సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల అభ్యర్థనలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. నిమ్మగడ్డ మొండిగా ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలను బహిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ క్షేమంగా ఉండాలి.. ఉద్యోగులు మాత్రం ప్రాణాలు బలి పెట్టాలా. అధికారులపై చర్యలు తీసుకుంటామని.. నిమ్మగడ్డ బెదిరించడం న్యాయం కాదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. అద్దం చాటున దాక్కుని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టారు’’ అని చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
(చదవండి: ఒంటెత్తు పోకడలకు చెంపపెట్టు)
‘‘ఆయన ఎందరిపై చర్యలు తీసుకుంటారో చూస్తాం. నిమ్మగడ్డ వ్యవహించిన తీరు, మాట్లాడిన విధానం.. బాధ కలిగించింది. ఎలాగైనా ఎన్నికలు జరిపి తీరుతామనే నిమ్మగడ్డ మొండివైఖరి సరికాదు. మా ప్రాణాలకు ష్యూరిటీ ఎవరు ఇస్తారు.. నిమ్మగడ్డ గ్యారెంటీ ఇస్తారా. 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నాం. ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారు. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడం’’ అని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment