
పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. వారాహి యాత్రలో పవన్ తన విధానాలను చెప్పుకోవాలి కానీ ఇతరులను దూషించడం సరికాదని హితవు పలికారు.
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. యాత్రలో పవన్ తన విధానాలను చెప్పుకోవాలి కానీ, ఇతరులను దూషించడం సరికాదని హితవు పలికారు.
‘‘సేవా దృక్ఫథంతో పనిచేస్తున్న వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందనడం దిగజారుడుతనం. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నాడు. వలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు కూడా గతంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. ఏ ఆధారాలతో వలంటీర్ల పై పవన్ ఆరోపణలు చేశాడో చెప్పాలి’’ అంటూ మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు.
చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని..
‘‘పవన్ కల్యాణ్‌కు మామూలుగానే తిక్క. ఆ తిక్కతోనే వలంటీర్ల పై వ్యాఖ్యలు చేస్తున్నాడు. తక్షణమే పవన్.. వలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని ఎమ్మెల్యే విష్ణు హెచ్చరించారు.