సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. తాను పార్టీని వీడుతున్నట్టు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. నైతిక విలువలతో వార్తలు రాయాలి గాని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఆ చానెళ్లకు విలువలు ఉండవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావానికి ముందు నుంచి వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు.
‘పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశాను. విభజన చట్టంలోని హామీలను సాధించపోతే చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఎన్నికలు వస్తున్నాయనే పెన్షన్లు పెంచుతున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు. బాబు నిజస్వరూపం ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతారు. మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసింది. బాబు మోసం, వంచనతో ప్రజలు విసిగిపోయారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను బాబు కాపీ కొడుతున్నారు’ అని మేకపాటి విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment