sandra Venkata Veeraiah
-
సత్తుపల్లి నియోజకవర్గంలో ఈసారి పైచేయి ఎవరిది ..?
సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గం సత్తుపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి పక్షాన సండ్ర వెంకట వీరయ్య మరోసారి గెలిచారు. దీంతో ఆయన నాలుగోసారి గెలిచినట్లయింది. గతంలో ఒకసారి సిపిఎం తరపున, ఆ తర్వాత టిడిపి పక్షాన ఆయన గెలిచారు.2018లో తెలంగాణలో టిడిపి రెండు సీట్లు గెలిస్తే వాటిలో ఒకటి సత్తుపల్లి. మరొకటి అశ్వారావుపేట. కాగా గెలిచిన కొద్ది నెలలకు సండ్ర టిఆర్ఎస్ లో చేరిపోతున్నట్లు ప్రకటించారు. సండ్ర వెంకట వీరయ్య తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి పిడమర్తి రవిపై 19002 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వీరయ్యకు 100044 ఓట్లు రాగా, పిడమర్తి రవికి 81042 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన కె.స్వామికి 7300 పైగా ఓట్లు వచ్చాయి. సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లిలో 2014లో తన సమీప ప్రత్యర్ధి ఘట్టా దయానంద్‌పై 2485 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.వీరయ్య మొదట సిపిఎం తరపున గెలిచారు.ఆ తర్వాత కాలంలో ఆయన టిడిపిలోకి మారి సత్తుపల్లి నుంచి మూడుసార్లు గెలుపొందారు. ఇక్కడ నుంచి 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన విద్యార్ధి నేత పిడమర్తి రవి ఓటమి చెందారు. రవికి 6666 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో కూడా గెలవలేకపోయారు. 2014లో ఇక్కడ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి ఎమ్.డి.విజయకుమార్ రెండో స్థానంలో ఉంటే, మాజీ మంత్రి,కాంగ్రెస్ ఐ అభ్యర్ధి సంభాని చంద్రశేఖర్ 30105 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం 2009లో ఎస్సిలకు రిజర్వు అయింది. సంభాని చంద్రశేఖర్ నాలుగుసార్లు పాలేరు నియోజకవర్గంలో గెలిచారు. అలాగే సండ్ర వెంకటవీరయ్య పాలేరులో ఒకసారి గెలిచారు. 2009లో పాలేరు జనరల్ కావడంతో వీరిద్దరూ రిజర్వు అయిన సత్తుపల్లికి మారారు. సత్తుపల్లిలో గతంలో జలగం కుటుంబం ఎక్కువ కాలం ఆధిపత్యం వహించింది. 1957లో జలగం కొండలరావు, 1962, 1967,1972లలో వేంసూరు నుంచి జలగం వెంగళరావు గెలిస్తే, 1978 నుంచి ఏర్పడిన సత్తుపల్లిలో కూడా వెంగళరావే గెలుపొందారు. ఆయన కాసు,పివి మంత్రివర్గాలలో ఉండి, ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన ఖమ్మం లోక్‌సభస్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రి బాధ్యతలుకూడా నిర్వహించారు. పిసిసి అధ్యకక్షునిగా కూడా పనిచేశారు. జలగం వెంగళరావు పద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి కొంతకాలం మంత్రిగా కూడా వున్నారు. వెంగళరావు చిన్న కుమారుడు వెంకటరావు 2004లో సత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో టిక్కెట్ రాకపోవడంతో ఖమ్మంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. కొంతకాలం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టిఆర్ఎస్ లో చేరి కొత్త గూడెం నుంచి 2014 లో పోటీచేసి గెలుపొందారు. కాని 2018లో ఓటమి చెందారు. వెంగళరావు సోదరుడు కొండలరావు ఎమ్.పిగా కూడా ఎన్నికయ్యారు. సత్తుపల్లిలో మరో ప్రముఖ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఆయన 1983 నుంచి అక్కడ టిడిపి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. 1985, 1994, 1999లలో సత్తుపల్లిలోను, 2009లో ఖమ్మంలోను పోటీచేసి గెలిచారు. 2014 లో ఓటమిచెందారు. తదుపరి తుమ్మల టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు.ఆ తర్వాత పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐదోసారి గెలిచారు. కాని 2018 సాధారణ ఎన్నికలో ఓటమి చెందడంతో మంత్రి పదవి కోల్పోయారు. తుమ్మల గతంలో ఎన్టిఆర్ క్యాబినెట్‌లోను, చంద్రబాబు క్యాబినెట్‌లోను,తదుపరి కెసిఆర్ మంత్రివర్గంలోను పనిచేశారు. 1978లో జరిగిన ఎన్నికలలో ప్రముఖ సాహితీవేత్త కాళోజీ సత్తుపల్లిలో వెంగళరావుతో పోటీపోడి ఓడిపోయారు. అయితే జలగం ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికారం రాకపోవడంతో ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామాచేశారు. సత్తుపల్లి జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు తొమ్మిదిసార్లు వెలమ, మూడుసార్లు కమ్మ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరణ
సత్తుపల్లి: స్వాతంత్య్ర వజ్రోత్స వాలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. ఈ చిహ్నాన్ని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్‌తో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం ఆవిష్కరించారు. వైస్ చైర్మన్ తోట సుజలరాణి, కమిషనర్ కె.సుజాత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో సై అంటే సై! స్పీడ్ పెంచిన తుమ్మల, మట్టా, మదన్‌లాల్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్లో ఆశావహ నేతలు దూకుడు పెంచారు. ప్రధానంగా ఆ పార్టీలో పాలేరు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి అనుచరగణమూ ఇదే స్థాయిలో సై అంటే సై అంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అశావహ నేతలు నువ్వా.. నేనా అన్నట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్లీ తమకే పార్టీ టికెటన్న ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. పార్టీ సర్వేల్లో జాతకాలు మారుతాయన్న నమ్మకంతో ఆశావహులు ఉన్నారు. ఇటీవల ఆశావహ నేతలు హాట్‌హాట్‌గా ప్రకటనలు చేస్తూ తమ అనుచరులను క్రియాశీలకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. (చదవండి: Munugode Bypoll: పోటీయా? మద్దతా?) పాలేరులో పోటా పోటీ.. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కేడర్ రెండుగా చీలింది. గత కొంతకాలంగా రెండు వర్గా ల మధ్య ఉప్పు–నిప్పు అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కందాల హాజరవుతున్నారు. ఈ జోష్‌తో తన అనుచర నేతలు, కేడర్‌తో మళ్లీ పోటీలో ఉండేది తానేనంటూ సంకేతాలిస్తున్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టడంతో పాటు గతంతో పోలిస్తే గ్రామ పర్యటనలకు ఇటీవల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తన అనుచర నేతలు, కేడర్ నుంచి ఏ కార్యక్రమానికి పిలుపు వచ్చినా తుమ్మల వదులుకోవడం లేదు. వీటిల్లో పాల్గొంటూనే రాజకీయంగా చర్చనీయాంశం అయ్యేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇటీవల నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటిస్తూ ‘ఎప్పుడైనా పిడుగులు పడొచ్చు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. త్వరలో ఎన్నికలు వస్తాయని, టికెట్ తనకేనన్న నమ్మకంతో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. వైరా ‘గులాబీ’లో వార్.. జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న వైరా నియోజకవర్గ ‘గులాబీ’లో వార్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ తమకే టికెట్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే రాములునాయక్, మదన్‌లాల్ వర్గాలు వేర్వేరుగా చేస్తుండడం గమనార్హం. అంతేగాకుండా ఇరువురూ తమ కేడర్, నేతలతో భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ ముగ్గురితోపాటు మరో ఒకరిద్దరు కూడా ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తుండడంతో చివరికి పోటీలో ఎవరు ఉంటారన్నది సర్వేల్లో తేలుతుందన్నది పార్టీ వర్గాల సమాచారం. సత్తుపల్లిలోనూ ఇదే సీన్.. ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే నేతలకు పుట్టినిల్లు సత్తుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రధాన నేతల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారిదే గెలుపన్నది ఎప్పటినుంచో సాగుతున్న ప్రచారం. ఇటీవల ఏ ఎన్నికలు వచ్చినా.. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆశీర్వాదం ఎవరికి ఉంది.. దీంతో బరిలో ఉండే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో నాలుగోసారి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. 2009, 2014, 2018 లో టీడీపీ నుంచి సండ్ర గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా సండ్రకే ఉంటాయని ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ మట్టా దయానంద్ ఈసారి వేగం పెంచారు. తన వర్గం కేడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. నాలుగో సారి విజయం తనదేనంటూ సండ్ర, తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో దయానంద్ ఉండడంతో ఈ నియోజవర్గంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది. (చదవండి: డిగ్రీ విద్యార్హతగల వీఆర్ఏలకు పేస్కేల్! రెవెన్యూలోనే కొనసాగింపు? ) -
పేదలకు సేవ చేయడమే లక్ష్యం..
సత్తుపల్లి: పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చంద్రభాను సత్పతి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో నిర్మించనున్న 250 పడకల ఆస్పత్రి భవనానికి సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి వారు శంకుస్థాపన చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి, చంద్రభానును ఎమ్మెల్యే సండ్ర సన్మానించారు. -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్, సండ్రలకు సుప్రీంలో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన పేరు తొలగించడాన్ని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ సండ్ర వీరయ్య, ఏసీబీ కోర్టుకు ఈ కేసు విచారించే పరిధి లేదంటూ రేవంత్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రేవంత్ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సండ్ర తరఫున న్యాయవాది కె.గులాటిలు వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటువేయాలంటూ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డిసహా మరో ఇద్దరు లంచం ఇస్తూ దొరికారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశా రని గులాటి తెలిపారు. కేసుతో సండ్రకు సంబంధం లేదని వెల్ల డించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని సిద్దార్ధ లూత్రా తెలిపారు. అయితే, ఈ కేసులో స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి తదితరులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని, ఇది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్ తెలిపారు. వాదన అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. మంగళవారంలోగా కౌంటరు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణ సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. -
డీఎస్సీ నిర్వహించాలి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యా బోధనలో నాణ్యత పడి పోకుండా వచ్చే జూన్‌లోగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బందిని తిరిగి నియమించాలని సూచించారు. విద్య, వైద్యం, పురపాలక, ఆబ్కారీ, అటవీ, దేవాదాయ తదితర శాఖల 2021–22 వార్షిక బడ్జెట్ పద్దులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు అధికార, విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సండ్ర కోరారు. జూనియర్ కళాశాలలు లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు. ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలి స్టులు వస్తున్నారని, ఎవరు జర్నలిస్టులనేది ప్రభు త్వం నిర్వచించాలన్నారు. టీఆర్టీ పోస్టులకు ఎంపి కైన 250 మందిని పక్కనపెట్టారని, వీరిలో అర్హులను గుర్తించి ఉద్యోగాల్లో నియమించాలని రఘునందన్‌రావు కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ, టిమ్స్, జిల్లా ఆస్ప త్రుల్లో నియమించిన తాత్కాలిక పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన దేవాలయ, వక్ఫ్ భూములను తిరిగి ఆయా సంస్థలకు అప్పగిం చాలని సూచిం చారు. కిడ్నీ రోగుల అవసరాలను తీర్చడానికి డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల సంఖ్య పెంచాలని సంజయ్ సూచించారు. -
ఓటుకు నోటు కేసు : ఎమ్మెల్యే సండ్రకు నిరాశ
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో ఈరోజు జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు. డిసెంబర్ 15న జరిగే తదుపరి విచారణకు అందరూ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇకపై హాజరు మినహాయింపు కోసం వేసే పిటిషన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. -
ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. సోమవారం సండ్ర డిశ్చార్జి పిటిషన్‌తో పాటు, ఉదయ్ సింహ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. కాగా, ఓటుకు కోట్లు పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతో ఏసీబీ కోర్టు ఆయనను గతంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్‌ప్లే బాబుదే -
సీఎం సారూ.. సత్తుపల్లికి ఒక్కసారి రండి..
సాక్షి, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో నిర్మించిన వైకుంఠధామం ఫొటోలను అసెంబ్లీలో శుక్రవారం సీఎం కేసీఆర్ చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి బ్రహ్మాండంగా వైకుంఠధామాన్ని పార్కులా.. దేవాలయంలా కట్టారు. సండ్ర వెంకటవీరయ్య చెప్పింది చాలా కరెక్ట్.. సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా చాలా నిర్మించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి, గ్రామ ప్రజలు, అధికారులకు అభినందనలు’అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పంపించారు. చాలా సంతోషం వేసిందని కితాబిచ్చారు. పల్లెప్రగతి సంతృప్తినిచ్చింది.. పల్లెప్రగతి కార్యక్రమం తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో తెలిపారు. మనిషి చనిపోతే తీసుకెళ్లాలంటే కొట్లాటలు జరిగిన ఘటనలు చూశానని, ఎన్నికలు వస్తే ముందు శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తేనే ఓటు వేస్తామని చెప్పేవాళ్లు ఉండేదని, వీటన్నింటికి పరిష్కారం పల్లెప్రగతి చూపించిందని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 143 గ్రామపంచాయతీలు ఉంటే అన్నింట్లో ట్రాక్టర్లు కొనడమే కాకుండా.. వైకుంఠధామాల నిర్మాణాలు కూడా 143 పంచాయతీల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి వేలాది మంది సమక్షంలో ప్రారంభించి.. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శ్మశానవాటికలు అందంగా ఉండాలని దాతల సాయంతో ఒక శివుడి విగ్రహాన్ని నిర్మించామని, మనిషి పుట్టుక ఎంతగొప్పదో.. చనిపోయిన తర్వాత అంతే పవిత్రంగా ఆ కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలిగే విధంగా వాటిని నిర్మించామన్నారు. సత్తుపల్లి మండలం కొత్తూరు పంచాయతీ జిల్లాలోనే బెస్ట్ పంచాయతీగా కలెక్టర్ ఎంపిక చేశారని, ఆ పంచాయతీలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారని.. ప్లాస్టిక్ గ్లాస్, ప్లాస్టిక్ బ్యాగ్ వాడినా మహిళా సర్పంచ్ ఫైన్ వేస్తారని వెల్లడించారు. అన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ పర్యటనకు రావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆహ్వానించారు. -
అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నా: సండ్ర
-
అవును టీఆర్ఎస్లో చేరుతున్నా...
సాక్షి, హైదరాబాద్ : నియోజకవర్గ ప్రజల అవసరాలు, అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసి అధికార టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును సండ్ర కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాను పార్టీ మారుతున్నది వాస్తవేమనని ఆదివారం మీడియాకు వెల్లడించారు. ‘ప్రజల యొక్క మనోభావాలు, సత్తుపల్లి ప్రజల అవసరాల కోసం.. ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీడీపీకి రాజీనామా చేసి.. మరికొద్దిరోజుల్లోనే టీఆర్ఎస్లో చేరాలనుకుంటన్నా. కేసులకు భయపడేవాడినైతే అప్పుడే పార్టీ మారేవాడిని. అయినా అవీ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం చేతులో ఏం లేదు. మూడు సార్లు గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మారుతున్నాను. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడూ చేరేది మాత్రం కార్యకర్తలతో చర్చించిన తరువాతే ప్రకటిస్తాను’ అని ఆయన తెలిపారు. శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. శాసనసభ్యుల కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎంఐఎంతో కలిపి టీఆర్ఎస్ ఐదు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ సైతం ఒక స్థానానికి పోటీ చేస్తోంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ మద్దతు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. అసెంబ్లీలో ప్రస్తుత బలబలాల ప్రకారం టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్కు దగ్గరగా ఉంటున్న సండ్ర వెంకటవీరయ్యతో ఈ పని ప్రారంభించింది. పోలింగ్‌లోగా మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) మద్దతు పొందేలా వ్యూహాలను అమలు చేస్తోంది. -
గులాబీ గూటికి సండ్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగు కానుంది. టీటీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్‡్షకు పదునుపెట్టింది. ఇందులో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతానని ఈ సందర్భంగా సండ్ర... కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 12న జరగనుంది. ఆలోగా సండ్ర అధికారికంగా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. శాసనసభ్యుల కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎంఐఎంతో కలిపి టీఆర్ఎస్ ఐదు స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ సైతం ఒక స్థానానికి పోటీ చేస్తోంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ మద్దతు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్కు దగ్గరగా ఉంటున్న సండ్ర వెంకటవీరయ్యతో ఈ పని ప్రారంభించింది. పోలింగ్‌లోగా మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) మద్దతు పొందేలా వ్యూహాలను అమలు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంపై నజర్... అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్ప రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్కు అనుకూలంగా భారీ తీర్పు వచ్చింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రం టీఆర్ఎస్ కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకుగాను 16 స్థానాల్లో (ఒక సీటులో మిత్రపక్షమైన ఎంఐఎం పోటీ చేయనుంది) గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్... ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో బలం పెంచుకునే వ్యూహాన్ని మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నారు. మరో ఎమ్మెల్యే నాగేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్నారు. సండ్ర 1994లో సీపీఎం తరఫున పాలేరులో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి గెలిచారు. ఖమ్మం జిల్లాకు సాగర్ ఎడమ కాల్వ నీరు ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పం టను కాపాడేందుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయా లని సీఎం కేసీఆర్ ప్రభుత్వ సీఎస్ ఎస్. కె. జోషిని ఆదేశించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలసిన సండ్ర... సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో రైతులు దాదాపు 2 లక్షల ఎకరాల్లో మెట్ట, ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు. ఆ పంటలకు ప్రస్తుతం నీరు అవసరమని, 10 రోజులపాటు సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు అందించి పంటలను కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు. -
టీటీడీ బోర్డు నుంచి సండ్ర తొలగింపు
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డు సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకం రద్దు అయింది. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్న సండ్ర...ఇంతవరకు బోర్డు సభ్యుడిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో పాలక మండలి నుంచి ఆయనను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి కూడా. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలిలో సండ్ర సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మరోవైపు తెలంగాణ అసెంబ్లీ విస్తరణ నేపథ్యంలో సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కనుక కారెక్కితే ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్లో బెర్త్ దక్కకున్నా... కీలక పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
కారెక్కేనా ?
సాక్షి, కొత్తగూడెం: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా జిల్లా నుంచి కొందరు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం అవుతోందనేది జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే మొదట గులాబీ బాస్ కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కారెక్కడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల తర్వాత కాంగ్రెస్ శాసన సభ్యులకు గాలం వేసేందుకు టీఆర్ఎస్ అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భారీ మెజారిటీతో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. భద్రా ద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల్లో జరుగబోయే పార్లమెంటు ఎన్నిక ల్లో గులాబీ జెండా ఎగరేయాలంటే ఖమ్మం, మ హబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లలో గెలిచిన విపక్ష ఎమ్మెల్యేలను ‘కారు’లో ఎక్కించుకునేందు కు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని బహిరంగ చర్చ జరుగుతోంది. ఇప్పటికే సత్తుపల్లి ఎ మ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేర డం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కొంత ఆలస్యంగానైనా మెచ్చా కూడా గులాబీ గూటికి చేరతారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే ఈ నెల 17వ తేదీలోపే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఎవరి ఆధ్వర్యంలో చేరుతారో.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒకవేళ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే ఎవరి ఆధ్వర్యంలో చేరుతారోననేది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే పొంగులేటి వర్గీయులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే కారెక్కేందుకు సండ్ర సిద్ధమైనప్పటికీ.. మెచ్చా మాత్రం సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటవీరయ్యతో కలిసి వెళితే ఆయనకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని, తనకు ప్రాధాన్యం ఉండదని మెచ్చా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెచ్చాకు కూడా ప్రాధాన్యత కల్పించేలా నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈనెల 8న మెచ్చా నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. గెలిచిన తరువాత మర్యాదపూర్వకంగానే తుమ్మలను కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలకు సంబంధించిన చర్చలు లేవని మెచ్చా చెబుతున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మెచ్చా గులాబీ గూటికి చేరడం ఒకవేళ ఖాయమైతే.. ఎవరి ఆధ్వర్యంలో అనే ఉత్కంఠ టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మెచ్చాకు చంద్రబాబు ఖరీదైన కారు..? మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉండడంతో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెచ్చాను పిలిపించుకుని పార్టీ మారవద్దని సూచించారు. సండ్ర టీఆర్ఎస్ గూటికి చేరినా మెచ్చాను మాత్రం వెళ్లవద్దని కోరినట్లు సమాచారం. టీడీపీలో కొనసాగితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు మెచ్చాకు ఖరీదైన కారు బహుకరించినట్లు నియోజకవర్గ వ్యాప్తంగా బహిరంగ చర్చ జరుగుతోంది. -
తెలంగాణలో టీడీపీకి ఝలక్
-
మోత్కుపల్లిపై ‘సండ్ర’ నిప్పులు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ పనైపోయిందని వ్యాఖ్యానించిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరోక్షంగా మండిపడ్డారు. కొంత మంది స్వార్ధపరుల కోసమో, పదవుల కోసమో, అవకాశవాదుల కోసమో టీడీపీని స్థాపించలేదని అన్నారు. కొంతమంది నాయకులు అవకాశం కోసం పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృతనిశ్చయంతో ఉండటమే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందని, పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిదని సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎమ్మెల్యే వీరయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని మోత్కుపల్లి బ్లాక్మెయిల్ చేస్తున్నారని వీరయ్య పరోక్షంగా పేర్కొనడంతో టీటీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడినట్టయింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించలేదు. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని నారా లోకేశ్ ప్రకటించారు. -
‘కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి’
విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వే అంతా బూటకమని టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య అన్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు దమ్ముంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్లాలి. వెంటనే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరాలి.. అప్పుడు తెలుస్తుంది ఎవరి దమ్మెంతో. కేసీఆర్ వెల్లడించిన సర్వే వివరాలన్ని అబద్ధాలని అన్నారు. -
బీఏసీ భేటీకి పిలిచి.. అవమానించారు
అసెంబ్లీ కార్యదర్శి సదారాంపై స్పీకర్‌కు సండ్ర ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో బీఏసీ సమావేశానికి తనను పిలిచి అవమానించారని, దీనికి బాధ్యులైన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఫిర్యాదుచేశారు. ఈ నెల 15న జరిగిన బీఏసీ సమావేశానికి హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం తనను అధికారికంగా ఆహ్వానించారని, అయితే హాజరైన తనను బడ్జెట్ సమావేశాలు మొత్తానికి సస్పెండైన కారణంగా బీఏసీ సమావేశానికి హాజరు కావొద్దని తిప్పి పంపించారని వివరించారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శిపై శాసనసభ రూల్ 168 ప్రకారం ప్రివిలేజ్ మోషన్ పెట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు. -
కోర్టుకు హాజరైన సండ్ర
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఆయన్ని నిందితునిగా చేరుస్తూ ఏసీబీ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు రేవంత్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. -
ఆ చట్టం తెస్తే కేసీఆర్‌కు యావజ్జీవమే
సింగరేణి ఉద్యోగాలపై కేసు వేసింది కవిత అనుచరులే: సండ్ర సాక్షి, హైదరాబాద్: అబద్ధాలను, ఆరోపణలను రుజువు చేయకుంటే జైలుకు వెళ్లాలనే చట్టం తీసుకొస్తే ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు జీవితాంతం జైలులోనే ఉం డాల్సి ఉంటుందని టీటీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలసి మీడి యాపాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు అందరికంటే ఎక్కువ శిక్ష తప్పదన్నారు. అప్పులు చేయడమే గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఆస్తులు రూ.వేల కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్న కేసీఆర్, కేటీఆర్‌లకు ఎన్ని అప్పులు ఉన్నాయో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.69 వేల కోట్లు అప్పులు ఉంటే ఇప్పుడవి రూ.లక్షా 40 వేల కోట్లకు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడే పుట్టిన శిశువుపై కూడా రూ.40 వేల అప్పు ఉందని చెప్పారు. అప్పులు చేస్తేనే అభివృద్ధి, అప్పులు చేయడం సమర్థత అంటున్న కేసీఆర్‌కు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పత్రికలు, ఒక టీవీ చానల్, వందలాది ఎకరాల్లో ఫాంహౌజు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. మరోవైపు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను ఆపింది తెలంగాణ జాగృతికి చెందిన నాయకులేనని సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. -
ఎండలో నిలబడి రేవంత్ నిరసన
అన్యాయంగా సభనుంచి సస్పెండ్ చేశారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్రవెంకటవీరయ్య సోమవారం అసెంబ్లీ ప్రధానద్వారం ఎదురుగా, మండు టెండలో నిలబడి నిరసన తెలియజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంతో పాటు, అసెంబ్లీ జరిగిన సమయం అంతా వారు ఎండలోనే నిలబడ్డారు. మరో టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా అసెంబ్లీ లోపలికి వెళ్లలేదు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో సభ పూర్తిగా ఆయన ఆధీనం లోనే ఉంటుందని, ఆ సమయంలో ఏం జరిగినా స్పీకర్‌కు సస్పెండ్ చేసే అధికారం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు అధికారంలేకున్నా, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారనే సాకుతో తమను సస్పెండ్ చేయడం ద్వారా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
రాజకీయ వేదికగా వాడుకోనీయం
సభను అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యం: సోలిపేట సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, వారిని సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్, బీజేపీ రాజకీయ చేయాలనుకోవడం విచారకరమని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాల రాజులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీని విపక్షాలు రాజకీయ వేదికగా వాడుకోవాలని చూస్తున్నాయని, వారి ఆటలు సాగనీయమని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా టీడీపీ సభ్యులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య రన్నింగ్ కామెంట్రీ చేశారని, వారి సస్పెన్షన్ సబబేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఓకే రీతిన వ్యవహరిస్తున్నాయని, సభను సీఎల్పీ నేత జానారెడ్డి తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. -
రేవంత్, సండ్ర సస్పెన్షన్
⇔ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలినందుకు చర్యలు ⇔ ప్రస్తుత సమావేశాలు ముగిసేవరకు వర్తింపు ⇔ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్.. ఆమోదించిన స్పీకర్ ⇔ సస్పెన్షన్ అన్యాయమంటూ విపక్షాల అభ్యంతరం ⇔ క్షమాపణ చెబితే సస్పెన్షన్‌పై పునరాలోచిస్తామన్న హరీశ్‌రావు ⇔ నిరసనగా కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం సభ్యుల వాకౌట్ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి పదే పదే అడ్డుపడ్డారన్న కారణంతో టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలకు సస్పెన్షన్ వేటు పడింది. వారిని ప్రస్తుత సమా వేశాల మొత్తానికి శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. స్పీకర్ మధుసూదనాచారి మూజువాణి ఓటు తో ఆమోదించారు. శనివారం శాసనసభ సమా వేశం ప్రారంభం కాగానే శుక్రవారం నాటి పరిణామాలను స్పీకర్ ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యు లు వ్యవహరించిన తీరును, కాంగ్రెస్ వాకౌట్ ను తప్పుబట్టారు. అలా సభా సంప్రదాయా లకు భిన్నంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. స్పీకర్ స్వయంగా కోరినా, బీఏసీలో నిర్ణయం తీసుకున్నా కూడా టీడీపీ సభ్యులు పదే పదే సభకు అంతరాయం కలిగిం చారని పేర్కొన్నారు. రేవంత్, సండ్రలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ హరీశ్ తీర్మా నం ప్రవేశపెట్టడం, అది వెంటనే సభ ఆమో దం పొందడం చకాచకా జరిగిపోయాయి. అయితే ఇది అన్యాయమంటూ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. ‘ఇది శాసనసభా.. టీఆర్ఎస్ సభా..? ప్రభుత్వం చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారొద్దు.. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా.. రాచరిక ప్రభుత్వమా..? ’అంటూ నినాదాలు చేశారు. గతంలో ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి: జానా కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో స్పీకర్ మధు సూదనాచారి ప్రతిపక్ష నేత జానారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో జానా మాట్లాడుతూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ‘‘గతంలో ఇదే సభలో నిరసనలు తెలిపిన తీరుపై అధికార పక్ష సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పటి ప్రభుత్వం ఎలా వ్యవహ రించింది, ఎలాంటి చర్యలు తీసుకున్నదీ గమనించాలి. కేవలం కక్షతో, సభ్యులను భయభ్రాంతులను చేయాలన్న ఉద్దేశంతో సస్పెండ్ చేయడం మంచిది కాదు..’’అని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రజా సంబంధ అంశాలు లేనందున తాము సైతం సభ నుంచి వెళ్లిపోయి, బయట నిరసన తెలిపామని చెప్పారు. తాము వాకౌట్ కానీ, నిరసన కానీ తెలియజేయలేదన్నారు. అనం తరం బీజేపీపక్ష నేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సరికాదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న సభ్యులు గతంలో ఇంతకన్నా ఎక్కువే చేశారని స్పీకర్ దృష్టికి తెచ్చారు. సస్పెన్షన్‌పై పునరాలోచన చేయాలని కోరారు. సభ్యుల సస్పెన్షన్‌ను సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. విపక్షాల విజ్ఞప్తి పట్ల మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెబితే పునరాలోచిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని.. అక్కడో సంప్రదాయం, ఇక్కడో సంప్రదాయమా అని నిలదీశారు. అయితే మంత్రి సమాధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల తీరు దురదృష్టకరం: సునీత ప్రతిపక్షాల సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, వినకుండా వాకౌట్ చేయడం దురదృష్టకరమని టీఆర్ఎస్ సభ్యులు వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పలువురు మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక విపక్షాలు ఇలా వ్యవహరిస్తున్నాయని గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. విపక్షాలకు తమ మనుగడ లేకుండా పోతోందనే భయం పట్టుకుందని, అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. తెలంగాణ రావడం చీకటి రోజని ప్రకటించిన పార్టీ కోసం ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. సస్పెన్షన్ ఎత్తివేయండి: టీటీడీపీ రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీటీడీపీ నేతలు ఎల్.రమణ తదితరులు స్పీకర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉందని, అంతమాత్రానికే సస్పెండ్ చేయడం సభ గౌరవానికి మంచిదికాదని జానారెడ్డి పేర్కొన్నారు. రేవంత్, సండ్రలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. దీనికి స్పీకర్ నిరాకరించడంతో.. కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సభ్యులు లేకుండా సభ నడపడం మంచిదికాదని పేర్కొన్నారు. స్పీకర్ తీరుకు నిరసనగా అసెంబ్లీలో ఏర్పాటు చేసిన భోజనాలను కాంగ్రెస్ సభ్యులు తిరస్కరించారు. -
రేవంత్‌రెడ్డి, సండ్రలపై వేటు
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ బడ్జెట్ సమావేశాల మొత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ముందు ఏపీలో జీవో తీసుకురండి
ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణపై మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించి విశ్వసనీయతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని తలసానిని ఉద్దేశించి సండ్ర వ్యాఖ్యానించగా.. ‘ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా జరిపేందుకు ముందు ఏపీలో జీవో తీసుకురండి, తర్వాత ఇక్కడ ఆలోచిద్దాం’ అని తలసాని అన్నారు. దీంతో కార్యక్రమానికి జీవోలుండవని, మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉంటాయని రేవంత్ జవాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని, ఇప్పుడు ఏపీలోనూ నిర్వహిస్తున్నారని వివరించారు. -
కోడెల తరలింపుపై వాయిదా తీర్మానం తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: కొమురవెల్లి మల్లన్న భక్తులు మొక్కుబడి కింద సమర్పించిన కోడెలు, లేగదూడలను కబేళాలకు తరలిస్తున్న తీరుపై చర్చించడానికి టీడీపీ బుధవారం శాసనసభలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మల్లన్నకు మొక్కుల రూపంలో భక్తులు ఇచ్చిన కోడెలను వేలంలో కొనుగోలు చేసి కబేళాకు తరలిస్తున్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఘోరం మల్లన్నా.. ఘోరం! ) -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి
స్పీకర్‌ను కలసిన రేవంత్, సండ్ర సాక్షి, హైదరాబాద్: టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన వారిపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20లోగా చర్యలు తీసుకోవాలని టీటీడీపీ నేతలు ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. గురువారం ఈ మేరకు శాసనసభ స్పీకర్‌ను కలసి అసెంబ్లీలో వినతి పత్రాన్ని అందించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలను తీసుకోకుండానే టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టుగా గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. ప్రశ్నల సంఖ్యను, సభలో మాట్లాడే సమ యాన్ని కూడా టీడీపీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారమే ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. -
అభివృద్ధి కోసమే.. పదవి
♦ అందుబాటులో ఉంటూ.. అభివృద్ధి చేస్తున్నా.. ♦ నిత్యం ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నా.. ♦ ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు ♦ ఎదురుదాడే మంత్రంగా పని చేస్తున్నా.. ♦ సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే ‘ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. వారి మనిషిగా ఉండటమే నాకిష్టం. జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతూ.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అందించేందుకు నా పదవిని ఉపయోగించటం తృప్తినిచ్చే అంశం. తెలంగాణ వాదానికి ముడిపెట్టి రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం.. నిరుపేదలు ఆర్థిక, సామాజిక అభివృద్ధి పథంలో పయనించేందుకు నా పదవిని ఉపయోగిస్తా’. అంటూ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సత్తుపల్లి : శిలాఫలకాలు.. రోడ్లు వేయడమే అభివృద్ధి కాదు.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ.. అండగా నిలవడమంటే నాకిష్టం.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన.. శాశ్వత ప్రాతిపదికన పనులు చేయించడం నా కర్తవ్యం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సింది ప్రభుత్వం.. తద్వారా ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రతిపక్షమైన అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా’. అని రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనపై..ప్రభుత్వం ఒకటి రెండు కార్యక్రమాల చుట్టే తిరుగు తోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ జపం చేస్తూ.. కొత్త పనులు చేపట్టడం వదిలేసింది. చాలా పథకాల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజలం దరినీ తమవైపు తిప్పుతూ.. అటుచేసి ఇటుచేసి రెండేళ్లు గడిపేసింది. ఎస్టిమేషన్ ఒకటి.. టెండర్ ఒకటి.. ఎక్స్టెన్షన్ మరొకటి.. ఇలా ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచి పెడుతోంది. కోట్ల రూపాయల పనులు నామినేషన్లపై ఇచ్చేస్తున్నారు. మిషన్ కాకతీయ పనులు 40 శాతం లెస్ వేసినా.. కాంట్రాక్టర్లకు లాభం వస్తుందంటే అంచనాల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరగటం విచారకరం. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పండుగలకు భోజనాలు పెట్టడం కాదు.. ఆ వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన పనులు చేపడితే ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రజాప్రతినిధిగా మీ అనుభవం? ఇప్పటికి నేను మూడోసారి ఎమ్మెల్యేగా పని చేస్తున్నాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మూడు ప్రభుత్వాలను దగ్గర నుంచి చూశాను. ప్రజా సమస్యలను ఆరుగురు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లా.. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంచి గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు పిలిచేందుకు జంకే పరిస్థితి వచ్చింది. ఈ పద్ధతిలో మార్పు రావాలి. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం అధికారులను కలవటం.. పని చేయించటం నా హక్కు. దారిని హరించే ప్రయత్నం చేస్తే ఎంత దూరమైనా వెళ్లి ప్రజల కోసం పోరాటం చేస్తా. మహిళలు, ఎస్సీలు కేబినెట్లో లేని ప్రభుత్వాన్ని చూడటం ఇదే తొలిసారి. ఎమ్మెల్యే నిధులెలా ఖర్చు చేశారు? రెండేళ్లలో నాకు వచ్చిన రూ.4కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. మరికొన్ని పనులు పూర్తి చేశాం.. శాశ్వతంగా నిలిచే పనులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతున్నాం. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాను. సత్తుపల్లిలో ముస్లిం ఈద్గాకు బోరు వేయించటం, మట్టి తోలించటం, జామె మసీద్‌కు రూ.50వేలు, షాదీఖానాకు రూ.3లక్షలు కేటాయించాను. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించాను. పెండింగ్ పనులపై.. ప్రభుత్వాలు మారగానే ప్రాధాన్యత మారటం బాధాకరం. రూ.38కోట్లతో సత్తుపల్లిలో 24 గంటలు మంచినీరు సరఫరా చేసే పథకం మిషన్ భగీరథలో చేర్చకపోవటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ పనులను సాగదీయకుండా.. నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేయాలి. పది వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిల్లుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిరుపేదలను ఇబ్బం దులు పెట్టడం సరికాదు. డబుల్ బెడ్రూం పథకానికి ఇప్పటివరకు కనీస మార్గదర్శకాలు రాలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై చట్టం చేసినా దారి మళ్లిస్తున్నారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి కొత్తగా భవనం నిర్మించాలి. పెనుబల్లి, కల్లూరు ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలి. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో సీట్లు పెంచాలి. నియోజకవర్గంలో సుమారు 6వేల మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని హిందూ దేవాలయాల అభివృద్ధికి ఆర్థికంగా చేయూతనందిస్తున్నాను. అనువైన ప్రాంతాల్లో కల్యాణ మండపాలు, పురాతన దేవాలయాల అభివృద్ధి, గోశాల ఏర్పాటుకు నిధులు అందించాను. ఎంతో మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు నా వంతు సహకారం అందిస్తున్నా. తిరుపతి ఆస్పత్రిలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 150 మందికి రూ.1.50లక్షలు ఖర్చయ్యే మోకాళ్ల ఆపరేషన్లు ఉచితంగా చేయించాను. -
'ఈ ప్రభుత్వానికి రెండు బడ్జెట్లు మాత్రమే పెట్టే అవకాశం'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు బడ్జెట్లు మాత్రమే పెట్టే అవకాశం ఉందని తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లు అభూత కల్పన మాత్రమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపించారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌కు రేవంత్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... రైతు రుణమాఫీ సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపించారు. కేజీ టూ పీజీ ఫీజురియింబర్స్‌మెంట్, ఇతర పథకాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. -
సండ్రకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన బెయిల్ షరతులు సడలించాలని సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైకోర్టు సండ్రకు బెయిల్ షరతులు సడలించింది. హైదరాబాద్ వచ్చేందుకు అనుమతులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు హైదరాబాద్ మినహా ఎక్కడికైనా వెళ్లవచ్చని హైకోర్టు తెలిపింది. -
ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ స్పీచ్‌ల రికార్డులను స్వర పరీక్ష కోసం తెలంగాణ అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. సెబాస్టియన్, మత్తయ్య టీవీ ఇంటర్వ్యూలను ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఏసీబీ కోర్టును అసెంబ్లీ అధికారులు కోరినట్టు సమాచారం. కాగా, ఓటుకు నోట్లు కేసులో అరెస్టైన తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. -
'టీఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం'
సత్తుపల్లి (ఖమ్మం జిల్లా): 'కేసీఆర్‌పై ఇక యుద్ధం మొదలైంది.. ఆరు నెలలు ఓపిక పట్టండి.. టీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే నాలుగేళ్లు ఏమీ మాట్లాడం.. రాజకీయ సన్యాసం తీసుకుంటాం' అని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యేల బృందం సండ్ర వెంకటవీరయ్యకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. 'మా పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నప్పుడు కేసుకాదు.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయానా డబ్బుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. అయినా కేసు కాలేదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఇటీవల జరిగిన ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. తలసాని శ్రీనివాసయాదవ్‌కు సనత్‌నగర్‌లో మూడో స్థానం దక్కుతుంది. 25వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుంది' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సండ్ర వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే ఏ తప్పు చేయకపోయినా కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొన్ని పొరబాట్లు జరగటం వల్లే సీట్లు తగ్గాయని.. కనీసం 30 నుంచి 32 స్థానాలు రావాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి తమ పార్టీని దెబ్బతీసేందుకే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. రాజకీయంగా తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. విశాఖపట్నంలో తమ పిల్లలు చదువుతుంటే ఫార్మా ఇండ్రస్ట్రీ పెట్టానని ఆరోపణలు చేస్తున్నారని.. ఎన్నికల అఫిడవిట్లో ఏవైతే దాఖలు చేశానో.. దానికంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా.. రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. బినామీల పేరుమీద అక్రమ ఆస్తులు సంపాదించాల్సిన కర్మ పట్ట లేదన్నారు. పోలీసులు, అధికారులను ప్రయోగించి పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాగంటి గోపినాథ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బ్రహ్మయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వాసిరెడ్డి రామనాధం తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ కోర్టుకు హాజరైన సండ్ర
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గోదావరి పుష్కరాలకు హాజరయ్యేందుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా మంగళవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సండ్ర వెంకట వీరయ్యకు గత వారం షరతులతో కూడిన బెయిల్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని , నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది.కాగా, పుష్కరాలకు హాజరు కావడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవల సండ్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే సండ్రకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : 'ఓటుకు కోట్లు' కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు మంగళవారం కూడిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు రూ. 2 లక్షల పూచీకత్తు చెల్లించాలని పేర్కొంది. అలాగే నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఏసీబీ కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సండ్ర ఏసీబీ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సండ్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సండ్ర బెయిల్‌పై వాదనలు పూర్తి, నిర్ణయం రేపటికి
-
సండ్ర బెయిల్‌పై వాదనలు పూర్తి, నిర్ణయం రేపటికి
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. విచారణ పూర్తయినందున సండ్రకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తే...కేసు కీలక దశలో ఉందని, సండ్రకు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. దాంతో వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. -
'ప్రధాన సూత్రధారుల్లో సండ్ర ఒకరు'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే విచారణ పూర్తయినందున సండ్రకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తే... సండ్రకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సండ్ర వెంకట వీరయ్య ప్రధాన సూత్రధారుల్లో ఒకరని, ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత సండ్ర పాత్ర బయటపడిందని, కేసు కీలక దశలో ఉందని, దర్యాప్తు సంస్థకు సరైనంత సమయం ఇవ్వాలని, కేసులో సూత్రధారి సండ్రకు బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని, దర్యాప్తుకు ఏమాత్రం సహకరించకుండా సండ్ర తప్పించుకుని తిరిగారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. -
'ఎఫ్ఐఆర్లో సండ్ర పేరు లేకున్నా అరెస్ట్'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో అరెస్ట్ అయిన సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కస్టడీ పూర్తయినందున సండ్రకు బెయిల్ మంజూరు చేయాలని సండ్ర తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే విచారణ పూర్తయిందని, స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారని, ఎఫ్ఐఆర్లో ఎక్కడా సండ్ర పేరు లేదని, అయినా సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని సండ్ర తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. విచారణలో A-1,A-2, A-3 నిందితులు కూడా సండ్ర పేరును ఎక్కడా ప్రస్తావించలేదని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. -
ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రెండో రోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. శుక్రవారం ఏసీబీ అధికారులు సండ్రను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఓటుకు కోట్లు కేసులో సండ్రను రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. గురువారం కూడా ఏసీబీ అధికారులు సండ్రను విచారించారు. ఈ రోజుతో సండ్ర ఏసీబీ కస్టడీ ముగిసింది. -
అన్నీ డొంకతిరుగుడు సమాధానాలే!
* ఏసీబీ తొలి రోజు కస్టడీ విచారణలో సండ్ర దాటవేత ధోరణి * ప్రతి కాల్‌నూ గుర్తుంచుకోలేనంటూ బదులు * కీలకమైన ప్రశ్నలపట్ల మౌనం * అతికష్టం మీద కొంత సమాచారం సేకరణ * సీఎం కేసీఆర్‌తో ఏసీబీ డీజీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో సూత్రధారుల్ని కనిపెట్టేందుకు అవినితి నిరోధకశాఖ (ఏసీబీ) కసరత్తు మరింత ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో ఐదో నిందితుడైన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన రెండు రోజుల అనుమతిలో భాగంగా గురువారం తమ కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...ఆయన్నుంచి అతికష్టం మీద కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. అయితే కొన్ని కీలకమైన ప్రశ్నలపట్ల కూడా దాటవేత ధోరణి అవలంబించినట్లు సమాచారం. ఈ కేసులో కీలక వ్యక్తులకు సంబంధించి రెండో రోజైన శుక్రవారం కచ్చితమైన వివరాలు రాబట్టాలని ఏసీబీ యోచిస్తోంది. కరువైన సమాధానం... ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మేరకు ఏసీబీ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో జరిగిన ఈ విచారణలో సండ్ర నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎం.మల్లారెడ్డి నేతృత్వంలోని అధికారులు శతవిధాలుగా ప్రయత్నించారు. ఉదయం ఏసీబీ కార్యాలయానికి రాగానే సండ్రకు కాఫీ ఇచ్చి అధికారులు కుశల ప్రశ్నలు వేశారు. అనంతరం చిన్నగా కేసుకు సంబంధించిన విషయాలను ఆయన వద్ద ప్రస్తావించారు. అయితే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సండ్ర నుంచి చిత్రమైన సమాధానాలు వచ్చినట్లు సమాచారం. నోటీసుల జారీ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఏసీబీ అధికారులకు చెప్పిన విషయాలనే పునారావృతం చేసినట్లు తెలిసింది. సెబాస్టియన్‌తో సాగించిన ఫోన్ సంభాషణలను ఆయన ముందుంచి కొన్ని పిన్ పాయింట్ ప్రశ్నలు వేయగా వాటిలో కొన్నింటి కి గుర్తులేదని, మరికొన్నింటి విషయంలో సండ్ర మౌనం వహించారని సమాచారం. ఈ కాల్స్ మాట్లాడింది మీరే కదా అని ఏసీబీ వేసిన ప్రశ్నకు... ‘ఏమో మాట్లాడి ఉండొచ్చు. నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేను, టీటీడీ బోర్డు సభ్యుడిని. నాకు రోజూ చాలా కాల్స్ వస్తాయి. టీటీడీ సభ్యుడిని కాబట్టి చాలా మంది రెకమండ్ కోసం ఫోన్లు చేస్తుంటారు. అన్నింటినీ గుర్తుపెట్టుకోలేను’ అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు తయారు చేసుకున్న ప్రశ్నావళిలో కొన్నింటికి సంబంధించి కొంత సమాచారాన్ని సండ్ర నుంచి రాబట్టగలిగినట్లు ఏసీబీ వర్గాల సమాచారం. అంతా ‘తర్ఫీదు’ ప్రకారమే... కస్టడీలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పందించిన తీరుపట్ల ఏసీబీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొదటిసారి తామిచ్చిన నోటీసులకు, ఆ తర్వాత అరెస్టుకు మధ్య అంతరంలో ఆయన ‘తర్పీదు’ పొంది నట్లు భావిస్తోంది. ఏపీలోని విజయవాడ, చికి త్స పొందినట్లు చెబుతున్న రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో సండ్ర ‘శిక్షణ’ పొందినట్లు ఏసీబీ అంచనాకొచ్చింది. ఈ శిక్షణలో కొందరు టీడీపీ నేతలతోపాటు మానసిక నిపుణులు, ఏపీ పోలీసుల ఉన్నతాధికారులు బాగా తర్పీదు ఇచ్చినట్లు అనుమానిస్తోంది. కస్టడీలో భాగంగా గురువారం విచారించగా సండ్ర వ్యవహరశైలి అచ్చం అదే విధంగా ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ కేసుకు సంబంధించి తాజా పరిస్థితిని ఏసీబీ డీజీ ఏకే ఖాన్.. సీఎం కేసీఆర్‌కు వివ రించారు. గురువారం సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఏకేఖాన్తోపాటు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసుతోపాటు రంజాన్ పండుగకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాట్లను చర్చించినట్లు సమాచారం. బెయిల్ పిటిషన్‌పై విచారణ 13కు వాయిదా ఈ కేసులో సండ్ర దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ నెల 13కు వాయిదా వేశారు. సండ్ర పిటిషన్‌పై గురువారం విచారణ జరగగా.. సండ్ర ఏసీబీ కస్టడీలో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఏసీబీ తరఫు న్యాయవాది కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. సండ్ర టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారని.. పలుకుబడి కలిగిన ఆయన బయట ఉంటే దర్యాప్తును అడ్డుకునే అవకాశం ఉందని పేర్కొంటూ ఏసీబీ ఇప్పటికే కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. -
ముగిసిన సండ్ర తొలిరోజు విచారణ
-
ముగిసిన సండ్ర తొలిరోజు విచారణ
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీలో భాగంగా ఏసీబీ తొలిరోజు విచారణ ముగిసింది. శుక్రవారం నాడు కూడా సండ్రను ఏసీబీ విచారించనుంది. ఈ రోజు పలు కీలక అంశాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఏసీబీ అడిగిన దానికి తనకు ఏమీ తెలియదంటూనే సండ్ర సమాధానాల్ని దాటవేసినట్లు సమాచారం. ఉదయం గం.10 నుంచి సాయంత్రం గం.5 ల వరకూ సండ్రను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు 70 నుంచి 80 ప్రశ్నల వరకూ ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది. సండ్రను న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ విచారించింది. ఓటుకు కోట్లు కేసులో సండ్రను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. -
ఏసీబీ కస్టడీకి ఎమ్మెల్యే సండ్ర
-
ఏసీబీ కస్టడీకి ఎమ్మెల్యే సండ్ర
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు గురువారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. సండ్రను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. దాంతో చర్లపల్లి జైలు నుంచి సండ్రను అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆయనను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. కస్టడీ అనంతరం సండ్రను అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సండ్ర బెయిల్ పిటిషన్‌తో పాటు, ఏసీబీ కౌంటర్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. సండ్రను రెండురోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అప్పగించడంతో అధికారులు తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా .. వాటిని భేఖాతరు చేసి తప్పించుకుని తిరుగుతున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు స్పెషల్ టీంను రంగంలోకి దింపారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా జిమ్మిబాబను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు రాబట్టవచ్చని ఏసీబీ భావిస్తోంది. కేసులో A-4 నిందితుడు మత్తయ్య మాదిరిగా జిమ్మిబాబు కూడా ఏపీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఏసీబీ అనుమానిస్తుంది. -
సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ
-
సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ
* ప్రత్యేక కోర్టు ఆదేశం * న్యాయవాది పర్యవేక్షణలోనే విచారించాలి * థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదు * ప్రతిరోజూ సాయంత్రం వైద్య పరీక్షలు చేయించాలి * ఓటుకు కోట్లు కేసులో సండ్రకు కీలక పాత్ర * అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి * ప్రత్యేక కోర్టులో ఏసీబీ వాదన సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ప్రత్యేక కోర్టు రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల మధ్య న్యాయవాది సమక్షంలో విచారించవచ్చని, అనుచితంగా ప్రవర్తించరాదని, థర్డ్‌డిగ్రీ పద్ధతులు ప్రయోగించరాదని పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించాలని స్పష్టంచేశారు. కస్టడీ సమయంలో పరిశుభ్రమైన ఆహారం అందివ్వాలని, శుభ్రంగా ఉన్న టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించాలని, కస్టడీ అనంతరం తిరిగి శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. కస్టడీ సమయంలో సండ్ర రక్షణ బాధ్యత ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డిదేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షల అనంతరం వీరయ్యను ఏసీబీ అదనపు ఎస్పీకి అప్పగించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కస్టడీ సమయంలో అవసరమైనన్ని మంచినీళ్లు వీలైతే మినరల్ వాటర్ ఇవ్వాలని, రాత్రి పడుకునే ముందు దిండు, బెడ్‌షీట్ ఇవ్వాలని, లైట్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తేల్చాలి.. అంతకుముందు తమ కస్టడీకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కుట్ర కేసులో సండ్ర వెంకట వీరయ్య కీలక పాత్ర పోషించారన్నారు. ఆధారాలు మాయం చేసేందుకే దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పోయారని తెలిపారు. రాజమండ్రిలో చికిత్స పొందుతున్నానని లేఖ రాసిన సండ్ర ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో కూడా చెప్పలేదన్నారు. హైదరాబాద్‌లో నిమ్స్ సహా అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నా.. విచారణ నుంచి తప్పించుకునేందుకే పక్క రాష్ట్రంలోని రాజమండ్రికి వెళ్లిపోయారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తెలిసినా ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా అమాయకుడిలా నటిస్తున్నారని తెలిపారు. మొదట సాక్షిగా సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చామని, అయితే రెండో నిందితుడు సెబాస్టియన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు విశ్లేషించి ఇచ్చిన నివేదిక ఆధారంగా సండ్రకు ఈ కుట్రలో కీలక పాత్ర ఉన్నట్లు నిర్ధారించామన్నారు. స్టీఫెన్‌సన్‌తో ఓటు వేయిస్తే హామీ ఇచ్చిన డబ్బు తాను ఇస్తానంటూ సండ్ర.. సెబాస్టియన్‌తో చెప్పారని, ఈ నేపథ్యంలో ఆ డబ్బు ఎక్కడ ఉందో కనిపెట్టాల్సి ఉందని వివరించారు. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విచారించి వదిలేశామన్నారు. సండ్ర పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేశామని, అరెస్టు తర్వాత విచారణకు సమయం సరిపోలేదని, కస్టడీకి అప్పగించాలని కోరారు. సండ్రను ఇప్పటికే విచారించారని, కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో ఆయన నిందితుడే కాదని, స్టీఫెన్సన్ ఇచ్చిన ఫిర్యాదులోనూ సండ్ర పేరు లేదన్నారు. స్టీఫెన్సన్ 28న ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేసిందని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద మొదట సాక్షిగా విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా, మారిన పరిస్థితుల రీత్యా సీఆర్పీసీ సెక్షన్ 41(ఎ) కింద అనుమానిత నిందితునిగా నోటీసులు జారీచేసే అధికారం ఏసీబీకి ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏసీబీ కస్టడీ కోరడం సహేతుకమేనని స్పష్టం చేశారు. మరోవైపు సండ్ర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది. -
జిమ్మి కోసం ఏసీబీ వేట
* అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం * మత్తయ్య దారిలో ఏపీలో జిమ్మిబాబు! * కొత్తగా తెరపైకి వచ్చిన జనార్దన్‌పై ఫోకస్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అప్పగించడంతో.. అధికారులు తదుపరి కార్యాచరణకు దిగారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా.. బేఖాతరు చేసి తప్పించుకు తిరుగుతున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై దృష్టిపెట్టారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఇక సండ్ర వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదిక ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన జనార్దన్‌ను కూడా విచారణకు పిలవాలని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసులో జనార్దన్ భాగస్వామ్యానికి సంబంధించి పలు కీలక ఆధారాలు లభించాయని, ఆ మేరకు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిమ్మిని పట్టుకోవాల్సిందే! సండ్రతో పాటు నోటీసులు జారీచేసినా జిమ్మిబాబు ఇప్పటివరకు ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. దీనిని ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తోంది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో జిమ్మిబాబు కూడా కీలకంగా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయనను అదుపులోకి తీసుకుని, మరిన్ని వివరాలు రాబట్టాలని ఏసీబీ భావిస్తోంది. అసలు ఈ కేసులో ఏ4 నిందితుడు మత్తయ్య మాదిరిగా.. జిమ్మిబాబు కూడా ఏపీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. మత్తయ్య తెలంగాణ పోలీసులకు వాంటెడ్ అంటూ తమకు అధికారిక సమాచారం లేదని వ్యాఖ్యానించిన ఏపీ పోలీసులు.. ఆయన అరెస్టుకు సహకరించలేదు. ఈ నేపథ్యంలో జిమ్మిబాబు పరారీలో ఉన్నారంటూ ఏపీ పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చేలా లేఖ రాయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మధ్యవర్తి జనార్దనేనా..? ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ‘బాస్ (చంద్రబాబు)’కు మధ్యవర్తిగా టీడీపీ నేత జనార్దన్ వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. సెబాస్టియన్, సండ్ర ఫోన్ సంభాషణల్లో పలుమార్లు జనార్దన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రతీ సందర్భంలోనూ జనార్దన్‌కు చెప్పారా? అంటూ సెబాస్టియన్ అడగడం, ‘సార్’ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి జనార్దన్ పేరును సెబాస్టియన్ ఉటంకించిన విషయం కాల్ రికార్డుల విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. సండ్ర కూడా పలుమార్లు ‘ఈ డీల్ జనార్దన్‌కు తెలుసు’ అంటూ మాట్లాడారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలులో జనార్దన్ పాత్ర ఉన్నట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. సండ్రను విచారించనున్న ఏసీబీ అధికారులు.. కేసులో కీలకాంశాలతో పాటు జనార్దన్ ఎవరనేది నిర్ధారించి, నోటీ సులు జారీ చేయాలని యోచిస్తున్నారు. -
మోకాలి నొప్పా.. బ్రెయిన్ వాషా?
మొదట నోటీసు జారీచేసిన తర్వాత.. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎక్కడెక్కడకు వెళ్లారు? అసలు రాజమండ్రిలో సండ్ర ఏం చేశారు? ఈ పది రోజుల పాటు సండ్రకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు? విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఇలా ఉంది.. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అత్యంత కీలక పాత్రధారులని ఏసీబీ నిగ్గుతేల్చింది. సండ్ర రిమాండ్ రిపోర్టులో కొన్ని ఆధారాలను కూడా ఏసీబీ పొందుపరించింది. జూన్ 16 నుంచి జులై 1 వరకూ సండ్ర ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో అజ్ఞాతంలో ఉన్నారు. కనీసం 8 రోజులపాటు ఆయన రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నట్టు స్వయంగా ఆయనే తెలిపారు. నిఘా వర్గాలు , దర్యాప్తు బృందాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సండ్రకు బాగానే బ్రెయిష్‌వాష్ చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తు సందర్భంగా అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోడానికి, ఈ పథకం వెనుక ఎవరున్నారో వెల్లడించకుండా బ్రెయిన్ వాష్ చేశారని సమాచారం. ఈ కేసులో అరెస్టు తప్పదని టీడీపీ అత్యున్నత వ్యక్తులు సహా, సండ్ర కూడా ముందుగానే ఊహించారు. దీనికి అనుగుణంగా ప్లాన్‌ను రెడీ చేశారు. ఆస్పత్రిలో ప్రత్యేక గది రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో పై అంతస్తులో ఒక గదిని సండ్ర కోసం కేటాయించారు. ఒక రకంగా ఇది గెస్ట్‌హౌస్. జైలు లాంటి వాతావరణాన్ని ముందుగానే అక్కడ సృష్టించారు. రెండు రోజులపాటు ఎవ్వరూ ఆగదిలోకి ప్రవేశించలేదు. ఆహారం, ఇతర సామగ్రి కూడా కిటికీ ద్వారానే అందించారు. మానసికంగా జైలు వాతావరణంలో ఉండేందుకు ఈ తరహా ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఒకవేళ అరెస్టు చేస్తే, మానసికంగా ఆందోళనకు గురై.. ఎక్కడ పెద్దల పేర్లు వెల్లడిస్తానెనన్న భయంతో.. సండ్రను ఈ పరిస్థితుల మధ్య ఉంచారు. నిపుణులతోనే శిక్షణ విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చనే మార్గాలనూ సండ్రకు ఇక్కడే బోధించారు. ఇలాంటి కేసుల సందర్భంలో నేరుగా దర్యాప్తులో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు సండ్రకు ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మానసికంగా సున్నితత్వం ఉన్న వ్యక్తులకు ఇలా బ్రెయిన్ వాష్ చేస్తారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ల పరిభాషలో దీన్ని ఎమోషనల్ ఎస్కేపిజం, లేదా ఎమోషనల్ ట్రాన్స్‌మైండింగ్ అంటారు. అంతా చెప్పినట్లే చేశారు అరెస్టు చేసిన తర్వాత రోజు విచారణలో సండ్ర... ఇలానే వ్యవహరించారని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మీరు సెబాస్టియన్‌తో మాట్లాడారా అంటే.. గుర్తులేదు, నేను మాట్లాడి ఉంటానా? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం. ఫలానా సమయంలో మాట్లాడారంటూ సండ్ర ముందు ఆధారాలు ఉంచితే, మాట్లాడి ఉండొచ్చు, గుర్తులేదని సమాధానం చెప్పారట. ఏ ప్రశ్నలు వేసినా తెలియదు, గుర్తులేదు అని మాత్రమే చెబుతున్నారన్నది విశ్వసనీయవర్గాల సమాచారం. సెబాస్టియన్ ఫోన్లో ఈ సంభాషణలు రికార్డు కావడం ఓ రకంగా కేసును మరింత బలపరిచిందని ఏసీబీ బృందాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర వెంకటవీరయ్య
ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి పంపుతూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. రేపు, ఎల్లుండి .. అంటే 9, 10 తేదీలలో ఆయనను ఏసీబీ విచారణ చేసేందుకు కోర్టు అనుమతించింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణ చేసుకోవచ్చు. కస్టడీ అనంతరం సండ్ర వెంకట వీరయ్యను కోర్టులో హాజరు పరచాలని కూడా ఆదేశించారు. విచారణ సమయంలో న్యాయవాదులు కూడా అక్కడే ఉండాలని కోర్టు తెలిపింది. కాగా, ఈ కేసులో సండ్ర వెంకట వీరయ్యను సమగ్రంగా విచారించి.. మరింత సమాచారన్ని రాబట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. వాస్తవానికి వెంకట వీరయ్యను ఐదు రోజుల కస్టడీకి పంపాలని ఏసీబీ కోరింది. అయితే కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీని మాత్రమే మంజూరు చేసింది. -
సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..!
-
'ఓటుకు కోట్లు’లో కీలక ఆధారాలు...
-
ముగ్గురిని ఒకేసారి విచారిస్తే..!
* 'ఓటుకు కోట్లు’లో కీలక ఆధారాలు వెలికితీసే దిశగా ఏసీబీ నిర్ణయం * ఏకకాలంలో సండ్ర, జిమ్మి, వేం నరేందర్‌ల విచారణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇప్పటివరకు వెల్లడికాని పలు అంశాలను వెలికితీసేందుకు ఏసీబీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సండ్రను కస్టడీలోకి తీసుకోవడంతో పాటు అజ్ఞాతంలో ఉన్న జిమ్మిబాబును అదుపులోకి తీసుకోవాలని, వీరితో పాటు వేం నరేందర్‌రెడ్డిని రప్పించి ముగ్గురినీ ఏకకాలంలో విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. తమకు లభించిన సమాచారంతో ఇప్పటికే సండ్రను విచారించగా వేటికీ తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నింటికి ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు సమాచారం. వేం కూడా ఇంచుమించు ఇదేతీరులో వ్యవహరించారు. దీంతో ముగ్గురిని ఒకేసారి విడివిడిగా, ముఖాముఖి విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలా చేస్తే ఈ వ్యవహారం వెనుక అసలు కుట్ర, సూత్రధారి బయటకు వస్తారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.నోటీసులు జారీ చేసినా స్పందించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు విషయంలో ఏసీబీ సీరియస్‌గా ఉంది. ఆయనకు 49ఏ కింద నోటీసులు జారీ చేసినందున.. ఆయన ఆచూకీ ఎక్కడ లభించినా అదుపులోకి తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించిన జిమ్మిబాబు.. కోర్టును ఆశ్రయిస్తే ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు సూచించడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. స్టీఫెన్సన్కు టీడీపీ ముఖ్యనేతలకు తొలుత మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి జిమ్మిబాబేనని ఏసీబీకి సమాచారం ఉంది. జిమ్మిని అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారాన్ని రాబట్టవచ్చని ఏసీబీ భావిస్తోంది. -
తర్వాత ఎవరి వంతో..!
* ఓటుకు కోట్లు కేసులో టీటీడీపీ నేతల్లో గుబులు * సండ్ర అరెస్ట్‌తో నాయకుల బెంబేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను చూసి బెంబేలెత్తుతున్నారు. తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్టు చేయడం, కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఈ కేసుతో సంబంధాలు ఉన్న నేతలంతా తమ వంతు కూడా వస్తుందా అన్న భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో గడిపి షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని ఏసీబీ అరెస్టు చేసి విచారించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో తేలిపోయింది. సండ్రను ఏసీబీ విచారిస్తే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్‌రెడ్డిని ఇప్పటికే 2 పర్యాయాలు విచారించిన ఏసీబీ మరోసారి విచారణకు పిలవనుంది. ఆయనను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో టీడీపీలోని మరికొందరు నాయకులు ఆందోళనలో పడిపోయారు. తమ అభ్యర్థి గెలుపునకు అవసరమైన 2 ఓట్లకే పరిమితం కాకుండా, ప్రభుత్వాన్ని అస్థిర పరిచే వ్యూహంతో పెద్దఎత్తున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధపడిందన్న సమాచారం బయటకు పొక్కిన సంగతి తెలిసిందే. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల టీడీపీ నాయకులు కొందరు టచ్‌లోకి వెళ్లారని, కొందరికి డబ్బులు కూడా ముట్టాయని చెబుతున్నారు. ఇదే సమయంలో స్టీఫెన్సన్కు డబ్బులిస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడడంతో మిగిలిన వారంతా జాగ్రత్త పడినా.. టీడీపీ నాయకులు పన్నిన వ్యూహంపై ప్రభుత్వం ఆగ్రహంగానే ఉందని, ఈ కేసుతో పరోక్ష సంబంధం ఉన్న వారినీ ఉపేక్షించరన్న వార్తలతో టీటీడీపీ నేతలకు వెన్నులో చలి మొదలైంది. సండ్ర తర్వాత వేం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేస్తారని, ఇక ఆ తర్వాత వంతు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. -
సండ్రకు 21 వరకు రిమాండ్
ఐదు రోజులపాటు కస్టడీకి కోరిన ఏసీబీ విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఈనెల 21 వరకు రిమాండ్‌కు తరలించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశించింది. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సండ్రను ఈ కేసులో ఐదో నిందితుడిగా చేర్చిన ఏసీబీ అధికారులు.. సోమవారం సాయంత్రం ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో సండ్ర పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు ఏసీబీ సమర్పించింది. సండ్ర సూచన మేరకే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు సెబాస్టియన్ ప్రయత్నించినట్లు వివరించింది. ఈమేరకు వీరి మధ్య పలు దఫాలుగా జరిగిన ఫోన్ సంభాషణలను అందజేసింది. మీడియా ద్వారా తెలిసింది! ‘ఓటుకు కోట్లు’ కేసులో తనకు ఏసీబీ నోటీసులు జారీచేసిన విషయం తెలియదని, విశాఖపట్నంలో చదువుకుంటున్న పిల్లలను చూసేందుకు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో అస్వస్థతకు గురికావడంతో రాజమండ్రిలో చికిత్స పొందానని సండ్ర ఈ సందర్భంగా న్యాయమూర్తికి చెప్పారు. తాను ఖమ్మంలో ఉంటానని, హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఏసీబీ నోటీసులు అంటించిన విషయం తెలియదని పేర్కొన్నారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరయ్యానని.. 8 గంటలపాటు జరిగిన ఏసీబీ అధికారుల విచారణలో అన్ని విషయాలు వెల్లడించానని అన్నారు. తనకు మొదట సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) కింద నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం సీఆర్పీసీ 41(ఎ) కింద నోటీసులు ఇచ్చారని.. తనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొన్నారు. అయితే దీనిపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో ఇన్ని ఆసుపత్రులున్నా.. ఉద్దేశపూర్వకంగా ఏసీబీ విచారణ నుంచి తప్పించుకునేందుకే రాజమండ్రిలోని ఆసుపత్రిలో చేరారని కోర్టుకు తెలిపింది. దీనిపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి ‘అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు ఏమైనా ఇబ్బందులకు గురిచేశారా’ అని ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని సండ్ర సమాధానమిచ్చారు. అనంతరం ఆయనను రిమాం డ్కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా తనకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పిం చాలని కోరు తూ వీరయ్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి అనుమతించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సండ్ర పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి స్టీఫెన్సన్ కు ఇస్తామన్న రూ. 5 కోట్లలో రూ. 4.5 కోట్లు ఎక్కడున్నాయో కనిపెట్టాలంటే సండ్రను కస్టడీలో విచారించడం అనివార్యమని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ మేరకు అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు తర్వాత ఎక్కువ సమయం లేకపోవడంతో ఆయన్ను విచారించలేకపోయామని.. ఐదు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించనుంది. కాగా అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు సండ్ర వెంకట వీరయ్యను చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్రకు ఖైదీ నంబర్ 4887ను కేటాయించి, గంగా బ్యారక్‌లో ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. -
సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..!
ఓటుకు కోట్లు కేసులో మరికొన్ని కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుపై కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వీటిని పొందుపరిచింది. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వెనుక పథక రచనను ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో సండ్ర ఎక్కడున్నారు, ఎవరెవరితో మాట్లాడారనే మొత్తం స్టోరీని ఏసీబీ కోర్టు ముందు ఉంచింది. ఓపక్క మహానాడు, మరోవైపు పథకరచన అంతా ఏకకాలంలో జరిగిపోయాయి. ఈ కేసులో రేవంత్‌రెడ్డి ఎంత కీలకంగా వ్యహరించారో... అంతే కీలకంగా సండ్ర వెంకట వీరయ్య కూడా వ్యవహరించారని ఏసీబీ చెబుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు కేవలం ఒకరిద్దరి ఆలోచన కాదని, ఇది పూర్తిస్థాయిలో వ్యవస్థీకృత నేరమని ఏసీబీ తన రిమాండ్ రిపోర్టులో చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ కేంద్రంగా ఈవ్యవహారం నడిచిందని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. సెల్‌నంబర్లు.. సంభాషణలు మే 31న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న సమయంలో ఏసీబీ కొన్ని ఫోన్లను స్వాధీనం చేసుకుంది. రేవంత్‌రెడ్డి ఫోన్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహా ఉపయోగించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. ఈ కేసులో రెండో నిందితుడగా ఉన్న సెబాస్టియన్ ఫోన్లో కొన్ని కాల్స్ రికార్డు చేసినట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో తేలింది. మే 23 నుంచి మే 31 వరకూ మొత్తం 32 సార్లు సెబాస్టియన్ - సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుకున్నట్టుగా ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఎమ్మెల్యే కొనుగోలు ఆపరేషన్ కోసం సండ్ర మొత్తం రెండు ఫోన్ నంబర్లలో మాట్లాడారు. 87908 25678 నంబర్ నుంచే కాక మరో నంబర్ 94406 25955 నుంచి కూడా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. ఈ నంబర్లు రెండూ వెంకట వీరయ్యవేనంటూ సంబంధిత టెలికాం కంపెనీల నుంచి ఏసీబీ అధికారికంగా వివరాలు తీసుకుంది. ఆపరేషన్ నడిచిన కాలంలో 87908 25678 నంబర్ నుంచి ఎమ్మెల్యే వీరయ్య - 95059 00009 నంబర్లో ఉన్న రేవంత్‌రెడ్డితో 18 సార్లు మాట్లాడారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడా వీరయ్యకు రెండుసార్లు కాల్ చేశారు. ఈ కాల్స్ అన్నీ మే 24 నుంచి మే 31 మధ్య చోటుచేసుకున్నవే. మరింత లోతుగా దర్యాప్తుచేసిన తర్వాత వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ల మధ్య మరో 19 సార్లు సంభాషణలు జరిగాయని ఏసీబీ సవివరంగా కోర్టుకు నివేదించింది. వీరయ్య నంబర్ 87908 25678 నుంచి సెబాస్టియన్ ఫోన్ 93943 26000కు కాల్స్ వెళ్లాయని నిర్ధారించారు. వీరయ్యకు చెందిన మరో ఫోన్ నంబర్ 94406 25955 నుంచి కూడా సెబాస్టియన్ నంబర్‌కు కాల్స్ వెళ్లాయని ఏసీబీ ధ్రువీకరించింది. ఈ వివరాలను కోర్టు ముందు ఉంచింది. ఫోన్ రికార్డింగ్.. ఉద్దేశపూర్వకమా? ఈ కేసులో మొత్తం ట్విస్ట్ సెబాస్టియన్ ఫోన్ రికార్డింగ్. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల సమయంలో సెబాస్టియన్ హెచ్‌టీసీ ఫోన్‌ను ఉపయోగించారు. ఏసీబీ అధికారులు ట్రాప్ చేస్తున్నప్పుడు సెబాస్టియన్ నుంచి ఈ ఫోన్‌నే స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకమో లేక అప్రయత్నమో తెలియదు గానీ మొత్తం కాల్స్ అన్నీ.. ఈ ఫోన్లో రికార్డయ్యాయి. వీటినే ఫోరెన్సిక్ నిపుణులు వెలికితీశారు. రిమాండ్ రిపోర్టులో మొత్తం మూడు కాల్స్‌కు సంబంధించి సంభాషణలను ఏసీబీ యథాతథంగా రిమాండ్ రిపోర్టులో పొందుపరించింది. మే 27 రాత్రి 9:45 నిమిషాలకు 2:09 నిమిషాల సేపు వెంకటవీరయ్య, సెబాస్టియన్ మాట్లాడుకున్నారు. సెబాస్టియనే మొదట వీరయ్యకు ఫోన్ చేశారు. ఏ-2 (సెబాస్టియన్): ఆ.. ఎమ్మెల్యే గారండీ.. సర్ ఎమ్మెల్యే (వెంకటవీరయ్య): ఏమైంది..? ఏ-2: సర్, అది .. ఇప్పుడు మనకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి సర్.. ఆయన గురించి,,, ఎమ్మెల్యే: అంటే మనకు ఎలక్షన్స్‌లో ఓట్లు ఉంటాయ్... ఏ-2: ఆ.. ఎమ్మెల్సీ... ఎమ్మెల్యే: ఎలక్షన్స్ల.. , ఎలక్షన్స్ల ఆయనకు ఓటు హక్కు ఉంది. ఏ-2: అవును ఎమ్మెల్యే : ఇంగ.. ఆయనేమన్నా.. మనకు అమౌంట్‌కు లొంగుతాడేమో, మన పార్టీకి సహకరించమని అడగాలి. ఏ-2: ఓహో.. అదా... ఎమ్మెల్యే : ఎందుకంటే... ఆయనకు ఫరదర్ రాజకీయాలతో అవసరం లేదు కదా? మేమంటే.. ఎలక్షన్స్‌లో గెలవాల.. ఒకసారి నామినేటెడ్ అయిపోయిద్ది గదా.., డబ్బు ముఖ్యం కదా.. ఆయనకు . ఏ-2:అదయితే కరెక్టు. ఎమ్మెల్యే : ఆ.. ఆ... సోర్స్ మనకు కావాలి. ఏ-2: ఓహో.. మనకు ఎంత టైముంది... సర్.. మనకు. ఎమ్మెల్యే : మనకు.. ఒకటవ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఏ-2: ఓకే.. ఈలోపుగా మనం టాప్ చేయాలి. ఎమ్మెల్యే : ఆ..ఆ.. ఈ లోపుల టాప్ చేసి.. ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తే... ఏ-2: ఒకే సర్. ఎట్లా మనం.. ఆయనకు... ఎక్కడన్నా, మనం హోటల్లో టైం ఇద్దామా? మాట్లాడటానికి లేదా... ఎమ్మెల్యే : ఆహా... మీరు ఆయనతో.. మీరు ఆయనతోని మళ్లా... దగ్గరా? ఎట్లా? మనం డీల్ చేసి సక్సెస్ కావాలి. ఫెయిల్ కావొద్దు. ఏ-2: ఓహో.. ఆ రెస్పాన్స్‌బిలిటీ... మరి మీరు తీసుకుంటారా సర్.. నేను మాట్లాడతా గనక... ఎమ్మెల్యే : ఆ అమౌంట్.. ఆయన ఓటుకు రెస్పాన్స్ ఇస్తే.. అమౌంట్‌కు రెస్పాన్స్‌బిలిటీ నాది అయితది. ఆయన ఎవరి పేరు చెప్తే.. ఆడ బెడదాం. మధ్యవర్తి ఖాయం ఉంటుంది. ఏ-2: ఆహా.. సర్. ఎట్ల సర్.. ఇప్పుడు మనం ఆయన ఓటు, మనకు ఏయాల.. మన ఎమ్మెల్యే, మన ఎమ్మెల్సీకి. ఎమ్మెల్యే : మన.. మన అభ్యర్థికి వేయాల. ఏ-2: ఇన్ కేస్..లేదు అంటే ఎట్లా.. ఎస్కేప్ చేపియ్యాలి మనం.. ఆరోజు ఆయనకి మనం. ఏ బాంబే, కలకత్తా వెళ్లిపోయేటట్లుగ మనం.. ఏర్పాట్లు చేయాల మనం. ఆబ్సెంట్ అయినా.. ఫర్వాలేదు కదా ఓటింగ్‌కు. ఎమ్మెల్యే : ఆబ్సెంట్ అంటే... కంటే కూడా, ముందు ముందు మీరు ఫస్ట్... ఓటుకు అడగాలి. లేకపోతే ఆబ్సెంట్‌కు అడుగుదాం. ముందు ఓటుకు అడగాలి, ఓటు కావాలి. ఏ-2: ఓకే ... ఓటు కావాలి. ఎమ్మెల్యే : ఊహుం... ఊహుం.. ఏ-2: సరే.. సరే.. సరి. నేను .. నాకిప్పుడు ఈ రెండు రోజులు మన మహానాడు బీజీ కదా సర్. అయినాకూడా నేను ... ఎమ్మెల్యే :మహానాడు ఉన్నది. నేను సెపరేట్ పర్మిషన్ తీసుకుంటాను. ఏ-2: ఆ.. సర్. ఎమ్మెల్యే : నాకు రేపటికి కావాలి. ఏ-2: సరే.. సరే.. రేపు మార్నింగ్ నేను అక్కడకి వస్తున్నామన్నా... ఎమ్మెల్యే : ఆ... ఏ-2: ఎన్టీఆర్ ఘాట్‌కు వస్తున్నాం, ప్రేయర్ చేయడానికి సర్... సర్ రమ్మన్నారు. ఎమ్మెల్యే : సర్.. ఎన్నింటికి వస్తున్నారు ఘాట్‌కి. ఏ-2: ఏమో సర్.. 7 గంటలకు రమ్మన్నారు నన్ను. ఎమ్మెల్యే : ఓకే.. మీరు మీ పని చూసుకోండి. మిగతా పని తర్వాత చూద్దాం. ఏ-2: ఒకే సర్.. మంచిది.. నేను టచ్‌లో ఉంటా మీకు. ఓకే.. ఎమ్మెల్యే :థాంక్యూ... ఏ-2: థాంక్యూ.. థాంక్యూ... సర్ ------------------------------------------------ మే 28 సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు మరో 3:10 నిమిషాల పాటు వీరయ్య, సెబాస్టియన్ మాట్లాడుకున్నారు. ఈసారి కూడా సెబాస్టియనే వీరయ్యకు కాల్ చేశారు. ఏ-2: (సెబాస్టియన్): ఎమ్మెల్యే గారూ నమస్కారం సార్... ఎమ్మెల్యే (వెంకటవీరయ్య): హలో... ఏ-2: నమస్కారం సర్.. ఎమ్మెల్యేగారూ... ఎమ్మెల్యే : నమస్కారం.. నమస్కారం.. చూశానూ.. మీ మెసేజ్ చూశాను. ఏ-2: సర్.. ఆ..ఆ.. ఎమ్మెల్యే : ఇప్పుడు మీరు ఎక్కడున్నారు. ఇప్పుడు.. ఏ-2: నేనాసర్.. నేను మా ఆఫీసులో ఉన్నాను (మోతీనగర్) ఎమ్మెల్యే : ఇవాళ మహానాడు... , మహానాడు.. ఏ-2:రాలేదండి సర్. ఇ.. ఇగ.. పొద్దుగాల నేను అక్కడకి సమాధి దగ్గరకి పోయినా. ఇవాళ సర్వమత సమ్మేళనం కింద.. అందరి మతాల పెద్దలు వచ్చి, ప్రార్ధన చేయాల. అందులో మాదిగూడా ఉండె. ఎమ్మెల్యే : ఓకే ఏ-2: సర్.. వచ్చారు. అందరొచ్చారు. వచ్చిన తర్వాత.. మాకు అక్కడే పది అయిపోయింది. ఎమ్మెల్యే : ఓకే ..ఓకే ఏ-2: సర్.. వెంటనే.. అంటే సమాధిని చూసేసి.. ఫ్లవర్ చల్లి వెళ్లిపోయారు. మేం అక్కడే ఉన్నాం. అక్కడనుంచీ మీరు చెప్పిన పని గురించి.. నేను అక్కడకి పోయినా. ఎమ్మెల్యే : అదే ముఖ్యం లెండి.. ఇవాళ. అదే ముఖ్యం.. అదే ముఖ్యం. ఏ-2:అదీ.. మీరు చెప్పారు కదా..? అందుకొరకు నేనుబోయాను.. మాట్లాడినా. ఎమ్మెల్యే : ఆ... ఏ-2: ఆ.. ఆ. మాట్లాడితే ఆయన .. మనకు, మనకు.. చెప్పకుండా ఆల్రెడీ ఎవరో ఈరోజు ఉదయం పోయిండ్రంట. ఎమ్మెల్యే : ఆహా.. ఏ-2: పోతే వాళ్లవర్షన్కు, నా వర్షన్‌కు డిఫరెంట్ ఉంది. ఎమ్మెల్యే : ఆ.. ఆ.. ఆ.. ఏ-2: అయితే... ఆయనేమన్నాడంటే.. నువ్వు మాకు బిషప్. నువ్వు చెప్పేది మాకు నమ్ముకం ఉంటాది. వాళ్లు చెప్పేది.. ఏమో. ఎట్లంటావో పోతరు. ఎందో మళ్లీ.. నిజమా? కాదా? ఏందో మళ్లీ... నాకు చెడ్డపేరు వస్తదేమో.. అని ఒక మాట అన్నరు. ఎమ్మెల్యే : ఓ..ఓ.. ఏ-2: అయితే... నేను ఆయన్ను ఎట్లా మేనేజ్ చేసినా అంటే.. ఇన్‌కేస్ ముందు.. బీజేపీలో అట్కిన్సన్ అనే ఒక రాజ్యసభ మెంబర్ ఉండే.., నామినేటెడ్ ఆంగ్లో. ఆయననే నేనే ప్రమోట్ చేసినా.. మా బిషప్‌లకు చెప్పి. ఎమ్మెల్యే : ఓకే. ఏ-2: మాకు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది. బీజేపీ ఉంది. మీక్కావాలంటే.. ఇక్కడ పోయినా కూడా, మేం ఢిల్లీ వరకూ రికమెండ్ చేయగలుగుతాం. ఏదైనా మైనార్టీ కమిషన్‌లో బోర్డు మెంబర్‌గా ఒకటి, రెండోది.. ఆంధ్రాలో ఇంగ.. మాకు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్‌కు సీటివ్వలేదు. మీలో ఎవరైనా మీ చుట్టాలు ఉంటే.. రికమెండ్ చేయ్..., బాబుతో మాట్లాడతా... ఎమ్మెల్యే : ఓకే ఏ-2: మూడోది.. మొత్తం మన ప్రభుత్వం.. ఆంధ్రాలో నీకేపని కావాలన్నా, నువ్వు ప్రతి మంత్రీ చేసిపెడతాడు నీకు. ఎమ్మెల్యే : అవును. ఏ-2: నాల్గోది.. వచ్చే ఎలక్షన్లో, 100 పర్సంట్.. మన టీడీపీనే వస్తాది.. ఈడ. వస్తే.. మళ్లీ నీ పేరే ప్రపోజ్ చేస్తాం ఎమ్మెల్యే : అవును. ఏ-2: నాలుగు ఆప్షన్స్ ఇచ్చాం సర్. ఎమ్మెల్యే : ఆ..ఆ... ఏ-2: ఇచ్చేవరకూ మస్త్... ప్లీజింగ్ అయిపోయిండు.. ఆయన, మీరు చెప్పింది చాలా బాగుంది. నాకు నచ్చింది. పొద్దుగాల వచ్చినవాల్లు.. వేరే విధంగా మాట్లాడిండ్రు అని అన్నాడు. ఎమ్మెల్యే : అ... ఏ-2: వాళ్లను పక్కకు పెట్టేసెయ్.. నేను బిషప్‌ను. నేను క్రిస్టియన్‌ను... , నువ్వు క్రిస్టియన్వు. ఎమ్మెల్యే : అవును. ఏ-2: నేనేం చేస్తానో.. అది అయితది. మీ ఇష్టం మరి అన్నా. అంతే... నాకు, నీకూ టైం ఇయ్యండి. ఈ రోజు నేను మా ఫ్యామిలీతో మాట్లాడతా.. మా వెల్ విషర్స్‌తో మాట్లాడి డిస్కషన్స్ చేసుకుని, ఈ రోజు గానీ, రేపు పొద్దుగాలకల్లా నేను చెప్తాని.. అన్నాడు. ఎమ్మెల్యే : ఒకే .. ఒకే.. వెరీగుడ్ ఏ-2: నో అని అయితే అన్లేదు. నేను చెప్పినా.. నీ లైఫ్ బాగైపోతాది. మేం ఇప్పుడు నీకు అండగా ఉంటాం. మాపార్టీ.. నాపార్టీ... తరఫున వచ్చినా నేను. నీవు, నేను బిషప్‌గా లేకపోతే, వో.. ఇక పక్కకు పెట్టేసేయండి. ఆ.., ఒక వెల్విషర్ నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియన్ని. నీకేం కావాలంటే డైరెక్ట్‌గా బాబుదగ్గరకి తీసుకెళ్లే సత్తా నాకున్నది. నీకేం కావాలో చెప్పు. ఎమ్మెల్యే : అందుకనే మీరు..మీరు .. మరి రేపటికన్నా.. ఒక లైనప్చేస్తే మనం సిట్టింగ్ పెట్టుకుందాం. ఏ-2: ఆ..ఆ.. అదిసర్.. ఇప్పుడు ఇంకోటి.. ఏందంటే.. మీరు నాకు సడన్‌గా లైన్లో దొరకట్లేదు. ఇప్పుడంటే.. మహానాడు ఉంది.. రేపు నేను వచ్చేస్తా.., నేను కూడా డయాస్ మీద ఉంటా. ----------------------------------------------- మే 28 సాయంత్రం 6 గంటల 15నిమిషాలకు మరో 3:28 నిమిషాల పాటు వీరయ్య, సెబాస్టియన్లు మరోసారి మాట్లాడుకున్నారు. ఈసారికూడా సెబాస్టియనే వీరయ్యకు కాల్ చేశారు. ఏ-2: హెలో.. ఎమ్మెల్యే : హెలో.. ఏ-2: ఆ సర్.. రాత్రికి ఏమైనా కలుసుకోవచ్చా మనం. సిటీలో ఎక్కడైనా.. ఎమ్మెల్యే : ఓ.. ఓకే. కలుసుకుందాం. అంటే నేనొస్తా. మనం ఎన్నింటికి రావాలో.. చెప్తే.. నేను అన్నింటికి వస్తాను. ఏ-2: అచ్చా... మీరిప్పుడు ఎక్కడున్నాడు సర్. స్టేయింగ్ ఎక్కడున్నారు. ఎమ్మెల్యే : మహానాడు దగ్గరనే ఉన్నాను. ఏ-2: ఆ..ఆ.. ఓకే ఎమ్మెల్యే : ఆ.. ఏ-2: మహానాడు అయిపోయినాక.. మనకు 8 అయితాది కదా.. ఎట్లా అయినా.. 7-8 అవుద్ది. ఎమ్మెల్యే : అవునవును.. ఎక్కడ కూర్చోవచ్చు. ఏ-2: మీరు చెప్పండి సర్. ఎక్కడైనా ఫర్వాలేదు. ఎక్కడున్నా కూర్చుని మాట్లాడుకుని మనం ఎట్లా చేద్దాం.. ఏంటిది మరి... ఎందుకంటే... మీరు సడన్‌గా రేపు కాల్ చేసిండ్రనుకో, మనం మళ్లీ మహానాడులో ఉంటా.. ఎక్కడైనా. ఓకే. అదీ పరిస్థితి. ఎమ్మెల్యే : ఆహా.. ఆహా.. అంటే మనం ఉన్నాగాని, మనం ఉన్నాగాని.. ఆం, మనం అదే ప్రయార్టీ. మనం ఏమీ లేదు.. సర్.. మనకు అది ప్రయార్టీ అని చెప్పిండు. మనం మన పద్ధతిలో మనం వెళ్దాం. ఏ-2: అచ్చా.. ఓకే. సరే ఇప్పుడు మహానాడు... మీకెప్పుడు అయిపోతది. ఎన్ని గంటలకు అయిపోతది.. మరి నాకు చెప్తే .... ఎమ్మెల్యే : నేను అది అయిపోయినాక సర్ దగ్గర ఎమ్మెల్యేల మీటింగ్ అంటున్నరు. ఏ-2: ఆహా... ఎమ్మెల్యే : ఒకే .. నేను కాంగానే... మీకు చెప్తా. ఆగండి. ఏ-2: ఒకే .. ఇప్పుడు మీరు సర్‌తో... ఎమ్మెల్యే : మీరు ఏ ఏరియాలో ఉంటారో మీరు చెప్పండి. ఏ-2: నేను మోతీనగర్ సర్. ఎమ్మెల్యే : మోతీనగర్.. ఒకే.. ఆయనా.... ఏ-2: ఆయనొచ్చి.. సికింద్రాబాద్‌లో ఉంటాడు. ఎమ్మెల్యే : సికింద్రాబాద్.. మనకూ, ఆయన మీకూ, మీకూ.. కామన్ ప్లేస్ ఎక్కడ. మీరు డిస్కస్ చేయండి. ఏ-2: అట్లంటారా..? ఎమ్మెల్యే : హ.. హ.. ఏ-2: ఎప్పుడాయన డిస్కస్ జేసిన తర్వాత.. మనం ఎప్పుడు సిట్టింగ్ పెడదాం. ఎమ్మెల్యే : ఆయన ఓకే అంటే.. రేపు మీరు ఏ టైం అయినా.., మహానాడు అయినా ఎగ్గొట్టి వచ్చేస్తా. మీరు ముందు ఆయన ... ఆయనతోని ఓకే చేస్తే, ఆయన డౌట్స్గాని, ఆయనకి క్లారిఫికేషన్స్ కావాలనో.. హామీ... అన్నీ నేను ఉంటా. ఏ-2: ఓకే.. నాకు ప్రాబ్లం ఏందంటే.. మీరు నాకు లైన్లో దొరుకుత లేరు. పొద్దుగాల నుంచి ఎన్నిసార్లో ట్రైచేసినా. ఎమ్మెల్యే : ఆహా.. అంటే.. మహానాడులో రావట్లేదు. ఏ-2: అవును. అక్కడ జామర్లు ఉంటది.. నాకు తెలుసు. ఎమ్మెల్యే : ఆ.. ఆ.. మీరు ఒక పని చేయండి. మా డ్రైవర్ నంబరు ఇస్తాను. అది రాసుకోండి... ఏ-2: ఒక్క నిమిషం సర్... ఆ చెప్పు సర్... ఎమ్మెల్యే : మా డ్రైవర్ నెంబర్ 8186 ఏ-2: 8186 ఎమ్మెల్యే : 8255 ఏ-2: 8255 ఎమ్మెల్యే :60 ఏ-2: 60, ఏం పేరు సర్ ఆయనది. ఎమ్మెల్యే : బాషా ఏ-2: బాషా , ఓకే ఎమ్మెల్యే : 81 ఏ-2: ఆ ఆ... 86 ఎమ్మెల్యే : 82 ఏ-2: 8255 ఎమ్మెల్యే : 5560 ఏ-2: బాషా, ఓకే టైమ్, ఇప్పుడు నేనడిగేదేందంటే... రేపు మరి నేను మహానాడులో ఉండాల్నా... మల్లీ సార్‌కు తెల్వది కద సర్... లేడని నన్నంటాడు. నువ్వే రాలేదేంటి ... మల్లీ బాగుండదు కదా... ఎట్ల మరి నీవు సర్కి... ఎమ్మెల్యే : ఆల్ రడీ నేను నీకు ఈ బాధ్యత అప్పజెప్పినట్టు చెప్పిన. ఏ-2: ఆ... ఎమ్మెల్యే : నేను .. నేను.. అక్కడ జామరొస్తే... సర్తోటి మీకు నేను ఫోన్ చేపిస్తా... ఏ-2: ఆ.. ఆ .. ప్లీజ్ ఆ పని చేయండి... ఎందుకంటే నేను జనార్దన్ సర్ కూడా అడిగిండియ్యాలా... నువ్వెందుకు రాలేదని... నాకియ్యాల మద్యాహ్నం పోన్ చేసిండు ఎమ్మెల్యే : లేలే... నేన్ జెప్త... నేన్ జెప్తా... ఏ-2: నేను ఆయనకు చెప్పలేదు... నేనేందుకంటే... చెప్పాల్నా వద్దా... మల్లీ అయనే... ఎమ్మెల్యే : మీరెవ్వరికి చెప్పద్దు... నేను సార్‌తో చెప్తా... ఏ-2: ఆ సర్కి చెప్పండి... ఇట్ల క్రిస్టియన్ ప్రెసిడెంట్ బిషప్ గారు ఈ పని జేస్తన్నడు సర్... అందుకే రాలేదు అని జెప్పండి... ఎమ్మెల్యే : లే... లే... నేనన్ని... నేను నా బాధ్యత... నేను ఒప్పజెప్త ఏ-2: ఆ మల్లీ నాకు నీవు మీటింగ్ ఎందుకు రాలేదంటే... మల్లి నాకు బాగుండదు... ఎమ్మెల్యే : మీరు మీరు నాకు వదిలేసేయండి... ఇప్పుడు జనార్దన్ గారికి కూడా చెబుతా... ఏ-2: ఆ చెప్పండి... ఆ జనార్దన్ గారికి చెప్పండి... సార్‌కు చెప్పండి ఎమ్మెల్యే : ఇద్దరికి చెబుతా.... ఏ-2: ఇద్దరికి చెప్పండి... జనార్దన్ గారికి ఈ విషయం చెబుతున్నారా ఏమైనా... ఎమ్మెల్యే : ఏం అవసరం లేదు... మనం మన పనిలో ఉన్నట్లు... నేను చెప్తలే మీకెందుకు... ఏ-2: ఆ ఓకే.... అంతే చెప్పండి... సార్ ఒక పని అప్పజెప్పండి... ఆ పని మీద ఉన్నాడని చెప్పండి... ఎమ్మెల్యే : ఆ.. ఏ-2: ఆ మంచిది సర్... ఎమ్మెల్యే : థాంక్యూ అండీ.... ఏ-2: థాంక్యూ... థాంక్యూ... ------------------------------------------------ మే 30 ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నుంచి సెబాస్టియన్‌కు కాల్ వెళ్లింది. 2 నిమిషాల 14 సెకన్ల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే... ఏపీ సీఎం చంద్రబాబు నివాసం కేంద్రంగా.. ఈ వ్యవహారం నడిచినట్టు.. రిమాండ్ రిపోర్టులోని అంశాలను పరిశీలిస్తే వెల్లడవుతోంది. సండ్ర అరెస్టుకు ముందు... ఆయన గన్‌మ్యాన్, పీఏల నుంచి ఏసీబీ అధికారులు వాంగ్మూలాలు సేకరించారు. ఏయే సమయాల్లో సండ్ర... ఎక్కడెక్కడకు వెళ్లారన్నదానిపై పూర్తిస్థాయిలో వారి సాక్ష్యాలను నమోదు చేశారు. సండ్ర గన్ మ్యాన్ లచ్చు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మే 30 వ తేదీ ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లినట్టుగా గన్‌మ్యాన్ లచ్చు ఏసీబీకి చెప్పారు. ఏపీ సీఎం ఇంట్లోకి వెళ్లిన గంటన్నర తర్వాత అంటే 30వ తేదీ ఉదయం 10 గంటలా 35 నిమిషాలకు సెబాస్టియన్ సండ్రకు కాల్ చేశారు. సెబాస్టియన్ ఫోన్ నుంచి 087908 25678 నంబర్‌కు కాల్ వెళ్లింది. ఈ సమయంలో సండ్ర, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. ప్లాన్ వేసుకున్నాక, అక్కడ నుంచి నేరుగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు అక్కడ నుంచి స్టీఫెసన్ ఇంటికి వెళ్లినట్టు.. ఈ కాల్ డేటా స్పష్టం చేస్తోంది. ఈ కాల్ సంభాషణలు ఏంటంటే... సండ్ర వెంకటవీరయ్య(ఎమ్మెల్యే) : హలో.., సెబాస్టియన్ (ఏ-2) : ఎమ్మెల్యేగారూ నమస్కారం సర్ ఎమ్మెల్యే : నమస్తేనండి.. ఏ-2: అదే.. రేవంత్‌రెడ్డిగారికి ఫోన్ చేశాను సర్.. నేను ఎమ్మెల్యే : ఆ..ఆ.. ఏ-2: బాబుగారి ఇంటిదగ్గరున్నాడంట. ఎమ్మెల్యే : ఆ.. ఆ.. ఏ-2: అది మీరొకసారి మాట్లాడి.. మనం, ఎందుకంటే.. మనం 11 గంటలకు టైం ఇచ్చినాం ఎమ్మెల్యే : ఒక్క నిమిషం.. నా ఎదురుగానే ఉన్నాడు. ఏ-2: ఆ.. ఓకే.. ఓకే.. సరే మాట్లాడండి. ఎమ్మెల్యే : ఒక్క నిమిషం లైన్లా ఉండు. ఏ-2: ఆ... ఎమ్మెల్యే : ....................... హలో ఏ-2: ఆహా.. సర్... చెప్పండి. ఎమ్మెల్యే : ................ హలో... ఏ-2: ఆహా సర్.. చెప్పండి సర్. ఎమ్మెల్యే : అదే.. అదే.. ఇక్కడున్నాం, సర్ దగ్గర 10 నిమిషాల్లో మాట్లాడేసి బయల్దేరుతాం. ఏ-2: బయలుదేరుతా.. - మరి మీరటు వచ్చేస్తారా? నేను బయలుదేరాలా? ఆయన ఎదురుచూస్తున్నాడు. ఎమ్మెల్యే : అవును.. మీరు ఎక్కడున్నారు. ఏ-2: మేం ఇక్కడ.. మోతీనగర్... ఎర్రగడ్డ... ఎమ్మెల్యే : మోతీనగర్..... అయితే ఒక పని చేయండి. మీరటు పార్టీ ఆఫీసు దిక్కు రండి. నేనటు వచ్చేస్తా. ఏ-2: పార్టీ.... ఎమ్మెల్యే : కారులో కూర్చుని పోదాం. ఏ-2: పార్టీ ఆఫీసులో.. సర్. ఎమ్మెల్యే : మీరు పార్టీ ఆఫీసు దగ్గరనే ఆపుకోండి బండి. ఏ-2: ఆ.... ఎమ్మెల్యే : మనం వెళ్లాల్సింది ఎటువైపు. ఏ-2: ఆ.. - బోయా.. ఇక్కడకు బోయగూడ. ఎమ్మెల్యే : అయితే.. ఓకే.. మీరు పార్టీ ఆఫీసు దగ్గరకు రండి . అయితే నాకు ఈజీ అయిద్ది. ఇది చూసుకుని నేను ఆడకి వచ్చేస్తా. ఏ-2: ఆ మంచిది సర్.. పార్టీ ఆఫీసు కాడకి వచ్చేస్తా. ఎమ్మెల్యే : ఒక్క నిమిషం. ఏ-2: ఆ... ఎమ్మెల్యే : ఆ.. అన్నగారూ.. ఒక పనిచేయండి మీరు. ఈ అడ్రస్‌కు మనం ఒక సీక్రెట్ డ్యూటీలో పోయేటప్పుడు అడ్రస్ వెతుక్కోకూడదు. డైరెక్ట్‌గా పోయేటట్టు ఉండాలంటే.. మీరు ఆఫీసుకాడ వచ్చి.. బైట పెట్టుకుని ఉండండి. మనోడు వచ్చేస్తాడు. ఏ-2: నేను బయటనే ఉంటా. బైటొచ్చి.. ఫోన్చేయాల్పా.. ఆఫీసుకాడకి. ఎమ్మెల్యే : ఆ.. పార్టీ ఆఫీసుముందు.. ఆ..చెట్లుంటాయికదా.. క్యాంటీన్ పక్కెంబడి.. చెట్టుకాడుండి.. నీడ... ఏ-2: మీరక్కడున్నారా... ఎమ్మెల్యే : లె.. లె.. నై... సారింటికాడున్నా... నువ్వు------, ఇద్దరం, ఎందుకు డబుల్ పనొద్దిలే. ఏ-2: ఆ.. ఓకే.. ఓకే.. ఎమ్మెల్యే : ఇద్దరం వద్దులే... బాగోదులే. ఏ-2: మీ ఇష్టం. మీ రంటే.. మీరు ఎమ్మెల్యే : మా కొద్దులే.. మాకేం ఇబ్బంది లేదు. ఎవరు చేసినా పార్టీ పని, మన దోస్తోడు. ఏ-2: హ..హ..హ.. ఎమ్మెల్యే : మీరు చేసినా, అన్నచేసినా, నేను చేసినా... ఒక్కటే. కామన్ మన అజెండా. సరే..సరే.. నేను ఆడ గేటు. -
లచ్చు వాంగ్మూలంతో వీడిన గుట్టు
ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ ఐదోముద్దాయిగా చేర్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మే 27 నుంచి మే 31 మధ్య 5 రోజుల గడువులో ఏకంగా 32 సార్లు సెబాస్టియన్, సండ్ర మధ్య సంభాషణలు జరిగాయి. సండ్ర 23 సార్లు కాల్ చేస్తే.. సెబాస్టియన్ 8 సార్లు కాల్ చేశారు. వీరిద్దరి సంభాషణలను సవివరంగా సేకరించిన ఏసీబీ అధికారులు.. వాటిని కోర్టుకు సమర్పించారు. కేసులో ఎ-1గా ఉన్న రేవంత్ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యకు మధ్య 18సార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. అలాగే సండ్ర వెంకటవీరయ్య, - హ్యారిస్ సెబాస్టియన్ మధ్య 12 కాల్స్ వెళ్లినట్టు ఏసీబీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి వెంకటవీరయ్యకు గన్‌మన్‌గా పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ టి.లచ్చు వాంగూల్మం కూడా ఏసీబీ సేకరించింది. మే 29 నుంచి జరిగిన పరిణామ క్రమాన్ని లచ్చు తన వాంగూల్మంలో వివరించారు. మే 29న సండ్ర మహానాడుకు హాజరయ్యారని, మే 30న ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం ఇంటికి వెళ్లారని, అక్కడినుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చారని లచ్చు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మే 30న లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు, సాయంత్రం 6 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్లారని తెలిపారు. నోవాటెల్ హోటల్లో జరిగిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారని లచ్చు తెలిపారు. మే 31న ఏసీ సీఎం ఇంటికి వెళ్తున్న సమయంలో వెంకటవీరయ్యకు ఫోన్ కాల్ వచ్చిందని, ఫోన్ సంభాషణను బట్టి అది రేవంత్ రెడ్డి నుంచి వచ్చినట్టుగా గుర్తించినట్టు లచ్చు తెలిపారు. నేరుగా ఆ ఇంటికి ఎందుకు వెళ్లావని రేవంత్‌ను నిలదీసినట్టు అర్థమైందని లచ్చు తెలిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులంతా ఏసీబీ ఆఫీసు ముందు ధర్నాచేసేందుకు వెళ్లారని వెంకట వీరయ్య గన్‌మ్యాన్ లచ్చు ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మొత్తం ఆపరేషన్‌కు పట్టిన సమయం ఐదు రోజులు కాగా.. మొదలైంది మే 27న, ముగిసింది మే 31న. తొలి మూడురోజులు మొత్తం పనంతా తానే చక్కదిద్దిన సండ్ర.. మే 30న వ్యవహారాన్ని రేవంత్‌కు అప్పగించారు. అంతా బాస్ ఆదేశాలతోనే చేస్తున్నట్లు చెప్పుకున్న వీరయ్య.. చిన్న చిన్న విషయాల్లోనూ జాగ్రత్త పడ్డారు. కలిసే సమయం, ఎంచుకునే ప్రదేశం, వెంట వచ్చే డ్రైవర్ ఇలా అన్ని విషయాల్లోనూ దృష్టి సారించిన సండ్ర.. ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా కేర్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆపరేషన్‌లో అన్ని విషయాలను చంద్రబాబుకు అప్డేట్ చేసినట్టుగా సండ్ర తన సంభాషణల్లో పేర్కొన్నారు. పైగా ఆపరేషన్‌కు టీడీపీ ఆఫీసులో పని చేసే జనార్దన్ అనే వ్యక్తిని సంధానకర్తగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే సండ్ర అండ్ టీం ఏ పని చేసినా.. జనార్దన్‌కు వివరించడం, ఆ విషయాన్ని జనార్దన్ చంద్రబాబుకు అప్డేట్ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. -
’ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా’
-
నా పిల్లలు విశాఖలో చదువుతున్నారు
తన పిల్లలు విశాఖపట్నంలో చదువుకుంటున్నారని, అందుకే వాళ్లను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో రాజమండ్రిలో చికిత్స పొందానని ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. తాను సత్తుపల్లి ఎమ్మెల్యేను కాబట్టి అక్కడే ఉన్నానని, అందుకే హైదరాబాద్‌లోని క్వార్టర్స్ వద్ద ఏసీబీ నోటీసులు అంటించిన విషయం తెలియదని ఆయన అన్నారు. మీడియా ద్వారా తనకు విషయం తెలియడంతో.. ఏసీబీకి లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత ఏసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. తర్వాత తానే మళ్లీ విచారణకు సిద్దంగా ఉన్నట్లు రెండోసారి లేఖ రాశానని చెప్పారు. రెండోసారి నోటీసులు ఇచ్చిన సమయానికి తాను విచారణకు హాజరయ్యానని, సోమవారం నాడు 8 గంటల పాటు ఏసీబీ అధికారులు సాగించిన విచారణలో అన్ని విషయాలను వెల్లడించానని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. తనను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని, అయితే ఈ కుట్రలకు భయపడేది లేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్కు కేవలం 63 మంది మాత్రమే ఎమ్మెల్యేలుండగా, వాళ్లు 84 మంది ఎలా అయ్యారని ప్రశ్నించారు. సరైన బలం లేని టీఆర్ఎస్ అసలు ఎన్నికల బరిలోకి ఎలా దిగిందని అడిగారు. తాను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పారు. -
ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అయిదో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనకు ఈనెల 21 వరకూ రిమాండ్ విధించటంతో అధికారులు చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు సండ్ర కస్టడీతో పాటు, బెయిల్ పిటిషన్లు బుధవారం విచారణకు రానున్నాయి. ఎమ్మెల్యే అయినందున సండ్రను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
ఇరుపక్షాల వాదనలు పూర్తి, 1.30కి ఉత్తర్వులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఇరుపక్షాల వాదనలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విన్నారు. దీనిపై మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ కేసులో అయిదో నిందితుడిగా ఉన్న సండ్ర తన వాదనలు కోర్టుకు వినిపించారు. 'నా పిల్లలు విశాఖపట్నంలో చదువుకుంటున్నారు కాబట్టి మార్గమధ్యలో రాజమండ్రిలో చికిత్స పొందాను. నేను సత్తుపల్లి ఎమ్మెల్యేను కాబట్టి ఏసీబీ ...నా క్వార్టర్స్‌లో నోటీసు ఇచ్చిన విషయం తెలియదు. మీడియా ద్వారా విషయం తెలుసుకుని ఏసీబీకి లేఖ రాశాను. ఏసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత విచారణకు సిద్ధంగా ఉన్నానని రెండోసారి నేనే లేఖ రాశాను. రెండోసారి నోటీసులిచ్చిన సమయానికి విచారణకు హాజరయ్యాను. నిన్న 8 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ విచారణలో నాకు తెలిసిన అన్ని విషయాలు వెల్లడించా' అని తెలిపారు. ఎమ్మెల్యే సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులు హాజరు పరిచారు. ఆయనను అయిదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు. -
ఎవరీ జనార్దన్?
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. వీరి సంభాషణల్లో చాలా సార్లు జనార్దన్ పేరు వినిపించింది. ప్రతి విషయాన్ని సండ్ర జనార్దన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొన్ని కీలక భేటీలు జరిగాయి. అయితే జనార్దన్ ఎవరు అన్న విషయం తెలాల్సివుంది. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
సాక్షి చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు
-
'తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించారు'
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కీలక పాత్ర వహించారని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. సండ్ర తెర వెనుక ఉండి ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారాన్ని మొత్తం నడిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సండ్ర పక్కా వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్‌లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. మే 30న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి, ఇదే కేసులో A-4 నిందితుడైన మత్తయ్యకు సండ్ర వీరయ్య.. 8 కాల్స్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును సాక్షి సేకరించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల మధ్య మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. సండ్ర మాట్లాడిన సంభాషణలు.. ఎమ్మెల్యేలు ఎవరెవరు డబ్బులకు లొంగుతారో సండ్ర ఆరా ఎంత డబ్బు పెడితే ఏ ఎమ్మెల్యే వస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల గైర్హాజరు, మరికొందరు టీడీపీకి ఓటు వేసేలా వ్యూహం మైనార్టీ ఎమ్మెల్యేల లక్ష్యంగా బేరసారాలకు వ్యూహం మహానాడు సభా వేదికల్లోనూ కుట్ర సంభాషణలు బాస్ తరపున వ్యవహారం నడిపించాలంటూ సెబాస్టియన్ కు సండ్ర సూచన ఎమ్మెల్యేల కొనుగోలుకు బాస్‌తో మాట్లాడి డబ్బులు అరెంజ్ చేస్తా డబ్బులకు లొంగకుంటే అధికారం ఆశ చూపాలి ఏపీలో చంద్రబాబు సర్కార్ ఉంది ఏపీలో ఆంగ్లో ఇండియన్ పోస్టులు ఖాళీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ పేరు చంద్రబాబుకు చెబుతా ఏపీలో ఏ పని కావాలన్నా బాబుతో చెప్పి చేయిస్తా ఎవరైనా చుట్టాలుంటే చెప్పు.. బాబుకు చెప్పి పని చేయిస్తా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మాదే అధికారం -
'సాక్షి' చేతికి ఎమ్మెల్యే సండ్ర రిమాండ్ రిపోర్టు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి కీలక రిమాండ్ రిపోర్ట్ 'సాక్షి' సేకరించింది. అందులో ఏసీబీ వెల్లడించిన వివరాలు మొత్తం రాజకీయ వ్యవస్థ విస్తుబోయేలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ ఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్నదానిపై సండ్ర సవివరంగా మాట్లాడారు. ప్రధానంగా సెబాస్టియన్ - సండ్ర వెంకట వీరయ్యల మధ్య సంభాషణలను ఏసీబీ అధికారులు సవివరంగా సేకరించి మరీ కోర్టుకు సమర్పించారు. మే 27 నుంచి మే 31 మధ్య అయిదు రోజుల గడువులో ఏకంగా 32 సార్లు సెబాస్టియన్, సండ్ర మధ్య సంభాషణలు జరిగాయి. సండ్ర 23 సార్లు కాల్ చేస్తే.. సెబాస్టియన్ 8 సార్లు కాల్ చేశారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల రికార్డులను పరిశీలిస్తే.. మొత్తం వ్యవస్థ ఏ స్థాయిలో అవినీతి ప్రవాహిస్తుందో అర్థమవుతుంది. మరోవైపు సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అయిదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
సండ్ర అరెస్ట్
* రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో కీలక పరిణామాలు * తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న ఏసీబీ * 7 గంటల విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటన * ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన సండ్ర * ఓ ఎమ్మెల్యేకు నగదు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయన్న ఏసీబీ * వేం నరేందర్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధం * రెండు రోజుల్లో కొందరు ‘ముఖ్యుల’ను ప్రశ్నించే అవకాశం * అజ్ఞాతంలోకి జిమ్మి బాబు.. అరెస్టుకు నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో కీలక పరిణామాలు మొదలయ్యాయి. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. అంతకుముందు దాదాపు ఏడు గంటల పాటు దఫదఫాలుగా ప్రశ్నించినా... సండ్ర నోరు విప్పకపోవడంతో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని నిర్ణయించిన అధికారులు.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని పూర్తిస్థాయిలో విచారించాలని నిర్ణయించారు. విచారణలో ఆయన సహకరించకపోతే.. అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తదనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యులకు నోటీసులు జారీచేసి, విచారించనున్నట్లు సమాచారం. శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎనిమిది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ వల వేసింది. ఎమ్మెల్యేల ఆర్థిక అవసరాలను బట్టి కోట్ల రూపాయల్లో లంచం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు చేశారు. అనంతరం స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రేవంత్‌తో పాటే డబ్బు బ్యాగ్ తీసుకుని వచ్చిన ఆయన సహచరుడు ఉదయ సింహ, టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు సెబాస్టియన్లను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు... టీడీపీకి చెందిన అనేక మంది ప్రముఖులకు ఈ ‘ఓటుకు కోట్లు’ బాగోతంలో ప్రయేయం ఉందని గుర్తించారు. రేవంత్ తెచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఖాతా నుంచి విత్‌డ్రా చేశారన్న వివరాలు ఏసీబీ వద్ద ఉన్నాయి. అయితే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50లక్షలు పోగా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది.. వంటి వివరాలు తెలియలేదు. దీనికి సంబంధించి సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు.. సోమవారం 7 గంటల పాటు సండ్రను ప్రశ్నించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానాలు రాకపోవడంతో.. అరెస్టు చేశారు. ఇక సోమవారంలోగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ జారీ చేసిన నోటీసును తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు బేఖాతరు చేశారు. విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఏసీబీ.. జిమ్మి పరారీలో భావిస్తూ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. సండ్రదే కీలకపాత్ర: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.150 కోట్లు సమకూర్చుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలను గుర్తించే బాధ్యతను నలుగురు ఎమ్మెల్యేలకు, ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అప్పగించారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను సండ్ర వెంకటవీరయ్యకు అప్పగించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సండ్ర... మే చివరి వారంలో ఆ ఎమ్మెల్యేలతో చర్చించారు. పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. కోట్ల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన (తదనంతరం టీఆర్ఎస్లో చేరారు) ఇద్దరు ఎమ్మెల్యేలతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా కొంత సొమ్ము ముట్టజెప్పారని.. రేవంత్ దొరికిపోగానే ఆ ఎమ్మెల్యే తనకిచ్చిన డబ్బును వెనక్కి తిప్పిపంపారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన ఓ గిరిజన ఎమ్మెల్యేతోనూ సండ్ర సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. సోమవారం నాటి విచారణలో సండ్ర ఏదీ బయటపెట్టనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ కోర్టును కోరనుంది. నరేందర్‌రెడ్డిని ప్రశ్నించనున్న ఏసీబీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ మరోమారు ప్రశ్నించనుంది. ఆయనకు నోటీసు జారీ చేయాలా, లేదా ఇంటికి వెళ్లి విచారించాలా అన్నదానిపై మంగళవారంనిర్ణయం తీసుకోనున్నారు. విచారణలో ఆయన సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశముందని ఓ అధికారి వెల్లడించారు. గతంలో నరేందర్‌రెడ్డిని విచారించినా.. ఆయన సహకరించలేదని, డబ్బు ఎవరు సమకూర్చారన్నది తేలాల్సి ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. మండలి ఎన్నికలకు ముందు కొన్ని బ్యాంకు శాఖల నుంచి కోట్ల రూపాయలు విత్‌డ్రా చేశారని, అవి ఎక్కడకు వెళ్లాయన్నది ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. వేం నరేందర్‌రెడ్డికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనను విచారించి నిజానిజాలను సరిపోల్చుకుంటామని తెలిపారు. మరింత కీలకం: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. అతి ముఖ్యమైన ఒక నేతతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులకు, ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. -
సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్ !
-
సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య ఈ ఉదయం ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటిసారి ఏసీబీ నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఏసీబీ ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసింది. సమాచారం కావాలంటే ఆయనను అరెస్టు చేసి ప్రశ్నించాల్సిందేనని ఏసీబీ భావించింది. ఈ పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతోనే ఆయనను ఏసీబీ అరెస్టు చేసినట్లు తెలిసింది. ఓటుకు రూ. 5 కోట్లు చెల్లించడానికి సిద్ధపడిన కేసులో ముందుగానే వీరయ్యకు నోటీసులు వెళ్లాయి. అయితే, అప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో రెండోసారి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన జెరూసలెం మత్తయ్యకు 9 సార్లు ఫోన్ చేసినట్లు సమాచారం వచ్చింది. ఆయన చేసిన ప్రతి కాల్ గురించి అడిగినట్లు తెలిసింది. ఈయన నుంచి ఫోన్ వెళ్లిన వెంటనే.. తర్వాత మత్తయ్య నేరుగా స్టీఫెన్సన్కు ఫోన్ చేశారు. ఉదయం నుంచి 75 వరకు ప్రశ్నలు ఆయనకు వేసినట్లు తెలుస్తోంది. ఆయనను సోమవారమే మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఏసీబీ వర్గాలు ప్రశ్నించినప్పుడు ఆయన సహకరించలేదని కూడా సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలులో సండ్ర వెంకట వీరయ్య కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. మత్తయ్యతో ఈయనే వ్యవహారం నడిపారని, కొందరు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. చార్జిషీటు దాఖలు చేయడానికి మరో 24 రోజుల గడువు మాత్రమే ఏసీబీ వద్ద ఉంది. దాంతో ఈలోపు వీలైనంత వేగంగా దర్యాప్తు ప్రక్రియను పూర్తిచేయాలన్న ఆలోచనలో ఏసీబీ వర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. -
సండ్రకు మళ్లీ ఏసీబీ నోటీసులు
-
సండ్రకు మళ్లీ ఏసీబీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తానంటూ లేఖ రాయడంతోపాటు రెండు, మూడు రోజులుగా బహిరంగంగా ప్రకటనలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు శనివారం మరోసారి పిలుపు వచ్చింది. సోమవారం లోగా తమ ఎదుట హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న సండ్ర నివాసానికి నోటీసులు అతికించారు. అయితే ఈసారి సండ్రకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులిచ్చారు. ఇంతకు ముందు జూన్16న సండ్రకు ఏసీబీ సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం నోటీసులు జారీ చేసింది. అయితే అప్పట్లో తనకు ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి వచ్చినా.. లేదా పది రోజుల తర్వాత విచారణకు సహకరిస్తానంటూ జూన్ 19న ఆయన ఏసీబీకి లేఖ రాశారు. కానీ పదిరోజులు గడిచినా ఏసీబీ ఎదుటకు రాలేదు. హైకోర్టులో రేవంత్‌రెడ్డికి బెయిల్ వచ్చిన మరుసటి రోజు ‘విచారణకు పిలిస్తే వస్తా’ అంటూ ఏసీబీకి లేఖ రాశారు. అప్పటి వరకు కనిపించకుండా పోయిన సండ్ర బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ‘ఓటుకు కోట్లు’ కుట్రలో సండ్రకు భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ మొదటి నుంచి కూడా అనుమానిస్తోంది. అందుకు అనుగుణంగానే గతంలో సండ్రను సాక్షిగా పరిగణించిన ఏసీబీ ఈసారి నిందితుల జాబితాకు మార్చుకుంది. అందులో భాగంగానే తాజాగా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. -
'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'
ఖమ్మం: ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో గడువులోగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు. శనివారం ఏసీబీ అధికారులు సండ్రకు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని సండ్ర ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. ఇంట్లో ఎవరూ లేకకపోవడంతో గోడకు నోటీసు అతికించి వచ్చారు. సోమవారం సాయంత్రం 6 గంటలలోగా విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ నేపథ్యంలో సండ్ర స్పందించారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ గతంలో సండ్రకు నోటీసులు ఇచ్చినా అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయినట్టు సండ్ర చెప్పారు. -
'సోమవారంలోగా విచారణకు రండి'
-
'సోమవారంలోగా విచారణకు రండి'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు పురోగతి దిశగా సాగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సెక్షన్ 41 ఏ సీఆర్పీసీ ప్రకారం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలలోగా విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు. శనివారం ఏసీబీ అధికారులు హైదర్ గూడలోని సండ్ర వెంకట వీరయ్య ఇంటికి నోటీసులు అతికించి వచ్చారు. ఆ సమయంలో సండ్ర ఇంట్లో ఎవరూ లేరు. కాగా ఎల్లుండి ఉదయం 10 గంటలకు సండ్ర ఏసీబీ కార్యాలయానికి రావచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. టీడీపీకి చెందిన కీలక నేతలను ఏసీబీ విచారించవచ్చని భావిస్తున్నారు. ఏసీబీ సండ్ర వెంకట వీరయ్యకు ఇంతకుముందే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా అనారోగ్యంతో బాధపడుతున్నానని తనకు 10 రోజులు గడువు కావాలని సండ్ర ఏసీబీ అధికారులను కోరారు. గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరయిన తర్వాత సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. తాను రాజమండ్రిలో చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నానని, ఏ సమయంలోనైనా ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని సండ్ర తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సండ్రకు నోటీసులు జారీ చేశారు. సండ్రతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని కూడా ఏసీబీ విచారించే అవకాశముంది. ఏసీబీ అధికారులు సండ్రను అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేంనరేందర్ రెడ్డికి ఓటు వేయడం కోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి 50 లక్షలు ముడుపులు ఇస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర ప్రత్యక్షం!
-
ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్ర ప్రత్యక్షం!
ఖమ్మం: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు జారీచేసినప్పటినుంచీ అజ్ఞాతంలో ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. నగరంలో ఆయన తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న విషయం తెలియగానే స్థానిక టీడీపీ నేతలు, అనుచరులు ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తమ పిల్లలను విశాఖపట్నంలోని గీతమ్ స్కూల్లో చేర్పించేందుకు వెళ్లానని, అయితే అప్పటికే అనారోగ్యానికి గురైన తనకు ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని లిఖిత పూర్వకంగా ఏసీబీ అధికారులకు రాసిచ్చానన్నారు. 15 రోజుల చికిత్స అనంతరం తన ఆరోగ్యం కుదుటపడిందని, ఇప్పుడు విచారణకు సిద్ధంగానే ఉన్నానన్నారు. ఏసీబీని గౌరవిస్తానని, వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. కాగా, సండ్రను కలిసిన వారిలో టీడీపీ నాయకులు గంగాధర్‌చౌదరి, కర్నాటి కృష్ణ, మద్దినేని బేబి స్వర్ణకుమారి, మందడపు రామకృష్ణ, బెల్లం వేణు, కొప్పు నరేష్ తదితరులున్నారు. -
ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా: ఏసీబీకి సండ్ర లేఖ
-
ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా: ఏసీబీకి సండ్ర లేఖ
ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని, ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యానని ఆయన తెలిపారు. ఇక విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తానని ఆయన ఆ లేఖలో రాశారు. కాగా, ఓటుకు కోట్లు కేసులో నోటీసులు జారీ చేసినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వెంకటవీరయ్యకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమైందన్న సమాచారం అందడం వల్లే ఆయన ఇప్పుడు విచారణకు వస్తానని లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈసారీ స్పందించకపోతే ఆయన్ని నిందితుల జాబితాలోకి చేర్చాలని ఏసీబీ భావించడంతో ఇక తప్పనిసరిగా విచారణకు రావాల్సిందేనని ఆయనకు సలహాలు ఇచ్చారు. వెంకట వీరయ్యను విచారించాలని భావించిన ఏసీబీ.. జూన్ 16న సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సండ్ర ఇంటి (208 క్వార్టర్) తలుపులకు నోటీసు అంటించారు. దీనికి సండ్ర తనకు వంట్లో బాగాలేదని, ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తానని లేదా ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ జూన్19న ఏసీబీకి లేఖ రాశారు. పది రోజులైనా ఏసీబీ ఎదుటకు రాలేదు. ఎక్కడ చికిత్స పొందుతున్నారో వెల్లడించలేదు. ఎట్టకేలకు బుధవారం నాడు తాను విచారణకు వస్తానంటూ ఏసీబీకి ఓ లేఖ రాశారు. -
సండ్రకు మరోసారి నోటీసులు?
విచారణకు హాజరు కాకపోవడంతో ఏసీబీ సీరియస్ స్పందించకపోతే నిందితుల జాబితాలో చేర్చాలని నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నోటీసులు జారీ చేసినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఈసారీ స్పందించకపోతే ఆయన్ని నిందితుల జాబితాలోకి చేర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రూ.50 లక్షలు ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కుట్రలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకూ భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అందుకోసం ఆయన్నీ విచారించాలని భావించి.. జూన్ 16న సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సండ్ర ఇంటి (208 క్వార్టర్) తలుపునకు నోటీసు అంటించారు. దీనికి సండ్ర తనకు వంట్లో బాగాలేదని, ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తానని లేదా ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని పేర్కొంటూ జూన్19న ఏసీబీకి లేఖ రాశారు. పదిరోజులైనా ఏసీబీ ఎదుటకు రాలేదు. ఎక్క డ చికిత్స పొందుతున్నారో ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ క్రమంలో సండ్రను ఏపీ ప్రభుత్వమే దాచిపెట్టిందని అనుమానం వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా వెళ్లింది. కాగా ఈసారి ఖమ్మం జిల్లాలోని సండ్ర నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నోటీసులకు కూడా సండ్ర స్పందించకపోతే.. ఆయన్ని నిందితుల జాబితాలో చేర్చి అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ముగుస్తున్న సండ్ర గడువు
-
శనివారమే ఆస్పత్రినుంచి వెళ్లిన సండ్ర
-
శనివారమే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన సండ్ర..
రాజమండ్రి : ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (రాజమండ్రిలో సండ్ర కలకలం) ఆచూకీ ప్రస్తుతం మిస్టరీగా మారింది. చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడ నుంచి సండ్ర అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కేవలం పడకకే పరిమితమై విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు చెప్పారని ఏసీబీకి లేఖ రాసిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానంటూ రోజుకో నగరాన్ని మార్చుతున్నారు. ఆస్పత్రిలో విచారణకైనా సిద్ధమంటూనే ఎక్కడ ఉన్నారో మాత్రం సండ్ర...ఏసీబీకి చెప్పడం లేదు. మరోవైపు ఎమ్మెల్యే సండ్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.