'కేంద్రమంత్రులు, ఎంపీలను ఓడించడమే లక్ష్యం' | APNGOs leader takes on seemandhra central ministers and mps | Sakshi
Sakshi News home page

'కేంద్రమంత్రులు, ఎంపీలను ఓడించడమే లక్ష్యం'

Published Sun, Nov 24 2013 12:02 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

'కేంద్రమంత్రులు, ఎంపీలను ఓడించడమే లక్ష్యం' - Sakshi

'కేంద్రమంత్రులు, ఎంపీలను ఓడించడమే లక్ష్యం'

సమైక్యాంధ్రకు విరుద్దంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్ అబిడ్స్లో ఏపీఎన్జీవో హోంలో సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన ఏపీఎన్జీవోల నేతలు  ఆయన సమావేశమైయ్యారు.

 

ఈ సందర్బంగా ఆయన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...రానున్న ఎన్నికలల్లో వారిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. బయట ఓ రకంగా మాట్లాడుతూ... లోపల మరోలా వ్యవహరిస్తున్నారని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఆయన ధ్వజమెత్తారు. ఆ సమావేశానికి ఏపీఎన్జీవోలతోపాటు సీమాంధ్రలోని దాదాపు 150 ఉద్యోగ సంఘాలు ఆ భేటీలో పాల్గొన్నాయి.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, అలాగే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు,ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర మంత్రులు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీఎన్జీవో  నాయకులు ఆదివారం మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement