * ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం * రాజకీయ క్రీడలకు అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? * రెండు రాష్ట్రాల సీఎంలకు చాలా బాధ్యతలున్నాయి.. ఇలాంటి సమయంలో ఇలా చేసుకుంటూ వెళ్లిపోతే.. * కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు * తలసాని శ్రీనివాస యాదవ్‌ను టీఆర్ఎస్లోకి తీసుకెళ్లగలరు గానీ సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తీసుకెళ్లగలరా? * ప్రజాసమస్యలు తీర్చడం మానేసి కోర్టుకేసులు, ఏసీబీ కేసులు .. ఇలా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు * నేను మార్చి 14న రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఒకటే భయం అని మోదీకి చెప్పాను * వ్యవస్థలు కొట్టుకుంటే అంతర్యుద్ధాలకు దారితీస్తుందని చెప్పాను * జల వివాదాల్లో రెండు రాష్ట్రాల పోలీసులు తలలు పగలగొట్టుకున్నారు * రెండు శత్రుదేశాల సైనికుల్లా కొట్టుకుంటే సామాన్య ప్రజలను రక్షించేదెవరు? * హైదరాబాద్ 60 ఏళ్ల పాటు ఆంధ్రులకు రాజధాని. ఇప్పుడు అక్కడ కొత్త రాజధాని కట్టడానికి డబ్బులు కూడా లేవు * ఒక కంట్లో వెన్న, మరో కంట్లో సున్నం పెట్టినట్లు కేంద్రం ఉంది * రాష్ట్రాన్ని విడగొట్టింది యూపీఏ, ఎన్డీయే * రెండు పార్టీలకూ రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది * మోదీ ఈ సమస్యల వైపు చూడాలని కోరుతున్నా. * ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తారా.. * నిజానిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలి. అది నిజమైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి. * జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు బాధ్యత గల నాయకులు కూడా ఆంధ్రోళ్లు, సెటిలర్లు అని మాట్లాడొద్దని నేను ఇంతకు ముందు కూడా కోరాను * హరీశ్ రావు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు * ఆంధ్రోళ్లతో పంచాయతీ తీరలేదని ఎవరన్నా నాకు నచ్చదు * చంద్రబాబును, టీడీపీని తిట్టాలనుకుంటే తిట్టండి. నన్ను తిట్టాలంటే పవన్ అనే పేరుతో తిట్టండి * ఆంధ్రులంటే కమ్మ సామాజికవర్గం మాత్రమే కాదు.. అన్ని మతాలు, కులాల సమ్మేళనం -
'చంద్రబాబు కన్నంలో పడ్డ దొంగలా దొరికాడు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓటుకు కోట్లు కేసులో కన్నంలో పడ్డ దొంగలా దొరికి పోయాడని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అవినీతి కేసు బయట పడేందుకు చంద్రబాబు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇదే అదునుగా ఓటుకు కోట్లు వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించాలని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని రాఘవులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు. -
ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధపై బదిలీ వేటు
-
ఏసీబీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే సండ్ర
-
జిమ్మిబాబుపై చర్యలు తీసుకుంటాం
-
'తొడ కొట్టడం ఆయన అహంభావానికి నిదర్శనం'
-
'ఓటుకు కోట్లు కేసుతో సంబంధం లేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) తెలిపింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్ సీఏ స్పష్టం చేసింది. జిమ్మిబాబు సోమవారం సాయంత్రంలోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ అల్టిమేటం జారీచేసిన నేపథ్యంలో హెచ్ సీఏ స్పందించింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన జిమ్మిబాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. -
అజ్ఞాతంలో జిమ్మిబాబు
-
ఎవరీ జిమ్మిబాబు?
-
రేవంత్‌కి శిక్ష ఖాయమంటున్న నిపుణులు
-
ఎవరీ జిమ్మిబాబు?
హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే సండ్రతో పాటు తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు అనే వ్యక్తికీ నోటీసులు జారీ చేసింది. జిమ్మిబాబు కూడా సోమవారం సాయంత్రం లోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ అల్టిమేటం జారీచేసింది. ఏసీబీ కోర్టుకు ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా జిమ్మిబాబు పేరు తెరపైకి వచ్చింది. 'సెబాస్టియన్‌ను పరిచయం చేసింది జిమ్మిబాబు' అని స్టీఫెన్సన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముగ్గురిని ఏసీబీ విచారించగా.. జిమ్మిబాబు పాత్ర వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిమ్మిబాబును కూడా ఏసీబీ పిలిచినట్లు సమాచారం. ఎవరీ జిమ్మిబాబు జిమ్మిబాబు స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరిఖని. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ విధంగా రేవంత్‌కు పరిచయమై ఆయనకు అనుచరుడుగా మారాడు. దాంతో పాటుగా జిమ్మిబాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు. దాంతో స్టీఫెన్ సన్ కుమారుడుతో జిమ్మిబాబుకు పరిచయాలు ఉన్నాయి. స్టీఫెన్ సన్ కుమారుడు ద్వారానే రేవంత్, స్టీఫెన్ సన్లు పరిచయం అయ్యారు. రేవంత్‌కు, స్టీఫెన్ సన్ను పరిచయం చేసింది జిమ్మిబాబే. తాజాగా ఆయన పేరు కూడా వెలుగులోకి వచ్చింది. సోమవారంలోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ జిమ్మిబాబుకు శనివారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. -
'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'
-
ఓటుకు కోట్లు కేసులో కొత్త పేరు: జిమ్మీకి నోటీసులు
ఓటుకు కోట్లు కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేసులో ఎక్కడా పేరు బయటపడని 'జిమ్మీ' అనే వ్యక్తికి ఏసీబీ వర్గాలు నోటీసు జారీచేశాయి. సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సెబాస్టియన్‌ను స్టీఫెన్సన్ వద్దకు తీసుకొచ్చి, ఆయనను పరిచయం చేసిన వ్యక్తే ఈ జిమ్మీ. ఈ విషయాన్ని స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో తెలిపారు. అయితే ఈ కేసు మొత్తమ్మీద జిమ్మీ పాత్ర ఏంటన్న విషయం, అసలు ఈ జిమ్మీ ఎవరన్న విషయం మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియలేదు. అసలు అతడికి రాజకీయాలతో లింకులేంటో, సెబాస్టియన్ ఎలా తెలుసన్న విషయం కూడా బయటపడలేదు. ఈ వివరాలన్నీ ఏసీబీ విచారణలో బయటకొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇస్తారన్న విషయం కూడా చిట్ట చివరి నిమిషం వరకు బయటకు పొక్కడంలేదు. ఏసీబీ అధికారులు చాలా పకడ్బందీగా, నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పేర్లు వెల్లడిస్తున్నారు. గతంలో ఒకటి రెండు పేర్లమీద అనుమానాలు వచ్చినప్పుడు.. ఏసీబీ కావాలనే లీక్ చేస్తోందన్న విమర్శలు వెలువడటంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ముందుగానే పేర్లు బయటకు వస్తే వాళ్లంతా జాగ్రత్త పడతారని, చిట్ట చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. తాము 60 రోజుల్లో చార్జిషీటు దాఖలుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ అంతకు మంచి ఆలస్యమైనా కోర్టు నుంచి అనుమతి తీసుకుని దాఖలు చేస్తామని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. -
'సోమవారంలోగా విచారణకు రండి'
-
ఈసీ చేతికి 'ఓటుకు కోట్లు' డాక్యుమెంట్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఎన్నికల సంఘం చేతికి డాక్యుమెంట్లు అందాయి. ప్రిన్సిపల్ కోర్టు అనుమతితో ఎన్నికల సంఘం ఈ డాక్యుమెంట్లను పొందింది. అంతకుముందు ఈ పత్రాలు కావాలని ఏసీబీ కోర్టులో ఎన్నికల సంఘం ఒక మెమో దాఖలుచేసింది. అయితే, మెమోలు సరిగా ఇవ్వలేదని.. ఇప్పుడు ఆ పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని ఏసీబీ కోర్టు కొట్టేసింది. దాంతో ప్రిన్సిపల్ కోర్టును ఆశ్రయించిన ఎన్నికల సంఘం.. తమకు మొత్తం అన్ని నివేదికలు కావాలని కోరింది. ప్రిన్సిపల్ కోర్టు అనుమతితో ఇప్పుడు పత్రాలన్నీ ఎన్నికల సంఘం చేతికి వచ్చాయి. ఓటుకు కోట్లు కేసును పూర్తిగా విచారించాలని, అర్థవంతమైన ముగింపు దశకు తీసుకురావాలని కూడా ఎన్నికల సంఘం తెలంగాణ ఏసీబీకి తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా కేసు పత్రాలను ఎన్నికల సంఘం తీసుకోవడం గమనార్హం. వాళ్లు ఈ డాక్యుమెంట్లను స్టడీ చేసిన తర్వాత ఎన్నికల చట్టాలకు సంబంధించిన కేసు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఏసీబీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారని, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద కేసు విచారణ పూర్తి చేశారని కోర్టు భావించింది. ఇప్పుడు మళ్లీ కస్టడీకి తీసుకుని ఏం విచారిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు కేసును ప్రభావితం చేస్తాడని ఏసీబీ వాదించినా, ఆ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. (చదవండి- రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ప్రారంభం) ఏసీబీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పలు లోపాలు ఉన్నాయని సిబల్ అన్నారు. కానీ, ఆయన వాదనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోస్లే ఏకీభవించలేదు. ఇప్పటికే నెల రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. విచారణ పూర్తయినందున ఇక ఆయన బెయిల్ రద్దుచేయాల్సిన అవసరం లేదని భావించారు. కాగా, బెయిల్ షరతులను రేవంత్ ఉల్లంఘించారని, జైలు నుంచి విడుదలైన సమయంలోనే బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రిపై మాట్లాడారని న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని, మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. -
రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ప్రారంభం
ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా.. ముగ్గురి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీబీ దాఖలుచేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాల బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ కోరుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై వాదనలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సహా ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ఏసీబీ రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి తరఫున రాంజెఠ్మలానీ వాదిస్తుండగా.. ఏసీబీ తరఫున ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు వాదిస్తున్నారు. కపిల్ సిబల్, దుష్యంత్ దావే, హరీన్ రావెల్ ముగ్గురూ ఏసీబీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తదితరులు చేసినది కేవలం ఒక ఎమ్మెల్యేను కొనేందుకు చేసిన ప్రయత్నం కాదని, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఏసీబీ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. పది మంది ఎమ్మెల్యేలను కొనాలని, తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకున్నారని సుప్రీంకోర్టుకు విన్నవించనున్నారు. రేవంత్ రెడ్డి విచారణలో వాస్తవాలను వెల్లడించలేదని, 50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయో తెలియాల్సి ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే జైలు నుంచి విడుదలైనప్పుడు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని చెప్పడమే కాక.. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. -
’సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది’
-
హత్య చేయడం తప్పుకాదట.. వీడియో తీయడం తప్పా!
హత్య చేయడం తప్పు కాదు గానీ, ఆ హత్య చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడితే, దాన్ని వీడియో తీయడం తప్పని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్-8 అనేది ఒక అంశం మాత్రమేనని, కానీ తాను తప్పు చేసిన తర్వాత చంద్రబాబుకు ఆ సెక్షన్ గురించి గుర్తుకొచ్చినట్లుందని ఆయన అన్నారు. విశాఖజిల్లా అచ్యుతాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వెళ్తూ మార్గం మధ్యలో నక్కపల్లి వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగారు. పాయకరావుపేట నియోజవకర్గ సమస్యలపై పార్టీ నేతలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు ఇచ్చిన వినతిపత్రాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే... రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్న ఏకైక పార్టీ మాదే రాష్ట్ర విభజనలో చంద్రబాబు పాలు పంచుకున్నారు రాష్ట్రాన్ని విభజించాలని పార్లమెంటులో ఆయన ఎంపీలందరూ సంతోషంగా చేతులు ఊపారు చంద్రబాబూ.. రాష్ట్రం విడిపోయాక ఆ రాష్ట్రంలో మేం ఏ పార్టీకి మద్దతిస్తే నీకేంటి? పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలుచేయాలని కేంద్రాన్ని నాలుగుసార్లు కలిశాం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఈ చట్టంలోని సెక్షన్ -8పై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు లంచాలు తీసుకున్న డబ్బులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చంద్రబాబు కొంటున్నారు కరప్షన్ మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే -
కేసిఆర్‌తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ
-
సీనియర్ ఐపీఎస్‌లతో సీఎం కీలక సమావేశం
పోలీసు ఉన్నతాధికారులు పలువురితో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తన క్యాంపు కార్యాలయంలో గురువారం భేటీ అయ్యారు. పలువురు ఐపీఎస్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా రావాల్సి ఉన్నా, ఆయన తల్లి మరణించడంతో రాలేకపోయారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు హాజరయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు డీసీపీలు కూడా వచ్చారు. ఇటీవలే హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యలు చేపట్టిన రాజీవ్ త్రివేది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు సీఎంతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఇప్పటివరకు సాధించిన పురోగతి, బెయిల్ మీద జైలు నుంచి విడుడలైన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన హంగామా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఆయన నేరుగా సీఎం, మంత్రులను ఉద్దేశించి విపరీత వ్యాఖ్యలు చేయడంతో దానిపై కూడా చర్చించారంటున్నారు. అసలు ర్యాలీకి అనుమతి లేకపోయినా భారీ ర్యాలీ ఎలా చేశారని చర్చించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మరికొందరికి ఓటుకు కోట్లు కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.