
నవరత్నాల పథకాలను వివరిస్తున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: ప్రజాసంక్షేమానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రగతికి నాంది అని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కోవూరు తూర్పు అరుంధతీయవాడలో గురువారం రావాలి జగన్...కావాలి జగన్ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించాడన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలను వదిలి జన్మభూమి కమిటీలను పెట్టి ప్రభుత్వ పథకాలను çటీడీపీ నేతలు, కార్యకర్తలకే పరిమితమయ్యేలా చేస్తున్నాడన్నారు. నిన్నటివరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి పనిచేసి నేడు వైఎస్సార్‌సీపీ నేతలు మోదీతో ఉన్నారని మోసకారి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. రాష్ట్ర రాజధానిలో ఒక్క శాశ్వత భవనం లేకపోయినా చంద్రబాబు గ్రాఫిక్స్‌ను చూపుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు.
మభ్యపెట్టడంలో చంద్రబాబు మొనగాడన్నారు. అందుకే ప్రజాస్వామ్య మనుగడకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలన్నారు. అందరూ సమష్టిగా కష్టపడి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు నాటకాలను, భూటకపు హామీలను, ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడాన్ని వివరించాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావాలన్నదే లక్ష్యమని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పోలింగ్‌బూత్‌ల పరిధిలో ప్రతి ఒక్కరికీ చేరాలన్నారు. జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్‌రెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయుడు, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్, సూరా శ్రీనివాసులురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment