ఓటుకు నోట్లు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. కోర్టుకు ఉన్న విస్తృతమైన అధికారాలతో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి కేసును విచారించాలని ఉండవల్లి కోరారు. తప్పుచేసిన ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్న ఆయన.. రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.