‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం టీడీపీ చేసిన కుట్రలో ‘పెద్ద’ల పాత్రను నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చినబాబు నారా లోకేశ్‌పై దృష్టిసారించిన ఏసీబీ... తదుపరి చర్యగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫోకస్ పెట్టింది.