Mekapati Goutham Reddy Demise: తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు  | Parents Get Emotional On Son Mekapati Goutham Reddy Sudden Demise | Sakshi
Sakshi News home page

Mekapati Goutham Reddy Demise: తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 

Published Tue, Feb 22 2022 10:52 AM | Last Updated on Tue, Feb 22 2022 11:06 AM

Parents Get Emotional On Son Mekapati Goutham Reddy Sudden Demise - Sakshi

సాక్షి, నెల్లూరు: వ్యాపారంలో, రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మేకపాటి గౌతమ్‌రెడ్డిని చూసి తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయేవారు. తన కుమారుడి గురించి ప్రతిఒక్కరూ గొప్పగా చెప్తుంటే రాజమోహన్‌రెడ్డి ఆనందంతో చిరునవ్వులు చిందించేవారు. ఇక గౌతమ్‌రెడ్డికి తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. తండ్రి భావాలను పుణికిపుచ్చుకుని.. వ్యాపారంలో, రాజకీయాల్లో అడుగులు వేశారు.

మరోవైపు తాను ఏ పని చేయాలన్నా తల్లి ఆశీస్సులు తీసుకునేవారు. ఆమె మాట జవదాటేవారు కాదు. ఇప్పుడు చెట్టంత కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో రాజమోహన్‌రెడ్డి దంపతులు కుమిలిపోతున్నారు. వారి వేదనను చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. గౌతమ్‌రెడ్డి మరణంతో చిన్నాన్న, ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

చదవండి: (హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్‌ ప్రముఖులతోనూ..) 

చదవండి: (Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement