mekapati rajamohan reddy
-
చంద్రబాబు ప్రజాజీవితానికి పనికిరారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అతి సామాన్య కుటుంబంలో జన్మించి, రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో సాగించిన మాజీ సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం గుర్తుంచుకోదగ్గ ఒక్క పనిచేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రజాజీవితానికి పనికిరారనే అంశం స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు.దివంగత సీఎం వైఎస్సార్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ప్రజల పక్షాన మూడు దశాబ్దాలకుపైగా పోరాటాలు చేసి ఆయన సీఎం అయిన అంశాన్ని ప్రస్తావించారు. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తిరుగులేని ప్రజానేతగా వైఎస్సార్ అవతరించారన్నారు. వైఎస్సార్‌తో కలిసి కాంగ్రెస్‌లో పనిచేశానని, ఆయన మరణంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులతోపాటు కోట్లాది అభిమానుల మనోభావాల్లో అనూహ్యమైన మార్పొచి్చందని తెలిపారు. జగన్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర చేయాలని భావిస్తే, కొందరి మాటలను విని పార్టీ అధిష్టానం అడ్డుకుందని చెప్పారు. ఈ క్రమంలో తాము ఆయనకు అండగా నిలిచామన్నారు. జగన్‌తో తన కుమారుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడిన అనంతరం తాను ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డి బరిలో దిగారని, ఆయనకు మద్దతుగా అప్పటి రాష్ట్ర, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి తనను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన అంశాన్ని గుర్తుచేశారు. అయినా తాను 2.92 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందానని తెలిపారు. ప్రజల గుండెల్లో జగన్‌కు సుస్థిర స్థానం వివిధ సంక్షేమ పథకాలు, నూతన ఒరవడితో ప్రజల హృదయాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి సుస్థిరస్థానం సంపాదించుకున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లోనే ఆయన్ని సీఎం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అయితే పచ్చమీడియా, టీడీపీ దు్రష్పచారంతో ఆ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను గెల్చుకుని అఖండ విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డిపై ప్రజాభిమానం మరింత ఎక్కువైందని, వై నాట్ 175 అనే పిలుపు అక్షరసత్యం కానుందని పేర్కొన్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం సభలకు అశేష ప్రజాదరణ లభిస్తోందని, రానున్న ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించనుందనే అంశం దీని ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు. చరిత్రహీనులుగా మిగలడం ఖాయం ప్రజాబలం లేని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వంటి వారు సీఎంపై దాడులకు ఉసిగొల్పి చరిత్రహీనులుగా నిలిచిపోనున్నారని ధ్వజమెత్తారు. సీఎంపై ఇటీవల రాయితో దాడిచేశారని, ప్రజాశీస్సులు మెండుగా ఉన్న కారణంగా ఆయనకు పెనుప్రమాదం తప్పిందన్నారు. ఈ హత్యాయత్నం వెనుక అసలు దోషి చంద్రబాబు కాదా అని ప్రశి్నంచారు. సంక్షేమసారథి జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు నుంచి తన కుమారుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి నుంచి తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించనున్నారని చెప్పారు. నెల్లూరు లోక్‌సభతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు. -
పవన్ కళ్యాణ్ వెళ్లి సినిమాలు చేసుకో: రాజమోహన్ రెడ్డి
-
బయటపడ్డ మోడీ మనసు బాబు కు ఇదే ఘోర అవమానం
-
తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం
ఆత్మకూరు: దివంగత మంత్రి, తన సోదరుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉన్నతంగా ఉండేవని, ఆయనతో ఉండే అనుబంధంతో తాను చిన్న వయసులోనే ఈ విషయాన్ని గమనించానని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఏడీఎఫ్, ఎంజీఆర్ ఫౌండేషన్ల ద్వారా సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్‌ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్న ఈ సభలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి మాట్లాడారు. 1995లో లండన్‌లో చదువు పూర్తి చేసుకొని దేశంలో అడుగుపెట్టిన గౌతమ్‌రెడ్డి అప్పట్లో మాల్ లాంటివి లేకపోవడంతో అది ఏర్పాటు చేసే ఆలోచన చేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయిందని, ఇచ్చిన మాట మేరకు తొలి కానుకగా మున్సిపల్ బస్టాండ్‌ను ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పలు వినతులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఏడీఎఫ్ ద్వారా రూ.10 కోట్ల సొంత నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నుడా పరిధిలో చేరడం సంతోషకరమని, పేదలకు మరో 15 వేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించగా, శనివారం మరో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 23 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. నారంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రి యల్ పార్కులో ఆరు నెలల్లో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని, అక్కడ 3 వేల మందికి ఉద్యోగాలు కల్పి ంచేలా పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో సోమశిల హైలెవల్ కెనాల్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట మండలాలకు సాగు, తాగునీరు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఉండగా, మరో జాతీయ రహదారి రానుందన్నారు. వేర్‌హౌసింగ్, లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని త్వరలోనే ఆ పనులు వేగవంతమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమ కుటుంబీకులు తప్పు చేయబోరని, ప్రజలకు తలవంపులు తీసుకురామని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అనంతరం చెప్పుడు మాటలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడంతో ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి ఆ కుటుంబం వెంట నడిచామన్నారు. ఆత్మకూరు ప్రాంతానికి తమ కుటుంబం తరపున చిరుకానుకగా ఈ బస్టాండ్‌ను సొంత నిధులతో నిర్మించిన అందజేసినట్లు తెలిపారు. దివంగత వైఎస్సార్ వల్లనే వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హైలెవల్ కెనాల్ రూపురేఖలు దాల్చాయని, వాటిని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వాదంతో తన సోద రుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఉదయగిరి ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. 600 వాగ్దానాలిచ్చి, వాటి ని తుంగలో తొక్కి, మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. తండ్రీ, కొడుకులు, దత్తపుత్రుడు అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించేందుకు పాదయాత్ర,బస్సుయాత్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీరికితోడు పచ్చపత్రికలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె అనన్య, కుమారుడు అర్జున్, తల్లి మణిమంజరి పాల్గొన్నారు. -
‘పోలవరం, వెలిగొండ పూర్తి కావాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలి’
సాక్షి, నెల్లూరు: ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ లోకేష్ నవ్వులపాలవుతున్నారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో అభివృద్ది లేదని విమర్శించే వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు. లోకేష్ బుద్ధి, జ్ఞానం లేకుండా విమర్శలు చేశారు.. తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని ఘాటుగా రాజమోహన్‌రెడ్డి బదులిచ్చారు. నెల్లూరులో సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ వైఎస్సార్, జగన్ పుణ్యమేనని చెప్పారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే 2024లో కూడా వైఎస్ జగన్ సీఎం అవ్వాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఆర్ధిక బలం, కమ్మ బలం, మీడియా సపోర్ట్ ఉంటే.. జగన్‌కు మాత్రం ప్రజా బలం ఉందన్నారు. లోకేష్ బుజ్జి బాబు చేసిన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేకపాటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: గంటకో నిర్ణయం.. పూటకో మాట.. పవన్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ -
సీఎం జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా.. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం: మేకపాటి
ఉదయగిరి: ఉదయగిరి టికెట్ నిర్ణయం పూర్తిగా సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచన ప్రకారమే ఉంటుందని, ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి విజయం కోసం పనిచేద్దామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆదివారం నెల్లూరులో మేకపాటి నివాసంలో రాజమోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చాలా కోణాల్లో పరిశీలించి చేస్తారని తెలిపారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మేకపాటి కుటుంబం వారికి పూర్తి సహకారం అందిస్తుందని, అందరం కలిసికట్టుగా వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకునేలా పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. త్వరలో అభ్యర్థి విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఆ తర్వాత ఉదయగిరిలో సమావేశం ఏర్పాటు చేసి అన్ని మండలాల నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో మాట్లాడి చిన్ని చిన్న సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుందామని తెలిపారు. ఉదయగిరికి మేకపాటి కుటుంబానికి నలభై ఏళ్ల అనుబంధం ఉందని, చంద్రశేఖరరెడ్డి వ్యవహారంతో కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. అందుకు మేకపాటి కుటుంబం తరపున ఉదయగిరి ప్రజలకు రాజమోహన్‌రెడ్డి క్షమాపణలు చెప్పా రు. మాజీ ఎంపీని కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యులు రావెళ్ల నాగేంద్ర, పావులూరు మాల్యాద్రిరెడ్డి, నాయకులు అండ్రా బాలగురవారెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, గంగవరపు పుల్లయ్య, గుంటుపల్లి నాగభూషణం, ఏనుగు వెంకటేశ్వరరెడ్డి, ఉండేల సుబ్బారెడ్డి, పెండ్యాల తిరుపతయ్య, బొమ్ము వెంకటరెడ్డి, బోగ్యం విజయ, వెంకటేశ్వర్లు, పి.విజయభాస్కరరెడ్డి, చెన్నారాయుడు, మధు, బాలచంద్ర, వెంగయ్యనాయుడు, రవి, రమేష్ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మా కుటుంబానికి కళంకం తెచ్చాడు..
-
‘మా కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడు’
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. (చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్) -
బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు
ఆత్మకూరు : నియోజకవర్గంలో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అందజేశారు. నెల్లూరులోని మేకపాటి నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చేతుల మీదుగా 38 మంది బాధితులకు రూ.40.17 లక్షల చెక్కులను అందజేశారు. ఓ వైపు ఆరోగ్యశ్రీ పథకంతో ఎందరో పేదలు ఉచిత వైద్య సేవలు పొందుతుంటే, సీఎంఆర్ఎఫ్ కింద మరింత మందికి బాసటగా నిలవడం దేశంలో ఎక్కడా లేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
పేదల పట్ల జగన్ తీరును దగ్గరగా చూసిన వ్యక్తి నేను
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం
ఆత్మకూరు: రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా శ్రీధర్ గార్డెన్స్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు జరుగుతాయని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిబాగా లేకున్నా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. మూడు మార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి గౌతమ్‌రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో విక్రమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్‌రెడ్డి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉన్నారని, ఆ ఫౌండేషన్‌లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు. 2వ తేదీన నామినేషన్ గురువారం మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది: మేకపాటి విక్రమ్‌రెడ్డి ఇటీవల పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పలు మండలాల్లో నిర్వహించినప్పుడు లబ్ధిదారులు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను తెలిపి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెల్లిబుచ్చారని మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు పారీ్టకి స్తంభాల్లాంటి వారని, వారు చేసిన కృషితోనే నాయకులు పదవుల్లోకి వస్తారని, వారి మేలు ఎప్పటికి మరచిపోలేమన్నారు. తొలుత దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, పార్టీ మండలాల కనీ్వ నర్లు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, రాపూరు వెంకటసుబ్బారెడ్డి, జితేంద్రనాగ్‌రెడ్డి, తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి, నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, బోయళ్ల పద్మజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
'గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు'
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నికకు జూన్ 2న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో అనుకోని విషాదం జరిగింది. విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు నుంచి పోటీకి నిలబెట్టాం. గౌతమ్ బాబు చేసిన కార్యక్రమాలను విక్రమ్ ముందుకు తీసుకెళ్తారు అని మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్ అన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రభుత్వానికి పూర్తి ఆదరణ ఉంది. సీఎంకి ఉన్న జనాదరణ, గౌతమ్ అన్నపై ఉన్న అశేష అభిమానం భారీ విజయానికి సోపానాలు కానున్నాయని విక్రమ్‌రెడ్డి తెలిపారు. చదవండి: (2019లో బాలకృష్ణ కూడా తొడలు కొట్టాడు.. ఏమైంది..?: మంత్రి జోగి రమేష్) -
రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగింత.. ఉదయగిరికి మరో మణిహారం
ఉదయగిరికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడ స్వర్ణయుగం నడిచినట్లు చెబుతుంటారు. కాలగమనంలో కరువు రాజ్యమేలింది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి మరో మణిహారం రానుంది. ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దాతృత్వంతో ప్రజలకు ఉపయోగపడేలా వర్సిటీని తీర్చిదిద్దనున్నారు. సాక్షి, నెల్లూరు: మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా వర్సిటీని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థుల్లో మరింత మక్కువ పెంచేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ వర్సిటీ అందుబాటులో ఉంటే అధిక మంది విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు సుమారు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీకి రాయలసీమ పరిధిలో ఉండే కళాశాలలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. మేకపాటి కుటుంబం దాతృత్వం మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి తప్పక జరుగుతుందనే ఆశయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే ఎంతో ఉదారంగా సాయం చేశారు. మర్రిపాడు మండలంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు సొంత భూములు కేటాయించారు. సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సొంత నిధులు సమకూర్చారు. ఎంఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు సొంత నిధులిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. మేకపాటి కుటుంబం ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగించడంతో వారి దాతృత్వానికి మెట్ట ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు. మహర్దశ పట్టించేలా.. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఉదయగిరిలో ఒకప్పుడు వ్యవసాయ రంగానికి సాగునీరు కరువై బతుకు దెరువు కోసం ఎంతోమంది వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో శ్రీమంతులైన వారు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయగిరికి సాగునీరందించే బృహత్తరమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవల్ కెనాల్ లాంటి ప్రాజెక్టులతో ఉదయగిరి వలస జీవనానికి కళ్లెం వేసి మోడుబారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తయితే వలసవాసులు తిరిగి వచ్చి సాగుబాట పట్టే అవకాశం ఉంది. దీనికితోడు వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుతో ఇక్కడి అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఔన్నత్యానికి నిదర్శనం మేకపాటి కుటుంబం ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రూ.250 కోట్లు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించమని కోరడం వారి ఔన్నత్యానికి నిదర్శనం. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండడం ఆనందదాయకం. – షేక్ గాజుల ఫారుఖ్‌అలీ, ఉదయగిరి హర్షదాయకం ఈ ప్రాంత రైతులకు ప్రయోజగకరంగా ఉంచేందుకు మెరిట్స్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షదాయకం. మెరిట్స్ కళాశాల ఉద్యోగులకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి చేయడం వారి దూరదృష్టికి నిదర్శనం. – డాక్టర్ ఎం.మనోజ్‌కుమార్‌రెడ్డి, మెరిట్స్ కళాశాల ప్రిన్సిపల్ గౌతమ్‌రెడ్డి పేరుతో.. మెరిట్స్ కళాశాల 106 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన అకాడమీ బ్లాక్స్, 600 అమ్మాయిలు, 750 అబ్బాయిలుండేలా హాస్టల్ భవవ సదుపాయాలున్నాయి. 89 స్టాఫ్ క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, లైబ్రరీ 27 వేల పుస్తక సముదాయం, మూడు బస్సులు, జనరేటర్స్, క్యాంటీన్, గెస్ట్ హౌస్, ఫిజికల్ డైరెక్టరీస్, ఎన్ఎస్ఎస్, భవన సముదాయాలు, ప్లే గ్రౌండ్ తదితర ఆస్తులను వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అలాగే సుమారు 50 ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములను కూడా ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. రూ.కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన ఎంఆర్ఆర్ ట్రస్ట్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్న వారి విన్నపానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. -
రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి
సాక్షి, నెల్లూరు: ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారన్నారు. ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచిపరిణామమని కొనియాడారు. చదవండి: (ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్) -
మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి
మర్రిపాడు: మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్‌రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మెట్టప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం కృషి చేస్తోందన్నారు. మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్–1, 2తో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గ్రామాల వారీగా నాయకులను విక్రమ్‌రెడ్డికి పరిచయం చేయించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇన్చార్జి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను నిరంతరం అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, బోయళ్ల పద్మజారెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్, సొసైటీ చైర్మన్ యర్రమళ్ల చిన్నారెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన మేకపాటి విక్రమ్
సాక్షి, అమరావతి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి ప్రజాసేవలో పాలు పంచుకోనున్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన రెండో కుమారుడు విక్రమ్‌రెడ్డితో కలసి గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. నియోజకవర్గ పర్యటనకు ముందుగా ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకునేందుకు విక్రమ్‌రెడ్డి వచ్చినట్లు రాజమోహన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే విక్రమ్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌ను కలసినట్లు తెలిపారు. విక్రమ్ ప్రజాసేవలో నిమగ్నం కానున్నట్లు రెండు వారాల క్రితమే సీఎం జగన్‌కు తెలియజేశామన్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో తెలుస్తుందన్నారు. పోటీ పెట్టాలా? వద్దా? అనేది ఆయా పార్టీల ఇష్టమన్నారు. తొలుత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగనన్న నాకు ఆదర్శం: మేకపాటి విక్రమ్‌రెడ్డి ఇన్నాళ్లూ వ్యాపార రంగంలో నిమగ్నమైన తాను రాజకీయాల్లోకి ప్రవేశించి సోదరుడు గౌతమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మేకపాటి విక్రమ్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి గౌతమ్‌రెడ్డి చేయాలనుకున్నది చేసి చూపిస్తానన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబం ఆశీస్సులు తీసుకుంటానన్నారు. జగనన్న ఆదేశాల మేరకు నడుచుకుంటూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తానని చెప్పారు. రాజకీయాల్లో తనకు ఆయనే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ప్రారంభించి సీఎం జగన్ ఆదేశించినట్లుగా సచివాలయాలను సందర్శించనున్నట్లు తెలిపారు. -
సీఎం మాటలు మనో ధైర్యాన్ని నింపాయి
నెల్లూరు (సెంట్రల్): కుమారుడిని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న తమ హృదయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు మనోధైర్యాన్ని నింపాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మృతజీవనుడంటూ గౌతమ్‌కు సంతాపం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి తపన పడిన ప్రతి అంశాన్ని పూర్తిచేస్తామని సీఎం ప్రకటించడంపై జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగం బ్యారేజీని వేగంగా పూర్తిచేసి దానికి గౌతమ్ పేరు పెడతానని ముఖ్యమంత్రి ప్రకటించటం సంతోషంగా ఉందన్నారు. తాను కోరిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తానని ప్రకటించడం తమ కుటుంబంపై వైఎస్ జగన్‌కు ఉండే అభిమానానికి నిదర్శనమన్నారు. ఉదయగిరి ఇంజనీరింగ్ కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. జగన్‌కు వెన్నంటి ఉన్న గౌతమ్‌రెడ్డికి అసలైన నివాళి తెలిపారన్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో చేయలేకపోయిన సోమేశ్వర ఆలయం, సోమశిల ప్రాజెక్టుల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌతమ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని తలుచుకుంటూ సభలో సంతాపం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
మెరిట్స్‌లో కర్మక్రియలు.. మార్చి 3న మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మ
సాక్షి, నెల్లూరు(ఉదయగిరి/సంగం): దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కర్మక్రియలను శుక్రవారం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వేద పండితులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. తండ్రి గౌతమ్‌రెడ్డికి ఆయన తనయుడు మేకపాటి కృష్ణార్జునరెడ్డి సంగంలోని పెన్నానదిలో త్రివేణిలో పిండ ప్రదానం చేశారు. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి మణిమంజీరి, గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తి, కుమార్తె సాయి అనన్య ఇతర కుటుంబ సభ్యులు దుఃఖాన్ని భరిస్తూ కర్మక్రతువులు పూర్తి చేశారు. అర్జన్రెడ్డిని ఓదార్చుతున్న మేకపాటి దంపతులు ఈ సమయంలో తండ్రిని కోల్పోయి పుట్టేడు దుఃఖంతో రోదిస్తున్న మవవడు అర్జన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి తమ దుఃఖాన్ని అణుచుకుంటూ ఓదార్చుతుండడం అందరిని కంట తడి పెట్టించాయి. బిడ్డలు వేదనను చూసిన బంధువులు, పలువురు అధికారులు కంట చెమ్మ పెట్టారు. గౌతమ్‌రెడ్డి చితాభస్మంను దేశంలోని ఏడు పుణ్యనదుల్లో కలిపే నిమిత్తం ఏడు పాదుకుల్లో సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిలప్రియ, ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిణి, మేకపాటి కుటుంబ సభ్యులు రాజారెడ్డి, పృధ్వీరెడ్డి, విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: (గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ) మార్చి 3న మంత్రి పెద్ద కర్మ మంత్రి గౌతమ్‌రెడ్డి పెద్ద కర్మ శాస్త్రీయ ప్రకారం కాలం చేసిన 11వ రోజు మార్చి 3వ తేదీ ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దకర్మకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీఐపీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అ«ధికారులు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ
సాక్షి, ఉదయగిరి: మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి కోరారు. అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ.. ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: (పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు) వీఎస్‌యూలో ఘన నివాళి వెంకటాచలం: మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గురువారం ఘన నివాళులర్పించారు. వీఎస్‌యూ వీసీ జీఎం సుందరవల్లి, రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి తదితరులు గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్‌రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన వ్యక్తి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనతికాలంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్దిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అకాలమరణం రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజయ్‌కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
అత్యంత శాస్త్రోక్తంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు..
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దహన సంస్కారాలు ఉదయగిరి మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం వేదపండితుల సమక్షంలో అత్యంత శాస్త్రోక్తంగా ఆయన కుటుంబ సభ్యులు జరిపించారు. ముందుగా గౌతమ్‌రెడ్డి తనయుడు కృష్ణార్జునరెడ్డి చేత పండితులు గణపతి హోమంతో పాటు అగ్నిప్రతిష్టంభన హోమం చేయించారు. గౌతమ్‌రెడ్డి చెవిలో కుటుంబ సభ్యులతో నారాయణ మంత్రం జపించారు. దహన సంస్కారాలు కూడా రాహుకాలం రాక ముందే సంప్రదాయ రీతిలో నిర్వహించారు. వేలాది మంది మేకపాటి అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతుల సమక్షంలో వేదపండితులు మధ్యాహ్నం 12 గంటలలోపే కృష్ణార్జునరెడ్డి చేత చితికి నిప్పంటించారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని గంధపు చెక్కలతో దహనం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చితికి నిప్పంటించినన ఆనంతరం పోలీసులు మూడు సార్లు గాల్లోకి కాల్పులు జరిపి వీడ్కోలు పలికారు. గౌతమ్‌రెడ్డి పాడె మోస్తున్న మంత్రి అనిల్ గుండెలలిసేలా.. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం వద్ద ఆయన తనయుడు కృష్ణార్జునరెడ్డి గుండెలవిసేలా రోదించాడు. ఆయన విదేశాల్లో విద్యభ్యాసం చేస్తున్న సమయంలో తన తండ్రి మరణవార్త విని హటాహుటినా బయలు దేరిన మంగళవారం రాత్రి 11 గంటలపైన నెల్లూరులోని స్వగృహనానికి చేరుకున్నారు. అప్పటి వరకు మంత్రి మేకపాటి పార్థివదేహన్ని ప్రజల దర్శనార్థం బయట ఉంచిన కుటుంబ సభ్యులు ఆయన తనయుడు రాక ముందే మంత్రి అధికార కార్యాలయ గదిలోకి మార్చారు. ఇంటికి చేరుకున్న కృష్ణార్జునరెడ్డి తండ్రి భౌతికకాయాన్ని చూసి రోదించాడు. అక్కడున్న అందరిని కాసేపు బయటకు వెళ్లమని చెప్పి తానొక్కడే తండ్రి దేహం వద్ద కూర్చొని చాతి నిరుముతూ బోరున విలపించాడు. తనయుడు బాధను చూసి వారి కుటుంబ సభ్యులు దుఃఖంతో గుండెలవిసేలా విలపించారు. చదవండి: (తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణార్జునరెడ్డి) తండ్రి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న తనయుడు కృష్ణార్జున్‌రెడ్డి మౌనంగానే ఉంటూ.. తన ముద్దుబిడ్డ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఇకపై తమబిడ్డ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎందరో మేకపాటి ఆప్తులు, ప్రముఖులు, అభిమానులు వేలాది మంది తరలివచ్చి ఆయన్ను ఓదార్చుతున్న వారందరితో మౌనంగానే చేయేత్తి నమస్కరిస్తూ బరువెక్కిన హృదయంతో లోలోపల కుమిలిపోయాడు. తన బిడ్డ పార్థివదేహన్ని తదేకంగా చూస్తూ మౌనంగానే రోదించారు. గౌతమ్‌రెడ్డికి తండ్రి రాజమోహన్‌రెడ్డి అంటే ఎనలేని ప్రేమ. ప్రతి రోజు ఎక్కడున్నా రోజుకు పదిసార్లయినా తండ్రికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ఆ రోజు తాను చేసిన పనులను చెప్పేవాడు. ఇటీవల దుబాయ్ వెళ్లి రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఎంఈఓలు కుదిరాయని తండ్రికి ఫోన్లో చెప్పడంతో కుమారుడిని అభినందించారు. అంతలోనే పుత్రశోకం మిగలడంతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి తట్టుకోలేక మౌనంగా రోదిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Mekapati Goutham Reddy Demise: తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
సాక్షి, నెల్లూరు: వ్యాపారంలో, రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మేకపాటి గౌతమ్‌రెడ్డిని చూసి తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయేవారు. తన కుమారుడి గురించి ప్రతిఒక్కరూ గొప్పగా చెప్తుంటే రాజమోహన్‌రెడ్డి ఆనందంతో చిరునవ్వులు చిందించేవారు. ఇక గౌతమ్‌రెడ్డికి తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. తండ్రి భావాలను పుణికిపుచ్చుకుని.. వ్యాపారంలో, రాజకీయాల్లో అడుగులు వేశారు. మరోవైపు తాను ఏ పని చేయాలన్నా తల్లి ఆశీస్సులు తీసుకునేవారు. ఆమె మాట జవదాటేవారు కాదు. ఇప్పుడు చెట్టంత కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో రాజమోహన్‌రెడ్డి దంపతులు కుమిలిపోతున్నారు. వారి వేదనను చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. గౌతమ్‌రెడ్డి మరణంతో చిన్నాన్న, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. చదవండి: (హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులతోనూ..) చదవండి: (Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..) -
అజాత శత్రువు
సాక్షి, అమరావతి/నెల్లూరు: రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా వెలుగొందారు మేకపాటి గౌతమ్‌రెడ్డి. పన్నెండేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఆద్యంతం వివాద రహితుడిగానే మెలిగారు. ఆర్థికంగా స్థితిమంతుడు.. సీనియర్ రాజకీయ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కుమారుడైనా గౌతమ్‌రెడ్డి అత్యంత సాధారణంగానే వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా అందరివాడిగా మన్ననలు పొందారు. వ్యాపారవేత్తగా ఉంటూ తనకేమాత్రం సరిపడని రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మృదుస్వభావిగానే కొనసాగారు. ప్రత్యర్థులపై ఏనాడూ వ్యక్తిగత విమర్శలు చేయకపోవడం హుందాతనానికి నిదర్శనం. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఎన్నికలు అయిపోగానే రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేసి ప్రజా సమస్యలపైనే దృష్టి సారించేవారు. అందుకే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు కూడా ఆయనతో గౌరవ ప్రదమైన సంబంధాలనే కొనసాగించారు. గౌతమ్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం దుందుడుకుగా వ్యవహరించలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఏనాడూ అహంకారం ప్రదర్శించలేదు. ప్రతిపక్ష నేతగా ఆనాడు ప్రజా సమస్యలు, విధానపరమైన అంశాలపైనే స్పందించారు తప్ప వివాదాస్పదుడు కాలేదు. అందుకే ఆయన విమర్శలను కూడా ఆనాటి ప్రభుత్వాలు తిప్పికొట్టలేకపోయేవి. ఆయన లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికే ప్రాధాన్యమిచ్చేవి. మంత్రిగానూ హుందాగానే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కీలక మైన పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా నియమితులైన తరువాత కూడా గౌతమ్‌రెడ్డి హుందాతనంతో కూడిన రాజకీయాలే నెరిపారు. ప్రతిపక్ష టీడీపీ కూడా అసెంబ్లీ సమావేశాల్లోగానీ బయట గానీ గౌతమ్‌రెడ్డిని విమర్శించే సాహసం చేయలేకపోయింది. మంత్రిగా సమర్థవంతమైన పనితీరు కనబర్చిన ఆయన తనను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఏనాడూ అవకాశం ఇవ్వలేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు అంశంపై ప్రతిపక్ష టీడీపీ ఓ సారి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. పరిశ్రమల శాఖ మంత్రిగా సమాధానమిస్తూ.. గౌతమ్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వాటి సత్ఫలితాలను వివరించారు. ఎక్కడా ప్రతిపక్ష టీడీపీని ఒక్క మాట అనకుండా.. ఎదురుదాడి చేస్తున్నట్టుగా కాకుండా ఆయన సవివరంగా ఇచ్చిన సమాధానంతో టీడీపీ మిన్నుకుండిపోయింది. వర్గ రాజకీయాలు లేవు.. అవినీతి మరకా లేదు ఎత్తులు, జిత్తులతో నిత్యం వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే నెల్లూరు జిల్లాలో గౌతమ్‌రెడ్డి తనదైన శైలిలో వివాద రహితుడుగా గుర్తింపు పొందడం విశేషం. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆయన వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్నప్పటికీ దానిని అవకాశంగా చేసుకుని జిల్లాపై రాజకీయ ఆధిపత్యం చెలాయించేందుకు యత్నించలేదు. ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలను కలుపుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోని అరుదైన రాజకీయ నేతగా గౌతమ్‌రెడ్డి గుర్తింపు పొందారు. కనీసం రాజకీయ ప్రయోజనాల కోసమైనా ప్రతిపక్షాలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేందుకు సాహసించలేదు. గౌతమ్‌రెడ్డి ఎవర్నీ ఏకవచనంతో సంభోదించే వారు కాదు. -
అరుదైన ఆత్మీయుడు.. స్నేహం కోసమే రాజకీయాల్లోకి
సాక్షి, అమరావతి/నెల్లూరు: రాజకీయ అవసరాల కోసం స్నేహాలు వర్తమాన పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అందుకు పూర్తి మినహాయింపు. స్వప్రయోజనాల కోసం ఆయన స్నేహం చేయలేదు. స్నేహం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎన్ని కష్టాలు ఎదురైనా స్నేహితుడి వెన్నంటి నిలిచారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన బాంధవ్యం నేటి రాజకీయాల్లో అరుదైన స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. చిన్నప్పుడే చిగురించిన స్నేహబంధం.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గౌతమ్‌రెడ్డి విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంపైనే దృష్టి కేంద్రీకరించారు. తొలినాళ్లలో రాజకీయ వ్యవహారాల పట్ల అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఆయన తమ్ముడు పృథ్వీరెడ్డి హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లాస్మేట్ కావడంతో స్నేహబంధం ఏర్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ఆత్మీయ అనుబంధం మరిం త బలపడింది. 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం టికెట్ కోసం నాడు కాంగ్రెస్ పార్టీలో తీవ్రపోటీ నెలకొనగా వైఎస్సార్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డికే అవకాశం దక్కింది. ఆర్థికంగా అణచివేసినా వెరవలేదు.. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆయన అండదండలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖం చాటేసినా కష్టకాలంలో మేకపాటి కుటుంబం వైఎస్ జగన్ వెన్నంటే నిలిచింది. నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహణలో పాలు పంచుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచేందుకు తన ఎంపీ పదవిని త్యజించేందుకు సైతం మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెనుకాడ లేదు. వైఎస్ జగన్ వెన్నంటి నిలిచిన మేకపాటి కుటుంబాన్ని నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వేధించింది. అయినప్పటికీ గౌతమ్‌రెడ్డి వెరవక వైఎస్ కుటుంబంతోనే రాజకీయంగా ప్రయాణం కొనసాగించారు. -
ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారం
సాక్షి, నెల్లూరు(మర్రిపాడు) : మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కంపసముద్రంలో సోమవారం ఆయన పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ గ్రామాన్ని గతంలో దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తుందని, ఏ సమస్య వచ్చినా ఫిర్యాదు చేసిన 72 గంటల్లోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఆత్మకూరులోని తమ కార్యాలయంలో ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యాయని ఓఎస్డీ చెన్నయ్య చెప్పారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎంజీఆర్ హెల్ప్‌లైన్‌కు చెప్పాలన్నారు. గ్రామాల్లో కక్షలు లేకుండా అందరూ కలసి మెలసి ఐక్యంగా ఉండాలన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యాలయం సచివాలయంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లు సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చెన్ను శ్రీధర్‌రెడ్డి, యర్రమళ్ల చిన్నారెడ్డి, గోపవరం కాంతారెడ్డి, బాబునాయుడు, కొండ్రెడ్డి రమణారెడ్డి, హజరత్ రెడ్డి, చిన్నమాచనూరు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘చంద్రబాబుపై కసి తీర్చుకున్నారు’
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రేమాభిమానాలతో పాటు చంద్రబాబుపై మహా కసితో తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓట్ల రూపంలో చంద్రబాబుపై కసినంతా ప్రజలు తీర్చుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాలన్న ఉద్దేశంతో తమకు అఖండ విజయం అందించారని అన్నారు. వైఎస్ జగన్ గొప్ప పరిపాలన ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్ప పరిపాలన అందిస్తారని అభిప్రాయపడ్డారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుని తమకు ఓటు వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. పదేళ్లుగా తమ నాయకుడు వైఎస్ జగన్ పడిన కష్టానికి ప్రతిపఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు. జగన్‌లో ప్రజలు గొప్పనాయకుడిని చూశారు కాబట్టి అఖండ విజయం కట్టబెట్టారని అన్నారు. -
జగన్ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యం
మర్రిపాడు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఏపిలగుంట గ్రామంలో ఆదివారం రాత్రి ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేసి యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆయన సహకారంతో ఈ ప్రాంతాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అభివృద్ధి పరుస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా తాగు, సాగునీరు సమస్య లేకుండా చూస్తారన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ పనులకు కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. నేటి పాలకుల హయాంలో పనులు పూర్తి కాకపోవడం దారుణమన్నారు. ఈ పనులన్నీ పూర్తయి ఈ ప్రాంతానికి సాగునీరు అంది బీడు భూములన్ని బాగు చేసుకోవాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు నాయుడు హజరత్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు రసం రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, సిద్దంరెడ్డి మోహన్‌రెడ్డి ఉన్నారు. -
దుర్మార్గపు సర్కారును సాగనంపుదాం
సాక్షి, నెల్లూరు : ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల కుట్రలు, కుతంత్రాల్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తొమ్మిదేళ్లుగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజలు ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి. వైఎస్ జగన్ పరిపాలన కూడా ఒక్కసారి చూద్దాం. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా మార్పు అవసరం’ అని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’తో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయనవి అన్నీ అబద్ధాలే.. నలభై ఏళ్ల అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆయన అనుభవం ఎవరికి అక్కరకొచ్చింది. ఆయన దుర్మార్గమైన పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. తన స్వార్థం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పేందుకైనా చంద్రబాబు సిద్ధం. ఎన్ని యూటర్న్లు అయినా తీసుకుంటారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి నుంచి ఒకే మాటపై నిలబడ్డారు. హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఐదేళ్లగా పోరాటం చేస్తుంటే.. హోదాకు మద్దతిస్తే జైలుకు పంపిస్తానని చంద్రబాబు భయపెట్టారు. ఎన్నికలకు ఏడాది ఉందనగానే యూటర్న్ తీసుకుని ఆయనే హోదాపై పోరాటం చేస్తున్నట్లు ప్రజలను నమ్మించేందుకు దొంగ దీక్షలు చేశారు. అవన్నీ బెడిసికొట్టాయి. చంద్రబాబు విన్యాసాల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బాబు పాలనపై ప్రజల్లో ఏవగింపు జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వమంటే చంద్రబాబు దానికి ఎన్ని వక్ర భాష్యాలు అల్లారో.. ఒక్క అవకాశం ఇచ్చి పులినోట్లో తలపెడతామా? ఒక్క అవకాశం ఇచ్చి కొండ నుంచి దూకుతామా? అంటూ చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. పిల్ల నిచ్చిన మామ నుంచి సీఎం కుర్చీని లాక్కుని గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాడు. రాష్ట్ర విభజనాంతరం కూడా ఐదేళ్లు సీఎంగా పనిచేసిన బాబుకు తన పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగిందో, ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తెలుసు. ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తున్న చంద్రబాబును ప్రజలు ఏవగించుకుంటున్నారు. పదవుల మీద వ్యామోహం లేదు నాకు పదవుల మీద వ్యామోహం లేదు. రెండుసార్లు పార్టీ ఆదేశిస్తే పదవులు త్యాగం చేశాను. నేను పోటీ చేయనని గతంలో వైఎస్ జగన్‌కే చెప్పాను. ఆయన పోటీ చేయమని చెప్పినా.. ఆరోగ్య సమస్యల వల్ల నేను చేయనన్నాను. నా కోరిక మేరకే సీటు మరొకరికి కేటాయించారు తప్ప.. నన్ను కాదని మాత్రం ఇవ్వలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే చాలు. అంతకంటే నాకు ఏ పదవులు ముఖ్యం కాదు. పరిపాలనలో మార్పు అవసరం చంద్రబాబుకు వయసు పైబడింది. ఆయనకు విరామం ఇస్తే మంచిది. ప్రజాస్వామ్యంలో మార్పు తప్పనిసరి. ఒక్కసారి వైఎస్ జగన్‌కు అవకాశమిచ్చి ఆయన పరిపాలన చూద్దాం. మార్పు కోరకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. జగన్మోహన్రెడ్డి కూడా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని మంచి పాలన అందిస్తాడని నాకు నమ్మకం ఉంది. ఈ ఐదేళ్లు చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా సాగింది. ఇంత దుష్టపాలనను ప్రజలు క్షమించరు. ఈ రోజు ఎన్నికలకు ఇంత ఖర్చవుతుందంటే అది చంద్రబాబు చలువే. ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేశాడు. చైతన్యవంతులైన ప్రజలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు దుర్మార్గ పరిపాలనకు చరమగీతం పాడాలి. 2004లోను వైఎస్‌పై దుర్మార్గ ప్రచారం చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తాడంటూ చంద్రబాబు ఇదే విధంగా దుర్మార్గ ప్రచారం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతటి చక్కటి పరిపాలన అందించారు. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. ఎన్నికల సమయంలో రెండు హామీలు ఇచ్చిన ఆయన అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. రాష్ట్రంలో పేదలకు 47 లక్షల ఇళ్లు నిర్మించారు. ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు ఇచ్చి ఆదుకున్నారు. ప్రతి పేదోడికి ఆరోగ్య భద్రత కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంత మంది పేదలకు మేలు జరిగిందో అందరికీ తెలుసు. ఫీజు రీయింబర్స్మెంట్ పేద విద్యార్థులకు వరంలా మారింది. ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారంటే అది వైఎస్ చలవే కదా. -
రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర
సాక్షి, ఉదయగిరి: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి సోదరులకు ప్రత్యేక స్థానం ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జాతీయస్థాయిలో రాజకీయాల్లో తమదైన ముద్రవేసుకున్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ముగ్గురూ ఒకే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలిలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1983లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన అదే ఏడాది కాంగ్రెస్ తరపున ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు. 1985లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 1989లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004లో నర్సరావుపేట ఎంపీగా పనిచేశారు. 2009, 2012, 2014లో నెల్లూరు ఎంపీగా గెలుపొందారు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో ప్రముఖ స్థానం వహించారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉదయగిరి నుంచే ప్రారంభించారు. పెద్దిరెడ్డిపల్లి, సీతారాంసాగర్ రిజర్వాయర్లు సాధించి వైఎస్సార్ చేతులమీదుగా శంకుస్థాపన చేయించారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి ఆయన పక్షాన నిలిచారు. జిల్లాలో అనేక రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొని జగన్‌తోనే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీలో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ నిర్ణయం మేరకు రెండుసార్లు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ తరపున పార్లమెంటులో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్సార్సీపీలో రాష్ట్రస్థాయి కీలకనేతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కమిటీలో కూడా ఆయన సభ్యుడుగా ఉన్నారు. సోదరుడు.. తనయుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా జిల్లా, ఉదయగిరి నియోజకవర్గాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు రికార్డుస్థాయిలో మెజారిటీ తీర్పు ఇచ్చారు. అలాగే ఉదయగిరి నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డి కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మొత్తమ్మీద మేకపాటి కుటుంబం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కీలకంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. -
ఆయన లేని లోటు పూడ్చలేనిది
సాక్షి, పులివెందుల : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు. వివేకా లేకపోవడం ఆయన కుటుంబానికి ఎంత లోటో.. వైఎస్సార్సీపీకి అంతే లోటు అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ‘వివేకా లేని లోటు తీర్చలేనిది. ఆయన మచ్చ లేని, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు కాదు’ అని వ్యాఖ్యానించారు. (వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత) నెల్లూరు : వైఎస్ వివేకానందరెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు.. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతపురం : వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణంపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘వివేకా మరణం వైఎస్సార్సీపీకి తీరని లోటు, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన నేత వైఎస్ వివేకా’ అని అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. -
ఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
-
ఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే సేవామిత్ర యాప్ ద్వారా అధికార టీడీపీ పార్టీ నేతలు ఓట్లు తొలగించారని ఈసీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ అనుకూలురుకు పోస్టింగులు ఇస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీని కలిసినవారిలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిదఫా ఎన్నికల్లో ఏపీలో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ ఒకేరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు నేడు ఈసీని కలిశారు. -
ఈసీని కలువనున్న వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఇవాళ (సోమవారం) 6. 30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలువనుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈసీని కలువనున్న బృందంలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిదఫా ఎన్నికల్లో ఏపీలో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ ఒకేరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు ఈసీని కలువబోతున్నారు. -
ప్రజల భద్రతకు ముప్పు
నెల్లూరు (సెంట్రల్): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను దొంగచాటుగా తీసుకున్న తీరును చూస్తే ప్రజల భద్రతలకే ముప్పు ఏర్పడిందని నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో మంగళవారం సమరశంఖారావం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తదితరులతో కలసి మంగళవారం విలేకరుల సమవేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట్లు ఉంటే అందులో దాదాపుగా 59 లక్షల ఓట్లు దొంగచాటుగా తొలగించడం, రెండు ఓట్లు చేయించడం వంటి నీచపు పనిని చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ అండదండలతో ఐటి గ్రిడ్స్ పేరుతో ప్రతిపక్షానికి చెందిన ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల మందికి చెందిన వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సేవామిత్ర పేరుతో ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత వివరాలు సేకరించి ఓట్లు తొలగింపు చేస్తున్నారన్నారు. ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని సేకరించడంలో నారా లోకేష్‌తో సన్నిహితంగా ఉంటున్న అశోక్, కిలారి రాజేష్, పెద్ది రామారావు, అబిష్ణ తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ప్రైవేటు ఏజన్సీలకు చంద్రబాబు రూ.కోట్లు కుమ్మరించి ఓట్ల తొలగింపు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా ఒక వ్యక్తి సమాచారన్ని మరొక వ్యక్తికి ఇవ్వరాదని సర్వోన్నత న్యాయ స్థానం కూడా చెప్పిందని, కాని నిబంధనలు బుట్టదాఖలు చేసి ఇలా చేయడం బాధాకరమన్నారు. వ్యక్తిగత జాబితాలను సేకరించి ఓట్లు తొలగించడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించి ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో మంగళవారం జరగనున్న సమరశంఖారావం సభ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ నేతలు సోమవారం పరిశీలించారు. (ఏపీ పరువు తీశారు) -
చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారు
-
రాజన్నను గుర్తు చేసిన మమ్ముట్టి!
