ఓటుకు కోట్లు కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ప్రత్యేక కోర్టు రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల మధ్య న్యాయవాది సమక్షంలో విచారించవచ్చని, అనుచితంగా ప్రవర్తించరాదని, థర్డ్‌డిగ్రీ పద్ధతులు ప్రయోగించరాదని పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించాలని స్పష్టంచేశారు. కస్టడీ సమయంలో పరిశుభ్రమైన ఆహారం అందివ్వాలని, శుభ్రంగా ఉన్న టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.