ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంతో పాటు టీడీపీ కార్యాలయానికి తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు ఇద్దరు వెళ్లినట్లు సమాచారం. గత రాత్రి 8.30 గంటలకు కానిస్టేబుళ్లు ....బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఓటుకు కోట్లు కేసులో డ్రైవర్ కొండలరెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కానిస్టేబుళ్లను ఇంట్లోకి అనుమతించడంపై నివాస భద్రతా అధికారి క్లాస్ పీకినట్లు సమాచారం.