హోదా తీసుకురాని అసమర్థుడు బాబు | YSRCP MP Mekapati fires On CM Chandrababu | Sakshi
Sakshi News home page

హోదా తీసుకురాని అసమర్థుడు బాబు

Published Thu, Mar 8 2018 8:25 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP MP Mekapati fires On CM Chandrababu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నాలుగేళ్ల పాటు ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూ ప్రత్యేక హోదా తీసుకురాని అసమర్థుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌లు మండిపడ్డారు. రాజకీయవసరాల కోసమే ఇప్పుడు టీడీపీ రాజీనామా డ్రామాలాడుతోందని వాళ్లన్నారు. ‘అనుక్షణం ఎత్తుగడలతో ప్రజలను బాబు వంచిస్తున్నారు.

‘ ప్రత్యేక హోదా ఇవ్వరని బాబుకి ఇప్పుడు తెలిసిందా? ప్యాకేజీ కి ఒప్పుకుని మోసం చేశారు. హోదా వచ్చి ఉంటే ఈ పాటికే పరిశ్రమలొచ్చి అభివృద్ధి చెందేది’ అని మేకపాటి అభిప్రాయపడ్డారు. కేసులకు భయపడి బాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడలేకపోతున్నారని ఆయన అన్నారు.  25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సహా అన్ని సాధిస్తామన్న తమ మాటలను బాబు వక్రీకరిస్తున్నారని మేకపాటి చెప్పారు.‘ మేం తొలి నుంచి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం. హోదాకోసం అవిశ్వాస తీర్మానం పెడుతామని పేర్కొన్నారు. బాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. దుగరాజపట్నం పోర్టు రాకుండా బాబు అడ్డుపడుతున్నారని’  వరప్రసాద్‌ తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీకి తీరని ద్రోహం చేశాయని, హోదాపై కేంద్రానివి కుంటుసాకులని ఆయన ఆక్షేపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement