సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్‌లో కంటైనర్‌కు వెనకనుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురితోపాటు, కంటైనర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు.
కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment