APNGO
-
అన్న క్యాంటీన్లకు పసుపు రంగు.. సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు టీడీపీకి సంబంధించిన పసుపు రంగును వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారని.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషన్లో చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.మరోవైపు, అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అన్న క్యాంటీన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా చంద్రబాబు మార్చేశారు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారు.ఇదీ చదవండి: తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్ లింకులు!?.. -
నేడు ఏపీఎన్జీవోల రాష్ట్ర మహా సభ
సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరగనున్న ఏపీఎన్జీవో అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మహాసభలను జయప్రదం చేయండి ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి ఉద్యోగులను కోరారు. మహా సభలు జరిగే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. 73 సంవత్సరాలు పైబడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధనే పరమావధిగా ఎన్జీవో సంఘం పనిచేస్తోందన్నారు. -
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతం: బండి శ్రీనివాస్
సాక్షి, అమరావతి: ఏపీఎన్జీవో భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాల నేతలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ అని.. ఎలాంటి అవినీతి లేకుండా లక్షా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కిందని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం సరైనదేనని కరోనా సమయంలో నిరూపితమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రపంచంలోనే ఏపీకి ప్రత్యేకత వచ్చిందని.. ఉద్యోగ వ్యవస్థకు ఇదొక గర్వకారణమని కొనియాడారు. సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులను రెగ్యులర్ చేయరని కొందరు అనుమానం వ్యక్తం చేశారని, కానీ సీఎం జగన్ సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి చూపించారని అన్నారు. చదవండి: ‘కన్నా పోటీచేస్తాడో.. పారిపోతాడో తెలియదు’ -
నా మాటలను వక్రీకరించారు
శ్రీకాకుళం అర్బన్: రాజకీయ స్వలాభం కోసం తన మాటలను కొన్ని పత్రికలు, మీడియా వక్రీకరించి కథనాలు ఇచ్చాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన 71 సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య సఖ్యత చెడగొట్టేందుకే కొన్ని మీడియా సంస్థలు తన మాటలను వక్రీకరించాయని చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీకీ తొత్తులు కాదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కష్టమొస్తే ప్రభుత్వంపైనే అలుగుతామని, సమస్యలు పరిష్కరిస్తే అదే ప్రభుత్వానికి, సీఎంకు పాలాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. పీఆర్సీ నిరసనల్లో పాల్గొనం ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం సాక్షి, అమరావతి: పీఆర్సీ ప్రకటించాలంటూ ఉద్యోగ సంఘాల జేఏసీలు మంగళవారం నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ తెలిపింది. ఈ మేరకు ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి.రమణారెడ్డి, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ అధ్యక్షుడు ఏవీ పటేల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీని పది రోజుల్లో ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేసినందున.. మంగళవారం నుంచి జేఏసీలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల, అధికారుల సంక్షేమం విషయంలో సీఎం జగన్‌పై తమకు విశ్వాసం ఉందన్నారు. -
ఉద్యోగినులకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి/మంగళగిరి: ప్రభుత్వ ఉద్యోగినుల సమస్యలపై కమిషన్ సత్వర స్పందనతో అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఏపీఎన్జీవో, సచివాలయ మహిళా సంఘాల ప్రతినిధులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయజ్ దీనికి అధ్యక్షత వహించారు. పద్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్ సూచనలతో పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలకు కమిషన్ కసరత్తు చేస్తుందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉద్యోగినులు ఫిర్యాదులు చేయడంలో ముందుంటున్నారని తెలిపారు. కనుసైగ సైతం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని గుర్తెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు.. గజ్జల వెంకటలక్ష్మి, ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి శాంతకుమారి, ఏపీ సచివాలయ మహిళా అసోసియేషన్ వైస్ చైర్పర్సన్ దీపాభవాని, ఏపీ ఎన్జీవో మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు వి.నిర్మలకుమారి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగినులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. కాగా, టీడీపీ నేతల బూతులు హేయమని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని బూతుల తిట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. మహిళల రక్షణ, భద్రత, సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారని కొనియాడారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. -
కోవిడ్ వల్లనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
నెల్లూరు (అర్బన్): కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఛిన్నాభిన్నమైందని, అందుకే ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కాస్త ఆలస్యమయ్యాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని ఎన్జీవో భవన్లో ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీతాలు కాస్త ఆలస్యం కావడానికి గత ప్రభుత్వం తెచ్చిన సీఎఫ్ఎంఎస్ విధానం కూడా మరో కారణమన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్ వల్ల నష్టం జరుగుతుందని, ఈ విధానం పనికిరాదన్నారని గుర్తు చేశారు. అందువల్ల సీఎఫ్ఎంఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అడగకుండానే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించనుందన్నారు. ముఖ్యమంత్రి ఆగస్టు 15న మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని తెలిపారన్నారు. ఆ హామీని త్వరగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నేపల్లి పెంచలరావు, నాయుడు వెంకటస్వామి పేర్కొన్నారు. -
ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా బండి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షునిగా ఉన్న ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ సర్వీస్ నుంచి బుధవారం రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి శ్రీనివాసరావును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన స్థానంలో వైఎస్సార్ జిల్లా ఎన్జీవోల సంఘం అధ్యక్షునిగా ఉన్న కేవీ శివారెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చదవండి: డెయిరీ విభజనపై ఇరు రాష్ట్రాలకు నోటీసులు -
పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల అభ్యర్థనలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. నిమ్మగడ్డ మొండిగా ముందుకు వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలను బహిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ క్షేమంగా ఉండాలి.. ఉద్యోగులు మాత్రం ప్రాణాలు బలి పెట్టాలా. అధికారులపై చర్యలు తీసుకుంటామని.. నిమ్మగడ్డ బెదిరించడం న్యాయం కాదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. అద్దం చాటున దాక్కుని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టారు’’ అని చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. (చదవండి: ఒంటెత్తు పోకడలకు చెంపపెట్టు) ‘‘ఆయన ఎందరిపై చర్యలు తీసుకుంటారో చూస్తాం. నిమ్మగడ్డ వ్యవహించిన తీరు, మాట్లాడిన విధానం.. బాధ కలిగించింది. ఎలాగైనా ఎన్నికలు జరిపి తీరుతామనే నిమ్మగడ్డ మొండివైఖరి సరికాదు. మా ప్రాణాలకు ష్యూరిటీ ఎవరు ఇస్తారు.. నిమ్మగడ్డ గ్యారెంటీ ఇస్తారా. 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నాం. ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారు. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదు. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడం’’ అని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. -
హైకోర్టు తీర్పు శుభపరిణామం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేయడం శుభపరిణామమని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవో హోంలో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ సమావేశం సోమవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ధర్మం వైపు న్యాయం హైకోర్టు తీర్పుపై ఏపీ అమరావతి జేఏసీ సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ను హైకోర్టు రద్దు చేయడంపట్ల ఏపీ అమరావతి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పుడూ ధర్మం వైపే న్యాయం ఉంటుందని ఈ తీర్పు ఋజువు చేసింది అని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆ ఉద్యోగులంతా ఏపీ ఎన్జీవోలో సభ్యులే..
సాక్షి, విజయవాడ : గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ ఇంతకుముందే ఏర్పడిందని, 2020లో రిజిస్ట్రర్ అయిన దాని నెంబర్ 138 అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఫెడరేషన్ రిజిస్ట్రర్ కాకముందు ఈ ఉద్యోగులు సంఘంగా ఉండేవారని తెలిపారు. ఈ ఫెడరేషన్ కేవలం గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులదేకాదని, ఏపీ ఎన్జీవోది కూడా అని అన్నారు. ఆ ఫెడరేషన్లో ఉన్న ఉద్యోగులంతా ఏపీ ఎన్జీవోలో కూడా సభ్యులేనని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు. ( ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవు) రాష్ట్ర ప్రజలకు నలుదిశలా సేవలందించడంలో లక్షా 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా వైరస్ ప్రారంభ దశలో పాజిటివ్ వ్యక్తులను గుర్తించడంలో ఈ గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. ఈ వ్యవస్థను ఇతర రాష్ట్రాలలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారునికి అందించడంలో ఈ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లుంటాయి. వాటిని పరిష్కరించడంలో ఏపీ ఎన్జీవో ముందుంటుంద’’ని అన్నారు. -
కరోనా తగ్గే వరకు స్థానిక ఎన్నికలు వద్దు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు స్థానిక ఎన్నికలను నిర్వహించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరతామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే తమ ఉద్యోగులను రక్షించుకునేందుకు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా అవతరిస్తున్నందున తమ ఉద్యోగులంతా విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
సీఎం సానుకూలంగా స్పందించారు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమకు రావాల్సిన బకాయిలు, రాయితీలు, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించామని చెప్పారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు నిలిపివేసిన 50 శాతం జీతాలను, మార్చి నెలలో నిలిపివేసిన పెన్షన్‌దారుల సగం పెన్షన్ వెంటనే చెల్లించాలని కోరామన్నారు. జూలై 1, 2018, జనవరి 1, 2019, జూలై 1, 2019 నుంచి బకాయి ఉన్న మూడు విడతల డీఏలను విడుదల చేయాలని అడిగామన్నారు. జూలై 1, 2018 నుంచి 55% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో సంఘ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, రాష్ట్ర సహాధ్యక్షుడు సీహెచ్ పురుషోత్తమనాయుడు, ఉపాధ్యక్షుడు డీవీ రమణ ఉన్నారని చెప్పారు. -
‘ఏపీ ఎన్జీవో చేస్తున్న ప్రచారం అవాస్తవం’
సాక్షి, విజయవాడ : జీవో 103ని రద్దుచేయాలని ఏపీ ఎన్జీవోలు ఆందోళన చేయడం హాస్యాస్పదం, అర్థరహితం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. టీడీపీ ప్రభుత్వానికి అనుబంధంగా వ్యవహరించిన ఏపీఎన్జీవో.. ఉద్యోగులకు ఏం మేలు చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ సంఘానికి గుర్తింపు ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా నిరసనలు చేయడం ఏపీఎన్‌జీవోకే చెల్లుతుందని విమర్శించారు. కొందరు ఐఏఎస్‌లు దొడ్డిదారిన 103 జీఓ విడుదల చేసారని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ప్రభుత్వానికి అన్ని పత్రాలు సమర్పించిన తర్వాతే జీవో 103 జారీ చేశారని స్పష్టం చేశారు. చౌకబారు రాజకీయాలు మానకపోతే తగిన రీతిలో బదులు ఇస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో కలసి పనిచేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని ఏపీఎన్జీవోను కోరారు. -
సీపీఎస్ రద్దు చేయాల్సిందే..
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు చేసే వరకూ పోరాటం ఆపేదిలేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. రాష్ట్రంలో సీపీఎస్ అమలు చేసేదిలేదని టీడీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకూ సీఎం చంద్రబాబు నాటకాలు నమ్మేది లేదని సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యమంలో చంద్రబాబు మాదిరిగా యూటర్న్లు తీసుకోవద్దని సంఘాలను పలువురు నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో విజయవాడలోని జింఖాన గ్రౌండ్స్‌లో శనివారం బహిరంగ సభ నిర్వహించారు. సీపీఎస్ అమలుతో రాష్ట్రంలో లక్షా 50 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ భద్రత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస స్పందనలేదని ద్వజమెత్తారు. ఉద్యోగుల పొట్టకొట్టే ఈ విధానంపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన వైఖరి తక్షణం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేయిస్తామని ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ఎన్నికల వరకు చూడకుండా సీపీఎస్ రద్దు కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోను, ఎంపీలు రాజ్యసభలోను ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని పలువురు కోరారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉండే రాజకీయ పార్టీలకే మేము దన్నుగా ఉంటామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు అనేది రాజకీయ నినాదంగా మారాలని, అందుకోసం రానున్న మూడు నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే సెప్టెంబర్ 1న చేపట్టే కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు పి.బాబురెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సీపీఎస్ రద్దుకు మద్దతు ఇస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏపీలో నోరు మెదపకుండా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఫ్యాప్టో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో మెలిగే ఉపాధ్యాయులు తిరగబడితే ఏం జరుగుతుందో పాలకులకు తెలియజెప్పాలన్నారు. ఎమ్మెల్సీలు రెడ్డప్ప బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, కత్తి నర్సింహారెడ్డి, వై.శ్రీనివాసరావు, రాము సూర్యారావు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా సీపీఎస్ రద్దు కోసం మండలిలో తమ వాణి వినిపిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు జి.నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ గఫూర్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న, ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తదితర నేతలు ఉపాధ్యాయుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. క్విట్ సీపీఎస్ నినాదంతో మూడు జాతాలు క్విట్ సీపీఎస్ నినాదంతో చేపట్టిన మూడు జాతాలు 13 రోజులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి విజయవాడ చేరుకున్నాయి. 12 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా లేపాక్షి , శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించిన ఈ జాతాలు అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు తమ ఇబ్బందులు వివరించి వారి మద్దతు కోరాయి. శనివారం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షం పడుతున్నా లెక్కచేయక గంటల తరబడి ర్యాలీ, బహిరంగ సభల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అశోక్‌బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు.. ఉపాధ్యాయులకు సంఘీభావంగా వచ్చిన ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. అశోక్‌బాబు గో బ్యాక్ అంటూ, ఆయనను రానివ్వద్దని పలువురు టీచర్లు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అశోక్‌బాబు టీడీపీ ఏజెంటని పలువురు పేర్కొన్నారు. దీంతో సభలో అలజడి రేగింది. ఫ్యాప్టో అధ్యక్షుడు బాబురెడ్డి, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు జోక్యం చేసుకుని సభికులకు నచ్చజెప్పారు. అశోక్‌బాబు మాట్లాడేటప్పుడు కూడా సభలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆశోక్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు
-
అశోక్‌బాబుపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబు ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ప్రధానిపై విమర్శలు గుప్పించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు సుధీష్‌రాంబొట్ల, ఆంజనేయరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలు ప్రకాష్‌రెడ్డి, రామకృష్ణ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సుధీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లఘించిన అశోక్‌బాబు.. ఇప్పుడు రాజీనామా చేస్తానని చెబుతున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు ఆయనకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం చెల్లించే గ్రాట్యూటీ, పెన్షన్ వంటివి నిలుపుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరామన్నారు. -
అశోక్‌బాబు సమావేశంలో రభస
సాక్షి, బెంగళూరు/అమరావతి: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, తెలుగుదేశం నాయకులు ఆదివారం బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్‌కు వేయాలని సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్‌ఫీల్డ్ రోడ్డులోని ఒక హోటల్లో ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరిట అశోక్‌బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే తాము ఇక్కడికి వచ్చేవాళ్లమే కాదంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడి తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి తమను విభజించవద్దని సూచించారు. చంద్రబాబు చెప్పినట్లు అశోక్‌బాబు ఇక్కడికొచ్చి వ్యవహరించడం సరికాదని చెప్పారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం కర్ణాటకలోని తెలుగు ప్రజలను ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కర్ణాటక ఎన్నికలతో అశోక్‌బాబుకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. అశోక్‌బాబును నిలదీసేందుకు కొందరు తెలుగు సంఘాల వారు హోటల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గొడవ మధ్యే అశోక్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన బీజేపీని, మోదీనీ ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. టీడీపీ ఏజెంటువా?.. విష్ణువర్దన్‌రెడ్డి ధ్వజం ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుపై బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన బెంగళూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ నేతలకు మొహం చెల్లక అశోక్‌బాబు లాంటి దళారికి విమాన టిక్కెట్లు ఇచ్చి కర్ణాటకకు పంపించారని ఆరోపించారు. అశోక్‌బాబు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నారో? ఎన్టీఆర్ ట్రస్టు నుంచి తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అశోక్‌బాబు కర్ణాటక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారంలో పాల్గొనడం సర్వీసు రూల్స్‌కు పూర్తిగా విరుద్దమని.. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అశోక్‌బాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజు మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం
సాక్షి, విజయవాడ : ఉద్యోగుల పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సీపీఎస్ విధానం రద్దు కోసం శనివారం విజయవాడలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పెన్షన్ సాధన కోసం పెన్షన్ సాధన సమితిని ఏర్పాటు చేశామని, పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని అవసరమైతే రాజకీయ అంశంగా మారుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌ను సాధించుకుంటామని చెప్పారు. ఏపీ సర్కార్ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని సీపీఎస్ కేంద్రం పరిధా, లేక రాష్ట్రం పరిధిలోనిదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫేడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
కొత్తూర్ (శ్రీకాకుళం) : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కొత్తూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు సాయిరాం, డివిజన్ అధ్యక్షుడు టి.చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
'వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరాం'
విజయవాడ: కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఘటనపై ఏపీ ఎన్జీవో చైర్మన్ విద్యాసాగర్ స్పందించారు. వనజాక్షికి రక్షణ కల్పించాలని కలెక్టర్ ను కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈనెల 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఏపీ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు ఏపీ ఎన్జీవో, జేఏసీల నుంచి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ధర్నాకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నాకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానిస్తామన్నారు. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ఉద్యోగ నేతలంతా కేంద్ర హోంమంత్రిని, మిగిలిన కేంద్ర మంత్రులను ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరతామన్నారు. దీంతో పాటు ఈనెల 10 వ తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు కూడా తాము సంఘీ భావం తెలుపుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎవరు ఉద్యమం చేసినా తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ నెల 16వ తేదీన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరులో విభజన హామీలపై సమావేశం ఏర్పాటు చేసి.. తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీకాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా దాడులు జరిగాయని చెప్పారు. తహశీల్దార్ వనజాక్షిపై ఇటీవలి దాడి జరిగిన ఘటన నేపథ్యంలో అశోక్ బాబు పైవిధంగా స్పందించారు. వనజాక్షిపై దాడి ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందని తెలిపారు. ఏపీలో ఉద్యోగుల బదిలీలను ఆగస్టులో చేయడం సరికాదని అశోక్ బాబు అన్నారు. విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉద్యోగులను కూడా సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలను కట్టిన తర్వాత రాజధానిని తరలించాలని గతంలోనే కోరామని చెప్పారు. ఏయే శాఖలు, ఎంత మంది ఉద్యోగులను తరలిస్తారో తెలపాలని కోరారు. ఉద్యోగులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియజేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. -
ఏపీ - టీ ఎన్జీవోల బాహాబాహీ
-
ఏపీ - టీ ఎన్జీవోల బాహాబాహీ
ఏపీఎన్జీవో కార్యాలయంలో వాటా కోసం ఏపీ ఎన్జీవోలు.. తెలంగాణ ఎన్జీవోల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో తమకూ వాటా ఇవ్వాలంటూ తెలంగాణ ఎన్జీవోలు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. కార్యాలయంపై పూర్తి హక్కులు తమవేనంటూ ఏపీఎన్జీవోలు ఎదురు తిరిగారు. దాంతో ఇరువర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రెండు ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు పరస్పరం తలపడ్డారు. కుర్చీలు విసురుకున్నారు, కొట్టుకున్నారు కూడా. గతంలో కూడా ఈ కార్యాలయంలో హక్కులకు సంబంధించి కొన్నిసార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. -
అశోక్‌బాబుపై చీటింగ్ కేసు పెట్టాలి
ఏపీఎన్జీవో నేతపై హైదరాబాద్ టీఎన్జీవో నేతల ధ్వజం కేంద్ర హోంమంత్రిని కలిసినట్టు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపాటు సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినట్టు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకి పంపాలని హైదరాబాద్ టీఎన్జీవోల సంఘం నేతలు డిమాండ్ చేశారు. గురువారం టీఆర్ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను పార్లమెంట్‌లోని ఆయన చాంబర్లో కలిసినట్టు సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ఎం. సత్యనారాయణగౌడ్ విజయ్‌చౌక్‌లో మీడి యాతో మాట్లాడుతూ, తాము హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసినప్పుడు అశోక్‌బాబు ఎవరో తెలియదని, ఏపీఎన్జీవోల నుంచి ఎవరూ తనను కలవలేదని చెప్పారని అన్నారు. ‘రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవో భవనంలో మాకు రావాల్సిన 42 శాతం వాటా కోసం దీక్షలు చేస్తే, గవర్నర్‌ను తప్పుదోవ పట్టించేలా అశోక్‌బాబు ఫిర్యాదు చేశారు’ అని సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. తెలంగాణలో ఏపీఎన్జీవోలకు రక్షణ లేదంటూ చేస్తున్న ఫిర్యాదుల్లో వాస్తవం లేదన్నారు. వీటిపై పూర్తి నివేదికలను కేంద్ర హోంమంత్రికి ఇచ్చినట్టు టీఎన్జీవో సంఘ నేత ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు
హైదరాబాద్ : హైదరాబాద్ గన్పౌండ్రీలోని ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు గురువారం తాళం వేశారు. తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామంటే... అశోక్ బాబు వినటం లేదంటూ తెలంగాణ ఉద్యోగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ఏపీఎన్జీవో ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని, అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు గతంలో వెల్లడించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. -
ఉన్నపళంగా తరలింపు తగదు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు మంత్రులు చెట్ల కింద పనిచేస్తే ఉద్యోగులూ సిద్ధం ఒత్తిడి వల్ల లాభం కంటే ఇబ్బందులే ఎక్కువ విజయవాడ బ్యూరో: తాత్కాలిక రాజధానికి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ దశలవారీగా జరగాలే తప్పా ఇప్పటికిప్పుడే హైదరాబాద్ నుంచి తరలించే యత్నం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. తాత్కాలిక రాజధానికి తక్షణం వెళ్లిపోవాలంటే.. మంత్రులు, ఐఏఎస్‌లు చె ట్ల కింద కూర్చుని పనిచేస్తే తామూ పనిచేస్తామన్నారు. విజయవాడ ఏపీఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న అనేక అంశాలను మంగళవారం సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఈలోగా తాత్కాలిక రాజధానిని నిర్మించుకుని, ప్రజలకు తక్షణ అవసరమైన శాఖలను దశలవారీగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.రాజధాని స్వరూప స్వభావాలు, పరిపాలనపై ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డులపై నేడు సీఎం సమావేశం.. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందించే అంశాన్ని చర్చించేందుకు మంగళవారం సీఎం నిర్వహించే సమావేశంలో ఆ పథకం అమలులో లోపాలను చర్చించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తెస్తామని అశోక్‌బాబు చెప్పారు -
బదిలీ జీవోలపై ఏపీ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులను బదిలీ చేస్తూ జారీ చేసిన జీవోపై ఏపీ ఎన్జీఓలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కలిసి తమ అసంతృప్తిని ఉద్యోగ సంఘాలు వెళ్లగక్కాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే మార్పులు చేయాలని చంద్రబాబుకు ఏపీ ఎన్జీఓలు సూచించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అంటూ విడదీయడం, విభజించడం బాధాకరమని ఏపీఎన్జీవోలు అన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని మార్పులు చేయాలని ముఖ్యమంత్రికి ఏపీఎన్జీవోలు సూచించారు. -
మాకు ప్రత్యేక గదులు కేటాయించాలి
అశోక్‌బాబును నిలదీసిన టీఎన్జీవోలు హైదరాబాద్ : ఏపీఎన్జీవోస్ హోంలో టీఎన్జీవోస్ అసోసియేషన్‌కు ప్రత్యేకంగా గదులు కేటాయించాలంటూ అసోసియేషన్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. గదుల కేటాయింపుపై ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుకు వినతి పత్రం ఇవ్వడానికి శనివారం గన్‌ఫౌండ్రిలోని ఏపీఎన్జీవోస్ హోంకు టీఎన్జీవోలు వెళ్లారు. వినతి పత్రాన్ని తీసుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఏపిఎన్జీఓస్ హోం నుంచి తమ అసోసియేషన్ కార్యకలాపాలను కొనసాగిస్తామని, ఏపిఎన్జీఓస్ అసోసియేషన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా వారికి అండగా ఉంటామని తెలిపారు. -
ఏపీఎన్జీవోల భూమిని బదలాయించొద్దు
ఆ భూములపై యధాతథస్థితిని కొనసాగించండి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం విచారణ 4 వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో ఏపీ ఎన్జీవో మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 189.11 ఎకరాల భూమిని మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ)కి బదలాయించొద్దని హైకోర్టు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నందున, దాని విషయంలో యధాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూమి స్వాధీనానికి సంబంధించి ఎపీ ఎన్జీవో హౌసింగ్ సౌసైటీకి నోటీసు జారీ, ఇతర పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. గోపన్నపల్లిలో తమకు కేటాయించిన 189.11 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (అసైన్మెంట్) బి.ఆర్.మీనా ఈ నెల 2న జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలోపిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. భూమి స్వాధీనం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలిపారు. భూ స్వాధీనానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లోనే నోటీసు ఇచ్చామని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి తమకెటువంటి నోటీసూ అందలేదని కోర్టుకు నివేదించారు. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. భూముల స్వాధీనం నిర్ణయం ప్రస్తుత ప్రభుత్వానిది కాదని చెప్పారు. గత ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 20న సొసైటీకి నోటీసు జారీ చేసి, భూ కేటాయింపులను ఎందుకు రద్దు చేయరాదో వివరణ కోరగా సమాధానం రాకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం భూ స్వాధీన చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. హౌసింగ్ సొసైటీ నోటీసు అందుకుందంటూ, సంబంధిత అక్నాలడ్జ్‌మెంట్‌ను న్యాయమూర్తి ముందుంచారు. హౌసింగ్ సొసైటీ భూముల విషయంలో యధాతథస్థితిని విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఎపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. -
ఏపీ ఎన్జీవో భూములపై హైకోర్టు స్టేటస్కో
-
ఏపీ ఎన్జీవోల భూమిని తీసుకోవడం అన్యాయం: అశోక్ బాబు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఆంధ్ర ప్రాంత వారిపై కక్షసాధింపు చర్యగా ఉద్యోగులు భావిస్తున్నారని అశోక్ బాబు మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయలేదనడం భావ్యం కాదన్నారు. 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్లే తాము నిర్మాణాలు చేపట్టలేకపోయామని అశోక్‌బాబు వివరణ ఇచ్చారు. 4 కోట్ల రూపాయలు లే అవుట్ ఛార్జీల కోసం, భూమి అభివృద్ధికి 5 కోట్లు ఖర్చుచేశామని అశోక్‌బాబు తెలిపారు. ఎపీఎన్జీవోలతోపాటు ఇతర సంఘాలకు ఇచ్చిన భూముల్లో కూడా చాలాభాగం నిర్మాణాలు జరగలేదని మీడియాకు అశోక్‌బాబు వెల్లడించారు. ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములే వెనక్కి తీసుకోవడం భావ్యం కాదని, సీఎం కేసీఆర్‌ను కలిసి వాస్తవాలు తెలియజేస్తామని అశోక్ బాబు అన్నారు. -
20 లోగా మార్గదర్శకాలు
ఉద్యోగుల ఆకాంక్షలకు తగినట్లుగానే ఉంటాయి అనిల్ గోస్వామి హామీ హైదరాబాద్: ఉద్యోగ సంఘాల ఆకాంక్షలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో, టీఎన్జీవో, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి బృందాలు మంగళవారం వేర్వేరుగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో గోస్వామిని కలిసి వినతిపత్రాలు సమర్పించారుు. సంఘాల ప్రతినిధులు చెప్పిన విషయాలను హోం శాఖ కార్యదర్శి సావధానంగా విన్నారు. ఈనెల 19 లేదా 20న మార్గదర్శకాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలికంగానే ఉద్యోగుల విభజన జరుగుతుందని, తదుపరి రెండు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉద్యోగుల పంపిణీ చేస్తాయన్నారు. 371(డీ)లో పేర్కొన్న జోన్ల సంఖ్య పెంపు లేదా కుదింపు కోరుతూ ఆయా ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు అందజేయవచ్చునని చెప్పారు. అందరికీ ఆప్షన్లు ఇవ్వాలి: సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇవ్వాల్సిందే. రాష్ట్రస్థాయి నియామకాల్లో ఉద్యోగాలు సంపాదించి సచివాలయం, హెచ్వోడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జోనల్ వ్యవస్థ వర్తించదు. వారిని స్థానికత ఆధారంగా కాకుండా ఆప్షన్ల మేరకు ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి.జిల్లాల నిష్పత్తిలో కాకుండా జనాభా నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరగాలి.రాజధానిలో ఉన్న ఉద్యోగుల పిల్లల స్థానికతను ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్లు ఇవ్వాలి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన పిల్లలు సీమాంధ్రకు వెళ్లాలనుకుంటే అక్కడ వారిని ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించాలి.విభజనలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఉండే అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానికత ఆధారంగా విభజించాలి: తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలి. తాత్కాలిక కేటాయింపునకు కూడా స్థానికతనే ఆధారంగా తీసుకోవాలి.సీమాంధ్రలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపించాలి. అదే విధంగా తెలంగాణ నుంచి సీమాంధ్రకు పంపించాలి.ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో 610 జీవో, గిర్గ్లానీ కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి.టీచర్లకూ ఆప్షన్లు ఇవ్వాలి: పీఆర్టీయూ, ఎస్టీయూవిభజన నేపథ్యంలో టీచర్లు సొంత జిల్లా, రాష్ట్రానికి వెళ్లడానికి వీలుగా ఆప్షన్ సౌకర్యం కల్పించాలి. దంపతులైన టీచర్లకూ ఈ సౌకర్యం ఉండాలి.కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి.సీమాంధ్రకు లోటు బడ్జెట్ ఉన్నందున ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బంది రాకుండా కేంద్రం సహకరించాలి. -
నాన్నలానే అండగా ఉంటా
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తా ఏపీఎన్జీవోలకు జగన్మోహన్రెడ్డి హామీ సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తరహాలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు రాకుండా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగా భావిస్తామని, కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని చెప్పారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కూడిన ప్రతినిధిబృందం ఆదివారం జగన్మోహన్రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయింది. ఉద్యోగుల సంక్షేమానికి చేపట్టే చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏపీఎన్జీవో నేతలు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల అంశాలకు సంబంధించి వినతిపత్రంలో తాము చేసిన డిమాండ్‌కు జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏపీఎన్జీవోల డిమాండ్లు ఇవీ... కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, దశల వారీగా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలి. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా హెల్త్‌కార్డుల పథకం అమలు చేయాలి. 2013 జూలై నుంచి పదో పీఆర్సీ అమలుపరచాలి. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ విషయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులందరికీ ఆప్షన్ సౌకర్యం కల్పించే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో వారికి ఇళ్లు/స్థలం మంజూరు చేయాలి. కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు తగిన భద్రత, సౌకర్యాలు కల్పించాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలి. -
వైఎస్ జగన్‌ను కలిసిన అశోక్ బాబు
-
వైఎస్ జగన్‌ను కలిసిన అశోక్ బాబు, ఏపీఎన్జీవోలు!
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీఎన్జీవో నేత పి. అశోక్ బాబుతోపాటు ఇతర నేతలు కలిశారు. ఏపీఎన్జీఓ ప్రతిపాదనలను వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చేర్చాలని వైఎస్ జగన్ కు అశోక్ బాబు, ఇతర నేతలు విజ్క్షప్తి చేశారు. ఏపీఎన్జీఓ నేతలు చేసిన విజ్క్షప్తికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత అశోక్ బాబు లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులేనని ఆయన అన్నారు. సీమాంధ్ర అభివృద్దిలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించనున్నారని అశోక్ బాబు తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని పలు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ప్రతిపాదనలు మ్యానిఫెస్టోలో పెట్టాలని పలు రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నామన్నారు. అంతేకాని సీట్లకోసం మాత్రం కాదు అని అశోక్ బాబు స్పష్టం చేశారు. -
హౌసింగ్ సొసైటీలో అశోక్‌బాబు సభ్యత్వం రద్దు
కోఆపరేటివ్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబుకు సభ్యత్వం ఇవ్వడాన్ని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ పి.శ్రీసుధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అశోక్‌బాబుకు సభ్యత్వం కల్పించారంటూ శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కార్యాలయ సూపరింటెండెంట్ డీఎల్ఆర్ సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ విచారించి.. ఈ ఉత్తర్వు లిచ్చింది. 2010లో అశోక్‌బాబు సభ్యత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే నగరంలో ఐదేళ్ల సర్వీసు పూర్తయినవారికే సభ్యత్వం ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ట్రిబ్యునల్ ఏకీభవించింది. సభ్యత్వం లేకుండానే సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నిక ఒకవైపు ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అశోక్‌బాబుకు సభ్యత్వం ఇవ్వడాన్ని కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తప్పుబట్టి సభ్యత్వాన్ని రద్దు చేసినప్పటికీ.. మరోవైపు ఆయన్ను సొసైటీ అధ్యక్ష స్థానానికి ఎంపిక చేయడం గమనార్హం. బుధవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోభవ నంలో హైడ్రామా మధ్య ఎన్నికలు నిర్వహించారు. అశోక్ బాబును కో-ఆప్షన్ సభ్యునిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకందలేదని సొసైటీలోని అశోక్ బాబు వర్గీయులు చెప్పారు. విలేకరులు విషయాన్ని అశోక్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా ట్రిబ్యునల్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
‘అశోక్‌బాబుపై చర్యలు తీసుకోవాలి’
కల్లూరు రూరల్, : ఉద్యోగులను తప్పుదోవ పట్టించిన ఏపీ ఎన్జీవోల చైర్మన్ అశోక్‌బాబుపై చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సరళగంగ, డబ్ల్యు. వెంకటరమణ మాట్లాడుతూ.. అశోక్‌బాబు సమైక్యం కోసం పోరాడుతున్నట్లు ఎన్జీవోలతో సమ్మె చేయించి నమ్మక ద్రోహం చేశారన్నారు. మోసపూరితంగా 60 రోజుల సమ్మె చేసిన కారణంగా ఏప్రిల్‌లో రిటైర్మెంట్ అవుతున్న ఓ ఉద్యోగి 1.50 లక్షల బెనిఫిట్స్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు సత్యనారాయణరాజు, మరికొందరు ఎన్జీవోలు పాల్గొన్నారు. -
సమైక్యవాదుల కన్నెర్ర
వైవీయూ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికే ఏపీఎన్జీఓలు సమ్మెబాట పట్టడంతో పలు చోట్ల కార్యాలయాలు మూతపడ్డాయి. కడప నగరంలోని ఎన్జీఓల ఆధ్వర్యంలో ఇర్కాన్సర్కిల్లో రహదారుల దిగ్బంధన కార్యక్రమం చేపట్టారు. దీనికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించి రహదారిపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ర్టపతి వ్యతి రేకించకుండా పార్లమెంట్క పంపడం దారుణమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అలా గే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కడప డిపో ఆవరణంలో ధర్నా చేపట్టారు. రీజినల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం మాట్లాడుతూ అవసరమైతే సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజంపేటలో తెలంగాణ లాయర్లు జయప్రకాష్నారాయణపై ఏపీభవన్‌లో వ్యవహరించిన తీరుపై రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. బైపాస్‌రోడ్డులో ఎన్జీఓలు రహదారి దిగ్బంధన కార్యక్రమం కొనసాగించారు. ప్రొద్దుటూరులో జేఏసీ కన్వీనర్ మాదాసు మురళీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పుట్టపర్తి సర్కిల్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు భారీర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో జేఏసీ ఆధ్వర్యంలో అరవింద్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహిం చారు. జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దముడియం మండలం కాండపాంపల్లె గ్రామస్థులు దీక్షలో బైఠాయించారు. వీరికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో సైతం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో సమావేశం నిర్వహిం చి ఉద్యమానికి సంఘీభావంగా తాము సైతం ఉద్యమబాట పట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నేడు జిల్లా బంద్‌కు పిలుపు.. పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ రాజ కీయ పార్టీలు ప్రకటించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కార్యచరణను గురువారం సమావేశంలో ప్రకటించనున్నట్లు లాయర్ల జేఏసీ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నేడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రబుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ప్రజల మనోభావాలు పట్టవా..! వైవీయూ: ఆంధ్రుల మనోభావాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఆమోదించడం రాష్ట్రపతికి తగదని ఏపీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం నగర శివారులోని ఇర్కాన్సర్కిల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. వీరికి జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీఓ నాయకులు గోపాల్‌రెడ్డి, చిన్నయ్య, రమేష్, చంద్రశేఖరరెడ్డి, జేఏసీ నాయకులు అమీర్‌బాబు, పీరయ్య, జోగిరామిరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'సీఎం రాజీనామా చేస్తా అనడం, ఎంపీల సస్సెండ్ డ్రామానే'
న్యూఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనడం, ఎంపీలనూ సస్పెండ్ చేయడం అంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆడిస్తున్న డ్రామాలో భాగమని ఏపీఎన్జీవో నేత సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనే ధృడ సంకల్పం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలలో లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి తెలంగాణ బిల్లు రాకముందే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసుంటే ప్రయోజనం ఉండేది అని ప్రజలు భావిస్తున్నారని సత్యనారాయణ అన్నారు. విభజన ప్రక్రియ క్లైమాక్స్ చేరుకున్న తర్వాత ఇప్పుడు ఎంతమంది రాజీనామా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని సత్యనారాయణ అన్నారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన ప్రదర్సన
శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కూడలి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్జీవో సంఘ తాలుకా కార్యదర్శి కుప్పాల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజనకు కనీస రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చూడటం దారుణమని దీనిని జాతీయపార్టీలన్నీ ఖండించాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణాకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మావనహారం నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు కృష్ణారావు, ఇరిగేషన్ జేఏసీ నాయకులు విజయవర్థన్, సామాజిక సేవాసంఘ ప్రతినిధి మీసాల రవి, పీఆర్టీయూ మండల అధ్యక్షులు గేరా విజయరాజ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు జూటూరి అప్పారావు, పవర్ ఆఫ్ యూత్ ప్రతినిధులు మాదిరాజు సుబ్బారావు, ముస్తఫా, జేఏసీ సభ్యులు రంగిశెట్టి మల్లిఖార్జునరావు, కెపి.రఘుబాబు, ఎస్జీఎస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
అదే సంకల్పం..ఆగలేదు సమరం
కడవరకూ పోరాడదాం సాక్షి, కాకినాడ : ‘కడ వరకు పోరాడదాం... రాష్ర్ట సమైక్యతను కాపాడుకుందాం’ అంటూ ఏపీఎన్జీఓలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్‌తో సహా వీఆర్వో కార్యాలయం వరకు పరిపాలన పూర్తిగా స్తంభించింది. సమ్మె బాటపట్టిన ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. రెండో రోజు వీరి ఆందోళనలకు పలు చోట్ల ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సంఘీభావం తెలిపారు. విభజన బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే పరిస్థితులు కన్పిస్తుండడంతో సోమవారం నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ట్రెజరీ, హౌసింగ్, సహకార శాఖ సిబ్బంది కూడా సోమవారం నుంచి సమ్మె బాటపట్టనున్నారు. మరొక పక్క తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అర్ధరాత్రి నుంచే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పారిశుద్ద్య సిబ్బంది సమ్మె బాట పట్టనుండడంతో మిగిలిన ఉద్యోగులు సోమవారం నుంచి సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మెలోకి రావాలని ఏపీ ఎన్జీఓలు పిలుపునిచ్చారు. వినూత్న నిరసనలు ఏపీఎన్జీఓ సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వే శారు. కలెక్టరేట్ రోడ్లో ఉన్న ఆర్డీఓ కార్యాలయం, జెడ్పీ, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్ తదితర కార్యాలయాలను కూడా దగ్గరుండి మూయించి వేశారు. జెడ్పీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. జెడ్పీ ఉద్యోగిని తెలుగుతల్లి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై జరిగిన ప్రదర్శనలో ‘తెలుగుప్రజలందరం ఒక్కటిగా ఉందాం...రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం అంటూ నినదించారు. విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్లో ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఏపీ ఎన్జీఓలు, ఏయూ పూర్వవిద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీఎన్జీఓలు నిరసన ప్రదర్శన చేయగా, సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ శిబిరాన్ని జేఏసీ నాయకులు అడ్డుకొని వారిని బయటకు పంపించారు. 10న కేంద్ర కార్యాలయాల ముట్టడి 10వ తేదీన కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని, 12వ తేదీన రహదారులను దిగ్బంధించాలని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్ పిలుపు నిచ్చారు. 10వ తేదీన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ర్ట అధ్యక్షుడు పి. అశోక్‌బాబు ముఖ్యఅతిథిగా జరుగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
6నుండి ఏపీఎన్జీఓల సమ్మె
-
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
-
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు మళ్లీ సమ్మె భేరి మోగించబోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తూ ఈ నెల 6 నుంచి ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. 7, 8, 9 తేదీల్లో కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించాలని సమావేశంలో నిర్ణయించారు. 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ పాటించనున్నారు. ఆ తర్వాత 17, 18, 19 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. -
ఇది సమైక్యాంధ్ర తొలి విజయం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర శాసనసభలో టీ-నోట్‌ను మూజువాణీ ఓటుతో తిరస్కరించడం సమైక్యాంధ్ర ఉద్యమం తొలి విజయంగా ఏపీ ఎన్జీవో సంఘం సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు పేర్కొన్నారు. గురువారం ఎన్జీవో హోంలో సమైక్యాంధ్ర సాధన సమితి ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు టీ నోట్‌ను తిరస్కరించడంపై పురుషోత్తం నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 66 రోజుల ఉద్యోగుల సమ్మెకు ఫలితం దక్కిందని, సీమాంధ్ర ఉద్యోగుల, నాయకులు, విద్యార్థుల, వివిధ సంఘా ల విజయమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు రాకపోవడం, కొందరు నాయకులు మాటలు మారుస్తున్నారన్నారు. టీ నోట్ తిప్పిగొట్టిన తర్వాతైనా కొన్ని పార్టీలు తమ జెండా, అజెండా వీడి సమైక్య ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సమైక్యవాదం వినిపించేందుకు సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు ఏకతాటిపై నిలిచి ఇతర ప్రాంతాలకు చెందినవారిని, పార్టీలను కలుపుకుని కృషి చేయాలని కోరారు. ఇదే పంథాలో పార్లమెంట్లో బిల్లును ఓడించాలన్నారు. బీజేపీ కూడా సమైక్యాంధ్రకు సానుకూలంగా ఉందని, గతంలో ఆ పార్టీ అధినేతను కలిశామని, అసెంబ్లీలో బిల్లు ఓడిస్తే పార్లమెంట్లో ఓడించేందుకు కృషి చేస్తామని చెప్పారన్నారు. ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో జరగనున్న సమావేశంలో పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఉద్యం కొనసాగించాల్సి ఉందన్నారు. సీమాంధ్రవాసులు మరికొన్నాళ్లు అప్రమత్తంగా మెలగాలని కోరారు. ఫిబ్రవరి నెలలో అధిక సంఖ్యలో ఢిల్లీ వెళుతున్నామని, యూపీఏ ప్రభుత్వం తీరు మారే లా ఉద్యమం చేపట్టాల్సి ఉందన్నారు. ఈ సందర్బగా ఆరు నెలల నుంచి ఉద్య మం చేస్తున్న ప్రజలను ఆయన అభినందించారు. జామి భీమ శకంర్, దుప్పల వెంకటరావు, గీతా శ్రీకాంత్, వేణుగోపాల్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నర్సునాయుడు, శోభారాణి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, కాయల శ్రీనివాసరావు, వై.జయరాం పాల్గొన్నారు. -
లగడపాటిని స్టేజ్ మీదనుంచి లాగేసిన తెలంగాణవాదులు
హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతుండగా, కొందరు తెలంగాణ వాదులు ప్రవేశించి ఆయనను స్టేజి మీద నుంచి కిందకు లాగేశారు. దీంతో అక్కడే భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. తెలంగాణ యువశక్తి సంస్థకు చెందిన ముగ్గురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు. అంతకుముందు మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు. -
ఏపీఎన్జీవోల ధర్నా.. భారీ భద్రతా ఏర్పాట్లు
ఏపీఎన్జీవోలు తలపెట్టిన మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు. ఇందిరాపార్కు, వార్త ఆఫీసుల, ఎల్ఐసీ కార్యాలయం, కట్ట మైసమ్మ దేవాలయం-అశోక్‌నగర్, అశోక్‌నగర్ రిలయన్స్- న్యూ బ్రిడ్జి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. -
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం.
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం
రాష్ట్ర విభజన సెగను సీమాంధ్రులు భోగి మంటల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చూపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీపీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భోగి మంటల్లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో టీ.బిల్లును దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో నేతలు బషీర్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేత కరణం బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో నేతలు మాట్లాడుతూ దేశంలోనే తొలి భాష ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించిందన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుండా విభజించిందని మండిపడ్డారు. ఇక సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో భోగి మంటలలో బిల్లు ప్రతులను తగలబెట్టారు. గుంటూరులో టీడీపీ నాయకులు కూడా ఇలాంటి నిరసనే తెలియజేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో కూడా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు టీ బిల్లును తగలబెట్టారు. -
ఏపీఎన్జీవో కార్యాలయ ముట్టడికి యత్నం
అశోక్‌బాబుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆగ్రహం హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి తగలబెడతానన్న ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ మండిపడింది. ఆయన తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ బిల్లుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శనివారం పలువురు తెలంగాణ న్యాయవాదులు ఏపీఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని అశోక్‌బాబు మాట్లాడటం అంబేద్కర్‌ను అవమానించడమే అని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలోని బ్యానర్‌ను చించేందుకు తెలంగాణ న్యాయవాదు యత్నించడంతో ఏపీఎన్జీవో నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేశారు. అశోక్‌బాబుపై అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీ న్యాయవాదులు.. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదులు ఉపేందర్, శ్రీధర్‌రెడ్డి, గంపా వెంకటేష్, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘అశోక్‌బాబును డిస్మిస్ చేయాలి’ తెలంగాణ బిల్లులను భోగి మంటల్లో తగలబెట్టాలని పిలుపునిచ్చిన అశోక్‌బాబును వెంటనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వి.రవికుమార్ డిమాండ్ చేశారు. అశోక్‌బాబు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. -
పురుషోత్తంనాయుడు మళ్లీ ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:ఏపీ ఎన్జీవోల సంఘం ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా పి.అశోక్‌బాబు, సహ అధ్యక్షునిగా చౌదరి పురుషోత్తంనాయుడు మళ్లీ ఎన్నికయ్యారు. వీరి ఎన్నికపై జిల్లా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో మరోసారి వీరు విజయం సాధించడం సంతోషంగా ఉందని సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, కార్యవర్గ సభ్యులు అన్నారు. -
'సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోలు నాకు రెండు కళ్లు'
కాకినాడ: ''సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోల సమస్యలు నాకు రెండు కళ్లు లాంటివి'' అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఈ రెండింటితోనే ఏపీఎన్జీవోల ఎన్నికలకు పోతామని ఆయన అన్నారు. అసెంబ్లీలో బిల్లును అడ్డుకునేందుకు ఒత్తిడి తెచ్చేలా జనవరి 2న విశాఖలో సమైక్యాంధ్ర మహాసభ ఏర్పాటు చేయనున్నట్టు అశోక్‌బాబు ప్రకటించారు. అంతేకాకుండా జనవరి 3న సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే సీమాంధ్రులకు సమైక్యాంధ్ర విలువలు తెలియజేస్తామని అశోక్‌బాబు చెప్పారు. -
రాజకీయ జేఏసీ ఏర్పాటులో అశోక్‌బాబు విఫలం
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్ష అభ్యర్థి అబ్దుల్ బషీర్ ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ర్టం కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎంలతో రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయడంలో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు విఫలమయ్యారని సంఘం అధ్యక్ష అభ్యర్థి ఎస్కే అబ్దుల్ బషీర్ ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు 64 రోజులపాటు పెద్దఎత్తున ఆందోళన చేపట్టినా అశోక్‌బాబు ఒంటెత్తు పోకడలవల్ల రాష్ట్ర విభజన ప్రక్రియను నిలుపుదల చేయలేకపోయామన్నారు. ఏపీఎన్జీవో సంఘం ఎన్నికల్లో భాగంగా ఓటర్లును కలిసేందుకు ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న పార్టీల్లో వైఎస్సార్సీపీ ముందుందన్నారు. ప్రజాభిమానం ఉన్న ఆ పార్టీని అశోక్‌బాబు ఉద్యమంలోకి ఆహ్వానించకపోవడంతో నేడు విభజన పక్రియ అసెంబ్లీ వరకు వచ్చిందన్నారు. హైదరాబాద్ సిటీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, సమైక్య ఉద్యమం ఎగసిపడుతున్న తరుణంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుచేయాలని అశోక్‌బాబుపై ఒత్తిడి తెచ్చినా ఏర్పాటుచేయలేదన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే మెరుపు సమ్మె చేస్తామని, దిగ్విజయ్‌సింగ్‌ను హైదరాబాద్‌లో కాలుపెట్టనీయబోమని ప్రగల్భాలు పలికిన ఆయన ఇప్పుడెందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. -
రాజ్యసభ సీటు కోసం ఉద్యమం తాకట్టు
అశోక్‌బాబుపై కారెం శివాజీ ధ్వజం హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజ్యసభ సీటుకోసం ఐదున్నర కోట్ల మంది నడిపిన సీమాంధ్ర ఉద్యమాన్ని ఏపీఎన్జీవోల ఆధ్యక్షుడు అశోక్‌బాబు కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాడని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ తీవ్రంగా విమర్శించారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీల అండ లేకుండా 130 రోజులు సమైక్యాంధ్ర ఉద్యమం నడిచిందని, అటువంటి మహా ఉద్యమాన్ని నీరుకార్చి అశోక్‌బాబు తన పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. -
'కేంద్ర మంత్రుల్ని రాజకీయంగా సమాధి చేస్తాం'
విజయనగరం: కేంద్ర మంత్రుల్ని రాజకీయంగా సమాధి చేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులే దౌర్భగ్యమే రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కారణమని మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర విభజన అంశంపై అవసరమైతే మరోసారి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత దుస్థితికి కేంద్ర మంత్రులు ప్రధాన కారణమన్నారు. వారి వైఖరి ఇలానే ఉంటే రాజకీయంగా సమాధి కాకతప్పదని ఘాటుగా విమర్శించారు. ఈ నెల 28 వ తేదీన మరోసారి రాజకీయ పార్టీలతో సమావేశమవుతామని అశోక్ బాబు తెలిపారు. తాము ఎప్పటికీ విభజనను వ్యతిరేకమన్నారు. అందరూ కలిసి వస్తేనే ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. -
అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు: కారెం
సాక్షి, రాజమండ్రి: ‘అశోక్‌బాబూ నీవి ఒంటెత్తు పోకడలు. నీవల్లే సమైక్య ఉద్యమం నీరుగారుతోంది. నీవల్లే సమైక్య ఉద్యమానికి ప్రజా సంఘాలు దూరమవుతున్నాయి’ అని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, సమైక్య ఉద్యమ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలో శివాజీ విలేకరులతో మాట్లాడారు. సమైక్య ఉద్యమం పట్ల అశోక్‌బాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. అశోక్‌బాబు అవలంబిస్తున్న పోకడల కారణంగా ఉద్యోగులు ఉద్యమానికి దూరమవుతున్నారని చెప్పారు. ఆయన వల్లే ఎన్జీవోల నడుమ అంతర్గత విభేదాలు పెచ్చుమీరిపోయాయని, ఆధిపత్య పోరు కొనసాగుతోందని ఆరోపించారు. ఎన్జీవో నేతలు వ్యక్తిగత దూషణలతో సమైక్య ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు. -
'రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుంది'
ఎపీఎన్జీవోలను చీల్చారన్నది దుష్ప్రచారం మాత్రమేనని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుందని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంలోని నేతలు భావించడం లేదని అన్నారు. గతంలో ఏపీఎన్జీవోలు వల్ల ప్రభుత్వాలు తారుమారైన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఎన్జీవోల రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఆదివారం ఆయన ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో జరగాల్సిన ఎన్నికలను ఇప్పుడు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు. తమపై రెండో ప్యానెల్ పోటీ చేసిన విజయం మాత్రం తమదేనని అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బషిర్పై అశోక్ బాబు తలపడనున్నారు. -
'ఆల్ పార్టీ మీట్ ఎప్పుడో నిర్వహించాల్సింది'
-
అసెంబ్లీని ముట్టడిస్తామన్న అశోక్‌బాబు ఎక్కడ?
సాక్షి, విజయవాడ: అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే పదిలక్షల మందితో ముట్టడిస్తామని చెప్పిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ఇప్పుడెక్కడ ఉన్నారని వాణిజ్య పన్నుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈరోజు చాలా పత్రికల్లో అశోక్‌బాబుపై పోటీ చేస్తే సమైక్యవాదానికి వ్యతిరేకంగా పోటీ చేసినట్లేనని, ఒక రాజకీయ పార్టీ వద్ద డబ్బులు తీసుకుని పోటీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ ఎన్జీవో సంఘం అశోక్‌బాబు వ్యక్తిగతం కాదని, తనపై పోటీ చేయడాన్ని సహించలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికలు పెట్టకుండా తానే అధ్యక్షుడినని ప్రకటించుకొని ఉంటే బాగుండేదన్నారు. హైకోర్టులో స్టే ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అశోక్‌బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. -
అశోక్‌బాబుపై ఏపిఎన్జీల ఫైర్
-
చర్చించేందుకు వస్తే అడ్డుకుంటారా?
అశోక్‌బాబు వైఖరిపై సుబ్బరాయన్ విమర్శ ఏపీఎన్జీవో భవన్లో అశోక్‌బాబుతో చర్చించేందుకు వచ్చిన సుబ్బరాయన్ వర్గీయులను అశోక్‌బాబు అనుచరులు అడ్డుకున్నారు. దాంతో ఏపీఎన్జీవో కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిగ్గీ రాజాను అడ్డుకోవడంతో పాటు అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు వెళితే తమను అడ్డుకున్నారని ఏపీఎన్జీవోల మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్, సంఘం మాజీ కోశాధికారి జి.సతీష్‌కుమార్ ఆరోపించారు. అసెంబ్లీకి టీ బిల్లు వస్తే సమ్మె చేస్తామని గతంలో అశోక్‌బాబు ప్రకటించారని, మరి సమ్మె ఏమైందని వారు ప్రశ్నించారు. గతంలో 66 రోజుల సమ్మెలో తాము కూడా పాల్గొన్నామని, ఇప్పుడు మాత్రం తమను రావద్దంటూ అశోక్‌బాబు అనుచరులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం అందరూ ఒక వేదిక మీదకు వస్తున్నప్పుడు.. తాము వస్తే అశోక్‌బాబుకు వచ్చే ఇబ్బందేమిటని నిలదీశారు. -
రాజకీయ జేఏసీ ఏర్పాటుకు యత్నం
పజాప్రతినిధుల ఇళ్లకు నీళ్లు, కరెంట్ కట్ సభ ముందుకు బిల్లు వస్తే అసెంబ్లీ ముట్టడి: అశోక్‌బాబు తాము రాజకీయాలకు అతీతంగా ఉన్నందున రాజకీయ జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. గురువారం విజయవాడలో న్యాయవాదుల సమైక్య శంఖారావం సభ కోర్టు సముదాయాల సమీపంలో జరిగింది. దీనికి 13 జిల్లాల న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌బాబు సభలోనూ, అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. జాతీయ రహదారులను దిగ్బంధించాలని.. రైల్‌రోకోలు నిర్వహించాలని.. బ్యాంకులను మూసివేయాలని.. విద్యుత్ ఉత్పత్తిని స్తంభింపజేయాలని అప్పుడే కేంద్రం దిగివస్తుందని చెప్పారు. సమైక్యానికి కట్టుబడని ప్రజాప్రతినిధులు, నాయకులను సామాజికంగా బహిష్కరించాలని.. వారి ఇళ్లకు విద్యుత్, నీళ్లు కట్ చేయాలన్నారు. వారి కేసులను న్యాయవాదులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి 40 రోజుల గడువిస్తే.. దిగ్విజయ్‌సింగ్ ఇప్పుడెందుకు రాష్ట్రానికి వచ్చారని అశోక్‌బాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు నెగ్గదన్న భయంతోనే దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చారన్నారు. ప్రత్యేక సమావేశంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే చలో హైదరాబాద్ నిర్వహించి అసెంబ్లీని ముట్టడిస్తామని.. ఉద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. -
25న ఏపీఎన్జీవో ఎన్నికలు, అశోక్ బాబుపై అసంతృప్తి
హైదరాబాద్ : ఈనెల 25న ఏపీఎన్జీవో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్‌లోని ఎన్జీవో హోంలో నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా ఏపీఎన్జీవో తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబుపై ఎనిమిది జిల్లాల నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అశోక్ బాబుకు వ్యతిరేకంగా వారు గురువారం సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆయా జిల్లాల నేతలు మండిపడ్డారు. -
'డిశంబర్ 9 తెలుగు జాతి విద్రోహ దినం'
-
సమైక్య ద్రోహులకు రాజకీయ సమాధే!
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర కోసం కృషి చేయని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియలో మొదటి అంకం పూర్తయ్యిందన్నారు. కేంద్ర మంత్రులు సీమాంధ్ర ప్రజలు సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియను అడ్డుకోలేదు సరికదా.. ప్రభుత్వంపై కనీసం ఒత్తిడి తెచ్చే యత్నం కూడా చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, చివరి అవకాశాన్ని వినియోగించుకుని రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం పడిపోయేలా చేయాలని సూచించారు. సోమవారం అన్ని వర్గాల ప్రజలు విద్రోహ దినం పాటించాలని పిలుపునిచ్చా రు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా గుడ్డిగా వెళుతున్న కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గుణ పాఠం చెప్పాయన్నారు. ఏపీ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్రమంత్రుల చేతకానితనం వల్లే టీనోట్ ఆమోదం పొందిందన్నారు. కేంద్రమంత్రులు పదవులకు రాజీనామా చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగులతో కలసి వస్తే విభజనను అడ్డుకోవచ్చని ప్రజాప్రతినిధులకు సూచించారు. విభజన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పొందూరుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బి. నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఈ సమావేశంలో ఎన్జీవో సంఘ ప్రతినిధులు హనుమంతు సాయిరాం, ఎస్వీ రమణ, ఈశ్వరరావు, శివారెడ్డి, మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.కాళీప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, కొంక్యాణ వేణుగోపాల్, పి.రామ్మోహనరావు, ఆర్.వేణుగోపాల్, పి.జయరాం, శిష్టు రమేష్, కిలారి నారాయణరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పూజారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
సుబ్బరాయన్ సభ్యుడేకాదు: అశోక్‌బాబు
హైదరాబాద్: సుబ్బరాయన్ ఏపిఎన్జిఓ సభ్యుడు కాదని ఏపిఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. అశోక్‌బాబు ఏకపక్ష ధోరణితో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, సమైక్యవాద ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనత అతనిదేనని సుబ్బరాయన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఆ విమర్శలపై అశోక్ బాబు స్పందించారు. స్థాయిలేని వ్యక్తుల ఆరోపణలకు తాను సమాధానం చెప్పనన్నారు. ఈనెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. విభజనకు వ్యతిరేకంగానే అసెంబ్లీలో పార్టీలన్నీ అభిప్రాయం చెప్పాలని అశోక్‌బాబు కోరారు. -
ఉద్యమాన్ని నీరుగార్చిన అశోక్‌బాబు
-
చిరంజీవి రాజీనామా చేస్తే..నేను కూడా చేస్తా: అశోక్ బాబు సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మంత్రి చిరంజీవిపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మండిపడ్డారు. తన రాజీనామాపై డిమాండ్ చేస్తున్న చిరంజీవి రాజీనామా చేసిన మరుక్షణమే తాను కూడా రాజీనామా చేస్తానని అశోక్ బాబు సవాల్ విసిరారు. సీమాంధ్రకు చెందిన నేతలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని ఏపీఎన్జీవో సంఘం అభిప్రాయపడితే.. చిరంజీవి మాత్రం తనను రాజీనామా చేయమంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారన్నారు. అయినా తనను రాజీనామా చేయమని అడిగే హక్కు చిరంజీవికి లేదన్న విషయం గుర్తించుకోవాలని అశోక్ బాబు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లోపు సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే ఉద్యోగులు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీపీఎం కార్యదర్శి రాఘవులతో ఆదివారం భేటీ అయిన అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని రాఘవులను కోరినట్లు తెలిపారు.కాగా, రాఘవులు మాత్రం పరిస్థితులను సమీక్షించి, డిసెంబరు 5 వ తేదీన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
అశోక్ బాబు తీరు టీ.జేఏసీని తలపిస్తోంది:ఎంపీ వెంకట్రామిరెడ్డి
అనంత: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అశోక్ బాబు వ్యవరిస్తున్న తీరు టీ.జేఏసీని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన అశోక్ బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఎంపీలపై అశోక్ పదజాలం బాగోలేదని, ఆయన ఇప్పటికైనా వైఖరిని మార్చుకుని ముందుకెళ్లాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సరిపోదని అనంత అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని సమస్యలన్నీ పరిష్కరించాకే ముందుకెళ్లాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గాడిదలు.. మూర్ఖులు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిస సంగతి తెలిసిందే. సమైక్య ఉద్యమంలో ఐదేళ్ల పిల్లవాడి నుంచి వయో వృద్ధుల వరకు పెద్దఎత్తున పాల్గొంటే... సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
కేంద్ర మంత్రుల ఓటమే మా లక్ష్యం: ఏపీఎన్జీవో నేతలు
సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర మంత్రులను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఎన్జీవో నేతలు హెచ్చరించారు. కేంద్ర మంత్రులను రాజకీయంగా సమాధి చేస్తామని, వారికంటే తమ స్థాయే పెద్దదని తెలిపారు. అసెంబ్లీకి బిల్లు వచ్చే సమయంలో చలో హైదరాబాద్‌ను నిర్వహిస్తామని, అలాగే పార్లమెంట్లో బిల్లు వచ్చే సమయంలో చలో పార్లమెంట్ నిర్వహిస్తామని చెప్పారు. సమ్మెతో పాటు అన్ని అంశాలపై ఈ నెల 24న కీలక సమావేశం నిర్వహిస్తామని, అందులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తోడ్పడతాయని భావిస్తున్నట్లు ఏపీఎన్జీవో నేతలు చెప్పారు. -
ఏపీఎన్జీవోల సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ఏపీఎన్జీవో, ఇతర ఉద్యోగులు చేపట్టిన సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ, మరోవైపు సమ్మెను సమర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో హైకో ర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు ఇవ్వనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు దిగారని, రాజకీయ అంశమైన రాష్ట్ర విభజన గురించి సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. -
'2014 వరకు విభజన జరిగే ప్రసక్తే లేదు'
హైదరాబాద్: 2014 వ సంవత్సరం వరకు రాష్ట్ర విభజన జరిగే ప్రసక్తే లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజల నిర్ణయంపైనే విభజన ప్రక్రియ ఆధారపడి ఉంటుందని తెలిపారు. సమైక్యవాణిని వినిపించే రాజకీయ నేతనే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు కేంద్ర మంత్రులపై మండిపడ్డారు. సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయిన విభజన బిల్లుకు సహకరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండి చేస్తామని హెచ్చరించారు. మంత్రులు కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ గెలవాలనుకుంటే అది వారి పిచ్చితనమే అవుతుందన్నారు. సమైక్యాంధ్ర కోరుకునే వారిని గెలిపించి సీమాంధ్రుల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలన్నారు. ఈ నెల 24వ తేదీన తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పదకొండ వివాదాస్పద అంశాలకు పరిష్కారం చూపించాలంటే 100 ఉల్లంఘనలు జరగాలని, అందువల్ల రాష్ట్ర విభజన సాధ్యం కాదన్నారు. -
రాజ్‌నాథ్ సింగ్‌తో ఏపీఎన్జీవోల భేటీ
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో ఏపీఎన్జీవోలు సోమవారం రాత్రి సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బీజేపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు రాజ్‌నాథ్‌కు వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ఏ విధంగా నష్ట పోతుందనే అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీమాంధ్రలో సమైక్య సెగలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. వంద రోజుల దాటి సమైక్య ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో సీమాంధ్ర మంత్రులు వైఖరిపై అశోక్ బాబు మండిపడ్డారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. 'మా దురదృష్టం.. మా కేంద్ర మంత్రులు, మా మంత్రులు చేతకాని వాళ్లు' అని విమర్శించారు. యూటీ, ప్యాకేజీలంటూ వారు మాట్లాడటం వారి అమాయకత్వమన్నారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కన్వీన్స్ అయ్యారేమో కానీ తాము మాత్రం కాదని అశోక్ బాబు తెలిపారు. ప్రధానితో జరిగిన భేటిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) ప్రాంతంగా చేయాలని ప్రధానికి విజ్ఞప్తికి చేసిన నేపథ్యంలో అశోక్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు, యూటీ ప్రాంతాలంటూ కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం తగదని సూచించారు. -
22న అమలాపురంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ
అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అమలాపురంలో ఈనెల 22న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించాలని కోనసీమ జేఏసీ నిర్ణయించింది. ఆదివారం రాత్రి జిల్లా జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాధరావు ఆధ్వర్యంలో అమలాపురం కాటన్ అతిథిగృహంలో కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వి.ఎస్.దివాకర్ అధ్యక్షతన కోనసీమ జేఏసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. అమలాపురం బాలయోగి ఘాట్‌లో ఈనెల 22న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. లక్షమందికి పైగా జనాన్ని సమీకరించేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎన్జీఓల సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబును ఈ సభకు ఆహ్వానించారు. -
ప్రజలను మభ్య పెట్టేందుకే జీవోఎం : అశోక్ బాబు
