సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్ ! | Cash For Vote || Sandra Venkata Veeraiah was arrested by ACB ! | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 6 2015 5:34 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య ఈ ఉదయం ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి ఏసీబీ నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఏసీబీ ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసింది. సమాచారం కావాలంటే ఆయనను అరెస్టు చేసి ప్రశ్నించాల్సిందేనని ఏసీబీ భావించింది. ఈ పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతోనే ఆయనను ఏసీబీ అరెస్టు చేసినట్లు తెలిసింది. ఓటుకు రూ. 5 కోట్లు చెల్లించడానికి సిద్ధపడిన కేసులో ముందుగానే వీరయ్యకు నోటీసులు వెళ్లాయి. అయితే, అప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన జెరూసలెం మత్తయ్యకు 8 సార్లు ఫోన్ చేసినట్లు సమాచారం వచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement