ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద గురువారం చోటుచేసుకుంది.
స్థానిక వైఎస్‌ఆర్‌ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్స్‌పాల్ చంద్రశేఖర్ రెడ్డి మరో ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డితో కలిసి బైక్ పై సింహాద్రిపురం నుంచి పులివెందుల వెళ్తుండగా.. సబ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, ఇది గుర్తించిన స్థానికులు వారిని వెంట నే 108 సాయంతో ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.