
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో దిక్కులేని పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలు అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎల్‌బీఎస్ నగర్‌లో ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ నుంచి నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. చంద్రబాబు, పవన్ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి. మహిళలకు అండగా ఉన్నారని’’ మల్లాది విష్ణు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment