ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-8పై ఉన్న వివాదాన్ని కేంద్ర హోం కార్యదర్శి గోయల్ పరిష్కరిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఇక్కడి తన కార్యాలయంలో జమ్మూకశ్మీర్‌కు ప్యాకేజీ అంశంపై విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం విలేకరులతో ముచ్చటించినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సెక్షన్-8పై కేంద్రం జోక్యం ఉంటుందా? అని ప్రశ్నించగా... ‘ఈ విషయమై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం. ఈ వివాదాన్ని ఆయన పరిష్కరిస్తారు..’ అని బదులిచ్చారు.