ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకి చేరుకుంది. ఏపీ భవన్‌లో నలుగురు వైఎస్సార్ సీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో శనివారం ఆయన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు.