సాక్షి, విజయవాడ: తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేశారని, పేదల మీద అద్దెలు భారం పడకుండా, సొంత ఇల్లు ఉండాలనుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ‘ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు కొని అందరికీ ఇళ్లిచ్చారు. పేదల ఇళ్ల కోసం గత ప్రభుత్వం కనీస ఆలోచన చేయలేదు. పేదల ఇళ్ల విషయాన్ని ఎన్నికల నినాదంగా వాడుకుని వదిలేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 7600 ఇళ్లను అమరావతిలో ఇస్తున్నాం.చంద్రబాబు చేయని కుట్రలేదు...మాటని మార్చలేదు.అమరావతిలో పేదలు ఉండకూడదనుకున్నారు. అమరావతిలో తన అనుచరులతో కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. హైకోర్టు,సుప్రీంకోర్టుల నుంచి మాకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. చంద్రబాబు అందితే జుట్టు...అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చామని గొప్పలు చెబుతున్నాడు. విజయవాడలో ఎంతమందికి రెండు సెంట్లు ఇచ్చాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ధైర్యముంటే ఇళ్ల స్థలాలు తీసుకున్న లబ్ధిదారుల పేర్లు, నెంబర్లు ఇవ్వాలని కోరుతున్నా. విజయవాడ నగరంలో 95 వేల మందికి స్థలాలు కొని అమరావతి...ఇతర ప్రాంతాల్లో ఇచ్చారు.పేదలకు ఒక హక్కు...ధైర్యాన్ని ఇచ్చారు. పేదల పక్షపాత ప్రభుత్వం మాది. ధనికుల పక్షపాతి గత టీడీపీ ప్రభుత్వం. టీడీపీ అధికారంలోకి వస్తే పేదలను ఖాళీ చేయిస్తామని అచ్చెన్నాయుడే చెప్పాడు.చంద్రబాబు కుయుక్తులు పనిచేయవు. టిడ్కో ఇళ్లలో అప్లికేషన్లను జిరాక్సులు తీసి అమ్మిన చరిత్ర టీడీపీ నేతలది’ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment