chandrasekhar reddy
-
బకాయిలు కొండంత.. చెల్లించేది గోరంత
సాక్షి, అమరావతి: ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలకుగానూ అరకొర నిధులను విడుదలచేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం రూ.1,300 కోట్లే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఆయన ఏమన్నారంటే.. ⇒ ఇవ్వాల్సిన బకాయిలెంత? ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేది. కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు. ⇒ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,300 కోట్లలోనూ రూ.519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక? ⇒ జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు. దీనికి మొత్తం ఇవ్వకుండా రూ. 519 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం? ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది. దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు.. అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు. సీపీఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రూ.265 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 36 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. ⇒ రాష్ట్రంలోని 3.80 లక్షల మంది పెన్షనర్లకు ఏమాత్రం మేలు చేయడంలేదు. డీఎ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటేషన్ ఆఫ్ లీవ్, గ్రాట్యూటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్ లో పెడుతున్నారు. అలాగే, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, ఏపీజేఎల్ వంటివి రూ. కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఇంతమేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టంచేయాల్సి ఉంది. ⇒ మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీలిచ్చింది. 7 నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు, ఐఆర్‌ను ప్రకటించలేదు. రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతి ఆరునెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తుంది. ఏపీలో 2024లో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ⇒ కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి రెండు నెలలే అలా ఇచ్చారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత, ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంవల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. సకాలంలో ప్రభుత్వ వాటా చెల్లించాలి. -
గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
-
పేరెంట్స్ మీటింగ్ కాదు.. పబ్లిసిటీ టీడీపీ మీటింగ్
-
నెల్లూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం..
-
అధికారులను వేదించటమే ప్రభుత్వం పనా?
-
‘ఉద్యోగులను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులే తప్ప ఎలాంటి మేలు జరగటం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.‘‘నెల్లూరులో మైకు పని చేయలేదని ఐ అండ్ పీఆర్ అధికారిని చంద్రబాబు అందరిముందు అవమానపరచారు. గతంలో కూడా జన్మభూమి సమావేశాల్లో అధికారులను ఇలాగే బెదిరించారు. కొంతమంది ఉద్యోగులు అక్కడే గుండెపోటుతో కుప్పకూలారు. అధికారులు ఏ ప్రభుత్వంలోనైనా పని చేస్తారు. కానీ చంద్రబాబు కొంతమందిని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పని చేసిన అధికారులను చంద్రబాబు వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటి వారిని కూడా చంద్రబాబు వేధిస్తున్నారు’’ అని చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.‘‘జత్వానీ కేసులో కూడా ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై వేటు వేశారు. రూల్స్ ప్రకారం పని చేస్తే ఈ వేధింపులేంటి?. చంద్రబాబు చెప్పిన రూల్స్ వ్యతిరేక పనులు చేయడం సాధ్యం కాదు. అంతమాత్రానికే వారిని వేధిస్తారా?. రెడ్‌బుక్ రాజ్యాంగం రాసుకుని దాన్ని ఫాలో అవమంటే అధికారులు ఎందుకు చేస్తారు?. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే అధికారులు పని చేస్తారని చంద్రబాబు, లోకేష్ గుర్తించాలి. విద్యా సంవత్సరం కూడా చూడకుండా ఉద్యోగుల బదిలీలు చేయటం కరెక్టు కాదు. రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారింది. పొలిటీషియన్లకు కప్పం చెల్లించిన వారికే కావాల్సిన చోటుకు బదిలీ చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు మరింతగా అల్లాడిపోతున్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!‘‘అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి?. ఐఆర్, పీఆర్సీ సంగతి ఏం చేశారో తెలియటం లేదు. ఉద్యోగులకు ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలి. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పది శాతం ఇవ్వాలి. విశాఖ ఉక్కు పరిశ్రమలో లక్షమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పరిశ్రమని ప్రైవేటు పరం చేస్తే వారందరి జీవితాలకు ఇబ్బంది వస్తుంది. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చూడాలి. ఉద్యోగులందరికీ వైద్య పరంగా ప్రభుత్వ సహకారం ఉండాలి. ఓపిఎస్ కోసం సీపీఎస్ ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. వారందరికీ న్యాయం చేయాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి. జాబ్ కేలండర్‌ను త్వరగా విడుదల చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. కాకినాడలో ప్రొఫెసర్ పై దాడి చేసిన ఎమ్మెల్యే నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు ప్రభుత్వం భద్రత కల్పించాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. -
నెల్లూరులో టీడీపీ అరాచకాలపై చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
-
టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఫైర్
-
ఇచ్చిన ప్రతి హామీ చంద్రబాబు అమలు చేయాలి
-
ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర
కడప కార్పొరేషన్: ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వానికి దూరం చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఇక్కడి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో ఏడెనిమిది సార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవులు, టీఏ, ఏపీజీఎల్ఐ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగినా, ఎందుకు జరిగిందో ఉద్యోగులకూ తెలుసన్నారు. రెండేళ్లు కోవిడ్ వల్ల ప్రపంచం యావత్తు అల్లాడిపోయిందని, రాష్ట్రానికి రూ.76 వేల కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తుచేశారు. 10,177 మంది రెగ్యులరైజ్ రాష్ట్ర బడ్జెట్ లక్షా ఇరవై ఐదు వేల కోట్లుగా ఉంటే అందులో 95 వేల కోట్లు జీతాలకే పోతోందని, మిగిలిన బడ్జెట్ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని తెలిపారు. కొంతమంది ప్రభుత్వంపై బురదజల్లుతూ రూ.25 వేల కోట్ల బకాయిలున్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియెర్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. ఐఆర్ 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్ష¯Œన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 10,177 మందిని రెగ్యులరైజ్ చేశారని, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 11 వేల మందికి 010 పద్దు కింద జీతాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలిపారు. లక్షా ముప్పై ఐదు వేల మందిని సచివాలయాల్లో నియమించిన సీఎం జగన్.. 12వ పే రివిజన్ కమిషన్ కూడా వేసి జూలై నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మే నెలతో పాటు ఒక డీఏ ఇస్తున్నారని, జూన్‌లో మరో డీఏ ఇస్తారని చెప్పారు. సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. కీలకమైన విద్య, వైద్యరంగాల్లో ఖాళీలన్నీ భర్తీ చేశారని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారని, చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయనున్నారని చెప్పారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికీ 16 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేశారన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ రెండు నెలల నుంచి ఆరు నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని చేసిన జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, పెన్షనర్లపై ఉందని చెప్పారు. వలంటీర్లపై నిత్యం చంద్రబాబు అక్కసు.. 2014లో చంద్రబాబు ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేశారని, తాజాగా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోను అమలు చేయాలంటే అదనంగా లక్షా యాభై వేల కోట్లు కావాలన్నారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఇన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. వలంటీర్లపై నిత్యం అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. అధికారంలోకొస్తే రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభల్లోనే అధికారులను తిడితే ఎంతో మంది గుండెపోటుకు గురయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడూ రెడ్ బుక్‌లో నోట్ చేస్తున్నాం.. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం.. అంటూ పోలీసులు, ఉద్యోగులను బెదిరిస్తున్నారని «ధ్వజమెత్తారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని అడిగితే.. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను గానీ డీఏలు ఇచ్చేది లేదని మొండికేసిన విషయం ఉద్యోగులు ఇంకా మర్చిపోలేదని చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల వల్ల వైద్యరంగంలో గొప్ప మార్పులు వచ్చాయని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఐఎంఏ ఏపీ స్టేట్ జోన్–3 రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం చేరువైందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుల ద్వారా 50 రోజుల్లోనే 60 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యం, ఆరోగ్యం విషయాల్లో మన రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. గతంలో వైద్య రంగానికి సంబంధించి మన రాష్ట్రం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల కంటే దిగువన ఉండేదని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా ఏపీ ముందు వరుసలో ఉందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణీందర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సమీకృత వైద్యాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందని, ఇది మంచిది కాదన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా పలువురు వైద్యులు చేసిన అరుదైన శస్త్రచికిత్సల గురించి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జీవీజీ మహేష్, డాక్టర్ త్యాగరాజరెడ్డి, డాక్టర్ ఇ.సాయిప్రసాద్, డాక్టర్ హేమలత, వసుధ, డాక్టర్ హరీ‹Ùకుమార్, అప్నా ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌కి ప్రాణాపాయం లేదన్న వైద్యులు
-
టీచర్లను రెచ్చగొట్టేలా ఈనాడు దుర్మార్గపు రాతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులను రెచ్చగొట్టేలా ఈనాడు కథనాలు రాస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడులో ఉపాధ్యాయులపై రాసిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ టీచర్లు విద్యార్థుల స్థితిగతులపై డిక్లరేషన్ ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని శుక్రవారం ఈనాడు వార్త ప్రచురించిందని, కానీ ప్రభుత్వం ఎప్పుడూ మౌఖిక ఆదేశాలు ఇవ్వదని, అధికారికంగా పేపర్ పరంగా ఆదేశాలుంటాయనేది ఆ పత్రికకు తెలియదా అని ప్రశ్నించారు. ఎవరు మౌఖిక ఆదేశాలిచ్చారో రాయకుండా టీచర్లను రెచ్చగొట్టేలా రాయడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలున్నా తక్షణమే సీఎం వైఎస్ జగన్ పరిష్కరిస్తున్నారని గుర్తుచేశారు. ఇకనైనా ఈనాడు ఇలాంటి అసత్య కథనాలు రాయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో బాబు ఎంతోమందిని అవమానించారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం ప్రాంతంలో ఒక పాఠశాలలో టీచర్ స్కూల్లోని సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే.. ఆ టీచర్‌ను యూజ్లెస్ ఫెలో అంటూ తిట్టి సస్పెండ్ చేశారని, అదే జిల్లా శింగనమల ప్రాంతంలో పంచాయతీ అధికారి ఒకరిని జీపుపై ఎక్కించి అవమానించిన ఘనత బాబుదేనన్నారు. టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప ఉపాధ్యాయులను చెట్టుకు కట్టేసి కొట్టండి అని గతంలో అన్నారని గుర్తుచేశారు. కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు విద్యావ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి, ఉపాధ్యాయులకు గౌరవాన్ని పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. -
ఎర్రచందనం..ఎనీటైమ్ ప్రొటెక్షన్
చిప్ పనితీరు ఇలా.. రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్ సెన్సార్ పరికరం 3.6 వాల్ట్స్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికినా, దొంగిలించేందుకు ప్రయత్నించినా క్షణాల్లోనే మొబైల్ అప్లికేషన్స్, వాట్సాప్‌లకు అలర్ట్స్ పంపిస్తుంది. చెట్ల వద్ద ఉన్న హూటర్ ఎలక్ట్రానిక్ సైరన్ మోగిస్తుంది. వెంటనే అప్రమత్తమై చెట్లను రక్షించుకోవచ్చు.మొబైల్ అప్లికేషన్స్‌తో క్లౌడ్ సర్వర్‌ను అనుసంధానం చేయడంతో యూజర్స్‌కు వివిధ రకాల నివేదికలు చేరవేస్తుంది. గచ్చిబౌలి : ఖరీదైన ఎర్రచందనం చెట్లను పరిరక్షించేందుకు అధునాతన పరికరం (రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా చిప్ సెట్లు అమర్చినట్టు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వైస్‌చైర్మన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో అధునాతన టెక్నాలజీని ఆయన వివరించారు. బొటానికల్ గార్డెన్లో 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయని, మొదటి విడతలో 50 ఎర్రచందనం చెట్లకు రియల్ టైం ప్రొటెక్షన్ చిప్‌లు అమర్చామని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన సీబీఐఓటీ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. చిప్‌ల అమరికతో దొంగల నుంచి ఎర్రచందనం చెట్లను రక్షించుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే వీలుంటుందన్నారు. సీబీఐఓటీ సీఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ ఎర్రచందనం చెట్ల రక్షణకు తమ సంస్థ ఇండియన్ ఉడ్ సైన్స్ టెక్నాలజీస్(ఐడబ్ల్యూఎస్‌టీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ టెక్నాలజీని ఐడబ్ల్యూఎస్టీతో పాటు ఢిల్లీ ఐకార్, బెంగళూరు, ఝాన్సీ నగరాల్లో వాడుతున్నట్టు వివరించారు. సెన్సార్ కేసింగ్ (యాంటినో)తో అనుసంధానం చేయడంతో మొబైల్ ఫోన్లోనే చెట్ల రక్షణ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎవరైనా చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చిప్ సెట్ సాయంతో అలారం మోగుతుందన్నారు. ఒక్క సెన్సార్ కేసింగ్‌తో కిలోమీటరు దూరంలో ఉన్న 500 చెట్లకు చిప్‌లను అమర్చుకోవచ్చన్నారు.అధికగాలి, జంతువుల రాపిడిని గుర్తించే విధంగా చిప్ సెట్ ఉంటుందన్నారు. ప్రతిరోజూ రాత్రి చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని సర్వర్‌కు చేరవేస్తుందన్నారు. చెట్టును కొట్టాలని చూస్తే అలారం మోగుతుందని, చెట్టు ఎక్కడ ఉందనే వివరాలు ఫోన్‌కు చేరవేసి మ్యాప్ ద్వారా డైరెక్షన్ చూపిస్తుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్‌నాయక్, డైరెక్టర్ అక్బర్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘మా కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడు’
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. (చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్) -
జీతాలపై దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక అదనంగా రెండున్నర లక్షలమందికిపైగా ఉద్యోగాలు ఇచ్చిందని, వారంతా ప్రభుత్వంలో కొత్తగా చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆర్టీసీ విలీనం వల్ల వారు ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించాయని, వీటివల్ల జీతాల భారం పెరిగిందని వివరించారు. ప్రభుత్వ సొంత ఆదాయం ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల మేర వస్తుంటే, రూ.90 వేల కోట్లు జీతాలకే సరిపోతోందని చెప్పారు. సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.3 వేల కోట్లకుపైగా చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఈ నెల 16వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కానీ బయటకు వెళ్లాక ఉద్యమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. -
ఆధారాలు లేకుండా చేయడానికే ఇంటికి నిప్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆధారాలు దొరకకుండా హత్య చేసేందుకే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్(గుడిపల్లి) ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని బలిగొన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సజీవ దహనం కేసు వివరాలను మంగళవారం డీసీపీ అఖిల్ మహాజన్.. ఏసీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌తో కలసి వెల్లడించారు. ఈ ఘటనలో ఐదు గురిపై హత్య, కుట్ర, ఒకరిపై అదనంగా అట్రాసిటీ కేసు పెట్టామన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద పరిహారం అందేలా చూస్తా మని తెలిపారు. మూడురోజులు 16 బృందాలు ద ర్యాప్తు చేసి క్షుణ్ణంగా పరిశీలించాయన్నారు. ఏ1గా మేడి లక్ష్మణ్, ఏ2 శనిగరపు సృజన, ఏ3 శ్రీరాముల రమేశ్, ఏ4గా వేల్పుల సమ్మయ్య, ఏ5గా ఆర్నకొండ అంజయ్య ఉన్నారని తెలిపారు. ఏళ్లుగా దంపతుల మధ్య గొడవలు.. మందమర్రి మండలం వెంకటాపూర్ పరిధి గుడిపల్లికి చెందిన మాసు శివయ్య(48) రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ(42) దంపతులు. శ్రీరాంపూర్‌కు చెందిన సింగరేణి మైనింగ్ సర్దార్ శనిగరపు శాంతయ్య(57) భార్య సృజనతో గొడవల కారణంగా శివయ్య–రాజ్యలక్ష్మితో ఉంటున్నాడు. ఇరువురు పంచాయతీలు, కేసులు పెట్టుకున్నారు. మెయింటెనెన్సు, జీతభత్యం వేరెవరికీ ఇవ్వకుండా కేసులు ఉన్నాయి. అయినా జీతం డబ్బులు, ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తున్నాడని భావించిన శాంతయ్య భార్య సృజన.. భర్తను హత్య చేయాలనుకుంది. తండ్రితో కలసి తనకు సన్నిహితుడైన లక్షెట్టిపేటవాసి మేడి లక్ష్మణ్(42)సాయం కోరింది. దీనికోసం 3 గుంటల భూమి రాసిస్తానని చెప్పింది. అలాగే, రెండు దఫాల్లో రూ.4 లక్షలు ఇచ్చింది. రంగంలోకి దిగిన లక్ష్మణ్.. శాంతయ్యను చంపేందుకు రూ.4లక్షలు ఇస్తానంటూ లక్షెట్టిపేటవాసి శ్రీరాముల రమేశ్ (36) సాయం కోరాడు. రోడ్డు ప్రమాదం చేసేందుకు రూ.1.40 లక్షలతో పాత బొలెరోను కొన్నా రు. నెల క్రితం మంచిర్యాల నుంచి శాంతయ్య, రాజ్యలక్ష్మి వెళ్తున్న ఆటోను బొలెరోతో ఢీకొట్టి చంపుదామనుకుని విఫలమయ్యారు. ఇలా రెండుసార్లు విఫలం కావడంతో ఈనెల 16న ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్, రమేశ్ మంచిర్యాలకు బస్సులో వెళ్లారు. శివయ్య, రాజ్యలక్ష్మి, శాంతయ్య ముగ్గురే ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు రమేశ్, సమ్మయ్య ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. నిద్రిస్తున్న వారిలో రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక(24), కూతుళ్లు ప్రశాంతి(3), హిమబిందు (13నెలలు) ఉన్నట్లు వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో ఒకరి కోసం ప్లాన్ వేస్తే ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. నిందితులను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో వివరాలు బయటపడ్డాయి. నిందితుల్ని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
‘సజీవ దహనం’ హత్యగానే భావిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మందమర్రి రూరల్: ‘ఆరుగురు సజీవ దహనం’ కేసును విచారణ చేస్తున్నాం. మా ప్రాథమిక విచారణ లో దీనిని హత్యగానే భావిస్తున్నాం. ఆ కోణంలోనే విచారణ సాగుతోంది. అందులో ఎంతమంది ఉన్నారో త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తాం’ అని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన రామగుండం సీపీ మీడియాతో మాట్లాడారు. నిందితులు వాడిన పెట్రోల్ క్యాన్లు, పరిసర స్థలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌రావు ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ నెల 16న అర్ధరాత్రి వెంకటాపూర్ (గుడిపెల్లి) ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. సీన్ రీ కన్స్ట్రక్షన్...: సోమవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత ప్రధాన నిందితులు ముగ్గురితో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. రెండు గంటలపాటు నిందితుల సమక్షంలోనే నేరం జరిగిన తీరు తెలుసుకున్నారు. ఇల్లు కాలిపోయిన చోటికి రెండు వాహనాల్లో వెళ్లారు. ఎవరు సాయం చేశారు? పెట్రోల్ క్యాన్లను ఎలా తీసుకెళ్లారనే విషయాలను నిందితులు వివరించగా, వాటిని ఘటన స్థలంలోనే మరోమారు ధ్రువీకరించుకుని రికార్డు చేశారు. దీంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
సలహాదారులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టం
సాక్షి, అమరావతి: సలహాదారులుగా ఎవరిని నియమించుకోవాలన్నది పూర్తిగా ప్రభుత్వ ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో ఇతరుల జోక్యానికి తావు లేదంది. సలహాదారును మీరు ఎంచుకోలేరని పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)గా ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శితో పాటు చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఎస్.మునయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్యోగుల సంక్షేమం విషయంలో సలహాదారుగా ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఉద్యోగులతో సమన్వయం చేయడం ఆయన బాధ్యత అని చెప్పారు. వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రస్తుతం కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని, సలహాదారును నియమించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సలహాదారుగా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వ ఇష్టమని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఇతరులకు లేదంది. చంద్రశేఖర్‌రెడ్డి నియామక ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న ఉమేశ్ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
కట్టు కథలు, పిట్ట కథలు మానుకో శ్రీరామ్
రాప్తాడురూరల్: పరిటాల శ్రీరామ్ చెబుతున్నట్లు వారి తాతల కాలం నుంచి వారి కుటుంబం నిజంగా బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పనిచేసి ఉంటే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలే 2019 ఎన్నికల్లో ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై పరిటాల శ్రీరామ్ కట్టు కథలు, పిట్ట కథలు మానుకోవాలని హితవు పలికారు. ‘మా నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఎవరికీ బెదిరే, అదిరేవారు కాదు. దౌర్జన్యాలకు తలవంచే మనస్తత్వం అసలే కాదు. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడే దౌర్జన్యాలను ఎదిరించిన ధీరుడు. నీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని రవి మొహం మీదే చెప్పిన వ్యక్తి మా నాన్న. ఈ విషయాన్ని అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాలార్ బాషా, మీ చిన్నాన్న గడ్డం సుబ్రహ్మణ్యంను అడిగితే తోపుదుర్తి పౌరుషం ఏంటో తెలుస్తుంది. మీ తాతల గురించి, మీ నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు మంచి చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో దోపిడీ సాగించారు. ఐదెకరాల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మా ఆస్తులు పేదలకు పంచేందుకు సిద్ధం. మీ ఆస్తులు పంచేందుకు మీరూ సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది! ‘పరిటాల శ్రీరాములు, బోయ సిద్దయ్య ఇద్దరూ కలసి దోపిడీలు చేస్తే..బోయ సిద్దయ్యనేమో దొంగగా మార్చి, శ్రీరాములు ఉద్యమకారుడు అంటూ పచ్చమీడియా చిత్రీకరించింది. ఇద్దరూ దొంగలైనా కావాలి.. లేదంటూ ఇద్దరూ ఉద్యమకారులైనా కావాలి. పరిటాల శ్రీరాములు ఒక్కడే ఉద్యమకారుడు ఎలా అవుతాడు? పరిటాల రవి హత్యలు చేసి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపినాడు. గత ప్రభుత్వంలో శ్రీకాకుళం అడవుల్లో 26 మంది నక్సల్స్‌ను ఎన్కౌంటర్ చేస్తే మంత్రిగా ఉన్న మీ తల్లి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది? నసనకోట పంచాయతీలోనే భూములు లాక్కున్న చరిత్ర మీ నాన్నది. నువ్వు బచ్చావు.. నీకు తెలీకపోతే ఓసారి పెద్దోళ్లను అడిగితే చెబుతార’ని పరిటాల శ్రీరామ్‌కు హితవు చెప్పారు. అనంతపురం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూ లిటిగెంట్ భూములను కొనుగోలు చేస్తూ దందాలు చేస్తోంది మీరుకాదా అని నిలదీశారు. బెంగళూరు కేంద్రంగా అడ్రెస్ లేని సిమ్ల ద్వారా తమ కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో పరిటాల కుటుంబం ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. (చదవండి: అనంతలో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ) -
అక్టోబర్ 2న ‘సెల్యూట్ సీఎం సర్’
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్ సీఎం సర్ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు. విజయవాడలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్‌తో కూడిన కొత్త జీతాలు వచ్చాయని, ఈరోజు తమకు శుభ దినమని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ 1.30 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఇది చెరగని చరిత్ర అని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ఇది సువర్ణ అధ్యాయమన్నారు. తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ నూతన పేస్కేళ్ళు వర్తింపచేయడంతో విమర్శలు చేసిన వారి నోళ్లు మూగబోయాయని అన్నారు. ఇంత మందికి మంచి జరగడం సహించని వారు ఈ ఉద్యోగాలు పర్మినెంట్ కాదని, తాత్కాలికమేనని, రూ.15 వేలకు మించి జీతం పెరగదంటూ ఉద్యోగులను కించపరిచేలా అనేక అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. పేస్కేల్స్‌తో జీతం ఇవ్వడం తమకు వరమైతే కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచిందన్నారు. సీఎం మాట నిలబెట్టుకున్నారు: చంద్రశేఖర్‌రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని సీఎం మాట ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైందని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జూలై ఒకటి నుంచి సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్ ప్రకారం జీతం అందించారని కొనియాడారు. నవ చరిత్రకు నాంది: బండి శ్రీనివాసరావు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ సీఎం చేయని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేశారని, నవ చరిత్రకు నాంది పలికారని తెలిపారు. ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించి యువతకు శాశ్వత భరోసా కల్పించడం గొప్ప విషయమన్నారు. తమ కలలు సాకారమైన వేళ గుండెలు నిండా అభిమానంతో ఈ సమావేశంలో పలువురు సచివాలయ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘సెల్యూట్ సీఎం సర్’ అంటూ నినాదాలు చేశారు. -
YS Rajasekhara Reddy: దశాబ్దాల రాజకీయం... శతాబ్దాల కీర్తి
జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి! ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత! రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మిన రైతుజన బాంధవుడు. లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం కోసం పనిచేసిన అపర భగీరథుడు. నిరుపేదలకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రదాత. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందించడం వైఎస్ పాలనలోనే మొదలైంది. పేద కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికొత్త ప్రయోగం. ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని సుపరిపాలకుడు వైఎస్. ఆయన ఆశయాల కొనసాగింపునకు ఆవిర్భవించిన వైసీపీ నేటి నుంచి జరిగే ప్లీనరీలో అందుకు పునరంకితమవుతోంది. విశ్వసనీయత, ఆపేక్ష, ధైర్యం, కరుణ, జాగరూకత... ఈ ఐదు లక్షణాలూ కలిగిన విలక్షణ వ్యక్తిత్వం వై.ఎస్.రాజశేఖరరెడ్డి సొంతం. కడప జిల్లా జమ్మల మడుగు మిషనరీ ఆస్పత్రిలో 1949 జులై 8న వైఎస్ జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత, రూపాయికే వైద్యం అందించారు. నాడి చూసి ప్రజల జబ్బులను పసిగట్టి చికిత్స చేసిన ఆయన... 28 ఏళ్ల వయసులోనే రాజకీయ నాయకుడిగా మారి, అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగుర వేశారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అమలు చేయడంలోనూ అధికారులకు వైఎస్ పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ఉదాహరణకు ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు వచ్చి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, తమ వారికి ఇప్పించాలనీ అడిగారు. అప్పుడు వెంటనే సంబంధిత వర్సిటీ వీసీకి ఫోన్ చేసి, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలనీ, ఎమ్మెల్యేలు చెప్పిన వారికి అర్హతను బట్టి పోస్టులు ఇవ్వాలనీ సూచించారు. అయితే వీసీ 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారున్నారనీ, ముందు వారికి అవకాశం ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనీ అన్నారు. ‘ఓకే! అలాగే కానివ్వండి. వీసీగా మీరే యూనివర్సిటీకి బాస్. మేం చెప్పిన వారికే ఇవ్వాలనేం లేదు’ అని వైఎస్ ఆయనకు స్పష్టం చేశారు. అదీ ఆయన వ్యక్తిత్వం. అదే సమయంలో ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించేవారు. ఆలస్యం చేస్తే సహించేవారు కాదు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వైఎస్ఆర్ హయాంలో ఆరేళ్ళ పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. తాను ఆ పదవిలో పనిచేసిన ఆరేళ్లలో ఎన్నడూ, ఏ సందర్భంలోనూ వైఎస్సార్ ‘వీరికి ఈ ఫేవర్ చేయండి’ అని చెప్పలేదనీ, పూర్తి స్వేచ్ఛ తమకిచ్చారనీ చెప్పారు. ఇటువంటి అధికారుల సహకారంతోనే వైఎస్ పాలనలో అద్భుతాలను ఆవిష్కరించారు. అనుక్షణం జనహితమే లక్ష్యంగా పనిచేసే వైఎస్సార్... రైతు పక్షపాతి. ౖరైతు బాగుంటేనే దేశం బాగుంటుందనీ, లక్ష కోట్లు ఖర్చయినా కోటి ఎకరాలకు సాగు నీరు అందించి, కోట్లాది మంది రైతుల కళ్లలో ఆనందాన్ని చూడడమే తన లక్ష్యమనీ చెప్పేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘జలయజ్ఞం’ పేరిట సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐదేళ్లలోనే 80 భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు చేపట్టి, 13 పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీటి సౌకర్యం కల్పించారు. రైతులకు ‘ఉచిత విద్యుత్’ చారిత్రక అవసరమని వైఎస్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో పార్టీ పెద్దలు, కొందరు ఆర్థికవేత్తలు ఈ పథకాన్ని అమలు చేయగలరా అని అనుమానం వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వచ్చి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తా. రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వలేని నాడు నేను సీఎం పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగను’ అని తేల్చిచెప్పారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారాయన. అనంతర కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2007లో అమెరికాలో జరిగిన ‘ప్రపంచ వ్యవసాయ వేదిక’ సమావేశంలో భారత్ ఏకైక ప్రతినిధిగా వైఎస్ పాల్గొన్నారు. అక్కడ ఓ బహుళజాతి విత్తన కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ కంపెనీకి చెందిన పత్తి విత్తనాల ధరపై అప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు నడుస్తోంది. వారు ఆ కేసును వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరారు. అది అంతర్జాతీయ కంపెనీ అనీ, కాస్త పట్టూ విడుపూ ప్రదర్శించమనీ ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా సూచించారు. అయినా వైఎస్ వెనక్కి తగ్గలేదు. అనంతర కాలంలో సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. తద్వారా ఏటా రూ 3,000 కోట్ల చొప్పున గత 16 ఏళ్లలో రైతాంగానికి దాదాపు రూ 48,000 కోట్లు ఆదా కావటం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఆనాడు ఐదు వందల గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ ధర దాదాపు 1,600 రూపాయలు ఉంటే, అందులో దాదాపు వెయ్యి రూపాయలు రాయితీగా ఉండేది. విత్తనాల ధరను 750 రూపాయలకు తగ్గిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు రాష్ట్రాలు ఆ చట్టాన్ని అనుకరించడంతో ఆ చట్టం దేశం దృష్టిని ఆకర్షిం చింది. ఆ విషయాన్ని ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వైఎస్‌ను ఎంతగానో ప్రశంసించింది. వైఎస్ రైతుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణ. ఐదేళ్ల వైఎస్ పాలనలో చేపట్టిన పథకాలన్నీ జనరంజకమైనవే. 2003లో రాష్ట్రవ్యాప్తంగా మండుటెండల్లో దాదాపు 1,450 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ ప్రతి కుటుంబాన్నీ కలిసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత పేదలకు కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్న లక్ష్యాన్ని నెర వేర్చారు. పింఛనుదారులకు ప్రతినెలా 1వ తారీఖునే పింఛన్ అందిం చడం వైఎస్ పాలనలోనే మొదలైంది. దేశంలో ఎక్కడా లేని మరో వినూత్న పథకం ఫీజు రీయింబర్స్మెంట్. బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన విశిష్ట పథకం. 2008లో ఉగాది పర్వదినాన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీనిపై పెద్ద చర్చ జరి గింది. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మార్కెట్లో ధరలు, ముఖ్యంగా సోనా మసూరీ ధర తగ్గేవరకూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులూ 2 రూపాయలకు కిలో బియ్యం రకాన్నే వాడారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించాలనీ, గుండె జబ్బులు సహా ఇతర వ్యాధులతో ఎవరూ మరణించకూడదనీ వైఎస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించారు. సామాన్యులకు ఈ పథకం అపర సంజీవనిలా మారింది. 108 అత్యవసర అంబులెన్స్ సర్వీసు కూడా ఆయన ప్రారంభించిందే. 104 కాల్ సెంటర్ ఏర్పాటు గ్రామీణ ప్రజలకు ఇంటి వద్దకే వైద్య చికిత్సను అందించేందుకు చేపట్టిన మరో బృహత్తర పథకం. పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు... ఇలా అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏ రంగాన్నీ, ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయలేదు. వైఎస్ హయాంలో పాడి పంటలే కాదు, ఐటీ ఎగుమతులు కూడా గణ నీయంగా వృద్ధి చెందాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన వైఎస్ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మూడు దశాబ్దాల ప్రజా జీవితంలో వైఎస్ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. చివరికి ప్రజల కోసం వెళుతూ, హెలికాప్టర్ ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక మనిషి గొప్పతనం ఆయన చనిపోయినప్పుడు తెలుస్తుందంటారు. అది వైఎస్ విషయంలో అక్షర సత్యమైంది. భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన చేసిన సేవ, ప్రవేశపెట్టిన పథకాల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. ఎ. చంద్రశేఖర్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈఓ, వైఎస్సార్‌కు నాటి ప్రెస్ సెక్రెటరీ -
ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పదకొండవ పీఆర్సీపై అనేకసార్లు చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను మొన్నటి వరకూ ఎన్జీవో అధ్యక్షుడిగా, జేఏసీ ఛైర్మన్‌గా ఉన్నాను. కొంత మంది ఉద్యోగ నాయకులు హెచ్ఆర్ఏ తగ్గిందని అంటున్నారు. దీనిపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై కమిటీ కూడా వేసింది. నిన్న (మంగళవారం) జరిగిన సమావేశంలో మూడు విషయాలను పట్టుబడుతున్నారు. పాత శాలరీ ఇవ్వాలని, పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన జీతాలకు అనుగుణంగా కొత్త జీవో ప్రకారం నిన్న జీతాలు వేశారు. ఇప్పుడు మార్చడానికి వీల్లేదు. ఐఆర్ రికవరీ లేకుండా, హెచ్ఆర్ఏ పెంచాలని అడుగుతున్నారు. కానీ ఆ విషయాన్ని మంత్రుల కమిటీ వద్ద చర్చిస్తే బాగుండేది. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఉద్యోగులు కోరిన మేర పీఆర్సీ ఇవ్వలేకపోతున్నాం. ఏది ఏమైనా జీతాలు పడ్డాయి కాబట్టి జీవోలు వెనక్కి తీసుకోలేము. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై సంప్రదింపులతో సాదించుకోవాలి. లేదంటే ఆ గ్యాప్ అలానే ఉంటుంది. సమ్మె నోటీస్ ఇచ్చి ఆందోళనకు వెళ్తామని చెప్తున్నారు. అనేక సార్లు చర్చలకు ఆహ్వానించి మంత్రుల కమిటీ వేచి చూసింది. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు వేరు కాదు. వారు మరోమారు ఆలోచన చేయాలి. చదవండి: (ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి) సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. మా ఉద్యోగ మిత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా చర్చలతో పరిష్కరించుకుందాం. కార్యాచరణ వాయిదా వేయాలని, చర్చలకు రావాలని కోరుతున్నా. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ముఖ్యమంత్రి 23 శాతం ఫిట్మెంటు ఇచ్చారు. వచ్చిన జీతాల్లో ఎవరెవరికి ఎంత పెరిగిందో వాళ్ళకే తెలుసు. సామరస్యంతోనే సమస్యను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు ఒకేసారి విజయవాడ రావడం వల్ల కొంత అసౌకర్యం కలుగుతుంది. అసాంఘిక శక్తులు కూడా మన మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం చేయవచ్చు. కోవిడ్ వల్ల ఇబ్బంది ఉంది. 200 మంది కంటే ఎక్కువ గుమికూడి ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఉద్యోగులు ఆలోచించాలి అని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. -
సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: ప్రొబేషన్ ప్రకటనపై గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన, అపోహలకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ అని, అందులో పనిచేసే ఉద్యోగులపై ఆయనకు ఎంతో అభిమానం ఉందని చెప్పారు. శనివారం విజయవాడలోని ఎన్జీఓ హోమ్‌లో పలు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శవంతమైందని చెప్పారు. దీన్ని చూసి పలు రాష్ట్రాలు ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను వేగంగా ప్రజలకు చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్‌లోపు పూర్తి చేసి జులై నుంచి పే స్కేల్స్ ఇస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. కొందరు ఉద్యోగులు గత అక్టోబర్ 2 నుంచే పే స్కేల్స్ అమలు చేయాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వారంతా సంయమనం పాటించాలని కోరారు. అందరికీ ఒకేసారి ప్రొబేషన్ ప్రకటించి, ఆ తర్వాత పే స్కేల్స్ అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 23 శాతం ఫిట్మెంట్ వల్ల జీతాలు తగ్గుతాయనే ప్రచారం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కూడా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం గొప్ప విషయమని తెలిపారు. ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు: జానీ బాషా గ్రామ సచివాలయ ఉద్యోగులెవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానీ బాషా చెప్పారు. ప్రొబేషన్‌పై సీఎం న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అక్టోబర్ 2 నుంచి పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అన్నారని, వారిని పీఆర్సీలో చేర్చడం ద్వారా ఇలాంటి అనుమానాలు పోయాయని తెలిపారు. -
ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి
సాక్షి, అమరావతి: 11వ పీఆర్సీని వారం రోజుల్లో ఇస్తామని సీఎం వైఎఎస్ జగన్ చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. సీఎం ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ఆయన సానుకూలంగా ఉన్నారని చెప్పారు. పీఆర్సీని చూపించి కొన్ని ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపట్టాయని, వీటిపై ఆలోచించాలన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా పనిచేస్తానని చెప్పారు. బకాయి ఉన్న డీఏలో ఒక డీఏను జనవరిలో ఇచ్చేందుకు ఇప్పటికే ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఉద్యోగులు అడక్కుండానే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. 15 ఏళ్లుగా ఎప్పుడు జరగని జాయింట్ స్టాఫ్‌కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు.