note for vote
-
ఓటుకు నోటు లంచమే
సాక్షి అమరావతి : ఎన్నికల సందర్భంగా ఓటర్లను డబ్బుతో కొనడం, ఓటర్లకు డబ్బు, రకరకాల వస్తువులను పంపిణీ చేసి ప్రలోభపెట్టడం మనదేశంలో సర్వసాధారణంగా మారింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(1) ‘లంచగొండితనం’ గురించి స్పష్టమైన నిర్వచనాన్ని ఇస్తోంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఎవరైనా వ్యక్తి, ఇతరులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టేందుకు బహుమతి, ఉచిత కానుక, హామీ ఇవ్వడం లంచగొండితనం కిందకు వస్తుందని ఈ సెక్షన్ చెబుతోంది. ఎన్నికల్లో ఓ అభ్యర్థి పోటీ చేసేందుకు, పోటీ చేయకుండా ఉండేందుకు, పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు, ఉపసంహరించుకోకుండా ఉండేందుకు ప్రలోభ పెట్టడం, ఓటు వేయడానికి, వేయకుండా ఉండేందుకు ఓటరును ప్రభావితం చేయడమూ లంచగొండితనమే అవుతుంది. అలాగే ఐపీసీ సెక్షన్ 171(బీ) కూడా లంచగొండితనానికి వివరణిచ్చింది. ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ఓటరును ఏ రకంగా ప్రలోభపెట్టినా అది నేరమే అవుతుందని ఈ చట్టంలో ఉంది. స్వేచ్ఛగా సాగే ఎన్నికల్లో జోక్యం చేసుకొంటూ ఓటర్లను ప్రభావితం చేయడం నేరమని ఐపీసీ సెక్షన్ 171(సీ) చెబుతోంది. అయితే ఇలా ఎన్నికల్లో లంచగొండితనానికి పాల్పడితే అది ప్రస్తుతం బెయిల్ ఇవ్వదగ్గ నేరంగానే ఉంది.– యర్రంరెడ్డి బాబ్జీ, సాక్షి అమరావతి కాగ్నిజబుల్ నేరంగా పరిగణించాలని.. ఎన్నికల్లో లంచగొండితనాన్ని కట్టడి చేసేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావించి, ఎన్నికల సంఘం 2012లో కేంద్ర హోంశాఖకు ఓ ప్రతిపాదన చేసింది. ఎన్నికల్లో లంచగొండితనాన్ని కాగ్నిజబుల్ (విచారణకు స్వీకరించదగ్గ) నేరంగా పరిగణించాలని, ఆ మేర చట్ట సవరణ చేయాలని కోరింది. కాగ్నిజబుల్ నేరం అయితే వారెంట్ లేకుండా ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తిని నేరుగా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. సులభంగా బెయిల్ ఇచ్చేందుకు ఆస్కారం ఉండదు. 2 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీనిపై 2018లో సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై ధర్మాసనం.. కేంద్రం, ఎన్నికల సంఘంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో లంచగొండితనాన్ని కాగ్నిజబుల్ నేరంగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు... ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఎన్నికల్లో లంచగొండితనానికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ కీలక నేతగానున్న రేవంత్‌రెడ్డి చేత రూ.5 కోట్లు ఇవ్వజూపి, అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు పంపారు. అనంతరం స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు స్వయంగా సెల్ఫోన్లో మాట్లాడారు. తన సన్నిహితుడు మత్తయ్య ద్వారా చంద్రబాబు ఇదంతా నడిపించారు. స్టీఫెన్సన్ ఇంటిలో జరిగిన, ఈ ఘటన మొత్తం వీడియోగ్రఫీ కావడంతో చంద్రబాబు, రేవంత్ తదితరులు అడ్డంగా దొరికిపోయారు. రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఓటుకు నోటు’ కేసుగా ఇది రెండు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన చంద్రబాబు మాటలు దేశవ్యాప్తంగా అందరూ విన్నారు. ఆ గొంతు తనది కాదని చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పలేదు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఆడియోలో ఉన్నది చంద్రబాబు స్వరమేనని కొన్ని ల్యాబ్‌లు కూడా నిర్ధారించాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. -
ఓటుకు నోటు.. ఆపై ఒట్టు.!
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ బరితెగిస్తోంది. నిజాయితీగా వెళ్తే గెలవలేమనుకుందో ఏమో ‘అడ్డదారుల్లో’ దూసుకెళ్తోంది. సార్వత్రిక ఎన్నికల గంట మోగడానికి చాలా రోజుల ముందు నుంచే ఓటర్లకు ఎర వేసే పనిలో నిమగ్నమైన ఆ పార్టీ.. ఇప్పుడు గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే ఒక వర్గం ఓటర్లపై కన్నేసింది. ఇందుకోసం స్థానిక నాయకులు, ద్వితీయశ్రేణి నేతలను రంగంలోకి దిచ్చింది. ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు జరిగే సమయానికి వెళ్లడం, అక్కడ డబ్బులు పంచడం, తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని వారితోనే ప్రతిజ్ఞ చేయించడం సర్వసాధారణమైంది. నిర్వాహకులతో బేరాలు.. కొన్ని చోట్ల ప్రార్థనాలయాల నిర్వాహకులతోనే ఓట్ల బేరం పెడుతున్నట్లు తెలుస్తోంది. మీ వద్దకు ఎంతమంది వస్తారు? ఎంత మందిని ఒప్పించగలరు? ఎన్ని ఓట్లు వేయించగలరు? అని తేల్చుకుని ఆయనకే గంపగుత్తగా సొమ్ములందిస్తుండటం విశేషం. అధికారపార్టీ ఎంపీ అభ్యర్థులు ఇందుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. తన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులందరికీ వారు ఆర్థికంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. వల ఆ వర్గం వారికే.. పెడన, విజయవాడ తూర్పు, సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నిరుపేదలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై అధికార పార్టీ నేతలు గురిపెట్టారు. సెంట్రల్‌లోని మాచవరం, మొగల్రాజపురం, కొండప్రాంతాలు, అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, తూర్పులోని కృష్ణలంక తదితర ప్రాంతాల్లో ఇది జోరుగా సాగుతోంది. డబ్బుతోపాటు ఆ పార్టీ నాయకులు మతం కార్డునూ ఉపయోగిస్తున్నారు. మనందరిదీ ఒకే మతమని మనకే ఓటు పడాలని తప్పుడు పద్ధతుల్లో ప్రచారానికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. నేతల లెక్కలు.. నియోజకవర్గం మొత్తం ఓట్లు ఎన్ని? అందులో పోలయ్యే ఓట్లు ఎన్ని? వాటిలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వస్తాయనే అంచనాల్లో అధికారపార్టీ నేతలు ఉన్నారు. ఎన్ని ఓట్లు వస్తే గెలుపునకు వీలుంటుంది. ఎవరెవరు ఎన్ని ఓట్లు చీలుస్తారు? అనే విషయాలను పోలింగ్ కేంద్రం వారి లెక్కలు తీస్తున్నారు. పార్టీ ఓట్లు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి? డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా వచ్చే ఓట్లు ఎన్ని? కొనుగోలు చేయాల్సినవి ఎన్ని? ప్రభావితం చేయగల నాయకులు ఎవరు? అనే అంచనాల్లో అభ్యర్థులు, వారి ముఖ్య అనుచరులు తలమునకలై ఉన్నారు. ఓట్ల కొనుగోలు ఎలాగూ తప్పదనే నిర్ణయానికి వచ్చిన అధికారపార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓటుకు రూ. వెయ్యి.. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓట్ల కొనుగోళ్లకు తెరతీశారు. ఓటుకు రూ. 1,000 తక్కువ కాకుండా ఇస్తున్నారు. ఓ అభ్యర్థి అయితే రెండు రోజుల కిందటే ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆయన గెలుపే ధ్యేయంగా నియోజకవర్గంలోని 75 శాతం మంది ఓటర్లకు డబ్బు అందేలా చూడాలని తన అనుచరులకు హుకుం జారీ చేశారు. అలాగే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 500 నుంచి రూ. 1,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. నమ్మకం లేని కొందరు అభ్యర్థులు డబ్బులు ఇచ్చిన తర్వాత ఓటర్ల వద్ద ప్రమాణాలు చేయించుకుంటారనేది విశ్వసనీయ సమాచారం. జాప్యమైతే నష్టమని.. జాప్యమయ్యే కొద్దీ ఒత్తిడి పెరుగుతుందని, పోలీసులు, ప్రత్యర్థుల పర్యవేక్షణ పెరుగుతుందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. అందువల్లే ప్రచారం సమయం పూర్తయ్యేలోగా నగదు పంపిణీ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. -
ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు
పశ్చిమగోదావరి , నరసాపురం రూరల్: ఓటును నోటుకు అమ్మితే ఐదేళ్లు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ ప్రచారం చేస్తున్నాడో అభ్యదయ ఓటరు. నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన కుంకటి కాంతారావు అనే రాజకీయ ఓనమాలు తెలిసిన ఓటరు తన ఇంటి గోడపై ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’ అంటూ రాసిన రాతలు రాజకీయ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయి. ప్రజాసామ్య వ్యవస్థలో ఓటరు తన ఓటు పదును చూపిస్తున్నట్టుగా ఉన్న రాతలు రాజకీయ చైతన్యం తీసుకువస్తాయని పలువురు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని చాటేలా ఉన్న ఈ మాటలు ఆలోచింపజేస్తున్నాయి. -
మత్తయ్యకు భద్రత కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో జెరూసలేం మత్తయ్యతో మాట్లాడి అతడికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ డీజీపీ భద్రత కల్పించలేదని, తాను కలిసేందుకు వెళ్లినప్పటికీ డీజీపీ నిరాకరించారని మత్తయ్య సుప్రీంకోర్టుకు నివేదించడంతో జస్టిస్ ఎస్ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మె ల్యే స్టీఫెన్సన్కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి మత్తయ్య పేరును హైకోర్టు తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టులో 2016లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు గురువారం మరోసారి విచారణకు వచ్చింది. అక్టోబర్ 26న విచారణకు వచ్చినప్పుడు మత్తయ్య వాదనలు వినిపిస్తూ తనకు రక్షణ లేదని, ఏపీ పోలీసులు తనను సుప్రీంకోర్టుకు రానివ్వకుం డా అడ్డుకున్నారని ఫిర్యాదు చేయగా ‘మత్తయ్య రక్షణ కోసం చేసుకునే దరఖాస్తును తెలంగాణ డీజీపీ పరిగణనలోకి తీసుకోవాలి..’అని ధర్మాసనం ఆనాడు ఆదేశించింది. ఉదయమే నా భార్యను బెదిరించారు.. తాజా విచారణలో మత్తయ్య తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ భద్రత కల్పించలేదని, గురువారం ఉదయం కూడా ఏపీ పోలీసులు తన ఇంటికి వెళ్లి భార్యను బెదిరించారని నివేదిం చారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని తెలంగాణ డీజీపీని కలిసేందుకు ప్రయత్నించినా సానుకూలంగా స్పందించలేదన్నారు. జస్టిస్ ఎస్ఎ.బాబ్డే స్పందిస్తూ.. ‘మేం చెప్పాం కదా.. భద్రత కల్పించడంలో వచ్చిన నష్టమేంటి?’అని తెలంగాణ తరఫు న్యాయవాది హరీన్ రావల్‌ను ప్రశ్నించారు. దీనికి రావల్ స్పందిస్తూ ‘మత్తయ్యకు హైదరాబాద్‌లో ఎలాంటి బెదిరింపులు, అభద్రత, ప్రాణహాని గానీ లేదు..’అని చెప్పారు. ఏపీ, తెలంగాణ పోలీసుల కుమ్మక్కు.. అయితే దీనిపై మత్తయ్య స్వయంగా వాదనలు వినిపిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు కుమ్మక్కయ్యారని, ఇద్దరూ కలసి నాటకం ఆడుతున్నారని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు దీనిపై స్పందిస్తూ క్రితం సారి విచారణలో న్యాయవాదితో రావాలని చెప్పామని, న్యాయవాదితో రావాలని సూచించారు. అయి తే తనకు న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేదని విన్నవించడంతో అక్కడే ఉన్న సిద్ధార్థ దవే అనే న్యాయవాదిని ‘మీరు మత్తయ్య తరపున వాదిస్తారా?’అని జస్టిస్ నాగేశ్వరరావు ప్రశ్నించగా అందుకు ఆయన సమ్మతించారు. కోర్టు దవేను మత్తయ్య తరఫున వాదనలు వినిపించేందుకు అమికస్ క్యూరీ (కోర్టుకు సహాయకారి)గా నియమించిందని, మత్త య్య తన పత్రాలను దవేకు ఇవ్వాలని ఆదేశించారు. మత్తయ్య తానొక మధ్యంతర దరఖాస్తు చేసుకునేం దుకు అనుమతించాలని కోరగా.. ఏదైనా న్యాయ వాది దవే ద్వారా చేసుకోవాలని సూచించారు. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయసింహ ఓటుకు కోట్లు కేసులో నిందితుడు ఉదయసింహ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు విచారణను ఆలస్యం చేసేందుకు పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ తరఫు న్యాయవాది రావల్ వాదించారు. దీనిపై ఉదయసింహ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరువురు న్యాయవాదులు వాదులాడుకోగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఉదయసింహ ఇంప్లీడ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. కేసు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదావేసింది. విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉదయకుమార్ సాగర్ పాల్గొన్నారు. -
కర్ణాటకంలో ‘నోటుకు ఓటు’ దాసోహం
సాక్షి, న్యూఢిల్లీ : వాడిగా, ‘వేడి’గా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంతిమ అంకం ప్రారంభమైంది. చల్లగా నోట్లు చేతులు మారుతున్నాయి. ఓట్లు కొనేవారికి, అమ్మేవారికి మధ్య అనూహ్య ఆత్మీయ బంధం అలుముకుంటోంది. ‘జన్‌ధన్’ ఖాతా కలిగిన ప్రతి ఓటరు అకౌంట్లోకి వెయ్యి రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఎన్నికల ఫలితాల రోజున అంటే, మే 15వ తేదీన మరో వెయ్యి రూపాయలు ఆ ఖాతాలకు వచ్చి చేరుతాయట. ఈ లెక్కన కర్ణాటకలో ఓటుకు రెండు వేల రూపాయలు పలుకుందని స్పష్టం అవుతుంది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 136 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఎన్నికల కమిషన్ కనుగప్పి ఓట్ల వ్యాపారం బాగానే కొనసాగుతోంది. నేడు ఒక రాష్ట్రమంటూ కాకుండా ‘ఓటుకు నోటు’ సంప్రదాయం దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అది పార్లమెంట్ ఎన్నికలయినా, అసెంబ్లీ ఎన్నికలయినా సంప్రదాయం కొనసాగాల్సిందే. 2008లో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఓట్లను కొనుక్కునే సంప్రదాయం మొదటిసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. నోటు తీసుకొని ఓటు వేసిన వారి సంఖ్య 2008లో ఏడు శాతం ఉంటే అది 2014 ఎన్నికల నాటికి 15 శాతానికి పెరిగిందని ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు వారి శాతం మరింత పెరిగే ఉంటుంది. దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ ప్రభావంగానే ఈ నోటుకు ఓటు సంస్కతి కొనసాగుతుందని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల్లో, ఓటర్లలో నైతికతను పెంచడం వల్ల ఈ దుస్సంప్రదాయాన్ని శాశ్వతంగా అరికట్టవచ్చని ఎవరైనా భావించవచ్చు. ఆ నైతికత ఎలా రావాలన్నది కూడా ఈ సామాజిక, ఆర్థిక పరిస్థితులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నిరుద్యోగం, పేదరికం..... దేశంలోని నిరుద్యోగం, పేదరికం, నైపుణ్య, అనైపుణ్య రంగాల్లో కనీస వేతనాలు ఎంత? కనీస వేతనాలపై బతికే కార్మిక లోకమెంత? మధ్యతరగతి వారు ఎంత? తదితర అంశాలపై ఆధారపడి ఓటుకు నోటు సంప్రదాయం కొనసాగుతుంది. సాధారణంగా ధనిక రాష్ట్రాలకన్నా పేద రాష్ట్రాల్లో ఓటుకు రేటు ఎక్కువ పలుకుతుంది. ‘నువ్వా, నేనా’ అన్నట్లు పోటీ ప్రతిష్టాత్మకంగా మారిన సందర్భాల్లో కూడా రేటు పెరుగుతుంది. కర్ణాటకలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు మూడు వందల రూపాయలు పలగ్గా ఇప్పుడది రెండువేల రూపాయలకు చేరుకుంది. కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా, ఉత్కంఠంగా మారడమే. గత ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం కర్ణాటకలో కనీస వేతనం 12,270 రూపాయలు. ఆ మొత్తంలో ఒక్క రోజు ఓటు వేస్తే 17 శాతం డబ్బులు ముడుతాయి. కర్ణాటకలో నిరుద్యోగం 2.6 శాతమే ఉన్నప్పటికీ రోజు కూలీ దొరకుతుందన్న గ్యారెంటీలేని జీవితాలు ఎన్నో. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూడా రోజుకు 236 రూపాయలే దొరకుతాయి. అది కూడా వందరోజులు మాత్రమే గ్యారంటీ. అలాంటి పరిస్థితుల్లో నోట్ల ప్రలోభానికి కాదు, నోట్ల ఒత్తిడికి ఎంత మందో గురవుతారు. రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారుతుంటోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో గుండు గుత్తాగా 150 ఓట్లకు లక్ష రూపాయలు పలికింది. అంటే ఒక్కో ఓటుకు 666.66 రూపాయలు అన్నమాట. ఈ విషయాన్ని ఆ ఎన్నికల్లో సీతాపూర్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన షెవాలీ మిశ్రా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలికిన మూడు వందల రూపాయలతో పోలిస్తే 666 రూపాయలు రెండింతలకన్నా ఎక్కువ. యూపీలో ఇప్పుడు కనీస వేతనం నెలకు 7,613 రూపాయలే. అంటే, కర్ణాటకకంటే 4,657 రూపాయలు తక్కువ. యూపీలో నిరుద్యోగం శాతం కూడా 5.5. కర్ణాటకకన్నా 2.9 శాతం ఎక్కువ. పంజాబ్‌లో 2009లో ఓటు రేటు ప్రత్యక్ష సాక్షిగా మాజీ జర్నలిస్ట్ మన్‌ప్రీత్ రంధావ రాసిని వ్యాసం కూడా ఇక్కడ గమనార్హమే. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్, బటిండా నియోజకవర్గంలోని మన్సా పోలింగ్ కేంద్రానికి ఆయన ఓటు వేయడానికి వెళ్లారు. ఆయన వద్దకు ఓ అకాలీదళ్ కార్యకర్త వచ్చి ఓటువేస్తే ‘యూ విల్బీ పెయిడ్’ అని చెప్పారట. అప్పుడు అకాలీదళ్ తరఫున హరిసిమ్రాట్ కౌర్ బాదల్ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున రణిందర్ సింగ్ పోటీ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కుమారుడే రణిందర్ సింగ్. ఓటు వేసిన తర్వాత అకాలీదళ్ కార్యకర్త చెప్పిన ఓ అతిపెద్ద భవనం వద్దకు వెళ్లి ఓటరు గుర్తింపు కార్డు, ఓటువేసినట్లు సిరా మరక చూపి ఓటర్లు డబ్బులు తీసుకోవాలట. అక్కడ మనిషికి 200 రూపాయలు ఇచ్చారట. ఆ విషయాన్ని ఆయన అప్పుడు పనిచేస్తున్న ‘హిందుస్థాన్ టైమ్స్’లో రాసినా అధికారులెవరూ ఆ భవనంపై దాడి చేయలేదట. ఎలాంటి చర్యా తీసుకోలేదట. ఆమ్ ఆద్మీ పోరాటం అవినీతికి వ్యతిరేకంగా కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2013, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటుకు నోటు సంప్రదాయంపై పరోక్ష యుద్ధం చేసింది. ‘ఏ రాజకీయ పార్టీ ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి’ అంటూ కేజ్రివాల్ ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటువేసే వారు అవినీతి పరులని అలాంటి వారి దగ్గర డబ్బు తీసుకోవడం అవినీతి కిందకు రాదని, పైగా వారికి బుద్ధి చెప్పిట్లు అతుందన్నది అప్పుడు ఆయన వాదన. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పిలుపు ఏ మేరకు ప్రభావం చూపించిందోగానీ, 2015 ఎన్నికల్లో అద్భుత ప్రభావాన్ని చూపించింది. 70 అసెంబ్లీ సీట్లకుగాను ఆయన పార్టీకి 67 సీట్లు వచ్చాయి. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఇదే వ్యూహాన్ని అనుసరించి బోల్తా పడ్డారు. ఆ ఎన్నికల్లో కొన్ని పార్టీలు గురద్వార్లకు, ఆలయాలకు ఓటర్లను తీసుకెళ్లి అక్కడే డబ్బులు పంచి ఒట్టు వేయించుకున్నారు. గుళ్లూ గోపురాల వద్దకు రావడానికి ఇష్టపడని ఓటర్ల వద్దకు నాయకులే వెళ్లి పవిత్ర గ్రంధాల మీద, దేవుళ్ల పటాలపై ఒట్లు వేయించుకున్నారు. ఓటుకు నోటు ఎవరు తీసుకుంటున్నారు? ఎక్కువ వరకు రెక్కాడితేగాని డొక్కాడని పేదలు, మధ్యతరగతిలో ఓ మోస్తారు మంది ఓటుకు నోటు ఒత్తిడికి గురవుతున్నారు. ‘ఇక మా జీవితాలు ఇంతే. ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా మా బతుకులు మారవు. మా కూడుకు మేము కష్టపడాల్సిందే’ అన్న నిర్లిప్తత పెరిగిన పేదలు, ‘ ఏ రాజకీయ పార్టీ, ఎవరొచ్చినా పెద్దగా మారేదేముందీ! ఎలాగైనా మన బతుకుల్ని మనం బాగుచేసుకోవచ్చు. మనకుండే నెట్వర్క్ మనకు ఉండనే ఉంటుంది’ అని భావించే మధ్యతరగతి మనుషులు ‘నోటకు ఓటు’ వేస్తున్నారు. -
ఓటుకు రెండు వేల రూపాయల నోటు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని 12 రోజులు లేవు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తనవైపు తిప్పుకునేందుకు ధనభలం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 27వ తేద నుంచి ఇప్పటి వరకు 136 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు మొత్తంలో 90 శాతం నోట్లు రెండువేల రూపాయలవే ఉన్నాయి. అంటే ఓటుకు నోటుకున్న డిమాండ్ రెండు వేల రూపాయలకు చేరుకుందని దీన్నిబట్టి తెలుస్తోంది. 2017లో తమిళనాడులోని రాధాకష్ణన్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సొమ్ము పెద్ద ఎక్కువ కాదని తెలుస్తోంది. తమిళనాడు నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలకు 86 కోట్ల రూపాయలను పంచారని తెలిసి ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికను కొంతకాలం వాయిదా వేసింది. అనంతరం డిసెంబర్లో నిర్వహించిన ఆ ఉప ఎన్నికల్లో డబ్బు కుప్పలు తెప్పలుగా చేతులు మారిందని తెల్సింది. నాటి ఎన్నికల్లో టీటీవి దినకరణ్ పాలకపక్ష అన్నా డిఎంకే, ప్రధాన ప్రతిపక్ష డిఎంకే అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దినకరణ్ రాధాకష్ణన్ నగర్‌ను సందర్శించినప్పుడు స్థానిక ప్రజలు 20 రూపాయల నోట్లను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ఈ 20 రూపాయల నోట్లను తీసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు. నాయకులు సంతకాలు చేసిన 20 రూపాయల నోట్లిచ్చి ఎన్నికల అనంతరం విజయం సాధిస్తే రెండువేలో, నాలుగువేల రూపాయలో ఇస్తామని తమిళనాడులో చెప్పారు. అది సరికొత్త పోకడ. అభ్యర్థి విజయం సాధిస్తేనే తమకు డబ్బులు వస్తాయని ఆశించి ఓటర్లు ఓట్లేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా డబ్బులు పంచకూడదంటూ అక్కడి రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ గట్టిగా హెచ్చరిస్తూ వస్తోంది. కానీ సరైన యాంత్రాంగం లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బులు పంచకుండా ఎన్నికల కమిషన్ నివారించలేకపోతోంది. రాజకీయ నాయకులు, జనం దష్టిలో ఓటుకు నోటు అనేది రోజు రోజుకు సాధారణ విషయంగా మారిపోతోంది. ఈ 12 రోజుల్లో కూడా కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగితే అది కచ్చితంగా బీజేపీకే లాభించే అవకాశం ఉంది. -
కోర్టుకు హాజరైన సండ్ర
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఆయన్ని నిందితునిగా చేరుస్తూ ఏసీబీ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు రేవంత్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. -
బాబు ‘బ్రీఫ్డ్ మీ’ అందరు విన్నారు: ఉండవల్లి
-
బాబు ‘బ్రీఫ్డ్ మీ’ అందరు విన్నారు: ఉండవల్లి
హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. కోర్టుకు ఉన్న విస్తృతమైన అధికారాలతో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి కేసును విచారించాలని ఉండవల్లి కోరారు. తప్పుచేసిన ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్న ఆయన.. రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. ‘బ్రీఫ్డ్ మీ’ అని చంద్రబాబు అన్న మాటలు అందరూ విన్నారని అన్నారు. ఈ కేసులో మరికాసేపట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తారు. ఈ కేసుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోందని ఉండవల్లి అన్నారు. -
బాబును ఎవరుకాపాడలేరు
– సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలి – వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను డిమాండ్ అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు) : ‘ఓటుకు కోట్లు’ కేసులో నిండా మునిగిన సీఎం చంద్రబాబుకు శిక్ష పడకుండా ఎవరూ కాపాడలేరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. అనిగండ్లపాడులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ శాసనమండలి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన వ్యవహారమంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని ఏసీబీ చార్జీషీటులో పేర్కొందన్నారు. ముఖ్యమంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు మరెవరినైనా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నారు. రెయిన్గన్ల ఏర్పాటుకు రూ.150 కోట్లు కేటాయిస్తున్నామని చెబుతున్నారని, దీనిల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. రెయిన్ గన్ల వల్ల రైతులకు సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కనకపూడి ప్రియాంక, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంజం కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల వెంకటాచలం పాల్గొన్నారు. -
'ఏపీ ప్రభుత్వానిది పరిపాలనా? వ్యాపారమా?'
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో లేక వ్యాపారం చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. గురువారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికే వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు భయంతోనే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్సీ కోలగట్ల విమర్శించారు. -
చంద్రబాబు టూర్ షెడ్యూల్లో మార్పులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్లో మార్పులు చేశారు. తిరుపతిలో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా, తిరుపతి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తంబళ్లపల్లి నుంచి విజయవాడకు పయనమైనట్టు తెలుస్తోంది. విజయవాడలో మూడున్నర గంటలకు జరగాల్సిన దుర్గాఘాట్ కార్యక్రమం వాయిదా పడింది. తిరుపతి పర్యటనను చంద్రబాబు అర్ధంతరంగా రద్దు చేసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఓటుకు కోట్టు కేసులో కోర్టు తీర్పుపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఈ కేసు విషయంలో పునర్విచారణపై నోరు మెదపని టీడీపీ నేతలు... అధినేత చంద్రబాబు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు న్యాయనిపుణులతో సమావేశమయ్యే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
కేసీఆర్ సంతకం పెడితే బాబు జైలుకే: రఘువీరా
అనంతపురం : 'ఓటుకు నోటు' కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద శాతం దోషి అని స్పష్టంగా తేలిందని, సంబంధిత ఫైలు తెలంగాణ సీఎం కేసీఆర్ టేబుల్ వద్ద ఉందని, సంతకం పెట్టిన మరుక్షణమే చంద్రబాబు చేతులకు సంకెళ్లు పడటం ఖాయమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసు భయంతో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనకాడటం లేదని ఆయన ధ్వజమెత్తారు. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రఘువీరారెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం డ్యాం నుంచి లిఫ్ట్ ద్వారా 160 టీఎంసీల నీటిని తరలించేందుకు కేసీఆర్ సర్కారు అనేక అక్రమ ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. రూ.32 వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు, భూసేకరణ జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్త్తిగా చట్టవిరుద్ధమని, రాష్ట్ర విభజన చట్టానికి కూడా వ్యతిరేకమని పేర్కొన్నారు. వీటివల్ల రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సైతం తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా ఎనిమిది జిల్లాల ప్రయోజనాలు దారుణంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నా చంద్రబాబు మౌనం వహించడంపై రఘువీరా మండిపడ్డారు. చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినా ఏనాడూ తెలంగాణ చేస్తున్న అన్యాయంపై ఫిర్యాదు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం రెండు టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకుంటోందని అక్కడికెళ్లి అరెస్టై నానాయాగీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నా మౌనం దాల్చడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు భయంతోనే కేసీఆర్‌కు దాసోహమయ్యారని విమర్శించారు. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంపై శనివారం శ్రీశైలం డ్యాం వద్ద కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రైతులతో కలిసి నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన మత్తయ్య
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య సోమవారం... తనకు రక్షణ కల్పించాలంటూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ సందర్భంగా ఈ నెల 20 వ తేదీలోపు మత్తయ్య అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఛార్జిషీటు కాపీని హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. కాగా కేసు తదుపరి విచారణను వచ్చే నెల 2 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. -
ఇద్దరూ ఇద్దరే.. నటనలో ఉద్దండులే
ఈ ఇద్దరు నేతల నైజం తెలిసిన వారు ఈ స్నేహం ఎంతకాలం నిలుస్తుందంటున్నారు. నిజంగానే వారు తెలుగు ప్రజలందరి బాగును కోరితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇంకో రకంగా ఉండేవి. పక్క రాష్ర్టంతో చెలిమే నిజంగా చంద్రబాబు లక్ష్యమైతే ఓట్లకు కోట్లు వ్యవహారం జరిగి ఉండేది కాదు. టీడీపీ ఎమ్మెల్యేలను, ఇతర నేతలను కేసీఆర్ ఎడాపెడా కొనుగోలు చేసేవారూ కారు. ఏదేమైనా ఈ స్నేహం వెల్లివిరుస్తుండగానే రెండు రాష్ట్రాల ప్రజలకూ మేలు కలిగే పనులు కొన్నయినా జరగాలని కోరుకుందాం. రాజకీయాలు, రాజకీయ నాయకుల గురించి పెద్దలు చాలా మాటలు చెపుతుంటారు. వాటిలో బాగా ప్రచారం పొందినవి రెండు. ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరు’ అనేది మొదటిది కాగా, ‘రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప’ అన్నది రెండవది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఆయన ఇంటికి వెళ్లి మరీ కలుసుకుని ముచ్చట్లాడారు. తాము నిర్మించనున్న నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆహ్వానిం చారు. చంద్రశేఖర్‌రావు కూడా తన ఒకప్పటి నాయ కుడు, సహచరుడు అయిన చంద్రబాబును సాదరంగా ఆహ్వా నించి, సకల మర్యాదలు చేశారు. అమరావతి శంకుస్థాపన వేడుకకు తప్పక హాజరవుతానని తెలిపి పంపించారు. ఇదొక ప్రత్యేకమయిన సందర్భం. మీడియాకయితే ఎక్కడలేని ఆసక్తి కలిగించిన ఘటన. ఒక రాష్ర్ట ముఖ్యమంత్రి ఇంకో రాష్ర్ట ముఖ్య మంత్రిని కలుసుకున్నారు, ఇందులో అంత అపురూపమయిన విషయం ఏముంది అని మరే సందర్భంలోనైతే అనుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అలాంటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విడి పోయి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడి పదహారు మాసాలవు తోంది. ఈ కాలమంతటా రెండు తెలుగు రాష్ట్రాలలో పారిన కృష్ణా. గోదావరి నదీ జలాలన్నీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల, వారి ప్రభుత్వాల, నాయకుల మధ్య రగిలిన విద్వేషాల విషంతో కలుషితమయ్యాయి. అటూ ఇటూ కూడా ప్రజల మధ్య తీవ్ర విభేదాల గోడలు దడికట్టి నిలిచాయి, పరస్పర విద్వేషాల నీడలు కమ్ముకున్నాయి. ‘రాజకీయాల్లో ఏదీ తప్పు కాదు’ ఈ పదహారు మాసాల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్నది రెండు సందర్భాలలోనే. అయితే కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నది మాత్రం ఒక్కసారే. ఇప్పుడు మళ్లీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం రూపంలో ఈ ఇద్దరు నేతల కలయిక ఇలా జరిగింది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మొన్నటి కలయిక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అనడానికి తాజా ఉదాహరణ. ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈయనా ఆ మర్యాద నిలపడానికి వెళతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూటికి నూరు శాతం రాజకీయ జీవి. రాజకీయాల్లో ఏదీ తప్పు కాదు అనుకునే నాయకుడు. మన రాజకీయ ప్రయో జనాల కోసమైతే ఎవరితోనైనా కలవవచ్చు, ఎవరినయినా దూరంగానైనా పెట్టవచ్చు అని మనసా వాచా కర్మణా నమ్మే వ్యక్తి. అదే నిజం కాకపోతే పదేళ్ల ఎడ బాటు తరవాత మళ్లీ ఆయన భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేస్తారా? తాను ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీని రాష్ర్టంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదు అన్న మనిషే ఆయనకు స్నేహ హస్తం చాచేవారా? గోధ్రా తరవాత జరి గిన గుజరాత్ అల్లర్ల తదుపరి నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మోదీని రాష్ర్టంలో అడుగు పెట్టనిచ్చేది లేదని ప్రకటించిన విషయం ఇంకా ఎవరూ మరచిపోలేదు. నరేంద్ర మోదీ అంతకన్నా రెండాకులు ఎక్కువే చదువుకున్నవారు. కాబట్టే ఆ అవమానాన్ని పక్కన పెట్టి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్ర బాబుతో చేయి కలిపారు. కపటత్వంలో ఎవరికి ఎవరూ తక్కువ కారు రాజకీయ కపటత్వం ప్రదర్శించడంలో ఎవరూ తక్కువ తిన్నవారు కారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా వీళ్లకు సమ ఉజ్జీగానే నిలుస్తారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్లగలరు. తెలంగాణ రాష్ర్ట సాధన పేరిట కాంగ్రెస్, వామ పక్షాలతో చెలిమి చేయడమూ, కాంగ్రెస్‌ను వదిలేసి తెలుగుదేశం, వామ పక్షాలతో కలసి మహా కూటమి కట్టడమూ, ఆ కూటమి భవిష్యత్తు ఇంకా బ్యాలట్ బాక్సుల్లో ఉండగానే లూధియానాకు వెళ్లి బీజేపీ ఎన్నికల వేదిక ఎక్కడమూ ఆయనకే చెల్లింది. తెలంగాణ రాష్ర్ట సమితి సాగించిన మలి విడత ఉద్యమం తొలి రోజుల్లో వామపక్షాలతో స్నేహం కోసం తాపత్రయపడ్డ ఆయనే నేడు అదే వామపక్షాలను దిక్కుమాలిన పార్టీలు అని చీదరించు కుంటుండటం చరిత్ర పుటల్లో నమోదవుతూనే ఉంది. ఇటువంటి విషయాల్లో మోదీ, బాబుల కంటే చంద్రశేఖర్‌రావు ఏ విధంగానూ తక్కువేమీ కాదని తెలంగాణ రాష్ర్టం ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అస్తిత్వమే కోల్పోయిన కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి బాగా తెలుసు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది. స్నేహం వికసిస్తుండగానే ఏదైనా మేలు చేస్తారా? అయితే ఏంటి? ఇప్పుడు ఎంతో పెద్ద కార్యక్రమం పెట్టుకున్న చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిని కలుసుకోవడం తప్పా? అని ఎవరయినా అనొచ్చు. అది ఎంత పెద్ద కార్యక్రమమో పక్కకు పెడితే... అలా పిలవడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ ఈ ఇద్దరు నేతల రాజకీయాలు తెలిసిన వారు ఈ స్నేహం, సౌహార్ద్రత ఎంత కాలం నిలిచేది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వారిద్దరూ తెలుగు ప్రజలందరి బాగు కోరితే ఈ పదహారు మాసాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల తీరు తెన్నులు ఇంకో రకంగా ఉండేవి. పక్క రాష్ర్టంతో చెలిమే నిజంగా చంద్ర బాబు లక్ష్యమైతే ఆయన నేతృత్వంలోనే తెలంగాణలో ఓట్లకు కోట్లు వ్యవ హారం జరిగి ఉండేది కాదు. ఎమ్మెల్యేలను కొనాలనే ఆలోచనే వచ్చేది కాదు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లను, ఇతర నాయకులనూ ఎడాపెడా కొనుగోలు చెయ్యనూ కూడదు. ఇంకా అనేక విషయాల్లో మర్యాదకరమైన ప్రవర్తన సరిహద్దులను దాటి, తమ స్థాయిని మరచి ఇరువురు ముఖ్య మంత్రులూ ఒకరి మీద ఒకరు చేసిన విమర్శలు, దూషణలూ చరిత్ర నుంచి చెరిగి పోయేవేవీ కాదే. ఈ నేపథ్యంలోంచి చూస్తే మొన్న ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి బేగంపేట విడిది లాన్స్‌లో విరిసిన ఈ స్నేహ పుష్పం ఎంత కాలం వికసిస్తూ ఉంటుందో వేచి చూడాలి. ఈ స్నేహం వెల్లివిరుస్తుండగానే రెండు రాష్ట్రాల ప్రజలకూ మేలు కలిగే పనులు కొన్నయినా జరగాలని కోరుకుందాం. టీఆర్ఎస్ నెత్తిన పాలు పోసిన నాయక్ ఇక రాజకీయాలు, రాజకీయ నాయకుల గురించిన రెండో నానుడి దగ్గరికి వద్దాం. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి అనే మాట బహుశా బలరాం నాయక్ వంటి కాంగ్రెస్ నాయకుల తీరును చూసే పుట్టిందేమో. గిరిజనులకు కేటాయించిన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో బలరాం నాయక్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. గిరిజనుడు అయినంత మాత్రాన ఆయనకు ఏమీ తెలియదనుకుంటే పొరపాటు. ఆయన చదువుకున్నారు, పోలీసుశాఖలో కొంత కాలం ఉద్యోగం కూడా చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక స్వల్ప కాలమే అయినా కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్రాన్ని విభజించి కూడా కాంగ్రెస్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఓడిపోయింది. పార్టీతో బాటే ఆయనా ఓడిపోయారు. ఇప్పుడు అదే జిల్లాలో వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించకపోతే తెలంగాణను మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపేస్తామని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఆ నియోజకవర్గ ప్రజలను బెదిరించారు. సభా వేదిక మీదున్న మిగిలిన కాంగ్రెస్ నాయకులు వారించినా వినకుండా మళ్లీ అదే మాట రెట్టించారు. అరవై సంవత్సరాల సుదీర్ఘ మధనం తర్వాత జరిగిన ఈ విభజనను ఒక ఉప ఎన్నికలో... అదీ కూడా కాంగ్రెస్ గెలిస్తే కాదు ఓడిపోతే తిరగరాస్తాం అన్న ఆయన మాటల ఫలితం ఏమిటి? తాడ్వాయి ఎన్కౌంటర్ సహా పలు కారణాల చేత వరంగల్ ఉపఎన్నిక నాటికి ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను చూసి ఆందోళన చెందుతున్న టీఆర్ఎస్ నెత్తి మీద పాలు పోసినట్టయింది. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని బలరాం నాయక్ మరోమారు రుజువు చేశారు. datelinehyderabad@gmail.com - దేవులపల్లి అమర్ -
ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ స్పీచ్‌ల రికార్డులను స్వర పరీక్ష కోసం తెలంగాణ అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. సెబాస్టియన్, మత్తయ్య టీవీ ఇంటర్వ్యూలను ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఏసీబీ కోర్టును అసెంబ్లీ అధికారులు కోరినట్టు సమాచారం. కాగా, ఓటుకు నోట్లు కేసులో అరెస్టైన తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. -
‘ఓటుకు కోట్లు’పై కేసీఆర్ నోరు మెదపరెందుకు?'
గంభీరావుపేట(కరీంనగర్): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై 40 రోజులుగా సీఎం కేఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించడంలో ఆంతర్యమేమిటని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
తొక్కిసలాట ఘటనపై పార్లమెంటులో నిలదీస్తాం
* వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి * పబ్లిసిటీ ఫిలిం షూటింగ్ కోసం 29 ప్రాణాలు బలిగొన్న * బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుదే * ఇదే విషయాన్ని పార్లమెంటుకు వివరిస్తాం * ప్రత్యేక హోదాతోపాటు ‘ఓటుకు కోట్లు’ అంశాన్నీ లేవనెత్తుతాం * మార్పులు చేయకపోతే భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదు * వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎంపీల భేటీ * పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ (లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బుట్టారేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి) సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్‌లో భక్తుల ప్రాణాలు బలిగొన్న తొక్కిసలాట ఘటనను పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తేవాలని ప్రయత్నిస్తున్న భూసేకరణ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు గుమ్మరించిన చంద్రబాబుకు సంబంధించిన ‘ఓటుకు కోట్లు’ కేసును కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని తీర్మానించింది. ప్రత్యేకహోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపైన కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం సహచర ఎంపీలతో కలసి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన సొంత ప్రచారంకోసం ఒక డాక్యుమెంటరీ తీయడానికి రాజమండ్రి పుష్కరాలను వేదికగా చేసుకోవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణానికి కారణమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనకు పూర్తిబాధ్యత చంద్రబాబుదేనంటూ.. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ పదవిని గెలవాలన్న ఉద్దేశంతో కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి జరిగిన వ్యవహారాన్నీ పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. ఇందులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీనిపై చర్చ జరగాలని కోరతామన్నారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపైనా.. ధాన్యం రైతులకు మద్దతుధరను ప్రభుత్వం కేవలం రూ.50 మాత్రమే పెంచిందని, దీనిని మరింత పెంచాలని కోరతామని మేకపాటి చెప్పారు. ఎంఎస్పీ ధర పెంపుతోపాటు ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణను ఏడాదికేడాది తగ్గిస్తున్న వైనంపైనా సభలో చర్చ కోరతామన్నారు. 2013-14లోకన్నా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ సగానికి సగం తగ్గిపోయిందని, ఈ ఏడాది మరింత తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఇలాంటి చర్యలవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికోసం ఎక్కువగా నీటి వృ థా చేయడంవల్ల రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూ రు జిల్లాల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ చర్యకు వై ఎస్సార్సీపీ వ్యతిరేకమని ఆయన చెప్పా రు. తప్పనిసరిగా శ్రీశైలంలో నిర్ణీతస్థాయిలో నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పార్లమెం ట్లోనూ ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గత పార్లమెంట్ సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిందని.. రెండుసార్లు ఈ అంశాన్ని జీరోఅవర్‌లో ప్రస్తావించామని ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరులడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్లకార్డులతో సభలో ఆం దోళన చేయడాన్నీ గుర్తుచేశారు. సమావేశంలో మేకపాటితోపాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, పెద్దిరెడ్డి మి థున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలున్నందున హాజరవలేదు. విభజన బిల్లులోని అంశాల అమలుకు పోరాటం.. ప్రస్తుత ఆర్డినెన్స్ రూపంలో ఉన్న భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదని మేకపాటి స్పష్టం చేశారు. మూడు.. నాలుగు పంటలు పండే భూముల్ని తీసుకోవడం, సామాజిక ప్రభావ అంచనా(సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) చేయకుండా, రైతుల అంగీకారం లేకుండానే భూములు లాక్కోవడం వంటి ప్రక్రియలకు తమ పార్టీ మొదటినుంచీ వ్యతిరేకమని చెప్పారు. ఆ మూడంశాల్లో రైతులకు ఆమోదయోగ్యంగా మార్పులు చేసినట్లయితే బిల్లుకు తాము మద్దతిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు అంశాలపై పార్లమెంట్లో పోరాడతామన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుతోపాటు విభజన బిల్లులో పేర్కొన్న అన్నిఅంశాల అమలుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. -
పార్లమెంట్లో ‘ఓటుకు కోట్లు’
* ఆరు వారాలైనా అలికిడి లేదేంటి? * చంద్రబాబు సంభాషణల టేపులు బయటపడినా చర్యలేవి? * సీబీఐకి అప్పగించాలని పార్లమెంట్లో పట్టుబట్టనున్న కాంగ్రెస్ * రాహుల్‌తో సమావేశమైన తెలంగాణ, ఏపీ పీసీసీ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పాల్పడిన ‘ఓటుకు కోట్లు’ ప్రలోభాల వ్యవహారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ కేసు వ్యవహారంపై పార్లమెంట్లో లేవనెత్తి సీబీఐ విచారణకు పట్టుబట్టాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ నెల 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ నేతలను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వారితో వేర్వేరుగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట చోటు చేసుకుని 27 మంది మృతికి దారితీసిన సంఘటనపైనా చర్చించారు. ఈ రెండు ఘటనలపై సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను ఆదేశించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన వ్యవహారంపై రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడటం, ఈ వ్యవహారంలో సూత్రధారిగా చంద్రబాబు ఉన్నట్టు టెలిఫోన్ సంభాషణ టేపులు బయటకు పొక్కిన వైనంపైనా హైకమాండ్ ఆరా తీసింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో నేరుగా సంభాషించినట్టు ఆడియో టేపులు బయటపడిన తర్వాత కూడా ఆ కోణంలో విచారణ జరక్కపోవడానికి కారణలేంటి అని అడిగినప్పుడు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదై ఆరు వారాలు గడుస్తున్నప్పటికీ సూత్రధారిపై చర్యలు తీసుకోవడంగానీ కేసు పురోగతి ఎటువైపునకు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పీసీసీ నేతలు వివరించారు. ఈ కేసు తెరమీదకు వచ్చిన తర్వాత చంద్రబాబు లేవనెత్తుతున్న అంశాలను పీసీసీ నేతలు వివరించినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని సులభంగా వ దిలిపెట్టరాదనీ, దీనికి సంబంధించి సమగ్ర వివరాలను అందించాలనీ, ఈ విషయాన్ని స్వయంగా పార్లమెంట్లో లేవనెత్తి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తానని రాహుల్‌గాంధీ చెప్పారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరు రాష్ట్రాల పీసీసీ నేతలు సమగ్రమైన వివరాలు, కేసు పురోగతిపై నివేదికను అందించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఏపీ పీసీసీ నేతలు కలిసినప్పుడు రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ బుధవారం ఇక్కడ ఏఐసీసీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. అనంతరం వారు రాహుల్‌ను కలిసి రాష్ట్ర రాజకీయాలు, ఇటీవల జరిగిన పరిణామాలపై వివరించారు. తర్వాత ఏపీపీసీసీ నేతలు ఎన్.రఘువీరారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్యలు రాహుల్‌గాంధీతో విడిగా సమావేశమయ్యారు. పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కారణమని వివరించారు. పార్లమెంట్లో లేవనెత్తనున్న రాహుల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓటుకు కోట్లు వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ లేవనెత్తనున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఓటుకు కోట్లు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ ఉల్లంఘన అంశాలను లేవనెత్తుతారని రాహుల్‌తో సమావేశం అనంతరం ఆయన చెప్పారు. -
అడగటం హక్కు చెప్పటం బాధ్యత
రూ. 50 లక్షల నోట్ల కట్టలతో దర్యాప్తు సంస్థకు ఓ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా... బుకాయింపులకు తక్కువలేదు. మహానాడులో ప్రకటించే లక్షల కొలది రూపాయల విరాళాల లెక్కలేవీ ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించే గణాంకాల్లో ప్రతిబింబించవు. రాజకీయపక్షాల నడతలో, వాటి జమా ఖర్చుల్లో, ఇబ్బడిముబ్బడిగా పారే విరాళాల్లో, అవిచ్చే దాతల వనరుల గుట్టుమట్లలో పారదర్శకత లేనంతవరకు... ఎక్కడో విదేశీ బ్యాంకుల్లో మగ్గిన నల్లధనాన్ని నట్టింటికి రప్పిస్తామనడం పచ్చి బూటకం. ‘ఉల్లి మంచిది కాదు, తినకూడదని చెప్పింది ఊరందరికోసమే పిచ్చి మొహ మా! మన కోసం కాదు’ అన్నాట్ట, ఆయన మాటలు విని ఉల్లి లేకుండా కూర వండిన భార్యతో వెనకట ఓ పెద్దమనిషి. నీతులు ఇతరులకు చెప్పడానికి మాత్రమే ఉంటాయేమో కొందరి విషయంలో.. కానీ, చట్టాలు అందరి కోసం ఉంటాయి, ఇది తెలియనట్టు నటిస్తూ ఈ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీ లు తమకు కొన్ని చట్టాలు వర్తించవని చెబుతూవస్తున్నాయి. వ్యవస్థలన్నీ పారదర్శకంగా పనిచేయాలని కోరుకునే రాజకీయ పార్టీలు, తాము మాత్రం సమాచారహక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి రామని రెండేళ్లుగా భీష్మించుకొని కూర్చున్నాయి. ‘మీరు ఈ చట్టపరిధిలోకొస్తారు’ అని కేంద్ర సమాచార కమి షన్ (సీఐసీ) రెండేళ్ల కింద ఇచ్చిన ఉత్తర్వును బేఖాతరంటూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా మొన్న మంగళవారం ఈ పార్టీల న్నింటికీ తాజాగా తాఖీ దులిచ్చింది. మీమీ పార్టీల రాబడులు, వ్యయాలు, విరాళాలు, దాతలు...ఇలా మీ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం లో మీకున్న అభ్యంతరాలేంటి? ఎందుకు మీరు ఆర్టీఐ పరిధిలోకి రారో ఆరు వారాల్లో వివరించండని ఆరు ప్రధాన పార్టీలను నిర్దేశించింది. ఇదే విషయమై మీ వైఖరేంటో తెల్పండని కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ ఎన్నికల కమిషన్ని కూడా సుప్రీం ఆదేశించింది. ఎవరేం చెబుతారో వేచి చూడాలి. ఏం చెప్పినా, చట్టం ఇచ్చిన నిర్వచనం ప్రకారం రాజకీయ పార్టీలన్నీ ప్రజా వ్యవస్థ (పబ్లిక్ అథారిటీ)లే ప్రజాస్వామ్య స్పూర్తిపరంగా చూసినా... రాజకీయ పార్టీల వ్యవ హారాలన్నీ ప్రజా జీవితంతో ముడివడి ఉన్నవే కనుక పారదర్శకంగా, ప్రజ లకు జవాబుదారుగా అవి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రా ల్లో చిచ్చురగిల్చిన ‘ఓటుకు కోటు’్ల వంటి దురాగతాలకు పార్టీల్లో, వాటి ఆర్థిక వనరుల నిర్వహణల్లో పారదర్శకత లోపించడం కూడా ఓ ప్రధాన కారణమే! చెప్పించుకునే స్థితి ఎందుకు? ఒక వివాదం తమ ముందు విచారణకొచ్చినపుడు, రాజకీయ పార్టీలన్నీ ప్రజా వ్యవస్థ నిర్వచన పరిధిలోకే వస్తాయని 2013 జూన్‌లోనే సీఐసీ తీర్పిచ్చింది. వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆరు ప్రధాన రాజకీయ పార్టీలు- కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీలకు స్పష్టం చేసింది. అన్ని పార్టీలూ పౌర వ్యవస్థలే కనుక ఆర్టీఐ చట్ట నిబంధనల ప్రకారం పౌర సమాచార అధి కారి (పీఐవో)ని నియమించాలని ఇతర నిబంధనలన్నీ పాటించాలని 2015 మార్చిలోనూ తన తీర్పును సీఐసీ పునరుద్ఘాటించింది. కానీ, పార్టీలేవీ లెక్క చేయలేదు. కాంగ్రెస్, బీజేపీలు తమకీ చట్టం వర్తించదని కరాఖండిగా పేర్కొ న్నాయి. సీపీఐ మాత్రం ప్రజలకు సమాచారం ఇవ్వడానికి పెద్దగా అభ్యం తరం లేదని, అయితే విరాళాలిచ్చిన దాతల పేర్లు వెల్లడించాలనడం ఇబ్బంది కరమని పేర్కొంది. రాజకీయ పార్టీలు ప్రజా కార్యాలయాలే కావని, చట్టపు నిర్వచనం పరిధిలోకి రావంటూ పార్టీలేవీ సీఐసీ ఆదేశాల్ని పాటించలేదు. ఇక్కడో విశేషముంది. తమ అడ్డగోలు వ్యవహారాలకు వ్యతిరేకంగా న్యాయస్థా నాలుగానీ, రాజ్యాంగ-చట్టబద్దమైన సంస్థలుగానీ తీర్పులిచ్చినపుడు తర తమ భేదాలు లేకుండా రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావడం ఈ దేశం లో తరచూ జరుగుతోంది. అందరూ కూడబలుక్కున్నట్టు సదరు చట్టాల్నో, రాజ్యాంగాన్నో మార్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఎన్నికల సంస్కరణలు మింగుడుపడనప్పుడు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని అంశాల్ని సుప్రీం న్యాయస్థానం చెల్లవన్నపుడు ఇదే చేశారు. ఇలాగే ఓ మారు సుప్రీం తీర్పు నచ్చనపుడు, అందుకు భిన్నంగా పార్లమెంటులో కొత్తచట్టమే తీసుకొచ్చారు. ఆ చట్టం రాజ్యాంగ నిబంధనలకు, స్ఫూర్తికి లోబడి లేదని సర్వోన్నత న్యాయ స్థానం సదరు చట్టమే చెల్లదు పొమ్మంది. ఒకవైపు సుప్రీం ఏమంటుందోనన్న బెంగ, మరో వైపు ఈ అవసరం కోసం సమాచార హక్కు చట్ట సవరణకు ప్రతిపాదిస్తే ప్రజాక్షేత్రం నుంచి ఏం వ్యతిరేకత వస్తుందోనన్న భయం వల్ల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్ట సవరణకు సాహసించడం లేదు. నోట్ ఫైల్స్ విషయంలో లోగడ యూపీఏ ప్రభుత్వం సవరణ ప్రతిపాదిస్తే బెడిసి కొట్టిన అనుభవం పాలకపక్షాలకు తెలుసు. పార్టీలు ఆర్టీఐ పరిధిలోకొస్తాయని సీఐసీ ఇచ్చిన ఆదేశాల్ని పార్టీలు ఇటు పాటించక, అవి చెల్లవని అటు న్యాయ స్థానంలో సవాల్ చేయకపోవడంతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అమలు నిలిచిపోయింది. న్యాయ ధిక్కారం కింద తదుపరి విచారించే అధికారం లేదనే కారణంతో సీఐసీ కూడా మిన్నకుండిపోయింది. సీఐసీ ఉత్తర్వులు అమ లయ్యేలా జోక్యం చేసుకోవాలనే వినతితో సామాజిక కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్, ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం (ఏడీఆర్)కు చెందిన జగదీప్ ఎస్ చొక్కర్ సుప్రీంకోర్టును సంప్రదించారు. వారి తరపున ఆర్టీఐ ఉద్యమ కారుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ వాదనలు వినిపించారు. ప్రజలతో ముడివడి ఉండి, నిత్యం ప్రజావ్యవహారాలు నిర్వహిస్తూ తమ సంగతులేవీ ప్రజలకు తెలియకూడదనే పార్టీల వాదనను ఖండించారు. ఈ అనుచిత గోప్యత వల్ల, తెలుసుకునే పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర భంగం కలుగుతోందనే వాదన ఆయన వినిపించారు. పబ్లిక్ అథారిటీలు కాకుండా పోతాయా? సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం అవుతోంది. ‘మేం ఈ చట్టం పరిధిలోకి రాం’ అని వివిధ సంస్థలు, కార్యాలయాలు వేర్వేరు సందర్భాల్లో పేర్కొన్నపుడు సీఐసీ, వివిధ రాష్ట్రాల సమాచార కమిషన్లు విస్పష్టమైన తీర్పు లిచ్చాయి. స్టాక్ ఎక్స్చేంజీలు, విదేశీ నేలపైన ఉన్నప్పటికీ ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయని ఇచ్చిన ఆదేశాల్ని సదరు సంస్థలు, కార్యాలయాలు విధిగా పాటిస్తున్నాయి. అట్లాంటి ఆదేశాలే రాజకీయ పార్టీల విషయంలోనూ వెలువడ్డాయి. ఇలా నిర్ణ యించడానికి కారణం, ‘ప్రజావ్యవస్థ’ (పబ్లిక్ అథారిటీ) అంటే ఏమిటో, ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 (హెచ్)లో స్పష్టమైన వివరణ ఉండటమే. రాజ్యాం గం ద్వారా, పార్లమెంటు-అసెంబ్లీ చేసిన ఏదైనా చట్టం ద్వారా, ఏవైనా ప్రభుత్వాదేశాలతోగానీ ఏర్పడిన వ్యవస్థ, సంస్థ, బాడీ అని ఉంది. అదే సమ యంలో...సెక్షన్ 2, (హెచ్)లోని ‘డి’ ప్రకారం (1) ప్రభుత్వ సొంత, అధీనం లోని, తగు నిధులు పొందినవి, (2) ప్రభుత్వేతరమే అయినా... కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తగు ఆర్థిక ప్రయో జనం/నిధులు పొందినవన్నీ ఈ నిర్వచనం పరిధిలోకొస్తాయి అని ఉంది. ఈ అంశం ఆధారంగానే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వం నుంచి, అంటే ప్రజాధనం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతు న్నాయి కనుక ప్రజావ్యవస్థల నిర్వచన పరిధిలోకి వస్తాయన్నది సీఐసీ ఉద్దే శం. ఈ చట్టం ఇదే రూపంలో ఉన్నంత కాలం కచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు: - రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల నిర్మాణానికి నామమాత్రపు ధరకు ప్రభుత్వ భూముల్ని పొందుతున్నాయి. - వారు పొందే విరాళాలకు నూరు శాతం ఆదాయపన్ను మినహాయింపు లభిస్తోంది.. - ఎన్నికల సమయంలో పైసా చెల్లించకుండా టీవీ, రేడియో వంటి ప్రభుత్వ జనమాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి. - చట్టసభల్లో, బయట పాలకపక్షంగా కొన్ని, ప్రతిపక్షంగా కొన్ని సదుపాయాల్ని ప్రజాధనం నుంచి పార్టీలు పొందుతున్నాయి. ఇవి కాకుండా కూడా రాజ్యాంగం, వివిధ చట్టాల ద్వారా రాజకీయ పక్షా లకు కొన్ని విశేషాధికారాలు సంక్రమిస్తున్నాయి. భారత రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం పార్టీలిచ్చే విప్‌కి, ఇతర ఆదేశాలకు లోబడి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నడచుకోవాల్సి ఉంటుంది. భిన్నంగా వ్యవహరిస్తే వారిని అన ర్హుల్ని చేసే ప్రక్రియ కూడా అందుబాటులో ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగ విధి విధానాలకు లోబడి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎన్నికల సంఘం నిబంధనావళికి లోబడి వ్యవహరించాలి. ఇవన్నీ రాజకీయ పార్టీలు ప్రభుత్వ వ్యవస్థల నియంత్రణ పరిధిలోకి వస్తాయని నిర్ధారించే విషయాలే! స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం కూడా ఎన్నికలప్పుడు అఖిలపక్ష సమావే శాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యతనిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది. వాటికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్నా... ప్రజావ్యవస్థలు కామని, తమకు పారదర్శకత వర్తించదని, తమ సమాచారం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం లేదని రాజకీయ పక్షాలు ఎలా అనగలవు? పార్టీల పనితీరులో మరింత పారదర్శకత అత్యవస రమని 1999లోనే లా కమిషన్ తన 170వ నివేదికలో విస్పష్టంగా పేర్కొంది. గోప్యతే అనర్ధాలకు కారణం పాలనలో పారదర్శకత వల్ల ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనేది ఒక్క కార్య నిర్వాహక వ్యవస్థకే ఎందుకు వర్తిస్తుంది? రాజకీయ వ్యవస్థకెందుకు వర్తించ దనే ప్రశ్న ఉదయిస్తుంది. అన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను కనుసన్నల్లో నడిపేవారి డబ్బు దందాలకు లెక్కలొద్దా? ఇవాళ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. సాధారణ వార్డు స్థాయి నుంచి శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల వరకు డబ్బే రాజ్యమేలుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడెని మిది ఎమ్మెల్యే ఓట్లను అడ్డగోలుగా వశపరచుకునేందుకు 150 కోట్ల రూపా యల వరకూ వెచ్చించేందుకు ఓ అధికారపక్షం సిద్ధమైన వైనం గగుర్పాటు కలిగిస్తోంది. 5 కోట్ల ఒప్పందంలో భాగంగా 50 లక్షల నోట్ల కట్టలతో దర్యాప్తు సంస్థకు ఓ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా... బుకాయింపులకు తక్కువ లేదు. మహానాడులో ప్రకటించే లక్షల కొలది రూపాయల విరాళాల లెక్కలేవీ ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించే గణాంకాల్లో ప్రతిబింబించవు. రాజ కీయ పక్షాల నడతలో, వాటి జమాఖర్చుల్లో, ఇబ్బడిముబ్బడిగా పారే విరా ళాల్లో, అవిచ్చే దాతల వనరుల గుట్టుమట్లలో పారదర్శకత లేనంతవరకు.... ఎక్కడో విదేశీ బ్యాంకుల్లో మగ్గిన నల్లధనాన్ని నట్టింటికి రప్పిస్తామనడం పచ్చి బూటకం. రాజకీయపక్షాల ఆదాయ వ్యయాలకు ముసుగుకప్పి, డబ్బు తో ఓట్లు కొంటూ అధికారాన్ని పిడికిట పట్టే వ్యవహారం సాగుతున్నంత కాలం వారినాశ్రయించి ఉండే అజ్ఞాత దాతల నల్లధనం రాశులు ఇంటా బయ టా మరింత పేరుకుపోతాయి తప్ప తరగవు. తెలుసుకోవడం ప్రజల హక్కు. తెలియజెప్పడం రాజకీయపక్షాల బాధ్యత! (వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్) dileepreddy@sakshi.com - సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, దిలీప్ రెడ్డి -
సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ
-
సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ
* ప్రత్యేక కోర్టు ఆదేశం * న్యాయవాది పర్యవేక్షణలోనే విచారించాలి * థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదు * ప్రతిరోజూ సాయంత్రం వైద్య పరీక్షలు చేయించాలి * ఓటుకు కోట్లు కేసులో సండ్రకు కీలక పాత్ర * అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి * ప్రత్యేక కోర్టులో ఏసీబీ వాదన సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ప్రత్యేక కోర్టు రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల మధ్య న్యాయవాది సమక్షంలో విచారించవచ్చని, అనుచితంగా ప్రవర్తించరాదని, థర్డ్‌డిగ్రీ పద్ధతులు ప్రయోగించరాదని పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించాలని స్పష్టంచేశారు. కస్టడీ సమయంలో పరిశుభ్రమైన ఆహారం అందివ్వాలని, శుభ్రంగా ఉన్న టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించాలని, కస్టడీ అనంతరం తిరిగి శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. కస్టడీ సమయంలో సండ్ర రక్షణ బాధ్యత ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డిదేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షల అనంతరం వీరయ్యను ఏసీబీ అదనపు ఎస్పీకి అప్పగించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కస్టడీ సమయంలో అవసరమైనన్ని మంచినీళ్లు వీలైతే మినరల్ వాటర్ ఇవ్వాలని, రాత్రి పడుకునే ముందు దిండు, బెడ్‌షీట్ ఇవ్వాలని, లైట్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తేల్చాలి.. అంతకుముందు తమ కస్టడీకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కుట్ర కేసులో సండ్ర వెంకట వీరయ్య కీలక పాత్ర పోషించారన్నారు. ఆధారాలు మాయం చేసేందుకే దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పోయారని తెలిపారు. రాజమండ్రిలో చికిత్స పొందుతున్నానని లేఖ రాసిన సండ్ర ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో కూడా చెప్పలేదన్నారు. హైదరాబాద్‌లో నిమ్స్ సహా అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నా.. విచారణ నుంచి తప్పించుకునేందుకే పక్క రాష్ట్రంలోని రాజమండ్రికి వెళ్లిపోయారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తెలిసినా ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా అమాయకుడిలా నటిస్తున్నారని తెలిపారు. మొదట సాక్షిగా సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చామని, అయితే రెండో నిందితుడు సెబాస్టియన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు విశ్లేషించి ఇచ్చిన నివేదిక ఆధారంగా సండ్రకు ఈ కుట్రలో కీలక పాత్ర ఉన్నట్లు నిర్ధారించామన్నారు. స్టీఫెన్‌సన్‌తో ఓటు వేయిస్తే హామీ ఇచ్చిన డబ్బు తాను ఇస్తానంటూ సండ్ర.. సెబాస్టియన్‌తో చెప్పారని, ఈ నేపథ్యంలో ఆ డబ్బు ఎక్కడ ఉందో కనిపెట్టాల్సి ఉందని వివరించారు. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విచారించి వదిలేశామన్నారు. సండ్ర పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేశామని, అరెస్టు తర్వాత విచారణకు సమయం సరిపోలేదని, కస్టడీకి అప్పగించాలని కోరారు. సండ్రను ఇప్పటికే విచారించారని, కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో ఆయన నిందితుడే కాదని, స్టీఫెన్సన్ ఇచ్చిన ఫిర్యాదులోనూ సండ్ర పేరు లేదన్నారు. స్టీఫెన్సన్ 28న ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేసిందని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద మొదట సాక్షిగా విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా, మారిన పరిస్థితుల రీత్యా సీఆర్పీసీ సెక్షన్ 41(ఎ) కింద అనుమానిత నిందితునిగా నోటీసులు జారీచేసే అధికారం ఏసీబీకి ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏసీబీ కస్టడీ కోరడం సహేతుకమేనని స్పష్టం చేశారు. మరోవైపు సండ్ర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది. -
జిమ్మి కోసం ఏసీబీ వేట
* అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం * మత్తయ్య దారిలో ఏపీలో జిమ్మిబాబు! * కొత్తగా తెరపైకి వచ్చిన జనార్దన్‌పై ఫోకస్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అప్పగించడంతో.. అధికారులు తదుపరి కార్యాచరణకు దిగారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా.. బేఖాతరు చేసి తప్పించుకు తిరుగుతున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై దృష్టిపెట్టారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఇక సండ్ర వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదిక ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన జనార్దన్‌ను కూడా విచారణకు పిలవాలని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసులో జనార్దన్ భాగస్వామ్యానికి సంబంధించి పలు కీలక ఆధారాలు లభించాయని, ఆ మేరకు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిమ్మిని పట్టుకోవాల్సిందే! సండ్రతో పాటు నోటీసులు జారీచేసినా జిమ్మిబాబు ఇప్పటివరకు ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. దీనిని ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తోంది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో జిమ్మిబాబు కూడా కీలకంగా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయనను అదుపులోకి తీసుకుని, మరిన్ని వివరాలు రాబట్టాలని ఏసీబీ భావిస్తోంది. అసలు ఈ కేసులో ఏ4 నిందితుడు మత్తయ్య మాదిరిగా.. జిమ్మిబాబు కూడా ఏపీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. మత్తయ్య తెలంగాణ పోలీసులకు వాంటెడ్ అంటూ తమకు అధికారిక సమాచారం లేదని వ్యాఖ్యానించిన ఏపీ పోలీసులు.. ఆయన అరెస్టుకు సహకరించలేదు. ఈ నేపథ్యంలో జిమ్మిబాబు పరారీలో ఉన్నారంటూ ఏపీ పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చేలా లేఖ రాయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మధ్యవర్తి జనార్దనేనా..? ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ‘బాస్ (చంద్రబాబు)’కు మధ్యవర్తిగా టీడీపీ నేత జనార్దన్ వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. సెబాస్టియన్, సండ్ర ఫోన్ సంభాషణల్లో పలుమార్లు జనార్దన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రతీ సందర్భంలోనూ జనార్దన్‌కు చెప్పారా? అంటూ సెబాస్టియన్ అడగడం, ‘సార్’ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి జనార్దన్ పేరును సెబాస్టియన్ ఉటంకించిన విషయం కాల్ రికార్డుల విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. సండ్ర కూడా పలుమార్లు ‘ఈ డీల్ జనార్దన్‌కు తెలుసు’ అంటూ మాట్లాడారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలులో జనార్దన్ పాత్ర ఉన్నట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. సండ్రను విచారించనున్న ఏసీబీ అధికారులు.. కేసులో కీలకాంశాలతో పాటు జనార్దన్ ఎవరనేది నిర్ధారించి, నోటీ సులు జారీ చేయాలని యోచిస్తున్నారు. -
'ఓటుకు కోట్లు’లో కీలక ఆధారాలు...
-
‘ఓటుకు కోట్లు’ కుట్ర బాబు కనుసన్నల్లోనే..
-
ముగ్గురిని ఒకేసారి విచారిస్తే..!
* 'ఓటుకు కోట్లు’లో కీలక ఆధారాలు వెలికితీసే దిశగా ఏసీబీ నిర్ణయం * ఏకకాలంలో సండ్ర, జిమ్మి, వేం నరేందర్‌ల విచారణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇప్పటివరకు వెల్లడికాని పలు అంశాలను వెలికితీసేందుకు ఏసీబీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సండ్రను కస్టడీలోకి తీసుకోవడంతో పాటు అజ్ఞాతంలో ఉన్న జిమ్మిబాబును అదుపులోకి తీసుకోవాలని, వీరితో పాటు వేం నరేందర్‌రెడ్డిని రప్పించి ముగ్గురినీ ఏకకాలంలో విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. తమకు లభించిన సమాచారంతో ఇప్పటికే సండ్రను విచారించగా వేటికీ తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నింటికి ముక్తసరిగా సమాధానమిచ్చినట్లు సమాచారం. వేం కూడా ఇంచుమించు ఇదేతీరులో వ్యవహరించారు. దీంతో ముగ్గురిని ఒకేసారి విడివిడిగా, ముఖాముఖి విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలా చేస్తే ఈ వ్యవహారం వెనుక అసలు కుట్ర, సూత్రధారి బయటకు వస్తారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.నోటీసులు జారీ చేసినా స్పందించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు విషయంలో ఏసీబీ సీరియస్‌గా ఉంది. ఆయనకు 49ఏ కింద నోటీసులు జారీ చేసినందున.. ఆయన ఆచూకీ ఎక్కడ లభించినా అదుపులోకి తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించిన జిమ్మిబాబు.. కోర్టును ఆశ్రయిస్తే ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు సూచించడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. స్టీఫెన్సన్కు టీడీపీ ముఖ్యనేతలకు తొలుత మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి జిమ్మిబాబేనని ఏసీబీకి సమాచారం ఉంది. జిమ్మిని అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారాన్ని రాబట్టవచ్చని ఏసీబీ భావిస్తోంది. -
సండ్రకు 21 వరకు రిమాండ్
ఐదు రోజులపాటు కస్టడీకి కోరిన ఏసీబీ విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఈనెల 21 వరకు రిమాండ్‌కు తరలించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశించింది. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సండ్రను ఈ కేసులో ఐదో నిందితుడిగా చేర్చిన ఏసీబీ అధికారులు.. సోమవారం సాయంత్రం ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో సండ్ర పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు ఏసీబీ సమర్పించింది. సండ్ర సూచన మేరకే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు సెబాస్టియన్ ప్రయత్నించినట్లు వివరించింది. ఈమేరకు వీరి మధ్య పలు దఫాలుగా జరిగిన ఫోన్ సంభాషణలను అందజేసింది. మీడియా ద్వారా తెలిసింది! ‘ఓటుకు కోట్లు’ కేసులో తనకు ఏసీబీ నోటీసులు జారీచేసిన విషయం తెలియదని, విశాఖపట్నంలో చదువుకుంటున్న పిల్లలను చూసేందుకు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో అస్వస్థతకు గురికావడంతో రాజమండ్రిలో చికిత్స పొందానని సండ్ర ఈ సందర్భంగా న్యాయమూర్తికి చెప్పారు. తాను ఖమ్మంలో ఉంటానని, హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఏసీబీ నోటీసులు అంటించిన విషయం తెలియదని పేర్కొన్నారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరయ్యానని.. 8 గంటలపాటు జరిగిన ఏసీబీ అధికారుల విచారణలో అన్ని విషయాలు వెల్లడించానని అన్నారు. తనకు మొదట సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) కింద నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం సీఆర్పీసీ 41(ఎ) కింద నోటీసులు ఇచ్చారని.. తనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొన్నారు. అయితే దీనిపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో ఇన్ని ఆసుపత్రులున్నా.. ఉద్దేశపూర్వకంగా ఏసీబీ విచారణ నుంచి తప్పించుకునేందుకే రాజమండ్రిలోని ఆసుపత్రిలో చేరారని కోర్టుకు తెలిపింది. దీనిపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి ‘అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు ఏమైనా ఇబ్బందులకు గురిచేశారా’ అని ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని సండ్ర సమాధానమిచ్చారు. అనంతరం ఆయనను రిమాం డ్కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా తనకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పిం చాలని కోరు తూ వీరయ్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి అనుమతించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సండ్ర పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి స్టీఫెన్సన్ కు ఇస్తామన్న రూ. 5 కోట్లలో రూ. 4.5 కోట్లు ఎక్కడున్నాయో కనిపెట్టాలంటే సండ్రను కస్టడీలో విచారించడం అనివార్యమని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ మేరకు అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు తర్వాత ఎక్కువ సమయం లేకపోవడంతో ఆయన్ను విచారించలేకపోయామని.. ఐదు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించనుంది. కాగా అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు సండ్ర వెంకట వీరయ్యను చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్రకు ఖైదీ నంబర్ 4887ను కేటాయించి, గంగా బ్యారక్‌లో ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. -
’ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా’
-
సండ్ర అరెస్ట్
* రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో కీలక పరిణామాలు * తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న ఏసీబీ * 7 గంటల విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటన * ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన సండ్ర * ఓ ఎమ్మెల్యేకు నగదు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయన్న ఏసీబీ * వేం నరేందర్‌రెడ్డిని మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధం * రెండు రోజుల్లో కొందరు ‘ముఖ్యుల’ను ప్రశ్నించే అవకాశం * అజ్ఞాతంలోకి జిమ్మి బాబు.. అరెస్టుకు నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: రూ.150 కోట్ల ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో కీలక పరిణామాలు మొదలయ్యాయి. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. అంతకుముందు దాదాపు ఏడు గంటల పాటు దఫదఫాలుగా ప్రశ్నించినా... సండ్ర నోరు విప్పకపోవడంతో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని నిర్ణయించిన అధికారులు.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని పూర్తిస్థాయిలో విచారించాలని నిర్ణయించారు. విచారణలో ఆయన సహకరించకపోతే.. అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తదనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యులకు నోటీసులు జారీచేసి, విచారించనున్నట్లు సమాచారం. శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎనిమిది మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ వల వేసింది. ఎమ్మెల్యేల ఆర్థిక అవసరాలను బట్టి కోట్ల రూపాయల్లో లంచం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు చేశారు. అనంతరం స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రేవంత్‌తో పాటే డబ్బు బ్యాగ్ తీసుకుని వచ్చిన ఆయన సహచరుడు ఉదయ సింహ, టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు సెబాస్టియన్లను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు... టీడీపీకి చెందిన అనేక మంది ప్రముఖులకు ఈ ‘ఓటుకు కోట్లు’ బాగోతంలో ప్రయేయం ఉందని గుర్తించారు. రేవంత్ తెచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఖాతా నుంచి విత్‌డ్రా చేశారన్న వివరాలు ఏసీబీ వద్ద ఉన్నాయి. అయితే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50లక్షలు పోగా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది.. వంటి వివరాలు తెలియలేదు. దీనికి సంబంధించి సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు.. సోమవారం 7 గంటల పాటు సండ్రను ప్రశ్నించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానాలు రాకపోవడంతో.. అరెస్టు చేశారు. ఇక సోమవారంలోగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ జారీ చేసిన నోటీసును తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు బేఖాతరు చేశారు. విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఏసీబీ.. జిమ్మి పరారీలో భావిస్తూ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. సండ్రదే కీలకపాత్ర: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.150 కోట్లు సమకూర్చుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలను గుర్తించే బాధ్యతను నలుగురు ఎమ్మెల్యేలకు, ఇద్దరు రాజ్యసభ సభ్యులకు అప్పగించారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యతను సండ్ర వెంకటవీరయ్యకు అప్పగించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సండ్ర... మే చివరి వారంలో ఆ ఎమ్మెల్యేలతో చర్చించారు. పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. కోట్ల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన (తదనంతరం టీఆర్ఎస్లో చేరారు) ఇద్దరు ఎమ్మెల్యేలతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యేకు అడ్వాన్స్‌గా కొంత సొమ్ము ముట్టజెప్పారని.. రేవంత్ దొరికిపోగానే ఆ ఎమ్మెల్యే తనకిచ్చిన డబ్బును వెనక్కి తిప్పిపంపారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన ఓ గిరిజన ఎమ్మెల్యేతోనూ సండ్ర సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీ గుర్తించింది. సోమవారం నాటి విచారణలో సండ్ర ఏదీ బయటపెట్టనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ కోర్టును కోరనుంది. నరేందర్‌రెడ్డిని ప్రశ్నించనున్న ఏసీబీ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్‌రెడ్డిని ఏసీబీ మరోమారు ప్రశ్నించనుంది. ఆయనకు నోటీసు జారీ చేయాలా, లేదా ఇంటికి వెళ్లి విచారించాలా అన్నదానిపై మంగళవారంనిర్ణయం తీసుకోనున్నారు. విచారణలో ఆయన సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశముందని ఓ అధికారి వెల్లడించారు. గతంలో నరేందర్‌రెడ్డిని విచారించినా.. ఆయన సహకరించలేదని, డబ్బు ఎవరు సమకూర్చారన్నది తేలాల్సి ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. మండలి ఎన్నికలకు ముందు కొన్ని బ్యాంకు శాఖల నుంచి కోట్ల రూపాయలు విత్‌డ్రా చేశారని, అవి ఎక్కడకు వెళ్లాయన్నది ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. వేం నరేందర్‌రెడ్డికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనను విచారించి నిజానిజాలను సరిపోల్చుకుంటామని తెలిపారు. మరింత కీలకం: ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. అతి ముఖ్యమైన ఒక నేతతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులకు, ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. -
దొరికిన దొంగలపై పవన్ దాటవేత
* ‘ఓటుకు కోట్లు’ కేసు కోర్టులో ఉన్నందువల్ల మాట్లాడను: పవన్ కల్యాణ్ * టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణకు డిమాండ్ * చంద్రబాబుపై అభియోగానికి, సెక్షన్-8కి సంబంధం లేదు * సెక్షన్-8కి తాను వ్యతిరేకమని వక్కాణింపు * సమకాలీన రాజకీయాల్లో అవినీతి సహజమన్న జనసేన అధినేత సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వచ్చిన అభియోగానికి విభజన చట్టంలోని సెక్షన్-8 వర్తించదని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్-8కు తాను పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షల లంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్హాండెడ్గా దొరికిపోయిన సంఘటనపై పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ కేసు వ్యవహారంలో స్పందిస్తానని చెప్పిన పవన్ తీరా మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి వ్యవహారంపై దాటవేశారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కోర్టులో ఉందనీ, తానిప్పుడు మాట్లాడననీ తప్పించుకున్నారు. సమకాలీన రాజకీయాల్లో నీతి నిజాయితీలకు స్థానం లేదని, అవినీతి సహజంగా మారిందని తేలిగ్గా మాట్లాడారు. రాజకీయ నాయకులందరి కంట్లో దూలాలున్నాయని, కాకుంటే వీటిలో పెద్ద, చిన్న తేడా తప్ప మరొకటి కాదన్నారు. ప్రస్తుత కేసుల వ్యవహారాలను ఆపాలని రెండు రాష్ట్రాలకు హితవు పలికారు. అలాగే సెక్షన్-8 అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికిఇచ్చిన ఆనందాన్ని తీసెయ్యొద్దన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి, అంతర్యుద్ధాలకు దారి తీస్తే సెక్షన్-8 అమల్లోకి వస్తుందని, అలాంటిదేం లేకుండానే సెక్షన్-8 బాధ్యత కేంద్రానికి అప్పగించి మళ్లీ అల్లకల్లోలం చేయవద్దని కోరారు. ఇందుకు కేసీఆర్ బాధ్యత తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి పార్లమెంటరీ కమిటీ నియమించాలని, ఇందులో బీజేపీ, యూపీఏ ప్రతినిధుల్ని నియమించాలని కేంద్రానికి సూచించారు. కేసీఆర్ చర్య అభినందనీయం యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం ఛీఫ్ ఆర్కిటెక్ట్‌గా విజయనగరం జిల్లాకు చెందిన ఆనందసాయిని నియమించి కేసీఆర్ తెలుగు జాతి సమైక్యతకు మొదటి అడుగు వేశారని పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేయకుండా కేసీఆర్ సమైక్యతా స్ఫూర్తి చాటాలని కోరారు. పొలిటికల్ గేమ్స్‌కు అలవాటుపడి నెల రోజులుగా ఓటుకు కోట్లు, ఫోన్‌ట్యాపింగ్ ఒకటే సమస్యగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విలువైన సమయాన్ని కోల్పోయి ప్రజా సమస్యల్ని విస్మరించాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తెలియదుగానీ అందులోనూ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కావడం నేరమన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆంధ్రోళ్లంటే వాళ్లే కాదు ఆంధ్ర అంటే అన్ని కులాలు, మతాల వారు ఉన్నారని, కేవలం కమ్మ సామాజిక వర్గమే కాదని పవన్ చెప్పారు. హరీశ్‌రావుకు ఎంతో ఇష్టమైన బొత్స సామాజిక వర్గం కాపులు కూడా ఉన్నారన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న హరీశ్ రావు లాంటి వారు ఆంధ్రోళ్లు, సెటిలర్లు అంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబును తిట్టాలంటే తిట్టుకోండి తప్ప, ఆంధ్రోళ్లంతా టీడీపీలో లేరని, ఆంధ్ర అంతా ఆయన కులమూ కాదని చెప్పారు. ఆత్మగౌరవంలేని సీమాంధ్ర ఎంపీలు సీమాంధ్ర ఎంపీలంతా ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఎంపీలకు పౌరుషం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్న ఎన్డీఏ చెప్పాయని, ఇప్పుడామాటే మర్చిపోయాయని విమర్శించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సీటు కోసం ఆ రోజు ఊగిపోయారని, ఎంపీ అయిన తర్వాత పార్లమెంటు గోడలు చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారా అని ఎద్దేవా చేశారు. ఇద్దరు బీజేపీ ఎంపీలు హరిబాబు, గంగరాజు, కాకినాడ, అనకాపల్లి ఎంపీలు తోట నరసింహం, అవంతి శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన రాయపాటి సాంబశివరావులు ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. కావూరి సాంబశివరావు, పురందేశ్వరిలు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్గజపతిరాజులు ఎందుకు కిక్కురుమనడం లేదన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువగా సీమాంధ్ర ఎంపీలు ఆంధ్రను దెబ్బతీస్తున్నారని ఆయన విమర్శించారు. -
రాజకీయవేత్తల ‘వ్యాపార పోటు’
బాబు ఎప్పుడూ వ్యాపారవేత్తల మధ్యనే ఉంటున్నారు. అది తప్పేమీకాదు గానీ ఆయన వారికి బందీగా ఉన్నారు. బాబు ఈ నూతన సంపన్నులకు దూరంగా ఉండి ఉంటే ఇప్పుడీ ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇరుక్కుని ఉండేవారూ కారు. రాజకీయవేత్తలకు సర్వసా ధారణంగా సోకే ప్రమాదకర మైన వ్యాధి ‘వ్యాపార పోటు’. గుండెపోటు లేదా లివర్ దెబ్బ తినిపోవడం వంటి వాటికి భిన్నంగా ఇది దురాశ, అవి నీతి వల్ల సంక్రమిస్తుంది. తెలి విగా తమ సంపదలను దాచే సుకుని గాంధేయవాదుల్లా నటించగలిగిన కొందరు రాజకీయవేత్తలకు ఈ వ్యాధి సోకదు. దొరికిపోయేవారు వెర్రిబాగులవారే. ఇంగ్లండ్, అమెరికాలాంటి దేశాల రాజకీయవేత్తలకు వ్యాపార పోటు భయం తక్కువ. ఎందుకంటే అక్కడి ప్రజలు అవి నీతికంటే అనైతిక ప్రవర్తననే ఎక్కువగా పట్టించుకుం టారు. ఆ విషయంలోనే వారు దొరికిపోతుంటారు. కాగా మన రాజకీయవేత్తలు డబ్బుకు సంబంధించిన కుంభకోణాల్లో దొరకడం పరిపాటి. రాజకీయవేత్తలకు తాము ఎంతెంత డబ్బు తినిపిం చామో గొప్పలు చెప్పుకోవడం మన వ్యాపారవేత్తలకు అలవాటు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా అరుణ్ నెహ్రూ ఆయనకు సలహాదారు. విదేశీ వ్యాపారవేత్తలైతే ఇక్కడివారిలా గప్పాలు కొట్టక గమ్మున ఉంటారు, వారి నుంచి ముడుపులు పుచ్చుకుంటే దొరకమని సలహా ఇచ్చారు. ఆ సలహాను పాటించే రాజీవ్ బోఫోర్స్ కుంభ కోణంలో దొరికిపోయి, 1989లో ఓడిపోయారు. జయ లలిత గత రెండు దశాబ్దాలుగా అలా బాధపడుతూనే ఉన్నారు. ములాయంసింగ్ ఆ వ్యాధి బారినపడ్డా తెలి విగా స్వస్థత పొందగలిగారు. ఇక మమతా బెనర్జీ సైతం వ్యాపార పోటుకు గురికాబోతున్నారు. కరుణానిధి, కని మొళి, రాజాల నుంచి మాయావతి వరకు అంతా ‘వ్యాపార పోటు’తో విలవిలలాడుతున్నవారే. చూడ బోతే, సోనియా, రాహుల్ , ప్రియాంకల తలరాతే కాస్త బావున్నట్టుంది. అయితే రాబర్ట్ వాద్రా ఇటీవలే రియల్ ఎస్టే టర్ల ద్వారా ‘వ్యాపార పోటు’కు గురయ్యారు. గత మూడు వారాలుగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు ‘వ్యాపార పోటు’తో బాధపడుతున్నారు. తక్షణమే రాజకీయ ఐసీ యూకి తరలించకపోతే వారి కేరీర్లు ముగిసిపోతాయి. బీజేపీలో ఎవరూ కాపాడేలా లేరు. మహారాణి రాజే మీడియా కంటపడకుండా గోడ దూకి దొడ్డిదోవ పట్టా ల్సివచ్చింది. సుష్మా వారికి దొరక్కుండా దాక్కున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇప్పుడు ‘వ్యాపార పోటు’ బాధితుల జాబితాకు ఎక్కారు. ఆయ న ఎప్పుడూ వ్యాపారవేత్తల మధ్యనే ఉంటున్నారు. అం దులో తప్పేమీ లేదు గానీ ఆయన వారికి బందీగా ఉన్నా రు. వ్యాపారవేత్తలతో సమస్యేమిటంటే వారికి రాజకీ యాలు ఒకపట్టాన అర్థం కావు. బాబు ఈ నూతన సంప న్నులకు దూరంగా ఉండి ఉంటే ఆయన ఇప్పుడీ ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ఇరుక్కుని ఉండేవారూ కారు, ఆయన ప్రతిష్ట మట్టి పాలయ్యేదీ కాదు. ములా యంసింగ్కు అమర్‌సింగ్‌లా చంద్రబాబును చాలా మం ది తెలుగు అమర్‌సింగ్‌లు చుట్టిముట్టి ఉన్నారు. వారా యనకు శత్రువులను తయారు చేసిపెట్టే పనిలోనూ, ఆయన ప్రభుత్వాన్ని ముంచేసే పనిలోనూ ఉన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోని కొన్ని మౌలిక సూత్రాలను మరచారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభు త్వానికి మధ్యన వారధులుగా నిలుస్తారు. కానీ బడా వ్యాపారవేత్తలు మాత్రం డబ్బు ఖర్చు పెట్టి గెలిచాం, గెలిచాం కాబట్టి డబ్బు ఖర్చు పెడతాం, మళ్లీ డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తామని భావిస్తారు. అమర్‌సింగ్ సమాజ్‌వాదీ పార్టీని ఎలా నాశనం చే శారో చంద్రబాబు కాస్త ములాయంను అడిగి తెలుసుకుంటే మంచిది. ధైర్యం చేసి ఆయన అమర్‌సింగ్‌ను బహిష్కరించినా, రెండేళ్లపాటూ బ్లాక్‌మెయిల్‌కు గురవుతూనే వచ్చారు. చంద్రబాబు చుట్టూ అమర్‌సింగ్‌లు కనబడుతుండటం తెలుగు ప్రజలకు ఆగ్రహం కలుగజేస్తోంది. వ్యాపారవేత్త లకు సన్నిహితంగా మెలిగితే వారెలా నాశనం చేసేస్తారో ‘లలిత్‌గేట్’ కుంభకోణం ద్వారా వసుంధర, సుష్మాలకు అనుభవంలోకి వచ్చింది. వసుంధర ముఖ్యమంత్రిగా ఉండగా అన్నీ లలిత్ మోదీయే నిర్దేశించారు, శాసిం చారు. ఆమె ఓడిపోయిన వెంటనే ఆమెకు దూరమయ్యా రు. ఆమె తిరిగి ముఖ్యమంత్రి కావడంతో ఆగ్రహం చెం ది, ఆమెను నాశనం చేయడానికి పూనుకున్నారు. రాజకీ యవేత్తలు వ్యాపారవేత్తలను చేరదీయగలరేగానీ వారిని దూరంగా పెట్టలేరు. వారిని బహిష్కరించారంటే చాలు... అజ్ఞాత వ్యక్తులుగా సీబీఐ, ఇన్‌కంటాక్స్, మీడి యాలకు అకౌంట్ల గుట్టుముట్లను నిత్యమూ విడుదల చేస్తారు. ఇంగ్లండ్‌లో కూచుని లలిత్‌మోదీ వసుంధరను ఇలాగే మెల్లమెల్లగా రోజూ హతమారుస్తున్నాడు. చంద్రబాబు తన చుట్టూ ఉన్న సంపన్న వ్యాపార వేత్తలను బహిష్కరిస్తే వారాయన గుట్టుమట్లు రట్టు చేస్తారు. వారు తనకు సమస్యలను సృష్టిస్తున్నారని తెలిసినా ఆయన వారిని ప్రేమిస్తూ ఉండాల్సిందే. రాజ కీయ వేత్తలుగా మారిన వ్యాపారవేత్తలతోనే చాలా కుం భకోణాలు మొదలయ్యాయని చంద్రబాబు గ్రహించాలి. వారిని ప్రేమించాలి గానీ దూరంగా ఉంచాలి. సీనియర్ రాజకీయనేతలే గనుక ఇప్పుడు బాబుకు సలహాలిస్తూ ఉండివుంటే ‘ఓటుకు కోట్లు’ కుంభకోణం జరిగి ఉండేదే కాదు. పట్టుబడినా డబ్బుంది గాబట్టి లాయర్లు బయట పడేస్తారనే ధీమా సంపన్నుల కుంటుంది. కాబట్టే అందు లోని ప్రమాదాల గురించి సంపన్నులకు ఎప్పుడూ పట్టదు. సుష్మా, వసుంధరలే గనుక కాల చక్రాన్ని వెనక్కు తిప్పగలిగితే లలిత్ మోదీలను దరిచేరనీయరు. ఒక్క ములాయమే అమర్‌సింగ్‌ను గెంటేసే ధైర్యం చేయ గలిగారు. బాబు తెలుగు అమర్ సింగ్‌లను గెంటేయ గలరా? (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -పెంటపాటి పుల్లారావు e-mail:Drpullarao1948@gmail.com -
వేం నరేందర్‌రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ!
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయన్ను మంగళవారం ఏసీబీ విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఓటకు నోటు వ్యవహారంలో గతనెలలో ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వేం నరేందర్ రెడ్డిని జూన్ 17వ తేదీ రాత్రి అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లినా.. తన ఆరోగ్యం బాగోలేదని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి మరుసటి రోజు ఉదయం ఆయన ఏసీబీ మందు హాజరయ్యారు. ఇదిలా ఉండగా, ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు ఏడు గంటలపాటు ఆయనను ప్రశ్నించిన అనంతరం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎవరీ జిమ్మిబాబు?
-
రేవంత్‌కి శిక్ష ఖాయమంటున్న నిపుణులు
-
సూత్రధారికీ జైలు తప్పదు: తెలంగాణ మంత్రులు
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు దీంతో సంబంధం ఉన్న వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. ఈ కేసులో పాత్రదారి జైలుకు వెళ్లాడని, సూత్రధారి కూడా వెళ్లక తప్పదన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు ఎప్పుడో నీళ్లొదిలిందని, ఇప్పుడున్న నేతలు స్వార్థంతో ఎన్టీఆర్, పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని విమర్శించారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటే మంత్రిని సస్పెండ్ చేసిన పార్టీలో రూ.50 లక్షలు లంచం ఇచ్చిన వారికి హారతులు పడుతున్నారని తుమ్మల ఎద్దేవా చేశారు. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసులో బెయిల్ వస్తే.. ఓ గొప్ప వ్యక్తికి, స్వాత్రంత్య్ర సమర యోధునికి స్వాగతం పలికినట్లు చేయడం విడ్డూరమని పోచారం వ్యాఖ్యానించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి ఇరికించారని బుకాయిస్తున్నారని అన్నారు. రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందని మళ్లీ జైలుకు వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోలేరని, అసలు కథ ముందుందని, రెండు రోజుల్లో ఏం జరుగుతుందో రుచి చూస్తారని మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
సీఎం ఉనికిని బెదిరించేలా రేవంత్ మాట్లాడారు
-
కాల్ డేటా దాఖలుకు గడువివ్వండి
-
దొరికిన దొంగకు హారతులా?: కర్నె
-
దొరికిన దొంగకు హారతులా?: కర్నె
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి జైలుపాలైన టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ దొరికినందుకే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50లక్షలిస్తూ ఏసీబీకి దొరికిన దొంగకు హారతులు పడతారా అని నిలదీశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. బెయిల్‌పై విడుదలైన రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ నేతలను దూషించడంపై కర్నె మండిపడ్డారు. ఏం ఘనకార్యం చేసి రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లాడో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. జైలుకు వెళ్లిన వారు పశ్చాత్తాప పడి బుద్ధి తెచ్చుకుంటారని, నిర్దోషిలా బయట పడినట్లు ఫోజు కొట్టరని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్ మాత్రమే దొరికిందని, నిర్దోషిగా తీర్పు రాలేదని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన భాష కాదని రేవంత్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడుతుందని, తప్పుందో లేదో కోర్టు తేలుస్తుందని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. -
రేవంత్‌కు షరతులతో బెయిల్
-
రేవంత్‌కు షరతులతో బెయిల్
* ఉదయసింహ, సెబాస్టియన్లకు కూడా.. * ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహలకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ తన నియోజకవర్గం కొడంగల్ దాటి బయటకు రాకూడదని, ముగ్గురు నిందితులు పాస్‌పోర్టులు స్వాధీనం చేయడంతోపాటు రూ.5లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడంతో.. రేవంత్, సహ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం మరోసారి విచారించారు. దర్యాప్తునకు విఘాతం.. తొలుత ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉందని, ఆడియో, వీడియో రికార్డుల ఫోరెన్సిక్ నివేదికలు ఇంకా అందాల్సి ఉందని వివరించారు. అంతేకాక రూ.4.50 కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను తెలుసుకోవాల్సి ఉందని.. ఈ కేసులో నాల్గో నిందితుడు మత్తయ్య పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. ‘ఓటుకు కోట్లు’ తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తోసిపుచ్చారు. రేవంత్ తదితరులకు బెయిలివ్వడం వల్ల ఏసీ బీ దర్యాప్తునకు ఆటంకం కలగబోదని భావిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ తదితరులను పోలీ సులు ఇప్పటికే విచారించినందున ఇంకా రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. బెయిల్ నిరాకరిం చేందుకు ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉండటం ప్రాతిపదిక కాదని.. ఈ కేసులో కీలక సాక్షులను ఇప్పటికే విచారించి, వాంగ్మూలాలను నమోదు చేశారని చెప్పారు. ఇక మత్తయ్యను పరారీదారుడిగా పేర్కొనాల్సిన అవసరం లేదని, అతను ఇప్పటికే కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం, అతని అరెస్ట్‌పై స్టే విధించడం జరిగిందని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.4.5 కోట్లు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందన్న కారణంతో బెయిల్ నిరాకరించలేమన్నారు. ఇవి గరిష్టంగా ఐదేళ్లు, కనిష్టంగా ఆరు నెలల శిక్షపడే అవకాశమున్న కేసులని.. బెయిల్ మంజూరు చేయదగినవేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే నింది తులు 25 రోజులకుపైగా జైల్లో ఉన్నారు కాబట్టి బెయిల్ పొందేందుకు అర్హులేనంటూ.. పలు షరతులతో బెయిల్ మంజూరు చేశారు. బెయిల్‌కు షరతులు.. * ముగ్గురు నిందితులు కూడా తలా రూ.5 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలి. * తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు రేవంత్ కొడంగల్ నియోజకవర్గం దాటి బయటకు రాకూడదు. * దర్యాప్తు అధికారులు ఎప్పుడు కోరితే అప్పుడు రేవంత్ వారి ముందు హాజరు కావాలి. * సెబాస్టియన్, ఉదయసింహ ప్రతీ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి. * ముగ్గురు నిందితులు పాస్‌పోర్టులను కింది కోర్టుకు అప్పగించాలి. -
బెయిల్‌పై సుప్రీంకు ఏసీబీ
* రేవంత్ తదితరులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేయాలని నిర్ణయం * తీవ్రంగా కసరత్తు చేస్తున్న అధికారులు * ఎమ్మెల్యే సండ్రపైనా దృష్టి.. కోర్టును ఆశ్రయించే యోచన * ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం * సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఏసీబీ డీజీ ఏకేఖాన్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో రేవంత్‌రెడ్డి సహా ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. ప్రజా ప్రతినిధులకు డబ్బు ఎర వేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరిగిందని ఆరోపిస్తున్న ఏసీబీ.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరించాలని భావిస్తోంది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత ఏసీబీ దానిని క్షుణ్నంగా పరిశీలించి.. ఒకటి రెండు రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ వ్యవహారానికి సంబంధించి రేవంత్ ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు ఇంకా ఇస్తానని చెప్పిన రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని సుప్రీంకు వివరించనుంది. అంతేగాక నాలుగో నిందితుడు మత్తయ్యను ఇంకా విచారించలేదని, నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తమ ముందు హాజరుకాలేదని... ఇలాంటి సమయంలో ప్రధాన నిందితులకు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని నివేదించనుంది. దీంతోపాటు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఏసీబీ నిర్ణయించింది. తదుపరి టార్గెట్ సండ్ర తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటివరకు సాక్షిగా పరిగణించిన ఎమ్మెల్యే సండ్ర విషయంలో ఏసీబీ సీరియస్‌గా ఉంది. ఈ కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహలను విచారించి సమాచారాన్ని రాబ ట్టిన ఏసీబీ.. అందుకనుగుణంగా ఎమ్మెల్యే సండ్రకు సీఆర్పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) ప్రకారం నోటీసులు జారీచేసింది. కానీ ఆయన అనారోగ్యం సాకుతో తమ ముందుకు రాకపోవడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణించింది. ఆయన కోరిన గడువు పది రోజులు పూర్తయినా తప్పించుకు తిరుగుతున్న సండ్రను ఇక ఉపేక్షించేది లేదని అధికారులు పేర్కొంటున్నారు. దర్యాప్తునకు సహకరించని ఆరోపణలపై సండ్రను కూడా నిందితుల జాబితాలో చేర్చడంపై సాధ్యాసాధ్యాలను న్యాయ నిపుణుల సహాయంతో పరిశీలిస్తున్నారు. ‘బాస్’కు నోటీసులు! ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంది. బాబు తనతో ఫోన్లో మాట్లాడారని స్టీఫెన్సన్ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. ఈ వ్యవహారంలో రికార్డు చేసిన ఆడియో, వీడి యో టేపులు అసలైనవేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా స్పష్టం చేసింది. దీంతో బాబుకు నోటీసులివ్వాలని ఏసీబీ యోచిస్తోంది. మరోవైపు ఈ కుట్రలో డబ్బు సమకూర్చిన వ్యక్తుల పాత్ర కీలకమని భావిస్తున్న ఏసీబీ వారిపైనా దృష్టి పెట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, సీఎం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కేసు దర్యాప్తు అంశాలను ఆయనకు వివరించారు. -
చిన్న వరం, పెద్ద సంబరం
రేవంత్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మీద విడుదలైనట్టుగా లేదు. ఆయన బెయిల్‌ను సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తరఫు న్యాయ వాదులు కాగితాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా లేదు. ఆయన నిర్దోషిగా బయటికి వచ్చినంతగా వాతావరణాన్ని సృష్టించేశారు తెలుగుదేశం పార్టీ వారు. ఓటుకు నోట్లు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి నిందితుడు. కేసు విచారణ పూర్తయి న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ నిందితుడిని జైలులో ఉంచడం న్యాయసూత్రాలకు విరుద్ధం. కాబట్టి బెయిల్ ఇవ్వడం సహజం. హర్షించాలి కూడా. తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నాయకుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతు లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి తప్ప, ఇంకెక్కడికి వెళ్లడానికి వీలులేదని హైకోర్టు షరతు విధించింది. ఆయన పాస్‌పోర్ట్ కూడా స్వాధీనం చెయ్యాలని కోరింది. ఈ వార్తాలేఖ రాస్త్తున్న సమయానికి ఇంకా ఆయన చర్లపల్లి జైలు నుంచి విడుదల కాలేదు. బెయిల్ ఉత్తర్వుల కోసం వేచి చూస్త్తున్నారు. రేవంత్‌కు బెయిల్ మంజూరు అయిందని తెలియగానే భార్యాపిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా ఉద్వేగానికి గురయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. సహజంగా జరిగేదే ఇది. కుటుంబ పెద్ద- భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, కొడుకు కావచ్చు, ఒక నెల రోజులపాటు జైలులో గడిపి తిరిగి వస్త్తుంటే ఎవరైనా ఉద్వేగానికి గురవుతారు. స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ శాసన సభ్యుడికి 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ పట్టుబడి, జైలుకు వెళ్లారు రేవంత్‌రెడ్డి. మే నెల 31న ఇది జరిగింది. రేవంత్‌రెడ్డి తన సొంత లాభం కోసం స్టీఫెన్సన్ను ప్రలోభ పెట్టలేదు. తన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ఆ పని చేశాడు. ఆ మాట చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పినట్టు టెలిఫోన్ సంభాషణల రికార్డులు బయటపడ్డాయి. అవి తన మాటలు కావు అని చంద్రబాబు ఇప్పటివరకు చెప్పలేదు. చంద్రబాబు రేవంత్‌కు ఈ పనిని అప్పగించింది కూడా శాసనమండలి ఎన్నికలలో తమ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించుకోవడం కోసమే. అధినేత ఆదేశాల మేరకు ఈ బాధ్యత నెత్తిన వేసుకుని రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లారు. ఆయన కుటుంబానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదు. రాజకీయాలలో ఉన్న వాళ్లు బయట చేసే పనులన్నిటికీ కుటుంబ సభ్యులు జవాబుదారీ కారు. అయితే బాధ ఉంటుంది. దశాబ్దాల తరబడి తమతో జీవితం పంచుకున్న వ్యక్తి ఏ కారణంగా జైలుపాలైనా కుటుంబసభ్యులు పడే బాధే రేవంత్ కుటుం బం ఈ నెల రోజులూ పడింది. ముందే చెప్పినట్టు ఇది చాలా సహజం. ఎందుకీ హడావుడి? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, శాసనసభ్యులు ఇతర నాయకులు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయిందన్న వార్త వినగానే ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. తెలంగాణ జిల్లాలతో బాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా బాణాసంచా పేల్చి పండుగ చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఈ నెల రోజులు నివాసం ఉన్న చర్లపల్లి జైలు ముందు టీడీపీ హడావుడి అయితే చెప్ప నక్కర లేదు. ఈ మధ్యే ఆయన జైలులో ఉండగా కట్టిన పాటలు పాడారు, నృత్యాలు చేశారు. టీవీ చానళ్ల మైకులు ముందున్నాయి కదా అని ఒళ్లు మరచి ప్రసంగాలు చేశారు. మర్యాదలను అతిక్రమించే విధంగా వారిలో కొందరి భాష సాగింది. రాజ్యం పన్నిన కుట్రను ఛేదించి బయటికి వచ్చిన మహా నేతగా రేవంత్‌రెడ్డిని వర్ణించారు. టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవ న్లో తెలంగాణ టీడీపీ నాయకులూ పోటీలుపడి రేవంత్‌రెడ్డి బెయిల్ మీద విడుదల కావడాన్ని గొప్ప విజయంగా శ్లాఘించారు. ఇంకా ఏమేమి జరగబో తున్నాయో చూస్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో తన కార్యాలయంలో సమీక్షలు చేస్తున్నారు. ఇంకా టీవీ కెమెరాలు ముఖ్యమంత్రి కార్యాలయం చేర లేదు, అక్కడి దృశ్యాలు రికార్డు చెయ్యడానికి. ఇదంతా చూస్త్తుంటే రేవంత్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్ మీద విడుదల అయినట్టుగా లేదు. ఆయన బెయి ల్ను సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తరఫు న్యాయవాదులు కాగితాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా లేదు. ఆయన నిర్దోషిగా బయటికి వచ్చినంతగా వాతావరణాన్ని సృష్టిం చేశారు తెలుగుదేశం పార్టీ వారు. ఓటుకు నోట్లు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి నిందితుడు. కేసు విచారణ పూర్తయి న్యాయస్థానం తీర్పు వెలువడే వరకూ నిందితుడిని జైలులో ఉంచడం న్యాయసూత్రాలకు విరుద్ధం. కాబట్టి బెయిల్ ఇవ్వడం సహజం. హర్షించాలి కూడా. నిందితులకు అండా? నిందితులందరి విషయంలో ఈ న్యాయం జరుగుతుందా అంటే, లేదు. అందరికీ న్యాయం ఒక లాగా ఉండదు అని చెప్పడానికి ఢిల్లీ ప్రొఫెసర్ సాయి బాబా ఒక తాజా ఉదాహరణ. పౌర హక్కుల సంఘాలు ఆ విషయంలో చేస్తున్న ఉద్యమాలు ఎవరికీ పట్టడం లేదు. సరే, అది ఇంకో అంశం. ఇక్కడ రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే ఆ కేసులో ఏసీబీ దర్యాప్తు ఇంకా జరుగుతు న్నది. మరి కొందరికి ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్నారు. ఒక నిందితుడు పొరుగు రాష్ర్టంలో, అక్కడి పోలీసుల రక్షణలో హాయిగా కాలం గడిపేస్తున్నాడు. ఈ కేసు దర్యాప్తులో సహకరించాల్సిన మరో ప్రజా ప్రతినిధి ఏసీబీ నోటీసులను త్రోసిరాజని అదే పొరుగు రాష్ర్టంలో బాధ్యతారహి తంగా, వైద్యం పేరిట చట్టానికి దూరంగా తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడారంటున్న ఆడియో టేపుల పరీక్ష ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరి గింది. దాని వివరాలు ఇంకా బయటికి రావలసి ఉన్నది. ఇంకా ఎంత మంది ఈ వ్యవహారంలో పాత్రధారులో తెలియాల్సి ఉన్నది. కేవలం ఒక్క శాసన మండలి స్థానం గెలుచుకోడానికి కాదు ఇదంతా చేసింది, మా ప్రభుత్వాన్నే కూలదోయడానికి పెద్ద కుట్ర దీని వెనక ఉంది అని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. కాదు తెలంగాణలో మా పార్టీని బలహీనపరచడానికి టీఆర్ఎస్ చేసిన కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నది అని తెలుగుదేశం అంటు న్నది. ఎవరేం చేశారన్నది ఏసీబీ దర్యాప్తు పూర్తయి, న్యాయ విచారణ జరిగితే తప్ప బయటపడదు. శాసనసభ్యుడి ఓటు కోసం ఐదు కోట్లు ఇవ్వజూపి భంగపడి కేసులో ఇరుక్కున్న వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడా నికి తెలుగుదేశం అధినేత, ఆయన పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్టే. సెక్షన్ 8ని ముందుకు తెచ్చారు, తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. రకరకాల అంశాలను తెర మీదకు తెచ్చి చివరికి చంద్రబాబునాయుడు ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదన్న చిన్న విషయం దాకా జనం దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు. వెర్రితలలు వేస్తున్న రాజకీయం ఇతర పార్టీల శాసన సభ్యులను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ తన సంఖ్యను పెంచు కోగా లేనిది, మేము చేస్తేనే తప్పయిందా అని కూడా వాదించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ సిద్ధాంతాన్ని ఔపోసన పట్టానని చెప్పే జూపూడి ప్రభాకర్‌రావు లాంటివారు అదే రాజ్యాంగం మీద ఏమాత్రం గౌర వం లేకుండా ‘ఎవరు పతివ్రతలు కనుక?’ అని మహిళలను కూడా అవమా నించే విధంగా, ‘అవినీతి మామూలే’ అని మాట్లాడేవరకూ ఈ ధోరణి వెర్రిత లలు వేస్తున్నది. ఇతర పార్టీల శాసన సభ్యులు టీఆర్ఎస్లో చేరడాన్ని ఎవ రూ సమర్ధించనక్కరలేదు. చట్టబద్ధంగా ఆ విషయంలో కూడా చర్యలు ఉండా ల్సిందే. ఇంత గందరగోళం జరుగుతుంటే రేవంత్‌రెడ్డికి కేవలం షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడాన్ని తెలుగుదేశం వారు ఒక గొప్ప విజయ మైనట్టు పండుగ చేసుకోవడం ఎందుకో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కథ ఇక్కడితో ముగిసిందని అనుకుంటే పొరపాటు. ఇంకా ఉంది. ఇక కొసమెరుపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రావెల కిషోర్‌బాబు అనే మంత్రి ఉన్నారు. ఆయన మంగళవారం విలేరులతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా స్థానిక సంస్థలకు చెం దిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో శిబిరం ఏర్పాలు చేసి ఉంచడాన్ని ఆక్షేపించారు. వైఎస్ఆర్ కాం గ్రెస్, టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యిందనడానికి ఇదే నిదర్శనం అన్నారాయన. అధికారబలంతో తమ సభ్యులను తెలుగుదేశం వారు డబ్బు ఆశ చూపి చెన్నైకి తరలిస్తే మిగిలిన వాళ్లను కాపాడుకోడానికి వైఎస్ఆర్ సీపీ గద్వాల శిబి రం తెరిచింది. మరి తెలుగుదేశం పార్టీ చెన్నైలో శిబిరం తెరిచిందంటే జయ లలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకేతో కుమ్మక్కు అయినట్టా? ఇది కిషోర్ బాబు గారే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మద్దతుతో మీరు స్థానిక సం స్థల ప్రతినిధులను చెన్నైకి తరలిస్తే, వైఎస్ఆర్ సీపీ అదే పోలీసుల దాష్టీకానికి భయపడి తన ప్రతినిధులను తెలంగాణకు తరలించింది. తెలంగాణ, తమిళ నాడు రెండూ పొరుగు రాష్ట్రాలే కదా ! - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ముగుస్తున్న సండ్ర గడువు
-
మీరే చూసుకోండి..!
-
జోక్యం చేసుకోం
* ‘ఓటుకు కోట్లు’పై గవర్నర్ నరసింహన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ స్పష్టీకరణ * సెక్షన్-8, ‘ఓటుకు కోట్లు’ రెండూ వేర్వేరు అంశాలు * కేసును దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చూసుకుంటాయి * పూర్తి అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోబోదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణలో విచారణ సాగుతున్న ఓటుకు కోట్లు కేసు, తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను ఢిల్లీకి పిలిచిన కేంద్రం ఈ విషయంపై స్పష్టతనిచ్చినట్టు అత్యున్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ‘‘ఓటుకు కోట్లు కేసులో కేంద్రం ఎటువంటి డెరైక్షన్ ఇవ్వబోదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన సెక్షన్-8 అంశం, ఓటుకు కోట్లు కేసు వ్యవహారం వేర్వేరు అంశాలు. రెండింటినీ కలిపి చూడటం సరికాదు’’ అని స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 5 కోట్లు ఆశ చూపిన ఉదంతంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం, అందులో చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బాహ్యప్రపంచానికి వెల్లడైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విభజన చట్టంలోని సెక్షన్-8ను తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న క్రమంలో కేంద్ర హోంమంత్రి గవర్నర్‌ను గత శుక్రవారం ఢిల్లీకి పిలిపించుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రితో పాటు పలు దఫాలుగా హోం శాఖ కార్యదర్శి గోయల్‌తో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. విభజన చట్టంలోని సెక్షన్-8 పరిమితిని దాటి ఉల్లంఘించిన సంఘటనలు ఏమైనా తలెత్తాయా అన్న వివరాలను తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విఘాతం కలగలేదనీ, రెండు ప్రభుత్వాల నుంచిగానీ, సివిల్ సొసైటీస్ నుంచిగానీ ఎలాంటి ఫిర్యాదులు కూడా రాలేదని నరసింహన్ వివరించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎలాంటి నివేదికలు అందలేదన్నారు. విభజన చట్టంలోని సెక్షన్-8కి సంబంధించి ఉత్పన్నమైన సంఘటనలేవైనా ఉన్నాయా? అని ఆరా తీస్తూనే రాష్ట్రంలో సంచలనంగా మారిన ఓటుకు కోట్లు కేసుపైనా చర్చించినట్టు హోం శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆ వర్గాలు అందించిన సమాచారం మేరకు... ఓటుకు కోట్లు కేసును విభజన చట్టంలోని సెక్షన్-8 కి ముడిపెట్టి మాట్లాడటం సరికాదని, ఆ రెంటికీ పొంతన లేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ కేసు వ్యవహారాన్ని మొత్తంగా దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చూసుకుంటాయని చెప్పారు. దీనికి సంబంధించి మీ స్థాయిలోనే నిర్ణయాలు జరగాలని స్పష్టతనిచ్చారు. ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు సాగుతుందనే దానిపైన కూడా చర్చ జరిగింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు సంబంధించిన సెక్షన్-8 అంశం ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చిందని గవర్నర్‌ను ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిన పక్షంలో విభజన చట్టంలో సెక్షన్-8 ద్వారా తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదించి గవర్నర్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆ పరిస్థితి ఇప్పటివరకు రాలేదని నరసింహన్ పేర్కొన్నట్లు అత్యున్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రూల్ పుస్తకం, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నడచుకోవాలని, పూర్తి అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో వెనకా ముందు ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన ఏడాదిలోగా చట్టంలోని షెడ్యూల్ 9, 10ల్లో పేర్కొన్న సంస్థలను ఇరు రాష్ట్రాలు విభజనను పూర్తి చేసుకోవాలని, ఏడాది దాటినా పూర్తి స్థాయిలో విభజన జరగలేదని గవర్నర్ వివరించారు. ఆ సంస్థల విషయంలో కేంద్రం నుంచి గడువు కావాలన్నా, లేదా తదుపరి ఎలాంటి ఆదేశాలు కావాలన్నా అందుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ సూచించింది. -
'చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం'
ఆదిలాబాద్ : ఓటుకు కోట్లు’ వ్యవహరంలో అడ్డంగా దొరికిన చంద్రబాబు.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కేంద్రం పెద్దల శరణుజోచ్చాడని, ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైదరాబాద్‌లో సెక్షన్ 8ను తెరపైకి తెస్తున్నారని, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా కూడా సెక్షన్ 8పై లేనిపోని రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. ఈ కేసులో ఏసీబీ పకడ్బందీగా విచారణ చేపట్టిందని అన్నారు. తప్పించుకునేందుకు చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కుల చేసిన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ కేసును కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ధర్మపురిలో కేసీఆర్ పుష్కరస్నానం ఈ పుష్కరాల్లో సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్లు మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశాలున్నాయని, ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 106 ఘాట్ల నిర్మాణం చేపట్టామని, 80 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. ఈ పనుల్లో నాణ్యత లోపిస్తే విజిలెన్స్, క్యూసీ వంటి సంస్థలతో విచారణ చేపడతామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పుష్కర స్నానం ఆచరించేందుకు భద్రాచలానికి నాగసాదువులు వచ్చే అవకాశాలున్నాయని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాల్లో రెండు హెలిక్యాప్టర్లను కూడా వినియోగిస్తామని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రత్యేక రైళ్లు నడపాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం చేస్తారని ప్రకటించారు. అలాగే ఈ పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు. ఇండ్ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు బెడ్రూంల గృహ ల నిర్మాణానికి విదేశీ కంపెనీలు ముందుకోస్తున్నాయని ఐ.కె.రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది 50 వేల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే రెండు లక్షల గృహాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. మున్సిపాలిటీల్లో జీ ప్లస్ 1, జీ ప్లస్ 2తో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీఆర్ఎస్ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి పాల్గొన్నారు. -
’చంద్రబాబు చేసేవన్నీ ప్రజలదృష్టి మరల్చేందుకే’
-
రంగంలోకి ఈసీ
-
స్టీఫెన్సన్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
-
రంగంలోకి ఈసీ
⇒ ‘ఓటుకు కోట్లు’ కేసులో వీడియో, ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ ⇒ నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నం జరిగింది ⇒ ఏసీబీ కేసు దర్యాప్తు చేస్తోంది ⇒ దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు అందజేయాలని విజ్ఞప్తి ⇒ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ముమ్మాటికీ అవినీతే: భన్వర్‌లాల్ ⇒ ఇది క్రిమినల్ కేసే.. దీనిపై ఏసీబీ మాకు ముందే సమాచారం ఇచ్చింది ⇒ కోర్టు తీర్పు అనంతరం ఈసీ తగిన చర్యలు చేపడుతుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమైంది. ఈ రికార్డుల కాపీలను తమకు ఇవ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసు కోర్టు పరిధిలో ఉండడంతో... కోర్టు తీర్పు ఆధారంగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. అంతేకాదు ఈ రికార్డులను ఫైల్ చేసి ఉంచనుంది. అసలు ఈ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం పూర్తిగా అవినీతి, క్రిమినల్ కేసేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొనడం గమనార్హం. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ కేసులో సూత్రధారితో పాటు పలువురు కీలక పాత్రధారులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఏసీబీ ఒక నివేదికను అందజేయనుంది. అరడజను మంది చట్టసభల సభ్యు ల ప్రమేయమున్న ఈ కేసులో చోటు చేసుకున్న ప్రతి కోణాన్ని ఈసీ దృష్టికి తీసుకురానుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలతో కలసి నడిపిన కుట్ర మొత్తాన్ని వివరించనుంది. కేసులో నిందితులను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం తన న్యాయవాదులతో న్యాయస్థానాల్లో నడిపిస్తున్న వ్యవహారాలను సైతం ఈ నివేదికలో పొందుపరుస్తోంది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడు మత్తయ్యతో పాటు, నోటీసులు అందుకుని విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కాపాడుతున్న తీరును వివరించనుంది. మొత్తంగా ఈ కేసులో ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో.. ఇందులో నిందితులైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు కీలక వ్యక్తుల చుట్టూ ఉచ్చు బిగుసుకోనుంది. ఎన్నికల కమిషన్ కన్ను.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టిన వ్యవహారానికి సంబంధించి ఏసీబీ రికార్డు చేసిన వీడియో, ఆడియో సంభాషణల కాపీలను ఇవ్వాలని ఎన్నికల సంఘం గురువారం న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, డిప్యూటీ సెక్రటరీ శ్రీదేవసేన అల్లంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఈ నెల ఒకటిన తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు, ఇతర ఆడియో, వీడియో రికార్డులు మాకు ఇవ్వండి..’’ అని ఆ పిటిషన్లో ఎన్నికల కమిషన్ కోరింది. న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ పిటిషన్‌ను పరిశీలిస్తామని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు. అయితే తమకు తెలియకుండా ఆ పత్రాలు, వీడియో, ఆడియో సంభాషణలను ఎన్నికల కమిషన్‌కు ఇవ్వవద్దంటూ రేవంత్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో సంభాషణలను తమకు కాపీ చేసి ఇచ్చేందుకు వీలుగా హార్డ్‌డిస్క్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులకు ఇచ్చినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి కోర్టుకు నివేదించారు. ఇదే విషయాన్ని మెమో రూపంలో కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి సూచించారు. ఇది ముమ్మాటికీ అవినీతి కేసే: భన్వర్‌లాల్ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ముమ్మాటికీ అవినీతేనని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన కేసు కావడంతో ఇది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని.. ఓటు కోసం డబ్బు ఇవ్వడాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల అవినీతిపై ఏ పోలీస్ విభాగమైనా కేసు నమోదు చేయవచ్చని, సాధారణ పోలీసులతోపాటు ఏసీబీ, సీఐడీ, సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులన్నీ ఈసీ పరిశీలిస్తుందని చెప్పారు. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గురువారం సాయంత్రం భన్వర్‌లాల్ తనను కలసిన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచమిస్తూ పట్టుబడిన వ్యవహారం కచ్చితంగా అవినీతి కేసేనని ఆయన స్పష్టం చేశారు. ఆ సంఘటన జరిగిన వెంటనే ఏసీబీ తమకు సమాచారం ఇచ్చిందన్నారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో రికార్డుల కాపీలను తాము ఏసీబీని కోరగా... అప్పటికే కోర్టుకు సమర్పించినట్లు తెలిపిందన్నారు. అందువల్లే ఆడియో, వీడియో రికార్డుల కాపీలు ఇవ్వాలని ఈసీ తరఫున కోర్టులో మెమో దాఖలు చేసినట్లు భన్వర్‌లాల్ చెప్పారు. ఇప్పటికీ అవి తమకు అందకపోవడంతో గురువారం రిమైండర్ మెమో దాఖలు చేశామన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు రికార్డులు, ఆధారాలన్నింటినీ ఈసీ ఫైల్ చేస్తుందని.. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే క్రిమినల్ కేసుల్లో ఇది సాధారణమని చెప్పారు. ఈ కేసులో రేవంత్‌తో పాటు ఇతరులపై ఏం చర్య తీసుకోవాలనేది కోర్టు తీర్పు తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని భన్వర్‌లాల్ తెలిపారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, రాష్ట్రంలో దాదాపు 15 వేల కేసులు నమోదయ్యాయన్నారు. అవన్నీ క్రిమినల్ కేసులేనని, దేశంలోనే ఎక్కడా ఇంత నగదు స్వాధీనం చేసుకోలేదన్నారు. -
స్టీఫెన్సన్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
* న్యాయం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేశాం * స్టీఫెన్సన్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు * ఆందోళనల ఆధారంగా దాఖలు చేసే పిటిషన్లను విచారించరాదు * మత్తయ్య తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా * సోమవారం నిర్ణయం వెలువరిస్తానన్న న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏ-4 నిందితుడు జెరూసలెం మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు తన నిర్ణయాన్ని సోమవారం వెలువరిస్తానని స్పష్టం చేశారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ తీరును, విచారణ సమయంలోని పరిణామాలను బట్టి ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ, కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ స్టీఫెన్సన్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం మొదలు పెట్టిన వాదనలను స్టీఫెన్సన్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు గురువారం కూడా కొనసాగించారు. కోర్టుల్లో విచారణ పారదర్శకంగా ఉంటేనే న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందన్నారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదనే అభిప్రాయం ప్రజల్లో కలిగితే, అది న్యాయవ్యవస్థ మనుగడకే ప్రమాదకరం అవుతుందని తెలిపారు. 18న కోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ఈ కోర్టు చేసిన వ్యాఖ్యలు, విచారణ జరిగిన తీరును న్యాయవాదులు గమనించారని, వారి ద్వారా వాటిని తెలుసుకున్న స్టీఫెన్సన్ ఈ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసులో తమకు కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు అవసరం లేదని, తాము వ్యక్తం చేస్తున్న భయాందోళనలను పరిగణనలోకి తీసుకుని, కేసు విచారణ నుంచి తప్పుకుంటే చాలని ఆయన తెలిపారు. తరువాత మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... స్టీఫెన్సన్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని కేసు విచారణ నుంచి తప్పుకుంటే, కేసు ఓడిపోతానని అనుకున్న ప్రతీ వ్యక్తీ న్యాయమూర్తిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ విచారణ నుంచి తప్పుకోవాలని కోరతారని, చివరకు అది చెడు సంప్రదాయానికి దారి తీస్తుందని చెప్పారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్లో స్టీఫెన్సన్ పార్టీ కాదని, అటువంటి వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరమే లేదన్నారు. తరువాత గండ్ర మోహనరావు తిరిగి వాదనలు వినిపిస్తూ... పరిణామాలు అసాధారణంగా ఉన్నందునే ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోందని తెలిపారు. తమ పిటిషన్‌పై మత్తయ్య కౌంటర్ దాఖలు చేశారని, దానికి తాము సమాధానం ఇస్తామని మోహన్‌రావు తెలిపారు. అయితే రాతపూర్వకంగా ఆ సమాధానాన్ని రిజిస్ట్రీలో దాఖలు చేయాలని, దానిని పరిశీలించి సోమవారం ఈ అనుబంధ పిటిషన్‌పై నిర్ణయం వెలువరిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
‘ఓటుకు కోట్ల’లో లేదు రక్షణ
ఇది, తెలంగాణ-ఆంధ్ర ప్రజల మధ్య వివాదం కానే కాదు. ఒక హత్య జరిగితే ప్రభుత్వమే రంగంలోకి దిగి, హంతకుడి రక్షణకు అధికారాన్ని వినియోగించడం అసంబద్ధం, అసంగతం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం. ఇదీ అంతే. చట్టాలను, రాజ్యాంగాన్ని అధికార రాజకీయాలకు ముడి బెట్టడం రూల్ ఆఫ్ లాకు విరుద్ధం. ఓటుకు కోట్ల రూపాయల లంచం ఇవ్వడం రాజ్యాంగ సమస్యా? కాదు. నిందితుడి వ్యక్తిగత సమస్యా? తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమస్యా? ఇటీవలే జాతీయ పార్టీగా ప్రక టించుకున్న అఖిల భారత తెలుగుదేశం పార్టీ సమస్యా? స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు తమదో, కాదో తేల్చు కోలేని ఆ పార్టీ అధ్యక్షుడి సమస్యా? ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ సమస్యా? ఆ రాష్ట్ర ప్రజల సమస్యా? ఏదేమైనా ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజల సమస్య మాత్రం కాదు. నేరం జరిగితే అది ఆ కేసు దర్యాప్తుకు, న్యాయ విచారణకు సంబంధించిన సమస్య. లంచం ఇచ్చిన ఆరోపణకు గురైన నిందితుడు టీడీపీ సభ్యుడు కనుక అది ఆ పార్టీ సమస్య అనుకుంటే నేరాం గీకారపత్రం అవుతుంది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్య గానీ, ప్రజల సమస్య గానీ కాబోదు. ఇది కేవ లం నేర, న్యాయపాలనా వ్యవహారం మాత్రమే. టీడీపీ తెలంగాణలో కూడా అధికారం చేబట్టాలనే ఆశతో ఒక్క ఎంఎల్సీ సీటు కోసం తమ పార్టీ ఎమ్మెల్యే ద్వారా మరో ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కెమెరాలకు చిక్కి నిందితుడైతే, అది ఒక ఎమ్మెల్యే నేరానికి సంబంధించిన విషయం. అందులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా? లేదా? అనేది ఏసీబీ దర్యాప్తు చేసి నిర్ణయించాల్సిన అంశం. ఆ లంచం నేరపు బుర దను ఇతరులంతా ఎందుకు వంటికి పులుముకుంటు న్నట్టు? అంతే కాదు, ఈ బురదను ఏపీ ప్రభుత్వం నెత్తిన పోయడానికీ వీల్లేదు. ఇక ఇది, తెలంగాణ-ఆంధ్రా ప్రజ ల మధ్య ఘర్షణ గాని, వివాదం గాని, విభజన సంబం ధిత అంశం గాని కానే కాదు. కావాలని జనాన్ని ఈ ఊబిలోకి దించడం న్యాయం కాదు. ఒక హత్య జరిగితే మొత్తంగా ప్రభుత్వమే రంగంలోకి దిగి, హంతకుడిని రక్షించడానికి సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తే అది అసంబద్ధం, అసంగతం, అన్యాయం, రాజ్యాంగ విరు ద్ధం. ఇదీ అంతే. నేరం జరిగిందన్న ఆరోపణ వచ్చిన ప్పుడు నిజానిజాలు తేలేందుకు న్యాయంగా అన్ని ప్రభు త్వాలు సహకరించాలి. ఏసీబీని తన పని తాను చేసు కుపోనివ్వాలి. ఈ లంచం ఘటన వల్ల పార్టీ పరువు పోకుండా ఉండాలని అనుకోవడం సబబే. కానీ ఆ నేరా రోపణకు తగిన సాక్ష్యాలు లేవని కోర్టులు తేల్చే వరకు ఎదురు చూడవలసిందే. కోర్టులో ఆ కేసు వీగిపోక తప్ప దనే నమ్మకం ఉందా లేక లంచాలు ఇచ్చుకుంటూ కెమె రాలకు చిక్కిన తరువాత తప్పించుకోలేమనే అను మానం ఉందా? నేరాలను ప్రొత్సహించడానికి గాను వాక్ స్వాతం త్య్రాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్ల్లేదని రాజ్యాం గంలోని ఆర్టికల్ 19(2) వివరిస్త్తున్నది. ప్రైవసీని (వ్యక్తి గత గోప్యత) కూడా అందుకు వాడుకోవడానికి వీల్లేదు. నేరాలు చేయబోతున్నారని రూఢిగా సమాచారం అందిన తరువాత ఆ కాబోయే నేరగాళ్ల ఫోన్లను వింటారు, కద లికలపైన నిఘా వేస్తారు, వారిని కలిసే వారినీ గమ నిస్తారు. నేరాలను ఈ విధంగానే నివారిస్తారనీ, పరిశో ధిస్తారనీ, పాలనానుభవం ఉన్న వారికి తెలియజేయా ల్సిన అవసరం లేదు. ఇక టెలిఫోన్ ట్యాపింగ్ సమస్య. ఇది ఖచ్చితంగా ప్రైవసీ హక్కుకు భంగకరమైనదే. అది వాక్ స్వాతంత్య్రా నికి దెబ్బ అని పీయూసీఎల్ కేసులో సుప్రీంకోర్టు వివరిం చింది. నేరాలను ప్రోత్సహించడాన్ని నిరోధించడం కోసం, హోం కార్యదర్శి అనుమతిస్తే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునని కూడా అది వివరించింది. లంచం ఇవ్వ జూపిన వ్యక్తి ఫోన్‌ను, ఫిర్యాదు చేసిన స్టీఫెన్సన్ ఫోన్‌ను రికార్డ్ చేసినపుడు ఆ ఫోన్లో మాట్లాడిన గొంతులన్నీ నేరగాళ్లవి కాకపోయినా, ఆ లంచాన్ని సమర్థిస్తూ మాట్లా డిన గొంతెవరిదో వారు ఆరోపణలెదుర్కోవలసి వస్తుం దని నేర విచారణ ప్రక్రియా చట్టం వివరిస్తున్నది. హఠాత్తుగా మిలియనీరైన నీరా రాడియాకు చెందిన ఎనిమిది టెలిఫోన్లను ట్యాప్ చేసినపుడు అనేక మంది జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, డీఎమ్‌కే నాయకుల గొంతులు, మాటలు దొరికిపో యాయి. వారి అవినీతి కుతంత్రాలు బయటపడ్డాయి. టెలికం కుంభకోణం వెలుగు చూడటం కూడా అందు లోంచే మొదలైంది. రాజకీయ నాయకులు చేసే అవి నీతిని, దుర్మార్గాలను బయటపెట్టడం కోసం, దేశ భద్రత కోసం, ఫోన్ ట్యాపింగ్ చేయడం రాజ్యాం గబద్ధమైన చర్య. నీరా రాడియా ఫోన్లు ట్యాప్ చేసిన ప్పడు ఎందరో రాజ్యాంగ పదవీధరుల గొంతులు కూడా దొరికినా నాటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం పడి పోలేదు. ఆ టేపుల్లో గొంతులసొంతదార్లయిన నీరా రాడియా, రతన్ టాటా, డీఎంకే నేతలు, జర్నలిస్టులు తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టలేదు. సమ పాలన (రూల్ ఆఫ్ లా) నియమం ప్రకారం వంద రూపాయల లంచం తీసుకున్న ప్రభుత్వోద్యోగిని ఏ విధంగా విచారిస్తారో, అదే విధంగా అయిదు కోట్లు లంచం ఇవ్వజూపిన వ్యక్తులను కూడా విచారించాలి. వారెవరనేది నిర్ణాయక కారణం కాదు, కారాదు. నేరం రుజువైతేనే శిక్షించాలి. అప్పీలు చివరి దాకా తీసుకు పోవచ్చు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివ సించే వారి ప్రాణాలకు, ఆస్తులకు, స్వాతంత్య్రాల రక్షణ కోసం విభజన చట్టంలో సెక్షన్ 8 కొన్ని ప్రత్యేక బాధ్య తలను గవర్నర్‌కు ఇస్తున్నది. అవసరమైనప్పుడు ఈ బాధ్యతను నిర్వర్తించాలి. లంచం కేసు బయటకు వచ్చిం ది కాబట్టి ఇప్పుడు సెక్షన్ 8 అమలు చేయాలనడం అస మంజసం. పాలనాపరమైన అవసరాలకు శాంతి భద్ర తల సందర్భంలో మాత్రమే గవర్నర్ ఈ సెక్షన్ కింద బాధ్యతలను నిర్వర్తించాలి. లంచాలు ఇచ్చినప్పుడు కాదు. విశాఖలో లాయర్లు వేసిన న్యాయమైన ప్రశ్నకు జవాబు చెప్పడం ఏపీ ప్రభుత్వ బాధ్యత. professorsridhar@gmail.com (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) - మాడభూషి శ్రీధర్ -
డబ్బు రాజకీయం కుప్పకూలేను
దేశవ్యాప్తంగా సుప్రసిద్ధమైన ‘ఓటుకు కోట్లు’ అంశాన్ని అనే కులు అనేక విధాలుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయాలన్నీ అవినీతిమయమై పోయాయని, ప్రతిపార్టీ ఇదే విధంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసింది పెద్ద తప్పేమీ కాదనే వారు కొందరయితే, బాబు గారి మాటలు రికార్డు కాకుండా జాగ్రత్తలు తీసుకుని ఉం డాల్సిందని ఇంకొందరు బాహాటంగానే అంటున్నారు. ఇంకొందరు ఏది ఏమైనా ఖరీదైన రాజకీయాలు నడప డంలో బాబును అధిగమిం చేవారేలేరని, రేవంత్‌రెడ్డి అభినవ అర్జునుడని కూడా నిస్సిగ్గుగా కీర్తిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను చూసి నిశ్చేష్టులైన వారు రాజకీయాల పట్ల తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దొరికిన వారికైనా చట్టప్రకారం శిక్ష పడాలని మరికొందరు భావిస్తు న్నారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష ఎన్నికల రాజ కీయాల్లో ఉన్న నేనూ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగి పోతుండటం పట్ల వ్యక్తిగతంగా ఎంతో ఆవేదన చెందు తున్నాను, నాకూ తీవ్ర నిరసన ఉంది. ఎవరు ఎలా భావించినా నేనిది నిజాయితీగా చెబుతున్నా. ప్రస్తుత సమాజ నైజంలో, రాజకీయాల్లో మార్పు రావాలని కోరు కునే వాళ్లలో నేనూ ఒకడిని. నాకూ, మా పార్టీకి టీడీపీ జాతీయ నేత చంద్రబాబు నాయుడు శత్రువు కాదు, రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. అలా అని భలే దొరికాడని శత్రుపూరితంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం వివేకం కాదనే నా భావన. కోట్లు పెట్టి టీఆర్ఎస్ ఎమ్మె ల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేయడం నేరమని చంద్రబా బుకు స్పష్టంగా తెలుసు. రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాక నేరం గుట్టురట్టయిందనీ తెలుసు. తన ఆడియో బయటపడ్డాక మొత్తం తతంగమంతా రికా ర్డయి ఉందనీ బాబుకు ఎరుకే. దొరక్కముందు ఎవరైనా దొరలే, నీతిమంతులే. కానీ దొరికిన తర్వాత కూడా బుకాయిస్తే అసహ్యించుకుంటా రు, ఆగ్రహిస్తారు. రేవంత్ దొరి కిన వెంటనే బాబు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది. పోనీ బాబు ఆడియో బయటప డ్డాకైనా కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానంటే బావుండేదని నేను బలంగా భావిస్తున్నా. ఆ రెండూ చేయకుండా, నేరాన్ని ఖండించకుండా, ఆడియోలోని గొంతు తనదో కాదో చెప్పకుండా నేరాన్ని కప్పి పుచ్చేందుకు ఆయన చేస్తున్న లెక్కలేనన్ని తప్పులు చంద్రబాబు రాజకీయ చరిత్రకే మచ్చ అని చెప్పక తప్పదు. ఈ నేర చర్యను రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమ స్యగా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరిం చాలని చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చారిత్రక ద్రోహం. కుట్ర రాజకీయాలకు పెట్టింది పేరైన బాబు ఈ కేసును పక్కతోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను మరో కొత్త కుట్రని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ ఓటుకు కోట్లు కుంభకోణంతో ఇక ఏపీ పేద రాష్ట్రమంటే ఎవరూ నమ్మకపోవచ్చు. ఓటుకు కోట్లు కుమ్మరించే రాష్ట్రంగా భావించి సానుభూతి చూపాలని, సహాయం చేయాలని అనుకోకపోవచ్చు. ఈ కేసు వల్ల మన రాష్ట్ర గౌరవానికి భంగం కలగడమే కాదు, ఆర్థికవృ ద్ధికే విఘాతం కలిగే ప్రమాదం దాపురించింది. అవినీతి కేసులో ఇరుక్కున్న ఒక సీఎంను నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ఏ దేశాలు ముందుకు వస్తాయి? టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును గద్దెదిం చడం దగ్గర నుంచే చంద్రబాబు ఆర్థిక నేరాలు తీవ్రతర మయ్యాయి. కాకపోతే ఇంతకాలానికి ఆయన అసలు ముఖం బయటపడింది. ఆయన గత తొమ్మిదేళ్ల పాల నకు ‘చంద్రబాబు జమానా - అవినీతి ఖజానా’గా ప్రసిద్ధి చెం దింది. తర్వాత పదేళ్లు ప్రతిపక్షం లో ఉండగా సహాయపడ్డ పెట్టు బడిదారుల రుణాన్ని అధికారం లోకి రాగానే తీర్చుకోవడానికి వారికి రాజ్యసభ సభ్యత్వాలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులూ కట్టబెట్టారు. వారి సహాయంతో పెద్ద ఎత్తున ‘అవినీతి మిషన్’ను బాబు నేడు ప్రారంభించారు. కేవలం డబ్బుతో రాజకీయాలను శాసించవచ్చని నమ్ముతున్న బాబు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశాలాంటి తెలుగు వారు అధికంగా ఉండే రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి డబ్బు సంపాదన ఒక్కటే మార్గమని నమ్మినట్లున్నారు. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత టీడీపీ ఓడిపోతే పార్టీని నడుపు కోవడానికి ఇప్పుడే డబ్బు సమకూర్చుకోవాలని, డబ్బుంటేనే చిన్న బాస్ మాట చెల్లుబాటు అవుతుందని ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్టుంది. తదనుగుణం గానే ఈ ఏడాది పాలనలో విచ్చలవిడి అవినీతికి తెరలే పారు. పైకి నీతులు వల్లిస్తూనే రాజధాని ఎంపిక రహ స్యం, నిర్మాణ నిర్ణయం రహస్యం, సింగపూర్ ఒప్పం దాల రహస్యం, చివరకు పట్టిసీమ నిర్ణయ రహస్యం, అన్నీ ముందే రహస్య ఒప్పందాలు, బేరాలు కుదిరాకే ప్రకటించారు. ప్రతిపక్షాలను, ఇతర రాజకీయ పక్షాలను లెక్కచేయని నియంతగా మారారు. సిమెంట్ ధరల పెంపు, అధిక ధరలకు విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, మద్యం డిస్టిలరీలకు అనుమతులు, పరిశ్రమలకు రాయి తీల విడుదల, పట్టిసీమ టెండర్ల వ్యవహారం, రాజధాని ప్రాంతంలో 99 ఏళ్ల భూముల లీజుల వ్యవహారాలు ఇలాంటి అనేక నిర్ణయాల్లో వేల కోట్ల రూపాయల అవి నీతి జరుగుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడా నికి ఓటుకు కోట్లు వెదజల్లుతున్న నారావారికి చివరగా ఒక్కమాట. రాజకీయాలతో డబ్బును శాసించవచ్చేమో కానీ, కేవలం డబ్బుతోనే రాజకీయాలను శాసించలేమని గుర్తించాలి. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా అనుకూల విధానాలతోనే, ప్రజల మద్దతుతోనే ప్రజాస్వామిక రాజ కీయాలు నడుస్తాయి. డబ్బుతో మాత్రమే రాజకీయాలు చేస్తే ఏదో ఒక రోజు పేక మేడలా వారి వ్యవహారాలు కూలిపోతాయి. టీడీపీలో ఎంతో మంది సీనియర్ నాయ కులు, నిజాయితీ పరులున్నా ఏ ఒక్కరూ ఈ కేసులో తమ అధినేత నైతిక బాధ్యత వహించాలని బహిరంగం గా చెప్పకపోవడం బాధాకరం. పైగా ఆయనను వెన కేసుకు రావడం ఆ పార్టీ చరిత్రకే మాయని మచ్చ. ఓటుకు కోట్లు కేసును పక్కతోవ పట్టించే విధంగా ఫోన్ ట్యాపింగ్‌ను, సెక్షన్-8ని ముందుకు తెచ్చి ప్రజల మధ్య భావోద్వేగాలను రగిల్చేందుకు ఇరు రాష్ట్ర ముఖ్య మంత్రులు చేస్తున్న ప్రయత్నం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు మౌనం పాటిస్తూ పరోక్షంగా నేర చర్యకు దన్నుగా నిలు స్తున్నారు. వెంకయ్యనాయుడు లాంటి వారు వివాదా లను పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలం టున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ, టీడీపీ, టీఆర్ ఎస్‌లు ముగ్గురూ పరస్పర అవసరాలకు అనుగుణంగా గూడుపుఠానితో రాజీ ఒప్పందం చేసుకున్నట్లు అనుమా నం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ చేత దర్యాప్తు చేయించా లనే డిమాండ్ సమంజసమైనది. దీనికితోడు నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షించాల్సిందేననే విలువల పరిరక్షణకు తెలుగు సమాజం, మీడియా, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులు నిరంతరం ఉద్యమించాలి. (వ్యాసకర్త అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) మొబైల్: 82971 99999 - డా॥ఎన్.రఘువీరారెడ్డి -
బాబుగారి కథలు చెల్లవిక
చంద్రబాబు కథ: టేపులు అతికించినవి, ఎక్కడెక్కడో మాట్లాడితే.. వాటిని ఒక చోట పేర్చారు. నిజం: ఆడియో, వీడియో టేపులు కల్పితాలు కావు, ఇవి నిజమైనవేనంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్. చంద్రబాబు కథ: ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేసు... ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఏసీబీకి ఏం పని? నిజం : ఈ కేసు అవినీతి కేసని ఎన్నికలసంఘం తేల్చిచెప్పింది. ఏసీబీ కేసుకూడా ఫైల్ చేయొచ్చని స్పష్టంచేసింది. కోర్టు తీర్పు వచ్చాక ఈసీకూడా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. చంద్రబాబు కథ: ఆడియో, వీడియో టేపులను కోర్టులు పరిగణలోకి తీసుకోవు. నిజం : ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం డిజిటల్ పరికరాల్లో ఉన్నవీ ఆధారాలే. కాకపోతే వీటికి సర్టిఫికేషన్ అవసరం. అంటే... ఇవి కల్పితం కాదంటూ ఒక నిఫుణిడి ధృవపత్రం అవసరం. ఆపనికూడా పూర్తయ్యింది. ఒరిజనలే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే రిపోర్టు ఇచ్చింది. చంద్రబాబు కథ : సెక్షన్ - 8 అమలు చేయాలంటూ.. అటార్నీ జనరల్ గవర్నర్ కు లేఖ రాశారు నిజం: అలాంటి లేఖ ఏమీ రాయలేదు. అస్సలు సెక్షన్ - 8 కి, ఏసీబీ కేసుకు సంబంధం లేదని రాజ్ భవన్ వర్గాలు స్పష్టంచేయడం చంద్రబాబు కథ: నాతో సహా చాలామంది ఫోన్లను ట్యాప్ చేశారు. దాదాపు 120 మంది ఫోన్లను ట్యాప్ చేశారు. నిజం: ట్యాపింగ్ జరగలేదని టెలికాం కంపెనీలు స్పష్టంచేశాయి. 16 గంటల విచారణలో ఇదే విషయాన్ని చెప్పాయి. చంద్రబాబు కథ: మత్తయ్యకు తెలంగాణ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది. నిజం: మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదులో కూడా లేదు. కేసీఆర్ మనుషులంటూ చెప్పుకున్న కొందరు తనను బెదిరించారని మత్తయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు కథ: అవసరమైతే హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు పెడుతుంది. మాకు మేమే రక్షణ కల్పించుకుంటాం. నిజం: హైదరాబాద్ లో ఏపీ పోలీస్ స్టేషన్లు పెట్టడానికి వీల్లేదన్న కేంద్రహోంశాఖ. కర్నూలునుంచి తెప్పించిన పోలీసులనుకూడా తిరిగి వెనక్కి పంపిన ఏపీ డీజీపీ చంద్రబాబు కథ: హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంత ప్రజలను వేధిస్తున్నారు. నిజం : చంద్రబాబు తన రాజకీయాలకోసం తమను వాడుకోవద్దని హైదరాబాద్ సెటిలర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టిమరీ స్పష్టంచేసింది. చంద్రబాబు లేకున్నా... తాము భద్రంగానే ఉంటామని చెప్పారు. చంద్రబాబు కథ: 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానపడ్డారన్న చంద్రబాబు. నిజం: ఎవ్వరూ అవమానపడలేదన్న అఖిలపక్షనేతలు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. చంద్రబాబు తప్పులను జనంపై రుద్దొద్దని హెచ్చరిక. చంద్రబాబు లేకున్నా.. ప్రజలను చూసుకునేందుకు వ్యవస్థలున్నాయని స్పష్టంచేసిన నేతలు. -
మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. కేంద్ర హెంశాఖ పిలుపు మేరకే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గవర్నర్ ఢిల్లీకి పయనం కానున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటుకు వ్యవహారం మరింత ముదిరి ఇరు రాష్ట్రాల మధ్య పెను వివాదానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పురోగతిని గవర్నర్ వివరించే అవకాశం ఉంది. గవర్నర్ ఢిల్లీ పర్యటనతో హైదరాబాద్ నగరంలోని సెక్షన్ -8 అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్
-
ఇరకాటంలో తెలుగు తమ్ముళ్లు
-
స్టీఫెన్సన్ పిటిషన్‌పై మొదలైన వాదనలు
-
నేడో, రేపో చంద్రబాబుకు నోటీసులు
-
కేసు క్లైమాక్స్‌కు
⇒ ఆ టేపులన్నీ అసలైనవే.. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే! ⇒ ఏసీబీ కోర్టుకు ప్రాథమిక నివేదిక అందించిన ఎఫ్ఎస్ఎల్ ⇒ ఆ ఆడియో టేపులేవీ ట్యాపింగ్ రికార్డులు కావు.. ⇒ ఒక ఫోన్ నుంచి వచ్చిన కాల్‌ను మరో ఫోన్లో రికార్డు చేశారు ⇒ వీడియోలూ సరైనవేనని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం ⇒ నేడు ఈ నివేదికను అధికారికంగా తీసుకోనున్న ఏసీబీ అధికారులు ⇒ ఆ వెంటనే నోటీసుల ప్రక్రియ షురూ.. నేడో, రేపో చంద్రబాబుకు నోటీసులు ⇒ మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ⇒ రేవంత్ బెయిల్ కేసులో రేపు అదనపు కౌంటర్ దాఖలు చేయనున్న ఏసీబీ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఈ వ్యవహారానికి సూత్రధారి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడేనని తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికలో ధ్రువీకరించినట్లు తెలిసింది. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు అది ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అతికించినది కాదని... చంద్రబాబు స్టీఫెన్సన్ మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ‘ఒరిజినల్’ అని ఫోరెన్సిక్ స్పష్టం చేసినట్లు సమాచారం. బాబు మాట్లాడిన ఆడియో రికార్డు ట్యాపింగ్ వెర్షన్ కాదని.. అది ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు వచ్చిన కాల్‌ను రికార్డు చేసిన టేపు అని ధ్రువీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానానికి తమ ప్రాథమిక నివేదికను అందజేసింది. ఈ నివేదికను ప్రత్యేక కోర్టు నుంచి ఏసీబీ గురువారం అధికారికంగా తీసుకోనుంది. ఆ నివేదిక అందిన మరుక్షణమే ఏసీబీ రంగంలోకి దిగి.. ‘ఓటుకు కోట్లు’ కేసు సూత్రధారిగా భావిస్తున్న చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ‘‘గురువారం రాత్రి లేదా శుక్రవారం బాబుకు నోటీసులు జారీ చేస్తాం. నోటీసు అందుకున్న నాటి నుంచి వారం రోజుల్లో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇదే కేసులో మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసి వారిని 72 గంటల్లో విచారణకు హాజరు కావాలని కోరబోతున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినందువల్ల ఆయన బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని వారం రోజులు గడువు ఇవ్వాలని భావిస్తున్నాం..’’ అని ఏసీబీ వర్గాలు బుధవారం రాత్రి వెల్లడించాయి. చంద్రబాబు కంటే ముందే టీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎంపీలను విచారించనున్నట్లు తెలిపాయి. వెలుగులోకి వచ్చి 25 రోజులు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, రూ.50లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా సాగించిన బేరసారాల ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి కూడా. రేవంత్ ఏసీబీకి పట్టుబడి దాదాపు 25 రోజులు కావస్తోంది. ‘బాస్’ సూచనల మేరకే వచ్చానని రేవంత్ పదేపదే స్టీఫెన్‌సన్‌తో చెప్పడం, రూ.50లక్షల సొమ్ము ఇవ్వజూపడం, చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడడం వంటివాటన్నింటిపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసి.. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలను సంపాదించింది. తాజాగా స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబే అని నిర్ధారణ కావడంతో ‘ఓటుకు కోట్లు’ కేసు దాదాపుగా ‘క్లైమాక్స్’కు చేరింది. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన రేవంత్, ఆయనకు సహకరించిన ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికే జైలులో ఉన్నారు. నాలుగో నిందితుడు మత్తయ్య విజయవాడలో పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ హైకోర్టులో మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. హైకోర్టులో మత్తయ్య తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదికి లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారనేది తెలుసుకునేందుకు తెలుసుకునేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఇక రేవంత్ బెయిల్ కేసుకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో ఏసీబీ అధికారులు అదనపు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇందులో అనేక సంచలన విషయాలు ఉండవచ్చని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఫోరెన్సిక్ నివేదిక కూడా.. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం నుంచి గురువారం తీసుకోనున్న ఫోరెన్సిక్ నివేదికను కూడా ఏసీబీ తన అదనపు కౌంటర్‌తో జోడించనున్నది. స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సాగించిన సంభాషణలకు సంబంధించిన ఈ నివేదికలో అంశాల ఆధారంగా తాము చేపట్టదలచిన దర్యాప్తు వివరాలను ఏసీబీ హైకోర్టుకు నివేదించనుంది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిన తీరును హైకోర్టులో దాఖలు చేయబోయే కౌంటర్లో ఏసీబీ ఆధారాలతో సహా పేర్కొననున్నట్లు సమాచారం. దాదాపు పాతిక మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఆపరేషన్ సాగిన వైనాన్ని శుక్రవారం నాటి కౌంటర్లో నివేదించనుంది. చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక లోక్‌సభ మాజీ సభ్యుడు, ఇద్దరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించిన దానిపై ఏసీబీ ఇప్పటికే తగిన ఆధారాలను సిద్ధం చేసుకుంది. రేవంత్‌తో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు దాదాపు రూ.2 కోట్లు సమకూర్చిన ఇద్దరు రాజ్యసభ సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైకోర్టుకు ఏసీబీ నివేదించనున్నది. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే వెంకట వీరయ్య ఏపీ ప్రభుత్వ సహకారంతో ఆ రాష్ట్రంలో తలదాచుకున్న సంగతిని కూడా వివరించనుంది. -
సీఎంతో స్టీఫెన్సన్ భేటీ
గంటల తరబడి మంతనాలు కేసీఆర్‌తో కలసి ఫామ్‌హౌస్‌లో చక్కర్లు గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారాన్ని బయటపెట్టిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ బుధవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయన.. గంటల తరబడి మంతనాలు జరిపారు. ‘ఓటుకు కోట్లు’ కేసు ఊపందుకున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం మధ్యాహ్నం సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఫాంహౌస్‌కు వచ్చారు. పలు అంశాలపై సీఎం కేసీఆర్‌తో చర్చించి.. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం కేసీఆర్‌తో స్టీఫెన్సన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఓటుకు కోట్లు’ కేసుపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. అంతేగాకుండా స్టీఫెన్‌సన్‌తో కలసి సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఫామ్‌హౌస్‌లో చక్కర్లు కొట్టారు. వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ సాగు పనులను పరిశీలిస్తూ.. మాట్లాడుకున్నారు. రాత్రి సమయంలో స్టీఫెన్సన్ వెళ్లిపోయారు. కాగా సీఎం కేసీఆర్ ఆదివారం వరకు ఫామ్హుస్లోనే ఉంటారని సమాచారం. -
స్టీఫెన్సన్ పిటిషన్‌పై మొదలైన వాదనలు
* తదుపరి విచారణ నేటికి వాయిదా * అప్పటివరకు మత్తయ్య అరెస్ట్‌పై స్టే కొనసాగింపు * స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు * రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడు జెరూసులేం మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. దాదాపు అరగంటపాటు వాదనలు విన్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బులుసు శివశంకరరావు తదుపరి వాదనల నిమిత్తం విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసును జస్టిస్ శివ శంకరరావు విచారిస్తే తమకు న్యాయం జరగదని, అందువల్ల ఈ కేసు విచారణను తప్పుకోవాలంటూ స్టీఫెన్సన్ మంగళవారం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తనపై కేసు కొట్టేయాలంటూ గత వారం మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తదుపరి విచారణ నిమిత్తం బుధవారానికి వాయిదా వేసిన సంగతీ విదితమే. స్టీఫెన్సన్ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు మధ్యాహ్నం 3.30 గంటలకు వాదనలు ప్రారంభించారు. మత్తయ్య పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ సందర్భంగా కోర్టు హాలులో చోటు చేసుకున్న పరిణామాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఒక రాష్ట్రంలోని అధికార పార్టీ, మరో రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఓట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నించిందని తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు పిటిషనర్ స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని వివరించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితులైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బిషప్ సెబాష్టియన్ హారీ, ఉదయసింహాలను అరెస్ట్ చేశారని, మరో నిందితుడు మత్తయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. అటువంటి మత్తయ్యను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, టీడీపీ శక్తివంచనలు లేకుండా పని చేస్తున్నాయని కోర్టుకు నివేదించారు. అందులో భాగంగానే ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు గత విచారణ సమయంలో మత్తయ్య తరఫున హాజరయ్యారని తెలిపారు. పిటిషనర్ కోర్టుకు ఎటువంటి దురుద్దేశాలను ఆపాదించడం లేదని విన్నవించారు. అయితే కోర్టుల్లో న్యాయమూర్తులు ఎలా వ్యవహరించాలన్న విషయంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో పలు తీర్పులు వెలువరించిందంటూ వాటిని చదవడం ప్రారంభించారు. అంతలో కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ సమయంలో మత్తయ్య తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా స్పందిస్తూ... మత్తయ్య అరెస్ట్‌పై ఇచ్చిన స్టే నేటితో (బుధవారం) ముగియనుందని, అందువల్ల దాన్ని పొడిగించాలని కోరారు. స్టీఫెన్సన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తాను నిర్ణయం వెలువరించేంతవరకు లేదా ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుని వేరే న్యాయమూర్తి ఈ కేసు విచారణ చేపట్టేంతవరకు మత్తయ్య అరెస్ట్‌పై స్టే కొనసాగుతుందంటూ జస్టిస్ శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా అంతకుముందు ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. ఈ కేసులో మరిన్ని అదనపు వివరాలను కోర్టు ముందుంచదలిచామని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ఏసీబీ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి న్యాయమూర్తిని కోరారు. దీనికి న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు. న్యాయమూర్తి తప్పుకోనవసరం లేదు ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావును అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై జెరుసలేం మత్తయ్య కౌంటర్ దాఖలు చేశారు. న్యాయమూర్తులను కేసుల విచారణ తప్పుకోవాలంటూ దాఖలయ్యే పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సుబ్రతో రాయ్ సహారా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఆ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ స్టీఫెన్సన్ దాఖలు చేసిన ఈ అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని మత్తయ్య తన కౌంటర్లో కోర్టును కోరారు. తాను దాఖలు చేసిన పిటిషన్ గురించి న్యాయమూర్తి ముందు ప్రస్తావించే విషయంలో తన తరఫు న్యాయవాదులు అనుసరించిన తీరును ఆయన సమర్థించుకున్నారు. -
రేవంత్ టేపులు చెబుతున్న నిజాలు
దేశ రాజకీయాల్లో అనేక చర్చలకు కేంద్ర బిందువైన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఈ సందర్భంగా అనేక నూతన అంశాలను చర్చలోకి తేవా ల్సిన అవసరం ఉంది. రేవంత్‌రెడ్డి సంభాషణ సారాంశాన్ని గమనిస్తే టీడీపీ ఎంత వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నదో సామాన్యులకు సైతం తెలిసిపోతుంది. వాటి ఆధారంగా బీసీ లకు సంబంధించిన రాజకీయ భవిష్యత్తు గురించి ఆ పార్టీ ఏమ నుకుంటున్నదో విశ్లేషించడం అవసరం. స్టీఫెన్‌సన్‌తో జరిపిన సంభాషణల్లో రేవంత్ తానే భవిష్యత్తు టీడీపీ అధ్యక్షుడినని, 2019 నాటికి తెలంగాణ సీఎం అభ్యర్థిగా కీలక భూమిక వహిస్తానని చెప్పుకోవడం కనబడుతుంది. తమది బీసీల పార్టీ అని, వారిని ఉద్ధరించింది తామేనని బాబు తరచూ చెబుతుంటారు. కానీ ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీని కాకుండా రేవంత్ సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపికచేశారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణనో లేదా మరో సీనియర్ బీసీ నేతనో ఎంపికచేసి ఉండేవారు. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పిం చాయి. కాంగ్రెస్ అన్ని ఒత్తిళ్లనూ తట్టుకుని, ఉద్దండులను సైతం పక్కన బెట్టి బీసీ వర్గాలకు చెందిన మహిళకు అవకాశం ఇచ్చింది. తెలంగాణలో తాము అధికారంలోకొస్తే బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్యను సీఎంను చేస్తామన్న బాబు...తదనంతర పరిణామాల్లో ఆయనకు ఏ పదవీ ఇవ్వలేదు. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎర్రబెల్లిని, ఉప నేతగా రేవం త్ను నియమించారు. బీసీల విషయంలో బాబు ఆది నుంచీ ఇలాగే వ్యవహరిస్తున్నారు. రేవంత్ సంభాషణతో టీడీపీలో బీసీలకు భవిష్యత్తు లేదనే అంశం తేలిపోయింది. అధికారంలో ఉండగా ప్రకటించిన వ్యూహ పత్రాల్లోని హామీల్లో 2004లో దిగిపోయే వరకూ టీడీపీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 2008లో వరంగల్ బీసీ గర్జనలో బీసీలకు 100 సీట్లు ఇస్తామని ప్రకటిం చి దాన్ని నిలుపుకోలేకపోయారు. అంతకన్నా ముందుకు వెళ్తే 1983లో అధికారంలోకొచ్చిన ఎన్టీఆర్ సైతం ఉమ్మడి రాష్ట్రంలో బీసీల రాజ్య స్థాపన దిశలో ఒక్క అడుగైనా ముందుకేయలేకపోయారు. 1985లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలేజీ హాస్టళ్లను రద్దుచేసి వేలాదిమంది ఉన్నత విద్యను అందుకోకుండా చేసిన ఘనత టీడీపీదే. కాంగ్రెస్, టీడీపీల పదేళ్ల పాలనలో బీసీల ప్రగతి ఎలా ఉందో పరి శీలిద్దాం. 1994-2004 మధ్య టీడీపీ సర్కారు బీసీలకు కేటాయించింది రూ. 1,580 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సగటున రూ. 158 కోట్లు. దివంగత నేత డాక్టర్ వైఎస్ పాలన నుంచీ పరిశీలిస్తే 2004-2014 మధ్య కాంగ్రెస్ సర్కారు సగటున ఏడాదికి రూ. 1,000 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో బీసీల స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు ఎగ్గొడితే...వారు రక్తం అమ్ముకుని చదువుకున్నారు. అయితే, డాక్టర్ వైఎస్ అధికారంలోకొచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభిం చడంతో లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులతో ప్రయోజ కులయ్యారు. పైగా బీసీ కుల ఆర్థిక ఫెడరేషన్ల కోట్లాది బకాయిలు రద్దుచేయడమే కాక వాటిని ఆర్థికంగా పరిపుష్టం చేశారు. అట్టడుగు బీసీ కులాలకు ప్రత్యేక ఫెడరేషన్లు నెలకొల్పారు. అంతేకాదు...బీసీలకు 100 సీట్లు ఇస్తామన్న హామీ జోలికి పోకుండానే మెజారిటీ స్థానాలు వారికి ఇప్పించే ప్రయత్నం చేశారు. సామాజికంగా అత్యధిక ఓట్లు లేకున్నా, ఆర్థికంగా సరితూగలేకపోయినా దాసరి అనే అతి చిన్న బీసీ కులానికి చెందిన ఈ వ్యాసకర్తను 2009 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ స్థానం నుంచి పోటీ చేయించారు. ఇలాంటి చరిత్ర బాబుకు ఉందా? ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీలు డాక్టర్ లోహియా సిద్ధాం తం వెలుగులో 1967 నుంచీ అధికారంలోకి వస్తున్నారు. మన దగ్గర కూడా అందరూ మేల్కొని సంఘటితమైతే...టీడీపీపై భ్రమలు వీడితే సొంతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. టీడీపీ ఆంతర్యమేమిటో, ఆ పార్టీలో బీసీల భవిష్యత్తు ఏమిటో రేవంత్ చెప్పకనే చెప్పారు. దీన్ని గుర్తించి స్వశక్తితో ఎదగడానికి బీసీలు కృషిచేయాలి. (వ్యాసకర్త బీసీ కమిషన్ పూర్వ సభ్యులు) మొబైల్: 98499 12948 డా॥వకుళాభరణం కృష్ణమోహనరావు -
టవర్లు తొలగించేలా ఉద్యమాలొస్తాయి
* టెలికం సర్వీస్ ప్రొవైడర్లను బెదిరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు * ‘ఓటుకు కోట్లు’లో తమకు అనుకూల అంశాలు బహిర్గతం చేయాలని ఒత్తిడి * విజయవాడలో ముగిసిన ప్రొవైడర్ల విచారణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు కౌంటర్‌గా నమోదైన కేసుల దర్యాప్తులో టెలికం సర్వీసు ప్రొవైడర్లను ఏపీ ప్రభుత్వం బెదిరిస్తోంది. సెల్ టవర్లు తొలగించేలా ప్రాంతాల వారీగా ఉద్యమాలు వస్తాయని, ఆ తరువాత మీరే నష్టపోవాల్సి వస్తుందని టెలికం సంస్థలను హెచ్చరిస్తోంది. విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్లో రెండో రోజైన మంగళవారం విచారణ కొనసాగించిన సిట్ బృందం.. సర్వీసు ప్రొవైడర్లను భయభ్రాంతులకు గురయ్యేలా బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. సిట్ శనివారం ఇచ్చిన నోటీసుల మేరకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరయ్యారు. నోటీసుల్లో అడిగిన ‘ట్యాపింగ్’ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యం కాదంటూ ప్రొవైడర్లు తేల్చిచెప్పడంతో.. కొందరు ‘ప్రభుత్వ పెద్దలు’ రంగంలోకి దిగి ప్రొవైడర్లను బెదిరించే ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. ‘అనుకూల’ వివరాలివ్వండి.. సిట్ బృందం అడిగిన వివరాలతో పాటు తమకు అనుకూలంగా మారే అంశాలు ఉంటే వాటినీ బయటపెట్టాలని ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. తాము చేసిన హెచ్చరికలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని, ఒక వేళ వస్తే సర్వీస్ ప్రొవైడర్లే స్వయంగా వాటిని ఖండించాలని చెప్పినట్లు సమాచారం. మరోపక్క సిట్ అధికారులు విజయవాడలో చేపట్టిన విచారణ మంగళవారంతో ముగిసింది. దాదాపు 15 మంది అధికారులతో కూడిన బృందం ఒక్కో సర్వీసు ప్రొవైడర్‌ను నాలుగు నుంచి ఐదు గంటల పాటు విచారించింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ పోలీసులు రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయని, గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణ అధికారులు చేపట్టిన ట్యాపింగ్స్ వివరాలు అందించాలని వారిపై సిట్ ఒత్తిడి తెచ్చిందని తెలుస్తోంది. వివరాలివ్వడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా ఆ చర్య అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్ యాక్ట్) ఉల్లంఘన కిందకి వస్తుందని టెలికం కంపెనీల ప్రతినిధులు చెప్పినా సిట్ పెడచెవిన పెడుతోంది. ఈ తతంగాన్ని వీడియో రికార్డు చేస్తూ, ఇక్కడే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ పరుష పదజాలం వాడి సర్వీస్ ప్రొవైడర్ ప్రతినిధుల్ని బెదిరించినట్లు తెలిసింది. ఇలావుండగా, టెలికం సర్వీసు ప్రొవైడర్ల విచారణ అంకం ముగియడంతో దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సిట్ చీఫ్ డీఐజీ ఇక్బాల్‌కు అందించడానికి ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఇక్బాల్‌తో పాటు డీజీపీ రాముడికీ ఈ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు మత్తయ్య కేసులో 20 రోజుల కాల్ డేటా ఇవ్వాలని కోరుతూ సీఐడీ పోలీసులు విజయవాడలోని మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. -
రేవంత్ కు బెయిల్ ఇవ్వొద్దు: ఏసీబీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో తెలంగాణ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేసు కీలకదశలో ఉన్నందున రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దని ఏసీబీ హైకోర్టును కోరింది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీచేసినా విచారణాధికారి ముందు హాజరు కాలేదని ఏసీబీ తన పిటిషన్ లో పేర్కొంది. మరో నిందితుడు ముత్తయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని హైకోర్టుకు విన్నవించింది. ఇటువంటి కీలక సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇస్తే.. విచారణకు ఆటంకం ఏర్పడుతుందని ఏసీబీ అధికారులు తమ కౌంటర్ పిటిషన్లో హైకోర్టుకు వివరించారు. -
'ఏపీలోనూ బాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ విమర్శించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయి రెండు రాష్ట్రాల ప్రజల సమస్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో ఇంత జరిగిన తర్వాత కూడా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇతర పార్టీల నేతలను నెల్లూరులో దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు ఎటువంటి ఢోకా లేదని మంత్రి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో చేస్తున్న రాజకీయాలు చూసి ప్రజలే ఆయనను అసహ్యించుకుంటున్నారని మంత్రి తలసాని యాదవ్ వ్యాఖ్యానించారు. -
'ఓటుకు నోటు కేసులో 2 రాష్ట్రాల సీఎంలు దొంగలే'
నిజామాబాద్: 'ఓటుకు నోటు' కేసు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సెక్షన్ 8 ను అమలు పరిచే అవసరం లేదన్నారు. కానీ ఈ సెక్షన్ 8 ను హైదరాబాద్ లో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
'దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదు'
హైదరాబాద్: దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల కోసం, దొంగల కొరకు రాజ్యాంగ పరమైన సంస్థల జోక్యం ఉంటుందని మేం అనుకోవడంలేదని పేర్కొన్నారు. సెక్షన్-8 పై అనవసర గందరగోళం సృష్టిస్తున్నారంటూ కేకే మండిపడ్డారు. సెక్షన్-8 పై గవర్నర్ నరసింహన్ కు ఎలాంటి ఆదేశాలు వచ్చినట్లు ఇప్పటికీ సమాచారం లేదన్నారు. ఒక దొంగను పట్టుకుంటే..అసలు దొంగ పార్టీ అధ్యక్షుడని దొరికిన దొంగే చెప్పాడని వివరించారు. ఓటుకు కోట్లు కేసును సెక్షన్ 8 తో ముడిపెట్టవద్దని కేకే హితవు పలికారు. శాంతి భద్రతల అంశం ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానిదేనని, ఆ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రిమినల్ విచారణలో ఎవరూ జోక్యం చేసుకున్నా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కేకే పేర్కొన్నారు. -
'దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదు'
-
బాబు ఆటంకాలు సృష్టిస్తున్నారు : కేసీఆర్
-
గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్
-
గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు కోట్లు' కేసు పురోగతిపై కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే సెక్షన్ 8, అటారీ జనరల్ సలహాల ప్రచారంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా సెక్షన్-8ను తెరపైకి తేవడంపై గవర్నర్ వద్ద కేసీఆర్ నిరసన తెలిపినట్లు సమాచారం. కాగా అంతకు ముందు కేసీఆర్ ...ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నగవర్నర్
-
ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న నరసింహన్
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ కానున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...గవర్నర్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. 'ఓటుకు కోట్లు' కేసు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
'పీఠం కదిలిపోతున్న టీడీపీ బుద్ధి మారలేదు'
-
’ఓటుకినోట్లు’కేసు గవర్నర్ చేతికి!
-
’సిట్’కి చుక్కెదురు..?
-
‘సిట్’కు చుక్కెదురు?
* విచారణకు హాజరైన టెలికం సర్వీసు ప్రొవైడర్లు * ఆ వివరాలు ఇచ్చేది లేదన్న కంపెనీల ప్రతినిధులు * భద్రపరచి ఉంచాలని ఆదేశించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు వెలుగులోకి వచ్చిన తరవాత తెలంగాణపై చేస్తున్న కౌంటర్ ఎటాక్‌లో భాగంగా నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న ‘సిట్’కు చుక్కెదురైనట్లు తెలిసింది. వీరిచ్చిన నోటీసుల మేరకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు సోమవారం విచారణకు హాజరయ్యారు. అయితే మీరడిగిన ‘ట్యాపింగ్’ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యంకాదంటూ ఆయా కంపెనీల ప్రతిని ధులు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనిపై కోర్టును ఆశ్రయించాలంటే ‘పరిధి’ పరమైన ఇబ్బందులొస్తాయని భావించిన అధికారులు ఆ వివరాలను భద్రపరచి ఉంచాల్సిందిగా ఆదేశించి సరిపెట్టారని తెలుస్తోంది. తెలంగాణపై కౌంటర్ ఎటాక్‌లో భాగంగా ఏపీలో నమోదైన 88 కేసుల దర్యాప్తును చేపట్టిన సిట్ ప్రధానంగా ‘ట్యాపింగ్’పై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలు, పూర్తి వివరాలు సమర్పించాలంటూ శనివారం 12 టెలికం కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో తమ ప్రతినిధులు, నోడల్ ఆఫీసర్లను ఆయా కంపెనీలు సోమవారం విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు పంపాయి. సిట్ సభ్యులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ఏఎస్పీ దామోదర్ తదితరులు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ‘ట్యాపింగ్’పై విచారణ అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని, దీనికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా టెలికం మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమించిన అధికారి/కమిటీకి మాత్రమే ఇస్తామని విచారణలో పాల్గొన్న ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. రహస్యమైనదిగా పరిగణించే ఓ పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలను మరో రాష్ట్ర పోలీసులకు ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారని తెలిసింది. ఈ పరిణామంతో కంగుతిన్న సిట్ అధికారులు తొలుత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించి న్యాయ నిపుణుల్ని సంప్రదించారు. ఈ కేసుల దర్యాప్తులో ప్రాథమికంగా పరిధి సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లు అనుమానిస్తున్న నేరం/నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదైన విషయం నిపుణులు గుర్తుచేశారు. దేశమంతటా ఒకే చట్టం అమలులో ఉన్నప్పటికీ ఒక ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన కేసుల్ని దర్యాప్తు చేసే అధికారం మరో ప్రాంత పోలీసులకు ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న నంబర్లకు సంబంధించిన పూర్తి సాంకేతిక సమాచారాన్ని భద్రపరచి ఉంచాలని కంపెనీల ప్రతినిధులకు చెప్పినట్లు తెలిసింది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న సీఐడీ మత్తయ్య ఫిర్యాదు మేరకు విజయవాడ సత్యనారాయణపురంలో నమోదైన కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మత్తయ్య విజయవాడ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోను సైతం ట్యాపింగ్‌కు గురైనట్లు పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై సీఐడీ అధికారులు దృష్టి పెట్టారు. నేరుగా అడిగితే సర్వీసు ప్రొవైడర్ల నుంచి ‘ట్యాపింగ్’కు సంబంధించిన వివరాలు వచ్చే అవకాశం తక్కువని భావించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో పరిధి సమస్య లేకపోవడంతో ఆయా వివరాలు తమకు ఇచ్చేలా కంపెనీలను ఆదేశించాలని కోరుతూ సోమవారం విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేశారు. మరోపక్క ఏపీ డీజీపీ జేవీ రాముడు సోమవారం ‘సిట్’, సీఐడీ చీఫ్‌లతో తన కార్యాలయంలో భేటీ అయ్యారు. కేసుల దర్యాప్తు తీరుతెన్నుల్ని సమీక్షించారు. -
'పీఠం కదిలిపోతున్న టీడీపీ బుద్ధి మారలేదు'
ప్రకాశం: స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడంపై ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు ఓటుకు కోట్లు కేసు నడుస్తున్నా కుక్క తోక వంకరన్నట్టు టీడీపీ బుద్ధి మారలేదని ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఓ లాడ్జీలో ప్రకాశం జిల్లా ఎంపీటీసీలను దాచేశారు. దీన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసివెళ్లి ఎంపీటీసీలను పక్కగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఓ పక్క ఓటుకు నోటు కేసులో పీఠం కదిలిపోతున్న అధికార టీడీపీకి సిగ్గురావడం లేదని విమర్శించారు. అయితే తాము మొదటి నుంచి అనుమానించినట్లే.. తమ సభ్యులను ప్రలోభపెట్టి టీడీపీ క్యాంప్‌కు తరలించదంటూ దుయ్యబట్టారు. ఇందులో భాగంగా టీడీపీ ప్రకాశం జిల్లాకు చెందిన తమ ఎంపీటీసీలను నెల్లూరు లాడ్జీలో నిర్భంధించారని చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలపై ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టీడీపీ నేతలపై చర్య తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.