సాక్షి, నెల్లూరు : కావలిలోని లత థియేటర్ లో యాత్ర సినిమా విడుదల సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి రామకోటా రెడ్డి, జగదీష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడం ఆనందంగా ఉందని ఎంపీ మేకపాటి అన్నారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. వై.ఎస్.ఆర్ పాలనతో ప్రజలను మెప్పించారని.. వైఎస్సార్‌పై సినిమా అంటేనే ప్రజలంతా ఆసక్తిని కనబరిచారని, ఆయన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పాదయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుని చరిత్ర సృష్టించారని కొనియాడారు. యాత్ర సినిమాలో మమ్ముట్టి బాగా నటించారని అన్నారు. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సందడి చేశారు. యాత్ర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ ఉండటంతో.. వైఎస్సార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
తిరుపతిలో బీసీ సన్నాహక సదస్సు
సాక్షి, తిరుపతి : తుమ్మలగుంటలోని వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం బీసీ గర్జనపై రాయలసీమ రీజియన్ సన్నాహక సదస్సు జరిగింది. బీసీల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందకుండా చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో బీసీ గర్జనను నిర్వహించి వారి సంక్షేమం కోసం డిక్లరేషన్ ప్రకటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వరప్రసాద్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు జంగా కృష్ణామూర్తి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సంజీవయ్య, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కుప్పం ఇంచార్జి చంద్రమౌళి, రాయలసీమ, నెల్లూరు జిల్లా కో ఆర్డినేటన్లు తదితరులు పాల్గొన్నారు. -
జనాన్ని మభ్యపెట్టడంలో చంద్రబాబు దిట్ట
-
మీడియాపై మండిపడ్డ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. తాను పార్టీని వీడుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. నైతిక విలువలతో వార్తలు రాయాలి గాని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఆ చానెళ్లకు విలువలు ఉండవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావానికి ముందు నుంచి వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ‘పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశాను. విభజన చట్టంలోని హామీలను సాధించపోతే చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఎన్నికలు వస్తున్నాయనే పెన్షన్లు పెంచుతున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు. బాబు నిజస్వరూపం ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతారు. మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసింది. బాబు మోసం, వంచనతో ప్రజలు విసిగిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను బాబు కాపీ కొడుతున్నారు’ అని మేకపాటి విమర్శలు గుప్పించారు. -
‘రఫేల్ కంటే అమరావతి స్కామ్ పెద్దది’
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని అనుచరగణం చేసిన అవినీతి, అక్రమాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ఢిల్లీ వేదికగా అటు ప్రత్యేక హోదాపై, ఇటు టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ఆ పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులు గళం వినిపిస్తున్నారు. ‘చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ అనే పుస్తకాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు ఢిల్లీలో సోమవారం విడుదల చేశారు. కాదేదీ అవినీతికి అనర్హమన్నట్టుగా చంద్రబాబు దోపిడీ పాలన సాగుతోందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిజ స్వరూపం చెప్పడానికే ఈ పుస్తకమని తెలిపారు. చంద్రబాబు, అతని అనుచరులు అమరావతి నుంచి పోలవరం నిర్మాణం వరకు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కార్యకలాపాల కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి అన్నారు. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డపై అప్పుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రఫెల్ కంటే అమరావతి స్కామ్ పెద్దది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని కాగ్ స్పష్టం చేసిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రఫేల్ కంటే అమరావతి స్కామ్ పెద్దదని వాటర్ మాన్ రాజేంద్ర సింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 600 హామీలిచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక్కటీ కూడా అమలు చేయలేదని రాజ్యసభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి పాలనపై సాక్షాత్తూ ఇద్దరు చీఫ్ సెక్రటరీలు బహిరంగంగా విమర్శలు చేశారని చురకలంటించారు. -
‘మైనారిటీ ఓట్ల కోసం చంద్రబాబు తాపత్రయం’
సాక్షి, నెల్లూరు: తన రాజకీయ అవసరాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. ముస్లింల సమస్యలపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1999లో బీజేపీతో పొత్తు పొట్టుకున్న చంద్రబాబు.. 2004లో ఓడిపోయిన తర్వాత చారిత్రాత్మక తప్పిదం చేశానని చెప్పారని గుర్తుచేశారు. అయితే మళ్ళీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచి.. తాజాగా కాంగ్రెస్‌తో జత కట్టారని తెలిపారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ మైనారిటీ ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సునామీ సృష్టించనుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. ముస్లిం సమస్యలపై వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఐజీ ఇక్బాల్ మాట్లాడుతూ.. తమ సమస్యలపై చంద్రబాబును నిలదీసిన ముస్లిం యువకులపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ముస్లింల స్థితిగతులపై జస్టిస్ రంగనాథ్ మిశ్రా, సంచార్ కమిటీలు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని తెలిపారు. మూడు నెలల కోసం ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు పొందడానికేనని ఆరోపించారు. ముస్లింకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తుచేశారు. తెలంగాణలో మాదిరే ఏపీ ప్రజలు కూడా చంద్రబాబు బుద్ది చెప్తారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన కేసును ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసును ఎన్ఐఏకు ఎందుకు అప్పగించడం లేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ.. మైనారిటీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ పుడుతుందని విమర్శించారు. వైఎస్సార్ తరహాలోనే వైఎస్ జగన్ కూడా ముస్లింల సంక్షేమం కోసం పాటుపడతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైఎస్ జగన్‌కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. -
‘నిన్ను చూసి నవ్వుకుంటున్నారు బాబు’
సాక్షి, నెల్లూరు: తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 31లోగా హైకోర్టు భవనాలు సిద్ధం చేస్తామని గతంలో చంద్రబాబు అఫడవిట్ ఇచ్చారని, దానికి అనుగుణంగా హైకోర్టును విభజిస్తే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అఫడవిట్ ఇచ్చి ఇప్పుడు తగిన సమయం ఇవ్వలేదని అనడం ఏంటని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు రకాల మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు విభజనకు, ప్రతిపక్షానికి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో సాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మకై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. డిసెంబర్ 15లోగా హైకోర్టు భవనం సిద్ధం చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిన చంద్రబాబు ఆవిధంగా మాట నిలబెట్టుకోలేకపోయ్యారని మండిపడ్డారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: వైవీ
ఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్సీపీయేనని తెలిపారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామని చెప్పారు. హోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశామని అన్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని అన్నారు. హోదా వచ్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నయవంచనను ప్రజల గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా 25 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. -
చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి
-
‘బాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారు’
ఢిల్లీ: తెలంగాణ ప్రజలు పరిపక్వతతో మంచి తీర్పు ఇచ్చారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. నాయకులు దారి తప్పినా ప్రజలు సరైన విధంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏపీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎత్తుగడలు, మోసాలతో నారా చంద్రబాబు ప్రజలను వంచించారని విమర్శించారు. బాబు విన్యాసాలు బెడిసికొట్టాయి: ఉమ్మారెడ్డి చంద్రబాబు విన్యాసాలు తెలంగాణాలో బెడిసికొట్టాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అనైతిక పొత్తు వల్ల నష్టపోయామని కాంగ్రెస్, టీడీపీలోనే అనేక మంది నాయకులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. పొత్తులు లేకుండా చంద్రబాబు రాజకీయాలు చేయలేదని మండిపడ్డారు. పొత్తుకు పరాకాష్టగా కాంగ్రెస్‌తో జత కట్టారని దుయ్యబట్టారు. హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు: వైవీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తొలి రోజునే ధర్నాకు దిగామని, ఎంపీలందరూ రాజీనామా చేసి నిరవధిక దీక్షకు దిగి పోరాటం చేశామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుదని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఓటమిని ఏ పార్టీ కూడా రక్షించలేదన్నారు. ఆయనకు ఏ పార్టీ కూడా మద్ధతిచ్చే అవకాశం లేదన్నారు. తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలతో కలిసినా ప్రజలు చంద్రబాబును, కాంగ్రెస్‌ను ఓడించారని ఎద్దేవా చేశారు. సీబీఐ నుంచి కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కొత్తపాట పాట పాడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే చంద్రబాబును ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, సైకిల్ రెండు చక్రాల్లో ఇప్పటికే గాలిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో గెలిస్తే నా వల్లే గెలిచావని చెప్పావు బాబూ! స్పష్టమైన ఆధిక్యంతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే నావల్లే గెలిచారని చంద్రబాబు జబ్బలు చరుచుకున్నారని చెప్పారు. తెలంగాణలోనూ ఓటమికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
సమయం లేదు మిత్రమా..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘సార్వత్రిక ఎన్నికలకు మరి కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు అందరూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. ప్రజా సమస్యలపై, ప్రజాపక్షాన మరింత అండగా నిలిచి పూర్తిస్థాయిలో పనిచేయాలి’’ అని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని సూచించారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయం ఆసన్నమైనందున ప్రతి రోజు విలువైనదేనని ప్రజా సమస్యలపై నిరంతరం క్షేత్రస్థాయిలో బలమైన పోరాటం సాగించాలని సూచించారు. అధికార పార్టీ నీచ రాజకీయాలు సాగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో నూరు శాతం బూత్ కమిటీలను పూర్తిచేసి వారిని మరింత క్రియాశీలకంగా పనిచేసేలా సమన్వయకర్తలు వ్యవహరించాలని సూచించారు. పార్టీ అనుబంధ విభాగాలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నవరత్నాలపై ప్రచారం విస్తృతం చేయండి పార్టీ ప్రకటించిన నవరత్నాల పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలకు కొద్ది సమయం మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్క సమన్వయకర్త నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు నిరంతం పార్టీ కార్యక్రమాలు జరిగేలా చూసుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అధికారంలోకి రాగానే మంచి ప్రాధాన్యత, గౌరవం ఉంటుందని వివరించారు. నూరుశాతం బూత్ కమిటీల ఎంపికలు పూర్తిచేసి రానున్న ఎన్నికల్లో బూత్ కమిటీ సభ్యుల సేవలను కీలకంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి సమస్యపై పోరాడడంతో పాటు సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి చేయాలని చెప్పారు. నెల్లూరు తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ప్రజలు భరించలేని స్థితికి వచ్చారని, అన్ని వర్గాలకు బాబు పాలనలో పూర్తి అన్యాయమే జరిగిందన్నారు. ప్రభుత్వ దుర్మార్గ పాలన, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, పార్టీ సమన్వయకర్తలు ఆనం రామ నారాయణరెడ్డి (వెంకటగిరి), నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (కోవూరు), మేరిగ మురళీ (గూడూరు), బాపట్ల, తిరుపతి పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడు నెల్లూరు (సెంట్రల్): జ్యోతిరావు పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, సమన్వయకర్తలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళి, పార్టీ ముఖ్య నేతలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డితో కలిసి నివాళులర్పించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహాత్మా అని అందరితో పిలుపించుకున్న మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. విగ్రహానికి నివాళులు నగరంలోని మినీబైపాస్‌రోడ్డులో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి వేణుంబాక విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, పి.రూప్‌కుమార్‌తో కలిసి నివాళులర్పించారు. -
కాంగ్రెస్‌తో జతకట్టి ప్రజలను మోసం చేస్తున్న బాబు
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కడతానని చెప్పడం చూస్తుంటే ప్రజలను ఆయన మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పెద్దబజారులోని మీనాక్షి కల్యాణమండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 44, 46వ డివిజన్లకు సంబంధించి బూత్‌కమిటీ సభ్యులతో నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌తో కలసి మాజీ ఎంపీ మేకపాటి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్లో బూత్‌కమిటీ కన్వీనర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని చెబుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం బీజేపీతో జతకట్టినప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. తిరిగి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ కాంగ్రెస్‌తో జత కడతానని చెప్పడం చూస్తుంటే మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం అన్నారు. బూత్ కమీటీ కన్వీనర్లు, సభ్యులు ప్రతి గడపకు వెళ్లి నవరత్నాల గురించి మళ్లీ ఒకసారి ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వేలూరు మహేష్, నీలి రాఘవరావు, వేలూరు రఘు, మాళెం సుధీర్‌కుమార్‌రెడ్డి, బాలు స్వామి, అరవిందజైన్, నారాయణరెడ్డి, రాజేంద్ర, అశోక్ దాతియా, అశోక్‌రెడ్డి, జయకృష్ణ, రామలక్ష్మణ్, నిరంజన్‌రెడ్డి, మనోజ్, సురేష్, హరి, పెసల ఆనంద్, మల్లికార్జున్ పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలన అంతా శూన్యం
-
చంద్రబాబుకు అవకాశం ఇవ్వొద్దు
ఇందుకూరుపేట: రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు గెలిచే అవకాశం ఇవ్వరాదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలంలోని డేవిస్‌పేట జైన్ మందిరంలో శనివారం బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలసి రాజమోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న ఎన్నికలు అత్యంత కీలమైనవని, ఈ ఎన్నికల్లో బూత్‌కమిటీలదే ముఖ్యభూమిక అని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేయడం వల్ల ఓ చిన్న వ్యక్తికి వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐకి రాష్ట్రంలో ప్రవేశం లేదని బాబు చెబుతున్నారని, బహుశా రాçష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటారేమో అర్థం కావడం లేదన్నారు. దేశంలో రాష్ట్రం ఓ భాగమని, కేంద్ర ప్రభుత్వం అలాగే చూడాల్సి ఉందన్నారు. బీజేపీతో కాపురం చేసి గ్రాఫ్ తగ్గుతుందని బయటకు వచ్చి ఇప్పుడు కేకలు వేస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా కాంగ్రెస్‌తో జట్టు కట్టిన చంద్రబాబు ఎంత అవకాశవాదో తెలుస్తోందన్నారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయని, అందరం కలసికట్టుగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి చివర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన అందించారని గుర్తుచేశారు. టీడీపీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి కోర్టు సీబీఐ ఎంక్వయిరీ వేస్తుందని తాను నమ్ముతున్నానన్నారు. జిల్లాలో 10 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంటుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం పనులను రాష్ట్రానివిగా డప్పు ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పనులను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా డప్పుకొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీలకు వస్తాయన్నారు. కేంద్రం నిధులతో శ్మశానాల అభివృద్ధి, ఎన్‌ఆర్‌జీఈఎస్‌తో సిమెంట్ రోడ్లు వేసి వాటిని ఎమ్మెల్యేలు ప్రారంభించి కోట్ల రూపాయల పనులు చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. బీజేపీ నాయకులు వారు చేసిన పనులను చెప్పులేకపోతున్నారన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మాట్లాడి బీచ్ రిసార్ట్స్‌కు రూ.60 కోట్లు తీసుకొచ్చారన్నారు. ఇవి కూడా రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెబుతున్నారన్నారు. వీటిలో కోవూరు నియోజకవర్గానికి రూ.14 కోట్లు కేటాయించారని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ కైలాసం ఆదిశేషారెడ్డి, జెడ్పీటీసీ బీవీ రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధీర్‌కుమార్, నియోజకవర్గ బూత్‌కమిటీ ఇన్చార్జ్ ఎన్.సుధాకర్‌బాబు, బూత్‌కమిటీ మండల ఇన్చార్జ్ తాతా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి కోవింద్‌ను కలవనున్న వైఎస్ఆర్సీపీ నేతలు
-
వారితో న్యాయం జరగదు..
-
‘చంద్రబాబు నైజం అందరికీ తెలుసు’
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ నేతలను మభ్యపెట్టడానికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అవినీతి, అబద్ధాలను జాతీయ నేతలు ఎప్పుడో అర్ధం చేసుకున్నారని ఆయన అన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై థర్డ్‌పార్టీ విచారణ కోరుతున్నామని ఈసందర్భంగా ఆయన తెలిపారు. తమ డిమాండ్స్‌కు జాతీయ నేతలు సీతారాం ఏచూరి, శరద్ యాదవ్, శరద్ పవార్ మద్దతు తెలిపారని వెల్లడించారు. థర్డ్‌పార్టీ విచారణ జరిగితే సుత్రాదారులు బయటకు వస్తారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై దాడిని ఖండిస్తూ జాతీయ నేతల మద్దతు కోసం వైఎస్సార్సీపీ నేతలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. వారితో న్యాయం జరగదు.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపితే న్యాయం జరగదని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. హత్యాయత్నం వెనుక చంద్రబాబు పాత్రలేకపోతే జాతీయ నేతలను ఎందుకు కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. థర్డ్‌పార్టీ విచారణతోనే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. కుట్రను వివరించాం.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంను సీతారం ఏచూరి, శరద్ యాదవ్, పవార్లకు వివరించామని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. తమ డిమాండ్స్‌కు వారు మద్దతిచ్చారని తెలిపారు. థర్డ్‌పార్టీ విచారణపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చంద్రబాబువి అవకాశవాద రాజకీయలన్న విషయం జాతీయ నేతలకు తెలుసని ఆపార్టీ మాజీ ఎంపీ మేకపాటి రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కోరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మేం కోరుతున్నది హత్యాయత్నంపై థర్డ్‌పార్టీ విచారణ మాత్రమేనని మిథున్‌రెడ్డి ప్రకటించారు. జాతీయ నేతలందరికీ చంద్రబాబు నైజం తెలుసని అన్నారు. -
‘నిందితుడు శ్రీనివాస్‌ను ఏమైనా చేస్తారేమో..’
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును ఏమైనా చేస్తారమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావుకు హాని జరగొచ్చని ముందు నుంచి వైఎస్సార్ సీపీ చెప్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తనకు ప్రాణహాని ఉందని నిందితుడు చెబుతున్నాడు.. అతనికి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని థర్డ్ పార్టీతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. శ్రీనివాస్‌ను భుజాలపై మోసుకెళ్తున్నారని.. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. శ్రీనివాస్ వెనుకున్నది ఎవరో తెలియాలంటే.. అతని ఆరోగ్యం బాగుండాలని తెలిపారు. అవసరమైతే మరోసారి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ విషయాలను ఆయన వివరిస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చిన్న విషయం కాదని పేర్కొన్నారు. శ్రీనివాసరావు ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. శ్రీనివాస్‌ను ఏమైనా చేస్తారనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, మంగళవారం వైద్య పరీక్షల కోసం పోలీసులు శ్రీనివాసరావును విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో అతను తనకు ప్రాణహాని ఉందంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: నాకు ప్రాణహాని ఉంది సర్: నిందితుడు శ్రీనివాసరావు -
అలిపిరి దాడి భువనేశ్వరే చేయించారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ : ‘చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో అడ్డదిడ్డమైన మాటాలు మాట్లాడిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని చెప్పిస్తున్నారు. అలిపిరిలో దాడి మావోయిస్టులు చేసింది కాదు.. భువనేశ్వరి చేయించారని ఎవరైనా అంటే ఒప్పకుంటారా? అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు’ అని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, బొత్స సత్యనారాయణలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. పక్కా పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు, లోకేశ్, హర్షవర్దన్, శివాజీలు భాగస్వాములన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. ‘అలిపిరి ఘటనలో చంద్రబాబు గాయపడితే హుటాహుటిన వైఎస్సార్ తిరుపతికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా వైఎస్సార్ ధర్నా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్న సంఘటనను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. హత్యాయత్నాన్ని ఖండించిన నేతలను తప్పుబడుతున్నారు. గవర్నర్‌ను కూడా తప్పుబట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. కేసు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకోకుండానే నిందితుల గురించి డీజీపీ చెప్పడం దారుణం. ఏపీ పోలీసు శాఖ ప్రభుత్వానికి కొమ్ముకాస్తుంది. వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ పార్టీ విచారణ జరగాల్సిందే’ అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. డీజీపీ ప్రకటన విచారణ నీరుగార్చేలా ఉంది : వైవీ సుబ్బారెడ్డి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం పాపులారిటీ కోసమే చేశారని డీజీపీ చెప్పడం దారుణమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. డీపీపీ ప్రకటన విచారణను నీరుగార్చేలా ఉందని ఆరోపించారు. వైఎస్ జగన్ అప్రమత్తంగా ఉండటం వల్లే ప్రాణపాయం తప్పిందన్నారు. వైఎస్ జగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని విమర్శించారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల అండలేకుంటే క్రిమినల్ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్వోసీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. క్యాంటీన్ యజమాని హర్షవర్దన్.. చంద్రబాబు, లోకేశ్‌లకు సన్నిహితుడని ఆరోపించారు. నిజాలు బయటపడాలంటే కేంద్ర సంస్థలతోనే దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదు: మేకపాటి వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ కుట్ర చేసి హత్యాయత్నానికి పాల్పడిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. సరైన విచారణ జరిగితేనే నిజాలు బయటకొస్తాయన్నారు. పాత్రధారుడిపైనే కాదు సూత్రధారులపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: వరప్రసాద్ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టమైనా.. సీఎం చంద్రబాబు నాయుడు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత వరప్రసాద్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం, డీజీపీ చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్ హుందాగా వ్యవహరించారని గుర్తుచేశారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలచే విచారణ చేయిస్తే నిజాలు బటయకొస్తాయని వరప్రసాద్ పేర్కొన్నారు. -
‘వైఎస్ జగన్‌ను అంతమొందించటానికి బాబు కుట్ర’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఆరోపించారు. ఆదివారం న్యూఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ అండతోనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని అన్నారు. హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించాలని చూస్తున్నట్లు తెలిపారు. జగన్ హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం చంద్రబాబు ఢిల్లీ వచ్చారని చెప్పారు. -
అంతా పథకం ప్రకారమే..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఎంతమాత్రం చిన్నది కానే కాదని, ఆయన్ను అంతమొందించడానికి ఒక పథకం ప్రకారం పక్కాగా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం దీనిని చిన్నగా చేసి చూపుతోందని అభ్యంతరం తెలిపారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ హత్యాయత్నంపై నిష్పాక్షిక విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని సీఎం చంద్రబాబుకు సవాలు విసిరారు. మేకపాటి మాట్లాడుతూ జగన్ తనపై హత్యాయత్నం తానే చేయించుకున్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, ఇక టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏకంగా తాము కావాలంటే జగన్‌ను కైమా కింద ముక్కలు చేస్తామంటున్నారని, ఇదెంత దారుణమైన మాట అని తప్పుపట్టారు. వాస్తవానికి జగన్‌పై జరిగిన దాడి చిన్నది కాదని, ఆ కత్తి ఎంతో పదునుగా ఉంటుందని, అది కనుక తగలరాని చోట తగిలితే ప్రాణాపాయం కలిగేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు చాలా చిన్న కుటుంబానికి చెందినవాడని, అతనికి అంత తెగింపు ఉండదని, ఎవరో ప్రేరేపించి ఉంటారు కాబట్టే అన్ని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. హత్యాయత్నాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా డీజీపీ ఎలా చెబుతారని, టీడీపీ ఎంపీలు అంత దారుణంగా ఎలా మాట్లాడతారని మేకపాటి దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన దాడి ఆయన్ను అంతం చేసేందుకు పథకం ప్రకారం చేసిందంటూ.. దీన్ని చిన్నదిగా చేసి చూపడం దారుణమన్నారు. ఈ ఘటనకు ఇతరులను బాధ్యులుగా చేయడం, వారిపైనే నిందలు వేయడం ఎంతవరకు సబబన్నారు. ప్రతిపక్ష నేతను పరామర్శించిన వారినీ విమర్శించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని ప్రజలంతా గమనించాలని, ఇలాంటి పోకడలను సమర్థిస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని అనేక సమస్యలొస్తాయని చెప్పారు. థర్డ్‌పార్టీతో సమగ్ర దర్యాప్తు చేయించాలి.. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నంలో తననే ముద్దాయిగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు అంటున్నారని, అయితే దీన్నుంచి బయటపడాలంటే.. రాష్ట్రప్రభుత్వంతో సంబంధం లేని ఏజెన్సీతో దర్యాప్తు జరిపించి ఆ నివేదికను ప్రజల ముందుంచితే సరిపోతుందని ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఈ ఘటనతో సీఎంకు సంబంధం లేదని చెప్పడం నిజమే అయితే అది దర్యాప్తులో తేలుతుంది కదా? మీకెందుకంత కలవరం? అని ప్రశ్నించారు. థర్డ్ పార్టీతో సమగ్ర దర్యాప్తు చేయిస్తే అన్నీ తేటతెల్లమవుతాయన్నారు. డీజీపీ ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయం చెప్పారని, కానీ సీఎం పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌ను) ఏర్పాటు చేస్తానన్నారని, డీజీపీ అభిప్రాయం చెప్పాక దానికి భిన్నంగా సిట్ నివేదికిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అంటే దాదాపుగా మీ(సీఎం) హోదా కలిగినవారని, అలాంటివ్యక్తిపై హత్యాయత్నం జరిగితే ఇలా వ్యవహరిస్తారా? అని విస్మయం వెలిబుచ్చారు. ఘటన జరిగిన గంటలోపే డీజీపీ తన అభిప్రాయం ఎలా చెబుతారు.. ఆయన అసలు అలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. డీజీపీ చెప్పిందే నిజమని ప్రజల్ని నమ్మించేయత్నం పథకం ప్రకారం జరుగుతోందన్నారు. గవర్నర్‌ను తప్పుపట్టడమేంటి? గవర్నర్ రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి అని, ఈ హత్యాయత్నంపై డీజీపీతో ఆయన మాట్లాడటాన్ని ఎలా తప్పుపడతారు? వాస్తవానికి రాష్ట్రంలో గవర్నర్ పేరుమీదుగానే కదా పాలన జరిగేది? అని ధర్మాన అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి అధిపతి ఎవరు? ప్రభుత్వ నిర్ణయాలు ఎవరిపేరిట వెలువడతాయి? అసలు మంత్రిమండలిని నియమించేది ఎవరని నిలదీశారు. గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఏకంగా కలెక్టర్ల సదస్సులోనే మాట్లాడారని, ఒక ముఖ్యమంత్రిగా అలా వ్యవహరించవచ్చా? అని ప్రశ్నించారు. ఎవరి అజమాయిషీలో పనిచేస్తున్నారో ఆయననే అవమానపరుస్తూ మాట్లాడ్డం చూస్తే చంద్రబాబు గతి తప్పుతున్నట్టుగా ఉందన్నారు. చంద్రబాబు ఢిల్లీలో గంభీరంగా మాట్లాడారని, దేశంలో రాజ్యాంగవ్యవస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు కూలిపోయాయని ప్రసంగించారని, కానీ అక్కడివారికి ఇక్కడ(ఏపీలో) ఏం జరుగుతోందో తెలియదని ధర్మాన అన్నారు. ఏకంగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేగాక వారిని అనర్హులుగా చేయకుండా స్పీకర్‌పై ఒత్తిడి చేసింది నిజం కాదా? అలాంటి చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోతోందని మాట్లాడతారా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్నదానికి భిన్నంగా ఢిల్లీ వీధుల్లో గగ్గోలు పెడుతున్నారని, మీపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరపకూడదా? మీరేమైనా అతీతులా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు కనుక విచారణకు ఆహ్వానిస్తారనుకున్నామని, తనను తాను రక్షించుకోవడానికి మాట్లాడారేతప్ప మరేమీ లేదన్నారు. అందుకే తాము థర్డ్‌పార్టీ విచారణనుగానీ, సీబీఐ దర్యాప్తునుగానీ కోరుతున్నామన్నారు. జగన్ తమ దయాదాక్షిణ్యాలమీదనే బతుకుతున్నాడని, తాము అనుకుంటే కైమా చేసేవాళ్లమన్న టీడీపీ ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
శ్రీనివాస్‌ను ప్రేరేపించిందెవరు? కుట్రదారులెవరు?
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్‌ను ప్రేరేపించిందెవరని, ఈ దాడి వెనుక కుట్రదారులెవరో తేల్చాలని ఆ పార్టీ నేతలు మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి రాజకీయ కారణాలతో బయటకొచ్చారన్నారు. ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై కేకలేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మొదట్నుంచీ పోరాడుతుంది వైఎస్సార్‌సీపేనని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిపై టీడీపీ నేతల స్పందన దారుణంగా ఉందన్నారు. ఈ దాడిని చిన్న ఘటనగా చిత్రీకరించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, విచారణ చేయకుండా డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జగన్‌ను కైమా చేసేవాళ్లమని టీడీపీ నేతలు అనడం ఎంతవరకు సమంజసమని అడిగారు. రాష్ట్రపతి,కేంద్ర హోంమంత్రిలను కలిసి దాడి ఘటనను నివేదిస్తామని ఈ సందర్భంగా మేకపాటి పేర్కొన్నారు. టీడీపీ పెద్దల హస్తం: ధర్మాన వైఎస్ జగన్‌పై దాడి వెనుక టీడీపీ పెద్దల హస్తముందని ధర్మాన ఆరోపించారు. వారికి సంబంధం లేనప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించొచ్చు కదా అని ప్రశ్నించారు. థర్డ్‌పార్టీ ఏజెన్సీతో విచారణ జరిగితేనే ప్రజలు విశ్వసిస్తారని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను పనిచేయకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ పాత్ర కాకుండా .. చంద్రబాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దయాదాక్షిణ్యాలపై బతకకపోతే ఎవర్నైనా కైమా చేసేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగనివ్వకుండా స్టేలు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అక్రమ సంపాదనపై దాడులు జరిగితేనే ప్రజలకు నమ్మకమొస్తుందని తెలిపారు. వైఎస్ జగన్ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్‌లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉండటంతో వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని ధర్మాన పేర్కొన్నారు. -
నెల్లూరులో 3000 వేల కొబ్బరి కాయలు కొట్టి ప్రజాసంకల్పయాత్ర మద్దతు
-
బారాషహీద్ దర్గా కిటకిట
నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. రొట్టెల పండుగకు రెండో రోజు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆయా ఘాట్లలో రొట్టెలను పట్టుకుని బారాషహీదులను దర్శించుకున్నారు. కడప దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో గంధంను సంప్రదాయబద్ధంగా కలిపి ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. బారాషహీదులకు గంధం సమర్పించి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వైఎస్ జగన్ సీఎం కావాలి: మేకపాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం స్థానిక దర్గామిట్టలోని బారాషహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని రొట్టెను పట్టుకున్నారు. -
నవరత్నాలతో ప్రగతికి నాంది
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: ప్రజాసంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రగతికి నాంది అని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కోవూరు తూర్పు అరుంధతీయవాడలో గురువారం రావాలి జగన్...కావాలి జగన్ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించాడన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలను వదిలి జన్మభూమి కమిటీలను పెట్టి ప్రభుత్వ పథకాలను çటీడీపీ నేతలు, కార్యకర్తలకే పరిమితమయ్యేలా చేస్తున్నాడన్నారు. నిన్నటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి పనిచేసి నేడు వైఎస్సార్సీపీ నేతలు మోదీతో ఉన్నారని మోసకారి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్ర రాజధానిలో ఒక్క శాశ్వత భవనం లేకపోయినా చంద్రబాబు గ్రాఫిక్స్‌ను చూపుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. మభ్యపెట్టడంలో చంద్రబాబు మొనగాడన్నారు. అందుకే ప్రజాస్వామ్య మనుగడకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలన్నారు. అందరూ సమష్టిగా కష్టపడి జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు నాటకాలను, భూటకపు హామీలను, ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడాన్ని వివరించాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నదే లక్ష్యమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పోలింగ్‌బూత్‌ల పరిధిలో ప్రతి ఒక్కరికీ చేరాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్‌రెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్, సూరా శ్రీనివాసులురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య పాల్గొన్నారు. -
ఆటోషో.. జోష్
నెల్లూరురూరల్/నెల్లూరు (వీఆర్సీసెంటర్): ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెండో రోజూ ఆదివారం నిర్వహించిన ‘సాక్షి’ మెగా ఆటోషోకు అపూర్వ స్పందన లభిం చింది. నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో ‘సాక్షి’ మెగా ఆటోషో సరికొత్త ఆలోచనతో వివిధ రకాల టూ, ఫోర్ వీలర్ వాహనాలను ఒకే వేదికకు తీసుకువచ్చింది. ఆటో షోలో సరికొత్త మోడల్స్‌తో పాటు, అధునాతన ఫీచర్లు ఉన్న వాహనాలను పలు సంస్థలు తీసుకొచ్చి నగర ప్రజలకు, వాహన ప్రియులకు పరిచయం చేశాయి. నగర ప్రజలతో పాటుగా, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహికులతో వీఆర్సీ క్రీడా మైదానం నిండిపోయింది. నచ్చిన వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసుకునే వీలు కల్పించడంతో యువత పెద్ద సంఖ్యలో వచ్చి తమకు అనుకూల బడ్జెట్లో, అనుకున్న ఫీచర్లు కలిగి ఉన్న వాహనాల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించుకుని సంతృప్తి చెంది, వాహనాలను కొనుగోలు చేశారు. మరికొంత మంది వాహనాలకు బుక్ చేసుకున్నారు. చివరి రోజు ఆటో షోకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులతో వాహన ప్రియులు వచ్చి కొనుగోలు చేయటంతో ఆటోషోలో పాల్గొన్న కంపెనీలు సైతం ఆనందంలో మునిగిపోయాయి. ‘సాక్షి’ నిర్వహించిన ఆటోషోకు పలు కంపెనీలకు చెందిన 22 స్టాల్స్ ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన కంపెనీలే కాక ఇతర జిల్లాలకు చెందిన కంపెనీలు ఆటోషోలో సరిత్త వాహనాలను నగర వాసులకు అందుబాటులో తీసుకు వచ్చారు. కొన్ని కంపెనీలు వారి వాహనాలకు స్పాట్ డెలివరీ, స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కల్పించటం గమనార్హం. ఇలాంటి ఆటోషోలను సక్సెస్ చేయటం ‘సాక్షి’కే సాధ్యమైందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రెండో రోజూ అనూహ్య స్పందన సాక్షి మెగా ఆటో షోకు అనూహ్య స్పందన లభించింది. ఆదివారం ముగిసిన షోలో అన్ని ప్రముఖ కంపెనీల వాహనాలను ఉంచడంతో వాహన ప్రియులు సందడి చేశారు. కొందరు తమకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేశారు. షో సందర్భంగా షోరూం నిర్వాహకులు కొన్ని వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. ఇటు వంటి షోలు ఏర్పాటు చేయడం వల్ల తమకు ఎంతో సమయం ఆదా అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. రెండో రోజు ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగింది. మొత్తంగా వేలాదిగా నగర ప్రజలు ప్రదర్శనలో పాల్గొని వారికి నచ్చిన వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు, బుక్ చేసుకున్నారు. సిరికళ వెడ్డింగ్ మాల్ సౌజన్యంతో ఆటో షో సందర్శకులకు గంట గంటకు లక్కీడిప్ తీసి గిప్ట్ కూపన్స్ అందజేశారు. ఈ ఆటో షోలో భార్గవి మారుతి సుజికి, భారతి నెక్సా, భార్గవి ఆటోమొబైల్, స్కోడా, కున్ హోండాయ్, సాయి షిర్డిషా హోండా, సరయు హీరో, ఎంఎల్ విస్సా, లక్ష్మీప్రసన్న హోండా, లక్ష్మీప్రియ టీవీఎస్, సుజికీ, రాయల్ ఎన్ఫీల్డ్, ఎంఎస్ మోటార్స్ వీసా అప్రిలిక, హెల్త్ గూడ్స్, ఎక్స్‌ప్రెస్ హోండా, టాటా మోటార్స్, కేటీఎం, యమహా గోల్డ్ ఫీల్డ్, ఏఎంరెడ్డి హీరో, ఎంజీవీ బజాజ్, తదితర కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో సాక్షి డీజీఎం బి.రంగనా«థ్, నెల్లూరు యూనిట్ యాడ్స్ మేనేజర్, బ్రాంచ్ ఇన్చార్జి పి.కృష్ణప్రసాద్, బ్యూరో ఇన్చార్జి కె. కిషోర్, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ జయరాజ్, భార్గవి ఆటో మొబైల్స్ అధినేత కొండా నిరంజన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కర్తం ప్రతాప్‌రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జగన్ సీఎం అయితే ప్రాజెక్ట్‌లు పూర్తి
ఉదయగిరి: సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తికావాలంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంం కావాలని, ఆయన ద్వారానే ఉదయగిరి ప్రాంతానికి సాగునీరు అంది, సస్యశ్యామలం అవుతుందని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి మెరిట్స్ కళాశాలలో శనివారం మండల బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన ఉదయగిరి మెట్ట ప్రాంతం ఎన్నో ఏళ్లనుంచి సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హైవే కెనాల్, సీతారాంసాగర్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్లు మంజూరుచేశారని, ఆయన బతికుంటే ఈ పాటికి సాగునీరు అంది సస్యశ్యామలం అయ్యేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో 3,500 కిలోమీటర్లు ఏడాదిపాటు పాదయాత్ర సాగించి ప్రజలతో మమేకమైన నేత దేశ చరిత్రలో ఎవరూ లేరన్నారు. జగన్‌కు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని, దీనిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబు డబ్బుతో, వివిధ రకాల బూటకపు వాగ్దానాలు, కుయుక్తులతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంతవరకు చంద్రబాబు పాలన చూశారని, వైఎస్ జగన్‌కు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ బలోపేతానికి బూత్‌స్థాయిలో కసరత్తు జరగాలన్నారు. ప్రతి బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు అంకితభావంతో పనిచేసి వైఎస్సార్సీపీ ప్రకటించిన వరత్నాలు, మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించి పార్టీకి ఓట్లు పడే విధంగా పాటుపడాలన్నారు. పార్టీ అధికారంలోకొస్తే బూత్‌కమిటీ సభ్యులు, కన్వీనర్లకు సముచిత స్థానం ఉంటుందని, నా మాటగా వారికి చెప్పాల్సిందిగా జగన్ చెప్పారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు డబ్బుతో ఎంపీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా చాలామంది పార్టీ కార్యకర్తలు అలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధుల పదవులు మూడు నెలల్లోపు కోల్పోయే విధంగా కేంద్రం చట్టం తీసుకురావాలన్నారు. ఉదయగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ పాలన రావాలంటే వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారన్నారు. మేకపాటి కుటుంబం ఎల్లవేళలా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి విధేయతగానే ఉంటుంది తప్ప తాము పార్టీ మారే పరిస్థితే లేదన్నారు. కొంతమంది పనికట్టుకొని పార్టీ మారుతున్నారని చేస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉండటంతో ఓటమి చెందిం దని, ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశంతోనే బూత్‌స్థాయి కమిటీలను బలోపేతం చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రతి బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు ఒక ప్లాన్ ప్రకారం ప్రజల్లోకి వెళ్లి పార్టీ నాయకులు పడుతున్న కష్టాలను, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తపిస్తున్న విధానాన్ని ప్రస్తుత పాలకపక్షం చేస్తున్న మోసాలను వివరించాలన్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేయవలసిన ఆవశ్యకత గురించి ఓటర్లకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉందని, దీనిని మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరముందన్నారు. కొన్ని సర్వేలు ఇచ్చే నివేదికలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇండియాటుడే సర్వే కూడా జగన్ సీఎం అవుతారని నిర్ణయించిందన్నారు. బూత్ కమిటీలు బోగస్ ఓబ్లు గుర్తించి తొలగించాలన్నారు. చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ ద్వారా లబ్ధిపొందేందుకు టీడీపీ, ఎల్లో మీడియా తీవ్ర పాట్లుపడుతున్నాయ ని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీ ఆర్ టీడీపీని స్థాపిస్తే..ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్న దివాలాకోరు రాజకీయ నేత చంద్రబాబు అన్నారు. పది తరాలకు సరిపోయే ప్రజల సొమ్ము ను బాబు కుటుంబం అక్రమార్జనలో సంపాదిం చిందని ఆరోపించారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి మొదటినుంచి అండగా నిలిచింది మేకపాటి కుటుంబమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా రాజమోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా చంద్రశేఖర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ బూత్‌కమిటీల ఇన్చార్జి వెంకటనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
బాబు మోసకారి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబు మోసకారి అని, ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోవూరు మండలం పడుగుపాడు రుక్మిణి కల్యాణ మండపంలో గురువారం జరిగిన కోవూరు నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు బీజేపీతో దోస్తీ చేసి నేడు మోదీని విమర్శిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నాడన్నారు. అంతటితో ఆగక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండి పడ్డారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నుంచి మైనార్టీలను, బీసీలను, షెడ్యూల్డ్ తెగలను దూరం చేయాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. వాటిని తిప్పి కొట్టే దిశగా బూత్ కమిటీ కన్వీనర్లలందరూ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లాకు తెలుగుగంగ తెచ్చి నీటి కొరత తీర్చిన గొప్ప నాయకుడన్నారు. ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఈ నాలుగేళ్లలో ఎమ్మెల్యే కాకపోయినా నాతో పాటు ఎందరో నేతల నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించారన్నారు. ఆయన గెలుపునకు సమష్టిగాకృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ అభ్యర్థిగా తన గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం బూత్ కమిటీ నెల్లూరు జిల్లా ఇన్చార్జి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన అధ్యాయాన్ని సృష్టించారన్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించి ప్రజల బాధలను తెలుసుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులందరూ విజయం సాధించాలన్నారు. ఎన్నికల్లో బూత్ కమిటీలే కీలకమన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు క్రమశిక్షణతో పనిచేసి కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపొందేందుకు కష్టపడాలని ఆయన కోరారు. కోవూరు నుంచే పోటీ చేస్తా– నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లాలో తనపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు నాలుగేళ్లుగా టీడీపీ నేతల అరాచకాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. అయినా నేటికీ తన వెంటే ఉన్నామని బూత్ కమిటీ సమావేశానికి వచ్చి రుజువు చేశారన్నారు. మీలాంటి వ్యక్తులు దొరకడం నా అదృష్టమని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమన్నారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తన లక్ష్యమన్నారు. టీడీపీ నేతల అరాచకాలకు చరమగీతం పాడుదామన్నారు. ఎన్నికలను ఎన్నికల్లా చేయాలని, తానున్నానని భరోసా ఇచ్చారు. సీఎం కుర్చీలో జగన్మోహన్రెడ్డిని కూర్చోబెట్టాలన్నారు. ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా తాను కోవూరు నియోజకవర్గ అభివృద్ధి చేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆనందంగా ఉండే రోజు త్వరలో రానునందన్నారు. అందరూ కలిసికట్టుగా విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణయ్య, నాపా వెంకటేశ్వర్లునాయుడు, వీరి చలపతిరావు, షేక్ అల్లాబక్షు, బూత్ కమిటీ నియోజకవర్గ కన్వీనర్ స్వర్ణా సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
హరికృష్ణకు నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
సంక్రాంతి తర్వాత బాబును సాగనంపడమే..
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి.. పశ్చిమ ప్రకాశం రైతున్నలకు వ్యవసాయం పండుగ కావాలనే సత్ సంకల్పంతో స్వాతంత్య్ర దినోత్సవ శుభ తరుణాన ఆరంభమైన ప్రజా పాదయాత్ర 14 రోజుల పాటు సాగింది. ఐదు నియోజకవర్గాలు.. 69 గ్రామాల మీదుగా మొత్తం 207 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే డిమాండ్‌తో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. ఆయన చేపట్టిన కార్యం విజయవంతం కావాలని కాంక్షిస్తూ మహిళలు హారతులిచ్చి స్వాగతాలు పలికారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు వైవీకి సంఘీభావం పలికారు. ప్రాజెక్టు పూర్తి చేసే వరకు తన పోరాటం ఆగదని వైవీ ప్రతినబూనారు. అదిగో ప్రాజెక్టు.. ఇవిగో నీళ్లంటూ టీడీపీ సర్కారు ఏడాదికో ప్రకటనతో ప్రకాశం ప్రజల్ని మోసగిస్తోందని, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని రాజన్నపాలన తెచ్చుకుందామని వైవీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ పూర్తి చేసి, నీళ్లిస్తామని ప్రకటించగా ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కనిగిరి పట్టణం నుంచి ప్రారంభమైన ప్రజా పాదయాత్ర పెద్దదోర్నాల మండలంలోని వెలిగొండ ఒకటో సొరంగమార్గం వద్ద మంగళవారం ముగిసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిగా గాలికొదిలారని, దివంగత నేత వైఎస్ నిధులిచ్చి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యి వెలిగొండకు నీరిస్తారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెలిగొండ సాధన కోసం సుబ్బారెడ్డి ఈనెల 15 నుంచి చేపట్టిన ప్రజా పాదయాత్ర మంగళవారం వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ వద్దకు చేరింది. యాత్ర ముగింపు సందర్భంగా సాయంత్రం సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ పాదయాత్రలో తనతో కలిసి నడిచిన అందరికీ తొలుత వైవీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఆది నుంచి కరువు ప్రాంతమని, 33 లక్షల మంది జనాభా ఉండగా దాదాపు 12 లక్షల ఎకరాల సాగుభూమి ఉందని వైవీ చెప్పారు. 6.80 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని, 13 లక్షల మంది యువత, 3 లక్షల మంది పట్టభధ్రులు ఉన్నారన్నారు. జిల్లాలో 70 శాతం మందికి తాగునీరు అందడం లేదన్నారు. 50 శాతం భూములకు సాగునీరు లేక బీళ్లుగా ఉన్నాయన్నారు. సంక్రాంతి తర్వాత బాబును సాగనంపడమే.. ప్రకాశం జిల్లాపై దివంగత నేత వైఎస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, చంద్రబాబు రాకముందే వెలిగొండ 75 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 13 ఏళ్ల పాలనలో చంద్రబాబు వెలిగొండను పట్టించుకోలేదని వైవీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి 2014 నుంచి ఏటా నీళ్లిస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నాలుగేళ్లు దాటినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు. 13 ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం దక్కలేదని, వారి భూములు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వారికి న్యాయం చేయాలని వైవీ డిమాండ్ చేశారు. అందుకే 14 రోజుల పాటు పాదయాత్ర చేశానన్నారు. వెలిగొండ పూర్తి అయితేనే పశ్చిమ ప్రాంతానికి బతుకని, ఫ్లోరైడ్‌ను పారదోలే అవకాశం ఉంటుందని చెప్పారు. సంక్రాంతి తర్వాత చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఫేజ్–1లో 1.20 లక్షల ఎకరాలకు నీరిస్తామని, 3వ టన్నెల్ తవ్వి అయినా కొండపి, పొన్నలూరులకు నీరిస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ముగిసిన పాదయాత్ర : వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈనెల 15న కనిగిరి నుంచి చేపట్టిన పాదయాత్ర కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో 69 గ్రామాల గుండా 14 రోజుల పాటు 207 కిలో మీటర్లు సాగింది. చివరి రోజు మంగళవారం పాదయాత్ర వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన టన్నెల్–1కు చేరింది. సాయంత్రం ఇక్కడే బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పాదయాత్ర పైలాన్‌ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ మంత్రులు మానుగుంట మహీధర్‌రెడ్డి, పార్థసారధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పిడతల సాయి కల్పనారెడ్డి, జక్కంపూడి రాజా, బాపట్ల సమన్వయకర్త సురేష్, పార్టీ అధికార ప్రతినిధులు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాని రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు బాదం మాధవరెడ్డి, రావి రామనాథంబాబు, బుర్రా మధుసూదన్‌యాదవ్, సుధాకర్‌బాబు, ఐవీ రెడ్డి, యడం బాలాజీ, బాచిన చెంచు గరటయ్య, నాయకులు బియ్యపు మధుసూధన్‌రెడ్డి, వెన్నా హనుమారెడ్డి, వరికూటి అశోక్‌బాబు, చుండూరు రవి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సింగరాజు వెంకట్రావ్, కుప్పం ప్రసాద్, రామారావు, పి.చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆదినారాయణ, మధుసూదన్‌రెడ్డి, జెట్పీటీసీ సభ్యులు అమిరెడ్డి రామిరెడ్డి, దుగ్గెంపూడి వెంకటరెడ్డి, ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, నాయకులు కన్వీనర్లు జంకె ఆవులరెడ్డి, దొంతా కిరణ్‌గౌడ్, పి.చంద్రమౌళిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, షేక్.జబీవుల్లా, కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పులుగు అక్కిరెడ్డి, పటా పంజుల అశోక్, షేక్.అబ్దుల్‌మజీద్, గంటా గురువారెడ్డి, వై.లింగారెడ్డి, కె.మల్లారెడ్డి, ఎ.రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెలిగొండపై సవాల్‌కు సిద్ధమా..? ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి నీటిని విడుదల చేస్తే తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి గుండు గీయించుకుంటానని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. సంక్రాంతి నాటికి నీరు ఇవ్వలేకపోతే జిల్లాకు చెందిన మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని బాలినేని ధ్వజమెత్తారు. జిల్లాకు బాబు ఒరగపెట్టింది శూన్యమన్నారు. ప్రజా పాదయాత్ర ముగింపు సభలో బాలినేని ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు వర ప్రదాయని అన్నారు. ఈ ప్రాంతం సశ్యశ్యామలం కావాలని దివంగతనేత వైఎస్ కలలు కన్నారన్నారు. 1996లో చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఒక్క పైసా ఇచ్చి పనులు మొదలు పెట్టలేదని బాలినేని విమర్శించారు. 2003 ప్రాంతంలో వైఎస్ జిల్లాకు వచ్చి తాను సీఎం అయితే వెలిగొండ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆమేరకు రూ.3వేల కోట్లకు పైగా నిధులిచ్చి పనులు 70 శాతం పైగా పూర్తి చేశారన్నారు. నిధులిచ్చి పనులు చేయకుండానే చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని, నీళ్లిచ్చేది కూడా తానేనని చెప్పడం సిగ్గుచేటన్నారు. టెంకాయ కొడితే ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలన్నారు. సంక్రాంతికి నీరిస్తానంటూ చంద్రబాబు జనాన్ని వంచించే ప్రయత్నంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు బాబు చేసింది శూన్యమన్నారు. వైఎస్ హయాంలోనే గుండ్లకమ్మ, రామతీర్థం, ఉలుచి చెక్‌డ్యామ్ తదితర పనులు పూర్తయ్యాయన్నారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను పెంచి పోషించేందుకే నీరు చెట్టు పనులు ప్రవేశపెట్టారన్నారు. అవి ప్రజల కోసం కాదని బాలినేని విమర్శించారు. -
చంద్రబాబు మోసకారి..
-
‘ప్రత్యేక హోదాను చంద్రబాబే నీరుగార్చారు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను నీరుగార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖరాసి చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో పోలవరం, హోదా, రైల్వేజోన్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, వైఎస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం వంటి హామీలిచ్చి టీడీపీ, బీజేపీలు పట్టించుకోవటంలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటివరకు వైఎస్ జగన్ ఒకే మాటపై ఉన్నారని తెలిపారు. హోదా కోసం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ఏం సాధించారో చూశామని.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఏం సాధిస్తారో చూద్దామని ఎద్దేవా చేశారు. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులను విభజించకుండా ఏపీని పనిగట్టుకుని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు చాలా వాగ్దానాలు చేసి మోసం చేశాయన్నారు. -
చంద్రబాబు మహా మాయావీ
-
వైఎస్సార్సీపీ ఉద్యమంతోనే..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా టీడీపీ బీజేపీ బంధం మరోసారి బట్టబయలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానం చర్చలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించిన అంశం, టీడీపీ వ్యవహరించిన తీరుపై వీరు స్పందించారు. ప్రత్యేక హోదా సంజీవనా అని ఎగతాళి చేసిన చంద్రబాబు.. హోదా కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న ఉద్యమం చూసి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందని మాజీఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మేం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని మద్దతు కోరితే అవిశ్వాసంతో ఏమొస్తుందని అన్నారని.. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినా ఏం సాధించలేకపోయారని తెలిపారు. ప్రజలను మభ్య పెట్టడంలో భాగంగానే టీడీపీ అవిశ్వాస డ్రామా ఆడిందన్నారు. రాజ్‌నాథ్ స్టేట్మెంట్పై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన తెలపలేదని విమర్శించారు. బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదని తెలిపారు. అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేశినేని నాని చివర్లో హోదా కోసం గట్టిగా నిలదీయకుండా, హామీలపై వాదించకుండా వ్యక్తిగత విమర్శలకే సరిపెట్టారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను అనర్హురాలిగా ప్రకటించాలని అడిగితే.. ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని, ఇప్పటికీ టీడీపీ,బీజేపీ కలిసి ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. లోపాయికారి ఒప్పందంతోనే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంటు, పోర్టుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని మాజీఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఒత్తిడి పెంచాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మేం 13 సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చినా స్పీకర్ అనుమతించలేదన్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేసి, ఆమరణ దీక్ష చేశామని తెలిపారు. అయితే ఇప్పుడు తొలిరోజే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చారని.. దీంతో వారి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం అర్థమవుతోందన్నారు. బయట కాంగ్రెస్ మద్దతు తీసుకుని..లోపల బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకున్నారని ప్రధాని స్పష్టం చేశారని.. ఇప్పుడు, ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి హోదా వచ్చేవరకు పోరాడుతామని సుబ్బారెడ్డి చెప్పారు. -
చంద్రబాబు అవినీతి వల్లే..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. అసలు పూటకో మాట మాట్లాడే చంద్రబాబు రాజకీయాలకు పనికిరారని మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ప్రజల్లో విశ్వాసం కోల్పోవడమేనని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. ప్రధానంగా చంద్రబాబు అవినీతి, అసమర్థత వల్ల ఏపీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఏపీకి బీజేపీ-టీడీపీ రెండూ ద్రోహం చేశాయన్న వరప్రసాద్.. చంద్రబాబు ద్రోహి నంబర్‌వన్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదట ఆమరణ దీక్ష చేసింది మాత్రం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా వరప్రసాద్ గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అనేది నేటికీ సజీవంగా ఉందంటే అందుకు కారణం జగనేనన్నారు. ఏపీకి హోదా కోసం ఏమేమి చేయాలో అన్నింటినీ వైఎస్సార్సీపీ చేసిందన్నారు. తాము కేంద్రంపై 13సార్లు అవిశ్వాసాన్ని పెట్టినా చర్చకు అనుమతి ఇవ్వలేదన్నారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు సృష్టించిన గందరగోళం కారణంగానే తాము పెట్టిన అవిశ్వాసంపై చర్చకు రాలేదన్నారు. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ కూడా సభ సాక్షిగా చెప్పిన విషయాన్ని వరప్రసాద్ పేర్కొన్నారు. ఇకనైనా అవకాశ వాద రాజకీయాలను టీడీపీ వదిలిపెట్టాలని హితవు పలికారు. ఇప్పటికైనా బీజేపీ.. ఏపీకి హోదాను ప్రకటిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మరోనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ..‘ మేము అవిశ్వాసం పెట్టినప్పుడు అవహేళన చేశారు. ఇప్పడు మధ్యలో వచ్చి నేనే చాంపియన్ అని చంద్రబాబు అంటున్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి.. ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు. ఎవరు ఎలా చేస్తున్నారో ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ఆలోచనంతా జగన్‌ను ఇబ్బంది పెట్టడంపైనే. చంద్రబాబు-మోదీ రాష్ట్రానికి చాలా ద్రోహం చేశారు’ అని వ్యాఖ్యానించారు. సంబంధిత కథనాలు: నేడే అవిశ్వాసం టీడీపీ అవిశ్వాస తీర్మానం వెనుక కేంద్ర సర్కార్ కనుసైగ! -
ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే పని చేస్తున్నారు
-
‘అప్పుడేమో ఎగతాళి.. ఇప్పుడేమో అవిశ్వాసం’
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాసంపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తామే చాంపియన్ అనిపించుకోవాలనే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలుచీ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘టీడీపీ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే తపన తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఎగతాళి చేసిన చంద్రబాబే అవిశ్వాసం పెట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. రాష్ట్ర సమస్యలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపుతారు. వైఎస్ జగన్ వస్తేనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది’ అని వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నేతలు నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
‘టీడీపీకి ఆ హక్కు లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు స్పష్టం చేశారు. టీడీపీ- బీజేపీ పొత్తు, పార్లమెంట్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించేందుకు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి, వర ప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేశామని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పోరాటం చేశామని మాజీ ఎంపీలు వివరించారు. గతంలో తమ పార్టీ అవిశ్వాసం పెడితే ఏపీ సీఎం చంద్రబాబు నాయడు హేళన చేశారని.. ఆరోజే టీడీపీ ఎంపీలు మాతో కలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని, అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు టీడీపీకి లేదని మండిపడ్డారు. ఇదంతా టీడీపీ- బీజేపీల మ్యాచ్ ఫిక్సంగ్‌లో భాగంగానే ఈ డ్రామా జరుగుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా నేడు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ మాజీ ఎంపీలు ధర్నా చేశారు. -
టీడీపీ రోజుకో డ్రామా ఆడుతోంది
-
చంద్రబాబుకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు
-
ఏ1 మోదీ.. ఏ2 చంద్రబాబు
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు ఏ1 ఏ2 ముద్దాయిలని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలను చంద్రబాబు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసమే ఎంపీ పదవులకు తాము రాజీనామాలు చేస్తే, చంద్రబాబు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే పదవులను వదులుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో జగన్‌దే జయం అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలివిగల మోసకారి అని, వచ్చే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయాలని అభ్యర్థించారు. -
ఏ పార్టీతో పొత్తు ఉండదు
-
ఉప ఎన్నికలు వస్తే మాదే విజయం
-
ఉప ఎన్నికలు వస్తే మాదే విజయం: వైఎస్సార్ సీపీ
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలసి టీడీపీ సాధించిందేమీ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రధానమంత్రి మోదీపై సీఎం చంద్రబాబు నిందలు వేస్తున్నారని చెప్పారు. సోమవారం అనంతపురంలో వైఎస్సార్ సీపీ వంచన గర్జన దీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలతో పాటు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. మేకపాటి ఫైర్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా చంద్రబాబు అదే పనిగా విమర్శలు చేస్తున్నారని మేకపాటి అన్నారు. తనకు తాను లౌకికవాదినని చెప్పుకుంటున్న చంద్రబాబు, బీజేపీతో వైఎస్ జగన్ స్నేహం చేస్తున్నారని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీ గ్రాఫ్ తగ్గుతోందని భావించినందునే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరకుంటారా అన్న చంద్రబాబు, దళిత తేజం పేరుతో ఏదో ఉద్దరిస్తామని చెప్పడం శోచనీయమన్నారు. కేవలం ఎన్టీఆర్ అల్లుడు అనే ట్యాగ్ కారణంగానే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన 600లకు పైచిలుకు హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఈ విషయంపైనే చంద్రబాబు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారని అన్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయో, లేదో తనకు తెలియదని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసమే పార్టీ నేతలు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. కేంద్రంపై వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టగానే చంద్రబాబు భయపడ్డారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 25 ఎంపీ స్థానాలు గెలుపొంది వైఎస్సార్ సీపీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎన్నికలకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని, ఉప ఎన్నికలు వచ్చినా కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను సాధిస్తాం : మిథున్ రెడ్డి ఏపీ ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ నేత మిథున్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాను వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీ సాధిస్తుందని చెప్పారు. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. రైతులను కూడా దాగా చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు అవకాశమిస్తే ఏపీ రూపురేఖలు మారుస్తారని చెప్పారు. చంద్రబాబు భారీ అవినీతి : వరప్రసాద్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత వరప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబు ఓ జిత్తుల మారి నక్క అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. డబ్బు కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని అన్నారు. నాలుగేళ్లలో బాబు చేసిన అక్రమాలను కాగ్ తన రిపోర్టులో ఎత్తి చూపిందని చెప్పారు. కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు దళితుల్ని తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. దేశవిదేశాలకు వెళ్లి చంద్రబాబు ఏపీకి ఏం తెచ్చారని ప్రశ్నించారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. పేదవాళ్లను అవమానించే వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత లేదని అన్నారు. కడప ఉక్కుపై బాబు కన్ను కడప స్టీల్ ఫ్యాక్టరీపై చంద్రబాబు కన్నుపడిందని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. పోలవరం కాంట్రాక్టు పనులను తీసుకున్నట్లే కడప ఉక్కు పరిశ్రమను తన బినామీలకు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. టీడీపీ-బీజేపీ వంచనపై రేపు దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. -
ఇకపై ప్రజాక్షేత్రంలోకి..
రాజీనామాల ఆమోదంతో ప్రత్యేకహోదా పోరాటంలో తమ చిత్తశుద్ధి మరోసారి రుజువైందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా తెలిపామన్నారు. ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. హోదా, విభజన హామీల కోసం ఇకపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. ఇకనైనా టీడీపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ల ఎంపీలు రాజీనామాలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. రాజీలేని పోరాటం చేశాం: మేకపాటి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన హోదా ఉద్యమాన్ని దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీ వేదికగా పోరు సాగించామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదాతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజీలేని పోరాటం చేశామన్నారు. హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామాలు చేశామని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలందరికీ వివరించామని, ఢిల్లీలో ఆమరణ దీక్షలు కూడా నిర్వహించామని చెప్పారు. స్పీకర్ ధర్మాన్ని నెరవేర్చారని, రెండు మూడు సార్లు తమతో మాట్లాడి రాజీనామాలు ఉపసంహరించే ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని వివరించి తమ రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరామన్నారు. మార్చి 15న అవిశ్వాసానికి నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరగకపోవటంతో వరుసగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేసే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మనందరి ఖర్మ అని మేకపాటి ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో రోజుకో రకంగా మాట్లాడి, డ్రామాలాడిన చంద్రబాబుకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు వేయకుండా చిత్తశుద్ధితో రాజీనామాలు చేసుంటే కచ్చితంగా కేంద్రం దిగి వచ్చేదన్నారు. తమకు ఉప ఎన్నికలను ఎదుర్కొంటామని సృష్టం చేశారు. నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబుకు అందరు కలిసి బుద్ధి చెప్పాలన్నారు. నీత్ ఆయోగ్ సమావేశానికి వెళ్లిన చంద్రబాబు.. మోదీ ఎడమచేతి కరచాలనం కోసం ఎంతగానో తపించిపోయి వంగివంగి మరీ కరచాలనం చేశారన్నారు. ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధానాంశం..: వైవీ ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశమని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎంపీల రాజీనామా ఆమోదిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజైనా మా రాజీనామాలు ఆమోదించడాన్ని స్వాగతి స్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం కోసం ఏప్రిల్ 6న రాజీనామాలు చేశాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా స్పందించకుండా కేంద్రం, స్పీకర్ రాష్ట్రానికి అన్యాయం చేశారు. వీటన్నింటికీ నిరసనగా మేం మా పార్లమెంటు సభ్యత్వానికి ఏప్రిల్ 6న అంటే లోక్‌సభకు ఇంకా 14 నెలల సమయం ఉందనగా రాజీనామాలు చేశాం. త్వరలోనే ఈ ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక హోదాయే మా ప్రధాన అంశం. ప్రజలు తమ ఆకాంక్షలను ఈ ఎన్నిక ద్వారా కేంద్రానికి తెలియపరుస్తారు. మేం ఇక ప్రజల్లోకి వెళతాం. రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా అన్యాయం చేశాయో వివరిస్తాం. వాళ్ల మద్దతు కూడగడతాం..’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘మావి కాదు డ్రామాలు.. టీడీపీ వాళ్లవి డ్రామాలు’ అని ధ్వజమెత్తారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని వస్తున్న విమర్శలను వైవీ ఖండించారు. ‘‘13సార్లు అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? మేమా? కుమ్మక్కయ్యేవాళ్లమయితే అవిశ్వాస తీర్మానం పెడతామా? కలసి కాపురం చేసి ఇప్పుడొచ్చి మేం కుమ్మక్కయ్యామని అంటావు? అమరావతిలో ఉన్నప్పుడేమో మోదీ దాడి చేస్తున్నాడని అంటావు. ఢిల్లీ వచ్చి కాళ్లూ గడ్డాలు పట్టుకుంటావు. నిజంగా రాష్ట్రప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే నీతిఆయోగ్ సమావేశంలో మన వాదన వినిపించి వాకౌట్ చేసి ఉండాల్సింది. నువ్వు ఆ పనిచేశావా? ’’ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్నికలు కావాలని తాము ఆశిస్తున్నామని, ఎన్నికలు వద్దని చంద్రబాబు అనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తేనే మా రాజీనామాలకు సార్థకత వస్తుందన్నారు. మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం: వరప్రసాదరావు ప్రత్యేకహోదా సాధన కోసం రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాదరావు అన్నారు. రాజీనామాలు ఆమోదించటం సంతోషంగా ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజీనామాలు ఆమోదం పొందిన సందర్భంగా ఎంపీ వరప్రసాద్ సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేకహోదాను హేళన చేశారని, హోదా సంజీవిని కాదన్నారని చెప్పారు. ధైర్యముంటే, మనస్సాక్షి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ముందుకు వెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఏదోరకంగా ప్రజల్ని మోసం చేసి తాము కూడా పోరాడుతున్నామని చెప్పుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీల డ్రామాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లోక్‌సభ మూసివేశాక లోపలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసి.. ప్రత్యేక హోదా కోసం ఏదో చేశామని చెప్పుకునేందుకు హడావుడి చేశారని, రాబోయే రోజుల్లో మరిన్ని డ్రామాలు ఆడబోతున్నారని చెప్పారు. తాము ఎన్నికలను సవాల్‌గా తీసుకుంటున్నామన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి పెద్దఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే.. ఆయన ప్రత్యేకహోదా కోసం చూపిస్తున్న ప్రాధాన్యతను బట్టే అని చెప్పారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి ఏమీ తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రం కోసం పదవీత్యాగం సంతోషదాయకం రాష్ట్రం కోసం పదవులు వదులుకోవడం సంతోషదా యకంగా ఉందని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలంటూ బీజేపీ, టీడీపీ కలసి కోరాయని, అదే నినాదంతో 2014 ఎన్నికలకు వెళ్లారని, అధికారంలోకి వచ్చిన ఆ రెండు పార్టీలు హోదా మాటే మరిచాయని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ సీఎం ప్రకటనలు చేశారని, ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రత్యక్ష పోరాటం చేశామని చెప్పారు. అన్నీ ప్రయత్నాలు చేసి తుదకు పదవులకు రాజీనామాలు చేశామని వివరించారు. రాజీనామాలు ఆమోదించడంలో కూడా ఆలస్యం చేశారని చెప్పారు. ఇకపై ప్రజల మధ్యనే ఉంటూ ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలుపుకోవడంలో రెండు పార్టీలు విస్మరించిన వైనాన్ని దేశవ్యాప్తం చేశామన్నారు. బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా అడుగులు ఇక బీజేపీ, టీడీపీలకు బుద్ధిచెప్పేలా తమ అడుగులు ఉంటాయని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో మిథున్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదా కోసం తాము చేసిన రాజీనామాలను ఆమోదించేందుకు కూడా ఇంతో సమయం తీసుకున్నారంటే ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో అర్థమవుతుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణి వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలంటే బాబుకు ఫీవర్ వస్తుందన్నారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. – సాక్షి, నెట్వర్క్