
సాక్షి, విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో ఘోరంగా ఓటమి చెందినా చంద్రబాబుకు ఇంకా సిగ్గురాలేదని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అయిదు మంచి కన్సలెన్సీలో బోస్టన్ కన్సల్టెన్సీ ఒకటి అని పేర్కొన్నారు. ఇదే బోస్టన్ కన్సల్టెన్సీతో చంద్రబాబు అయిదేళ్లు ముందు కలిసి పని చేయించారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇన్స్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడింది వాస్తవం కాదా? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు 29 గ్రామాలు ప్రజలు భాధలకి కారణం చంద్రబాబేనని, శవ రాజకీయం చేయడం చంద్రబాబు అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు.(‘చంద్రబాబు, పవన్‌కు వారి త్యాగాలు తెలియవా’)
రాజకీయాల్లోకి లాగొద్దు
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాల్సిందేనని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీజీ నివేదికను తాము స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామని తెలిపారు. దేవినేని ఉమా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని, ఉద్యోగ సంఘాల నేతలను ఏసీబీ ద్వారా ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడనడంలో వాస్తవం లేదన్నారు. దేవినేని ఉమా వ్యాఖ్యలను తీవ్రంగా కండిస్తున్నామని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులుగా మూడు రాజధానులపై మా అభిప్రాయం మేము చెపుతున్నాము. దేవినేని ఉమా రాజకీయ లబ్ది కోసం సీఎంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలను రాజకీయాల్లోకి లాగొద్దని దేవినేని ఉమాకు సూచించారు.