* వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి
* పబ్లిసిటీ ఫిలిం షూటింగ్ కోసం 29 ప్రాణాలు బలిగొన్న
* బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుదే
* ఇదే విషయాన్ని పార్లమెంటుకు వివరిస్తాం
* ప్రత్యేక హోదాతోపాటు ‘ఓటుకు కోట్లు’ అంశాన్నీ లేవనెత్తుతాం
* మార్పులు చేయకపోతే భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదు
* వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎంపీల భేటీ
* పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
(లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బుట్టారేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి)
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్‌లో భక్తుల ప్రాణాలు బలిగొన్న తొక్కిసలాట ఘటనను పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తేవాలని ప్రయత్నిస్తున్న భూసేకరణ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు గుమ్మరించిన చంద్రబాబుకు సంబంధించిన ‘ఓటుకు కోట్లు’ కేసును కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని తీర్మానించింది. ప్రత్యేకహోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపైన కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయించింది.
ఈ నెల 21 నుంచి ప్రారంభమవనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం సహచర ఎంపీలతో కలసి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన సొంత ప్రచారంకోసం ఒక డాక్యుమెంటరీ తీయడానికి రాజమండ్రి పుష్కరాలను వేదికగా చేసుకోవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణానికి కారణమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనకు పూర్తిబాధ్యత చంద్రబాబుదేనంటూ.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ పదవిని గెలవాలన్న ఉద్దేశంతో కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి జరిగిన వ్యవహారాన్నీ పార్లమెంట్‌లో లేవనెత్తుతామన్నారు. ఇందులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీనిపై చర్చ జరగాలని కోరతామన్నారు.
మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపైనా..
ధాన్యం రైతులకు మద్దతుధరను ప్రభుత్వం కేవలం రూ.50 మాత్రమే పెంచిందని, దీనిని మరింత పెంచాలని కోరతామని మేకపాటి చెప్పారు. ఎంఎస్‌పీ ధర పెంపుతోపాటు ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణను ఏడాదికేడాది తగ్గిస్తున్న వైనంపైనా సభలో చర్చ కోరతామన్నారు. 2013-14లోకన్నా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ సగానికి సగం తగ్గిపోయిందని, ఈ ఏడాది మరింత తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఇలాంటి చర్యలవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికోసం ఎక్కువగా నీటి వృ థా చేయడంవల్ల రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూ రు జిల్లాల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ చర్యకు వై ఎస్సార్‌సీపీ వ్యతిరేకమని ఆయన చెప్పా రు. తప్పనిసరిగా శ్రీశైలంలో నిర్ణీతస్థాయిలో నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పార్లమెం ట్‌లోనూ ప్రస్తావిస్తామన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గత పార్లమెంట్ సమావేశాల్లోనూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిందని.. రెండుసార్లు ఈ అంశాన్ని జీరోఅవర్‌లో ప్రస్తావించామని ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరులడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్లకార్డులతో సభలో ఆం దోళన చేయడాన్నీ గుర్తుచేశారు. సమావేశంలో మేకపాటితోపాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, పెద్దిరెడ్డి మి థున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలున్నందున హాజరవలేదు.
విభజన బిల్లులోని అంశాల అమలుకు పోరాటం..
ప్రస్తుత ఆర్డినెన్స్ రూపంలో ఉన్న భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదని మేకపాటి స్పష్టం చేశారు. మూడు.. నాలుగు పంటలు పండే భూముల్ని తీసుకోవడం, సామాజిక ప్రభావ అంచనా(సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్) చేయకుండా, రైతుల అంగీకారం లేకుండానే భూములు లాక్కోవడం వంటి ప్రక్రియలకు తమ పార్టీ మొదటినుంచీ వ్యతిరేకమని చెప్పారు. ఆ మూడంశాల్లో రైతులకు ఆమోదయోగ్యంగా మార్పులు చేసినట్లయితే బిల్లుకు తాము మద్దతిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు అంశాలపై పార్లమెంట్‌లో పోరాడతామన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుతోపాటు విభజన బిల్లులో పేర్కొన్న అన్నిఅంశాల అమలుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
తొక్కిసలాట ఘటనపై పార్లమెంటులో నిలదీస్తాం
Published Sun, Jul 19 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement