సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని ప్రభుత్వ సలహాదారు, ఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులు, ప్రజలందరి మన్ననలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఒక ప్రకటనలో చెప్పారు. త్వరలోనే పీఆర్సీ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అడక్కపోయినా 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చారని తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. గ్రామ సచివాలయాల్లో అతి తక్కువ కాలంలో 1.30 లక్షల మందిని పారదర్శకంగా నియమించడం గొప్ప విషయమన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, అందువల్లే ఉద్యోగులకు అందవలసినవి సకాలంలో అందలేదన్నారు.
సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి
Published Tue, Dec 7 2021 4:29 AM | Last Updated on Tue, Dec 7 2021 4:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment