సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు స్పష్టం చేశారు. టీడీపీ- బీజేపీ పొత్తు, పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించేందుకు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి, వర ప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేశామని, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పోరాటం చేశామని మాజీ ఎంపీలు వివరించారు.
గతంలో తమ పార్టీ అవిశ్వాసం పెడితే ఏపీ సీఎం చంద్రబాబు నాయడు హేళన చేశారని.. ఆరోజే టీడీపీ ఎంపీలు మాతో కలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని, అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు టీడీపీకి లేదని మండిపడ్డారు. ఇదంతా టీడీపీ- బీజేపీల మ్యాచ్ ఫిక్సంగ్‌లో భాగంగానే ఈ డ్రామా జరుగుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా నేడు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ మాజీ ఎంపీలు ధర్నా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment