
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు.
(చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్)
Comments
Please login to add a commentAdd a comment