హైదరాబాద్ : ప్రజలను మభ్యపెట్టేందుకు జీవోఎంను తెరమీదకు తెచ్చారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలుస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరిస్తామన్నారు. పదవుల్లో కొనసాగాలా లేదా అనేది సీమాంధ్ర ఎంపీలే నిర్ణయించుకోవాలని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే యూపీఏ సర్కారుపై ఒత్తడి పెరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామన్నారు. హెల్త్ కార్డుల ట్రస్ట్‌లో ఉద్యోగులకు ఎక్కువ భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అశోక్ బాబు తెలిపారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి:అశోక్ బాబు
హైదరాబాద్: జీవో 177 రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశారు. సీమాంధ్ర ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసిన అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. పీఆర్సీకి నివేదిక తయారు చేసే అంశంపై సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సమావేశమైనట్లు తెలిపారు. జూలై 1 వ తేదీ నుంచి మధ్యంతరం భృతి కల్పించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. సమ్మెకాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలన్నారు. -
తెలుగుతల్లి విగ్రహం ఎదుట ఎన్జీవోల నిరసన
శ్రీనగర్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని ఏపీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు టి.వి.రామిరెడ్డి చెప్పారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని తెలుగుతల్లి విగ్రహం ఎదుట సమైక్య నినాదాలుచేసి నిరసనలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏపీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి పి.ప్రభాకర్, జిల్లా జాయింట్ సెక్రటరీలు షేక్ బాజిత్, దరియావలి, నగర అధ్యక్షుడు దయానందరాజు, కార్యదర్శి సుకుమార్, వివిధ శాఖల ఉద్యోగ నాయకులు ప్రసాద్లింగం, మూర్తి, మస్తాన్, వెంకటరెడ్డి, అనిల్, ఫణీంద్ర, విజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెకు బ్రేక్
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు తెరపడింది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు శుక్రవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. జిల్లాలో సమ్మెను విరమిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. సమ్మె విరమించినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిత్యం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమంలో 25 వేల మంది ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 67 రోజుల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఎన్జీఓలతో పాటు జిల్లా గెజిటెడ్ అధికారులు, ఆర్టీసీ కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, నాలుగో తరగతి ఉద్యోగులు, న్యాయవాదులు ఇలా దాదాపు 70 విభాగాల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉద్యోగులు రెండు నెలల పాటు విధులు బహిష్కరించారు. ఫలితంగా జిల్లాలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయింది. రెండు నెలల పాటు కలెక్టరేట్, జిల్లాలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ బోసిపోయాయి. సమ్మెకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో ఉద్యోగులు మరింత ఉత్సాహంగా ఉద్యమాన్ని కొనసాగించారు. రెండు నెలల నుంచి ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోయాయి. పలు అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. తొలుత ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 10, 11వ తేదీల్లో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు సమ్మె విరమించారు. అదే కోవలో ఎన్జీఓలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఉధృతంగా సాగిన ఉద్యమం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే మొదలైన ఉద్యమం జిల్లాలో గురువారం 79వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టారు. ఉద్యోగులు జీతాలను సైతం వదులుకొని సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేశారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలను ముందుండి నడిపించారు. రోడ్డు పక్కన చిరువ్యాపారం చేసుకునే వారి నుంచి ఆటో కార్మికులు, చెక్కపని, రిక్షా కార్మికులు, టైలర్లు, వివిధ సామాజికవర్గ ప్రజలు ఇలా ప్రతి ఒక్కరూ ఉద్యమానికి అండగా నిలిచారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే మరోసారి మెరుపు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. తలుపులు తెరుచుకోనున్న కార్యాలయాలు ... ఉద్యోగుల సమ్మెతో మూతబడిన ప్రభుత్వ కార్యాలయాల తలుపులు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయి. జిల్లా పరిపాలన భవనం కలెక్టరేట్ తోపాటు, కార్పొరేషన్ కార్యాలయం, విద్యాశాఖ, జెడ్పీ, వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ పీఆర్, ఇరిగేషన్, ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాలు యాథావిధిగా పనిచేయనున్నాయి. రెండు నెలల పాటు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు మోక్షం కలగనుంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకునే... సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన ప్రజలకు ఎన్జీఓ అసోసియేషన్ నగర కమిటీ నాయకుడు నాసర్‌మస్తాన్‌వలి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకే సమ్మె విరమిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొనే సమ్మె చేసినట్లు వివరించారు. సమ్మెకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె విరమించినా సమైక్యాంధ్ర ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చే సూచనలకనుగుణంగా పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని నాసర్‌మస్తాన్‌వలి పేర్కొన్నారు. -
ఏపీఎన్జీఓల సమ్మె తాత్కాలిక విరమణ
-
ఏపీఎన్జీఓల సమ్మె తాత్కాలిక విరమణ
-
సమైక్యం కోసం ఏంచేస్తారో చెప్పాలని డిమాండ్
-
అప్పుడే రాజీనామా చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: అశోక్ బాబు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సమర్పించిన రాజీనామాలు డ్రామాలో భాగం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఏపీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంపీలు రాజీనామాలను ఆమోదించుకోవాలి అని సూచించారు. ప్రజలకు న్యాయం చేయాలంటే ఉద్యమం కొనసాగించాలని ఏపీఎన్జీవో ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం అని అన్నారు. తాము కోరిన వెంటనే రాజీనామాలు చేసి ఉంటే ఈ పరిస్తితి వచ్చేది కాదని అశోక్ బాబు అన్నారు. గురువారం జరిగే ఐకాస భేటి తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ప్రజలను కేంద్రమంత్రులు మానసికంగా ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో అభిప్రాయ సేకరణకు బిల్లు ప్రవేశపెడితే వ్యతిరేకించాలని ఎమ్మెల్యేలను కోరుతామన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న ప్రకటనలు అయోమయం సృష్టిస్తున్నాయన్నారు. రేపు సీఎం కిరణ్ తో చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలను హామీ ఇవ్వాలని కోరుతామన్నారు. -
సీఎం హామీ ఇస్తే సమ్మె విరమిస్తాం: అశోక్‌బాబు
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇస్తే సమ్మెను విరమిస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. లేదంటే పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమైక్యంపై సీఎం హామీ ఇస్తే.. ఆ హామీని ఎలా నిలబెట్టుకుంటారనే విషయంపై కూడా వివరణ అడుగుతామన్నారు. మంగళవారం ఏపీఎన్జీవో భవన్లో అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు సాధారణ పరిపాలన విభాగం అధికారుల నుంచి పిలుపు వచ్చిందని అశోక్‌బాబు తెలిపారు. 17న మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు వస్తామని తాము తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం పరిశీలించబోయే అంశాల్లో ఉద్యోగుల సమస్యలు కూడా ఉన్నందున.. దానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమను కోరారని చెప్పారు. రెండు మూడ్రోజుల్లో నివేదిక ను సీఎస్‌కు అందజేస్తామన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కలుస్తాం రాష్ట్ర విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని సీమాంధ్ర జిల్లాల్లోని దాదాపు అందరు (ఐదుగురు మినహా) ఎమ్మెల్యేలూ డిక్లరేషన్ ఇచ్చారని అశోక్‌బాబు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలను కలిసి డిక్లరేషన్ కోరతామన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలనూ కలిసి రాష్ట్రాన్ని ఎందుకు సమైక్యంగా ఉంచాలో వివరిస్తామన్నారు. త్వరలో డీఎంకే, ఏఐడీఎంకే నేతలను కలిసి విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరతామన్నారు. జాతీయ నాయకుల మద్దతు కోరేందుకు నెలాఖర్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. తుపాను సమయంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉండే(జీతాలు తీసుకోకుండా) సేవలందించారని అశోక్‌బాబు తెలిపారు. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా సమ్మెలోనేఉన్నారన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఆర్టీసీ, ఉపాధ్యాయ, విద్యుత్ జేఏసీ సమ్మె విరమించాయని ప్రభుత్వం అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
ముఖ్యమంత్రిని ఉంచుతారో.. తొలగిస్తారో తెలియట్లేదు: అశోక్‌బాబు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తున్న హామీలు నమ్మాలంటే అసలు ఆయనను ముఖ్యమంత్రిగా ఉంచుతారో, తొలగిస్తారో తెలియట్లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు మంగళవారం హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో గురువారం చర్చించిన తర్వాత సమ్మె కొనసాగించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రితో చర్చలపై రేపు, ఎల్లుండి ఏపీఎన్జీవోలు, జేఏసీ నేతల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పై-లీన్ తుఫాను సందర్భంగా సహాయ, పునరావాస కార్యక్రమాలకు హాజరైన ఉద్యోగులంతా మళ్లీ సమ్మెలోకి చేరారని అశోక్ బాబు తెలిపారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకునే ఉపాధ్యాయులు, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందిగా తెలంగాణ ఎమ్మెల్యేలను కలసి కోరతామని పి.అశోక్‌బాబు వెల్లడించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా తాము చివర వరకు పోరాడతామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా.. ప్రభుత్వ వ్యవస్థలపై సమ్మె ప్రభావం అలానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లన్నింటినీ రెండు మూడు రోజుల్లో సీఎస్‌కు నివేదిస్తామన్నారు. న్యూఢిల్లీ వెళ్లి మరోసారి జాతీయ నాయకులను కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరనున్నట్లు అశోక్‌బాబు వెల్లడించారు. -
చంద్రబాబు వైఖరేంటో తేలిపోతుంది: అశోక్ బాబు
భీమవరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడి వైఖరి ఏమిటనే విష యం అసెంబ్లీలో తెలంగాణ అంశంపై తీర్మానం సందర్భంలో తేలిపోతుందని ఏపీఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్‌బాబు పేర్కొన్నారు. గురువారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విభజన అం శంపై అసెంబ్లీలో తీర్మానం చేసేప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు రాష్ర్ట విభజనకు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటారా.. లేక సమైక్యాంధ్రకు అండగా నిలుస్తారా అనే విషయం ఆయన ఓటు ద్వారా తెలుస్తుందన్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానం ఓడిపోతే పార్లమెంటులో కూడా బిల్లు ముందుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ పార్లమెంటులో ఆమోదం పొందితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. పార్లమెంటులో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని అన్ని జాతీయ పార్టీల నేతలను కలసి విన్నవిస్తామన్నారు. తొలుత చెన్నై వెళ్లి డీఎంకే నేతలను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అశోక్‌బాబు చెప్పారు. ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ బహిరంగ లేఖలు ఇవ్వనున్నట్టు అశోక్‌బాబు తెలిపారు. దసరా పండగ అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి ఎమ్మెల్యే విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేసే విధంగా ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయనన్నారు. రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటుతోనే బుద్ధిచెప్పండి అనంతరం భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో హోరువానలో జరిగిన గోదావరి ప్రజాగర్జన సభలో అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ర్ట విభజనకు కారకులైన రాజకీయ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జీతాలు రాకపోరుునా ఉద్యోగులు, చదువులు దెబ్బతింటున్నా విద్యార్థులు, కష్టనష్టాలు ఎదుర్కొంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారని, అయితే విభజనను అడ్డుకునే విషయంలో ఎంపీలు చేసిన ద్రోహాన్ని మాత్రం ఎవరూ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే ఎంపీలు పదవులకు రాజీనామా చేసివుంటే తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేది కాదన్నారు. కనీసం ఎమ్మెల్యేలైనా అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. 2014 ఎన్నికల వరకు రాష్ర్ట విభజన జరగదని అశోక్‌బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే రాష్ర్ట విభజనాంశం సీమాంధ్రుల చేరుుదాటిపోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మూడుకోట్ల మంది ఓటర్లు బుల్లెట్లుగా మారాలని పిలుపునిచ్చారు. సభకు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
అంగన్వాడీల సమైక్య బాట
ఇప్పటివరకు ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తుంటే.. ఆ స్ఫూర్తితో అంగన్వాడీ సిబ్బంది కూడా ఉద్యమబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రెండు నెలలుగా దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ‘నో వర్క్’ బోర్డు పెట్టిన విష యం తెలిసిందే. అదే బాటలో ఈ నెల 17వ తేదీ నుంచి సీమాంధ్రలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని నాయకులు నిర్ణయించారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు సూపర్వైజర్లు, సీడీపీఓలు, ప్రాజెక్టు డెరైక్టర్లు, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్లంతా సమైక్య జెండాలు చేతబట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. జిల్లాలో 4094 కేంద్రాలు జిల్లాలో 21 సీడీపీఓ ప్రాజెక్టుల పరిధిలో 4094 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందుతుంది. కొన్ని నెలల నుంచి కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం కూడా ప్రవేశపెట్టారు. పౌష్టికాహారంలో భాగంగా వారంలో రెండు రోజులు కోడిగుడ్లు అందిస్తున్నారు. ఇక ఆటపాటల విద్య చిన్నారుల సొంతం. ఇంతటి ప్రయోజనకరమైన అంగన్వాడీ కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్షలమంది లబ్ధి పొందుతున్నారు. సమ్మె ప్రారంభమైతే వీరందరిపై ప్రభావం పడక తప్పదు. జేఏసీ ఆవిర్భావం.. ఇటీవల విజయవాడలో సీమాంధ్రలోని పదమూడు జిల్లాలకు చెందిన అధికారులు, కార్యకర్తలు సమావేశమై సమైక్యాంధ్రకు దన్నుగా ఉండాలని తీర్మానించారు. ఇప్పటికే రెండు యూనియన్లు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూనియన్లతో సంబంధం లేకుండా శాఖ కింది స్థాయి కార్యకర్తల నుంచి పైస్థాయి ఉన్నతాధికారుల వరకు జేఏసీలో భాగస్వాములు కానున్నారు. ఇకపై అంతా.. ఇప్పటివరకు పర్చూరు, తాళ్లూరు, మార్కాపురం అర్బన్ సీడీపీఓలతోపాటు కొండపి ఏసీడీపీఓ పూర్తిస్థాయిలో సమ్మె చేస్తున్నారు. మిగిలినవారు ఓవైపు విధులు నిర్వర్తిస్తూ.. మరో వైపు ఉద్యమ నినాదాలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో అంతా సమ్మె పోరుకు సిద్ధమయ్యారు. అయితే సుదీర్ఘకాలంగా ఉద్యమం జరుగుతున్నా స్పందించని శిశుసంక్షేమ అభివృద్ధి శాఖ.. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సమ్మెకు దిగుతామంటూ ప్రకటించడంపై పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: అశోక్ బాబు
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించింది. ఆదివారం ఏపీఎన్జీవోలు సమావేశమై ఉద్యమం కార్యాచరణ గురించి చర్చించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కితీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. కేంద్రమంత్రులపై నమ్మకం పోయిందని సమావేశానంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని కేంద్రమంత్రులు వమ్ముచేశారని విమర్శించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యేల నుంచి హామీ పత్రాలను తీసుకుంటామని తెలిపారు. 8,9 తేదీల్లో కేంద్ర కార్యాలయాలను దిగ్బంధిస్తామని చెప్పారు. ఉద్యోగులపై దాడి చేసిన ఎంపీ హర్షకుమార్ కుమారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో రాజకీయ అరాచకం జరుగుతోందని విమర్శించారు. విభజనకు నిరసనగా దసరాను జరపడం లేదని అశోక్‌బాబు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో పిలుపు వస్తేనే చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు. -
రెండోరోజూ బంద్ సంపూర్ణం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ 72 గంటల, ఏపీ ఎన్జీవోల 48 గంటల బంద్ పిలుపులో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి కార్యకర్తలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై పాత టైర్లను వేసి తగులబెట్టారు. సీమాంధ్రలో ప్రైవేటు ఆస్పత్రుల బంద్ నిర్వహించారు. వైద్యులు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర ఠ నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు, రైతులు, మహిళలు రహదారులపైకొచ్చి ఆందోళన నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో జాతీయ రహదారి దిగ్బంధం.. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్యయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలు కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకుని కొద్దిదూరం తీసుకువెళ్లి వదలివేశారు. ఎన్టీటీపీఎస్ గేటు వద్ద ఉద్యోగులు, కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. పెదప్రోలు, మాజేరులో చల్లపల్లిలో వంటావార్పు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రహదారులపై టైర్లు కాల్చి, వాహనాలను అడ్డుపెట్టి సంపూర్ణ బంద్ పాటించారు. నూజివీడులో నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జంక్షన్ రోడ్డులో తారురోడ్డుపై ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఉయ్యూరు మండలం చిన ఓగిరాల గ్రామస్తులు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై చెట్లను అడ్డుగా వేసి తగలబెడుతూ వంటావార్పుతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉయ్యూరులో సోనియా, షిండే, దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు జోరువానలోనూ అంతిమ యాత్ర చేసి, దహన సంస్కారాలు పూర్తి చేశారు. కంచికచర్ల ప్రాంత ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో టీ నోట్‌కు నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కైకలూరులో టీడీపీ నేతలు రైలురోకో కార్యక్రమాన్ని చేపట్టారు. కృత్తివెన్నులో వందలాది మంది సమైక్యవాదులు 216 జాతీయ రహదారిపై కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు వారధిపై ఉదయం నుంచే పెద్దసంఖ్యలో చేరి రాస్తారోకో చేశారు. వారధిపైనే సమైక్యవాదులు షిండే, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాద్, డాక్టర్ వాకా వాసుదేవరావుల నేతృత్వంలో బందరుకు వెళ్లే బైపాస్ రోడ్డుపై జేఏసీ నాయకులు, వీవీఆర్, ఉప్పాల వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ మహిళా నేత సామినేని విమలాభాను ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలతో నిరసన తెలిపారు. చిల్లకల్లు-వైరా రహదారి దిగ్బంధం.. జిల్లా సరిహద్దు, ఖమ్మం జిల్లా ప్రవేశం వద్ద చిల్లకల్లు-వైరా రహదారిని దిగ్బంధం చేశారు. సుమారు గంటపాటు చేసిన ఆందోళనలో రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కైకలూరు మండలంలోని ఆటపాక, జాన్‌పేట, గోనెపాడు గ్రామాల రహదారులపై ప్రజలు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. స్థానిక టౌన్‌హాల్ వద్ద జాతీయ రహదారిపై అడ్డంగా రాళ్లతో గోడను కట్టి వంటావార్పు చేపట్టారు. మచిలీపట్నంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది శనివారం ఓపీని బహిష్కరించి ఆస్పత్రి ఆవరణలో సోనియా, ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు, కేసీఆర్ చిత్రాలను తగులబెట్టారు. నందిగామ జాతీయ రహదారిపై అంబారుపేట బైపాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. గుడివాడలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. జనార్థనపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కొండపల్లి కుమార్‌రెడ్డి 48 గంటల రిలేదీక్షను ప్రారంభించారు. -
దాడులు చేస్తే సహించం : ఆశోక్ బాబు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని రాజకీయ నాయకులను ఏపీఎన్జీవోలు హెచ్చరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ఆర్టీసీ ఈయూ నేత దామోదరరావు, మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ తదితరులతో కలిసి ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు శనివారం సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజల మానసిక స్థితిని రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. రాజకీయ నేతల మీద ప్రజలకు ఉన్న భావన ఏమిటో తెలుసుకోండి. మీ చేతగానితనం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది. మీ మీద దాడులు చేస్తున్నారని ఎదురు దాడులు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ప్రజలకు రాజకీయ నాయకులే ఊరట కల్పించాలి. రెచ్చగొట్టే విధంగా ఎదురు దాడులు చేస్తే.. సివిల్ వార్ వస్తుంది’ అని హెచ్చరించారు. అధికార దాహంతో రాజకీయ నాయకులెవరైనా సమైక్యతకు తూట్లు పొడిస్తే.. వారి రాజకీయ జీవితానికి ప్రజలు సమాధి కడతారని హెచ్చరించారు. ‘ప్రజలు నాలుగు రోజులు ఆవేశంగా ఉంటారు. తర్వాత మర్చిపోతారనుకుంటే పొరపాటే. రాష్ట్ర సమైక్యతకు వ్యతిరేకంగా పనిచేసే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. అలాంటి వారి రాజకీయ జీవితాలకు శుభం కార్డు వేస్తారు’ అన్నారు. బంద్‌ను ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నామని, రాజకీయ నాయకులు ఉన్న కార్యక్రమాల నుంచి ఉద్యోగులు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాలు సొంతంగా ఉద్యమించాలన్నారు. తీర్మానానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పండి.. శాసనసభలో విభజన తీర్మానానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని అశోక్‌బాబు ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ ఈ మేరకు లేఖ రాయనున్నామని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు రాష్ట్రానికి చేసే ఆఖరు సేవ ఏదైనా ఉందంటే అది తీర్మానాన్ని ఓడించడమే. ప్రజల రుణం తీర్చుకొనే అవకాశం ఇదే. తీర్మానం ఉన్న రోజున శాసనసభకు రాకపోయినా, పార్టీకి విధేయులమని చెప్పి తప్పించుకున్నా.. ప్రజలు క్షమించరు’ అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సీమాంధ్రలో ఆందోళనలు సహజమే అంటూ కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతా రహితంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో జరిగిన ఆందోళనలు కూడా సహజమే అనుకుంటే పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదు కదా? అని ప్రశ్నించారు. విజయనగరం ముట్టడికి పిలుపునిచ్చామంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. దాడులు చేసిన నేతలు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఏపీ ఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు. నేడు కార్యాచరణ ఖరారు ఢిల్లీలో వారం రోజుల పాటు ధర్నాలు చేయాలని, జాతీయ నేతలందరినీ కలిసి తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించామని నేతలు తెలిపారు. ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలి, ఎవరెవరు వెళ్లాలనే విషయాన్ని ఆదివారం జరిగే జేఏసీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఈ నెలాఖరులో ఢిల్లీ యాత్ర ఉండే అవకాశం ఉందన్నారు. 10న భీమవరంలో సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, గంటూరులలోనూ సభల తేదీలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. దళిత ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేసి ఉద్యమించాలని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. -
స్తంభించిన పాలన
ఏలూరు , న్యూస్‌లైన్ :టీ నోట్ ప్రకంపనలపై జిల్లా వ్యాప్తంగా రెండో రోజున చేపట్టిన ఎన్జీవోల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ కార్యాలయాలన్నింటినీ ఎన్జీవోలు మూ యించి వేయడంతో పాలన స్తంభించింది. సిని మా థియేటర్లు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలను సమైక్యవాదులు మూయించి వేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులను, గ్రామాల్లోని రహదారులను దిగ్బంధించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈసందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్జీవోలు నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. దీంతో ఉద్యోగులు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఉద్యోగులను ఎమ్మెల్యే దుర్భాషలాడారు. ఏలూరు ఆశ్రం వద్ద జాతీయర హదారిని, కలపర్రు టోల్గేట్ వద్ద రహదారిని ఎన్జీవోలు దిగ్బంధించారు. ఆచంట సెంటరులో మర్చంట్స్ చాంబర్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కొవ్వూరులో ఎన్జీవోలు రోడ్డు కం రైలు వంతెన దిగ్బం ధించారు. ఎన్జీవోలపై అక్రమంగా చేయి చేసుకున్న కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ కుమారులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. నిడదవోలు-పంగిడి రహదారిపై బ్రాహ్మణగూడెం, ఎస్.ముప్పవరం గ్రామా ల్లో సమైక్యవాదులు రోడ్లను చుట్టుముట్టారు. రోడ్డుపై టెంట్లు వేసి నిరసన తెలిపారు. చింతలపూడిలో ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం కొత్తబస్టాండ్ సెంటర్లో ఆందోళన చేశారు. కోయగూడెం యువకులు యువగర్జన నిర్వహించారు. తాడేపల్లిగూడెం లో ఎన్జీవోలు ఎరువుల, ఉల్లిపాయల ఎగుమతి, దిగుమతులను అడ్డుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఉండిలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఆధ్వర్యం లో వంటావార్పు నిర్వహించారు. నిడదవోలులో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు మోటార్ సైకిళ్ల ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు టీ నోట్ పత్రాలను దహనం చేశారు. ఇరగవరం మం డలం రేలంగిలో గ్రామ పంచాయతీ ఉప సర్పం చ్ వడ్డి మార్కండేయులు, న్యాయవాది గాజుల అప్పాజీ ఆమరణ నిరాహారదీక్షలను ప్రారంభిం చారు. తాడేపల్లిగూడెంలో ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్డుపై టెంట్లు వేసి వంటావార్పు చేశారు. రాజస్తాన్ యువత బంద్‌కు సంఘీభా వం తెలిపింది. భీమవరంలో ఉపాయులు, ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. నర్సాపురంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు. తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకోవాలి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, హోం మంత్రి షిండే తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకోవాలం టూ ఎన్జీవోలు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఎన్జీవోల ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎం పీలు, మంత్రులు, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు పిండప్రదానం చేశారు. భీమవరంలో ప్రకాశం సెంటర్లో సెయింట్ జోన్స్ స్కూల్ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్, షిండే మాస్క్‌లతో రాక్షస వేషధారణలతో నిరసన తెలిపారు. దెందులూరు, గోపన్నపాలెం, శ్రీరామవరం గ్రామాల్లో సమైక్యవాదులు షిండే, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి, శ వయాత్ర నిర్వహించారు. -
ఎన్జీవోలపై హర్ష తనయుల దాడి
అమలాపురం ఎంపీ హర్షకుమార్ కుమారులు రాజమండ్రిలో సమైక్య ఉద్యమకారులపై దాడి చేయడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ దాడిని నిరసిస్తూ అమలాపురంలో ఎంపీ క్యాంప్ కార్యాలయాన్ని ఉద్యమకారులు ముట్టడించారు. ఆ సందర్భంగా జరిగిన పోలీసు లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. దాంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా హర్షకుమార్ కుమారుల చర్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మల దహనాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సాక్షి, రాజమండ్రి/కంబాలచెరువు, న్యూస్‌లైన్ : ఎంపీ హర్షకుమార్ తనయులు సమైక్యవాదులపై దాడి చేసి రెచ్చి పోయారు. ‘మీకు సమైక్యాంధ్ర కావాలా’ అంటూ వీరంగం ఆడారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ తోపులాట జరిగింది... ఆ పరిస్థితుల్లో కొట్టారని టీవీల్లో చెప్పడం ఉద్యమకారులను రెచ్చకొట్టింది. దాడి జరిగిందిలా.. తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం పేపర్మిల్ను మూయించివేసేందుకు అక్కడకు వెళ్లిన ఎన్జీవో నాయకులు కాతేరు వైపునుంచి వచ్చే వాహనాలను ఆపేందుకు రాజీవ్‌గాంధీ కళాశాల వద్ద రోడ్డుకు అడ్డంగా ఆటోలు పెట్టి, తాడుతో దారి మూసివేస్తున్నారు. ఓ సమైక్యవాది ఉదయం 8.50 గంటల ప్రాంతంలో కళాశాల బోర్డును చింపారు. ఆ సమాచారం తెలుసుకున్న ఎంపీ హర్షకుమార్ తనయులు శ్రీరాజ్, సుందర్ అక్కడకు వచ్చి సమైక్యవాదుల చేతిలో జెండాలు లాక్కుని ఆ కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రమోద్‌కుమార్, వీఆర్వోలు లక్ష్మణ్, శివరాజు, పేపర్‌మిల్లు ఉద్యోగి దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పోలీసుల సాక్షిగా దాడి ‘ఏరా.. మీకు సమైక్యాంధ్ర కావాలా..మీరు ఎన్జీవోలా’ అంటూ పోలీసుల సాక్షిగా ఎంపీ తనయులు శ్రీరాజ్, సుందర్ దాడి చేశారు. వారికి ఎంపీ సెక్యూరిటీ, వారి వ్యక్తిగత గార్డులు తోడయ్యారు. రంగంలోకి దిగిన ఎన్జీవోలు పేపరు మిల్లు వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, డీఎస్సీలు నామగిరి బాబ్జీ, అనిల్‌కుమార్ పోలీసులు బలగాలతో అక్కడకు చేరుకున్నారు. అలాగే అమలాపురం నుంచి కోనసీమ జేఏసీ నాయకులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. హర్షకుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హర్షకుమార్ భార్య జేఏసీ నాయకులను బుజ్జగించే ప్రయత్నంలో కాలేజీ లోపల వారితో ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆందోళకారులు బయటనుంచి రాళ్లు విసిరారు. ఈ దాడిలో కాలేజీ అద్దాలు బద్దలుకాగా ఒక పత్రికా విలేకరికి, మరొకరికి గాయాలయ్యాయి. మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున చెత్తతీసుకుని వచ్చి కళాశాల ముందు వేశారు. ఆందోళనకారులు ఆ చెత్తకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను కళాశాల మెయిన్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకొనడంతో పక్కమార్గం గుండా లోపలికి వెళ్లి ఏసీ మిషన్లు తీసుకువచ్చి చెత్త మంటల్లో పడేశారు. మూడు కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. శ్రీరాజ్, సుందర్‌లను అరెస్టు చేశామని, కావాల్సివస్తే తీసుకెళ్లి చూపిస్తామని ఎన్జీవో నాయకులు గెద్దాడ హరిబాబు, ఇతర జేఏసీ నాయకులకు ఎస్పీ వివరించడంతో గొడవ సద్దుమణిగింది. బాధితులకు పరామర్శ ఎంపీ తనయుల దాడిలో గాయపడిన ప్రమోద్‌కుమార్, లక్ష్మణ్, శివరాజ్, దుర్గాప్రసాద్‌లను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పరామర్శించారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి మాకు క్షమాపణలు కాదు. న్యాయం కావాలి. ఎంపీ కుమారులపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేయాలి. - బూర్ల హరిబాబు, ఎపీఎన్జీఓల సంఘం రాజమండ్రి విభాగం అధ్యక్షుడు సమైక్యవాదుల్ని నీచంగా తిట్టారు సమైక్యవాదాన్ని, ఉద్యోగులను ఎంపీ తనయులు నీచంగా తిట్టారు. మేంప్రాణాలకు ఒడ్డి సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతుంటే సీమాంధ్రలో ఉండి తెలంగాణా వాదిలా వ్యవహరించారు. - ప్రమోద్ కుమార్, దాడిలో గాయపడ్డ ఉద్యోగి వారు ఎన్జీవోలని తెలీదు ఏపీఎన్జీవోల పిలుపులో కళాశాలల బంద్ లేదు. అయినప్పటికీ మేం బంద్ పాటిస్తున్నాం. కళాశాలపై దాడి చేస్తున్నారని భావించి కొట్టాం. వారు ఎన్జీవోలు అని తెలియదు. - సుందర్, హర్షకుమార్ కుమారుడు -
అవును.. అది అవమానమే! : బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు తాను హైకమాండ్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినా వినకపోవడం తమకు తలవొంపేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అయినప్పటికీ సమస్యలకు భయపడి పారిపోబోమని, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తామని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్ర అసెంబ్లీలో విభజన అంశాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించాలని నిర్ణయించామన్నారు. తద్వారా విభజన ప్రక్రియ ఆగిపోయే అవకాశముందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు సూచించారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు వ్యవహరిస్తానన్నారు. సీమాంధ్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఏపీఎన్జీవోలు వెంటనే సమ్మె విరమించాలని కోరారు. రాష్ట్ర విభజనవల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా విభజన అంశంపై ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతూ తగిన కార్యాచరణ రూపొందించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. విజయనగరంలో తన నివాసంపై, విద్యా సంస్థలపై జరిగిన దాడి ఎవరు చేశారనే అంశం జోలికి వెళ్లనన్నారు. విభజన విషయంలో ఎవరేం చెప్పినా అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కాబట్టి ఆ దృష్టితో దాడి చేశారని భావిస్తున్నానన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌ను చులకన చేస్తుంటే బాధేస్తుందని, దీనిని ఏ విధంగా అధిగమించాలి? పార్టీని బలోపేతం చేసేదేలా? అనే అంశాన్ని ఆలోచిస్తున్నామన్నారు. తొందర్లోనే కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తారు. సీమాంధ్రలో ప్రజలు ఉద్యమిస్తున్నా చంద్రబాబు మాత్రం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం రమేశ్‌ను కలసిన మాట నిజమే తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనను కలసిన మాట వాస్తవమేనని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అంగీకరించారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘నేను మంత్రిని. ఆయన ప్రజాప్రతినిధి. కలిస్తే తప్పేముంది? అందులో రహస్యమేముంది? వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా వివిధ సమస్యలపై నా వద్దకు వస్తారు కదా!’ అన్నారు. సీఎం రమేశ్ ఏ సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చారన్న ప్రశ్నకు ‘సమస్యలన్నీ మీకు చెబుతామా? మాకేం అవసరం? ఇదేం పద్ధతండీ...అసలు మీడియా ఎక్కడికి వెళుతుందో అర్ధం కావడం లేదు’’అంటూ అసహనం ప్రదర్శించారు. -
'వైఎస్ మరణించినప్పటిలాగే.. ఇప్పుడూ బాధపడుతున్నారు'
వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు ప్రజలు ఎంత బాధ పడ్డారో.. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతోందని అంతగా బాధపడుతున్నారని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులవి రాజీనామా డ్రామాలేనని, వాళ్లలో ఎవరూ రాజీ నామాలు అధికారికంగా చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బిల్లును అడ్డుకుంటామని ఎమ్మెల్యేల వద్ద హామీ తీసుకుంటామని ఆయన చెప్పారు. విభజన కొనసాగిస్తే ప్రజావిప్లవం తప్పదని అశోక్‌బాబు హెచ్చరించారు. -
కలుపుమొక్కలను ఏరేయాలి: అశోక్‌బాబు
‘కృష్ణా’ రైతు మహాగర్జన పిలుపు రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలు ద్రోహులే..: అశోక్‌బాబు సమైక్యాంధ్ర ద్రోహులకు 2014లో ఓటెయ్యొద్దు {పాణాలైనా అర్పించి కేంద్ర కేబినెట్ నోట్‌ను అడ్డుకుంటాం సమైక్యవాదం 19 జిల్లాలకు విస్తరించింది రాహుల్ చెబితే నేరచరిత్ర ఆర్డినెన్సును ఆపేశారు.. మరి కేబినెట్ నోట్కూడా కాని తెలంగాణ నిర్ణయం విరమించలేరా? సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారెయ్యాలని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు రైతులకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో బుధవారం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాగర్జన సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ద్రోహులే అన్నారు. వీరు నిజంగా తెలుగు తల్లికి పుట్టి ఉంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేసే ఏ పార్టీ నాయకుడైనా ఓటెయ్యవద్దని, అటువంటి అవకాశ రాజకీయ నాయకులకు 2014 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు అనే బుల్లెట్‌తో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు మారిన సంగతి గత ఎన్నికలు రుజువు చేశాయని, 2014 ఎన్నికల్లో అదే చరిత్ర పునారావృతం అవుతుందని హెచ్చరించారు. 2004లో తెలంగాణాపై రెండో ఎస్సార్సీ అన్న పార్టీకి పట్టం కట్టామని, 2009లో అసలు రాష్ట్ర విభజన ప్రాస్తవన లేని పార్టీని గెలిపించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా రాష్ట్ర విభజనను అడ్డుకునే నాయకులకే అండగా నిలుస్తామని అశోక్‌బాబు స్పష్టంచేశారు. తమ ప్రాణాలైనా అర్పించి తెలంగాణా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదానికి రాకుండా అడ్డుకుంటామన్నారు. రాజకీయాల్లో నేర చరితులు అనే విషయంలో బిల్లు దశకు వచ్చి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిన తరుణంలో కేవలం రాహుల్ గాంధీ అభ్యంతరం చెప్పారని బుట్టదాఖలు చేశారని, అలాంటింది కేబినెట్ నోట్‌గా కూడా రాని తెలంగాణా అంశాన్ని ఎందుకు ఆపలేరని ప్రశ్నించారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు 110 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మా సహనానికి కేంద్రంలోని యూపీఏ సర్కార్ పరీక్ష పెడుతోందని, మా చేతల్లో, మాటల్లో గాంధీ ఉన్నా, గుండెల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాస్‌చంద్రబోస్ ఉన్నారన్న విషయం చాటిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమం కేవలం సీమాంధ్రలోని 13 జిల్లాలకే పరిమితం కాలేదని, ఇది ఖమ్మం, నల్గొండ, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకూ విస్తరించిందన్నారు. అచ్చమైన రైతులే రోడ్డెక్కి గర్జించడం చూస్తే ఈ జిల్లా వాడిగా గర్వపడుతున్నానన్నారు. కలియుగ ‘హంస’ కేసీఆర్ పాలు, నీరును వేరుచేసే ప్రత్యేక లక్షణం హంసకు మాత్రమే ఉందని, అలాంటి పాలు, నీరులా కలిసి ఉన్న తెలంగాణా, సీమాంధ్రను వేరుచేసే హంసను తయారు చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని అశోక్‌బాబు విమర్శించారు. తెలంగాణ ఉద్యమం వాస్తవాలపై నిర్మించలేదని, మీడియా, సాహిత్యంవల్లే దానికి ఒక ఊపు వచ్చిందని, అటువంటి జోష్ మన ఉద్యమానికి కూడా అవసరమని అశోక్‌బాబు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే తెలంగాణ వాళ్లకే ఐదేళ్లపాటు నాయకత్వం అప్పగించేందుకు సిద్ధం కావాలని, అప్పుడైనా ఉద్యమాలు లేని ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుందేమో ఆలోచించాలని అశోక్‌బాబు అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, మాదిగ దండోరా రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణాకు మద్దతు పలికే మంద కృష్ణమాదిగ గుంటూరులో సభ పెడతానని ప్రకటించారని, ఆయన్ను ఇక్కడ కాలుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఈ రైతు గర్జనలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతలు ఆకట్టుకున్నాయి. -
ఏపీఎన్జీఓలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జరిపిన చర్చలు విఫలం
-
'అక్టోబర్ 15 వరకూ సమ్మెను కొనసాగిస్తాం'
హైదరాబాద్: అక్టోబర్ 15 వరకూ సీమాంధ్రలో సమ్మెను కొనసాగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఆదివారం సమైక్య గర్జనలో కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డ ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 2 వ తేదీ వరకూ గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలుపుతామన్నారు. మూడ, నాలుగు తేదీల్లో సీమాంధ్ర ఎంపీల ఇళ్ల వద్ద వంటా వార్పు ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 5 వ తేదీన రహదారుల దిగ్బంధ చర్యలను, 5, 6 తేదీల్లో పెట్రోల్ బంకులు, ప్రైవేట్ బస్సుల నిలిపివేస్తామన్నారు. 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం, 9,10, 11 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేపడతామన్నారు. మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. సీఎం స్థాయిలో చర్చలు జరిపితే వెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమీటీకి చట్టబద్దత లేదని ఈ సందర్భంగా తెలిపారు. అటువంటి కమిటీ ఎలా నివేదికలు ఇస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జీతం లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు...బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని అశోక్ బాబు తెలిపారు. -
పదవుల్ని వదలండి ఎన్జీఓల డిమాండ్
సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే తప్ప సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ సాధ్యం కాదని ఏపీ ఎన్జీఓలు స్పష్టం చేస్తున్నారు. పదవులు పట్టుకుని వేలాడుతూ, సోనియా పంచన తిరుగుతుండడంపై ప్రజలు ఏవగించుకుంటున్నారని ఎలుగెత్తుతున్నారు. ‘ఇకనైనా పదవుల్ని పరిత్యజించి, ఉద్యమ బాట పట్టండి’ అని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నారు. సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్య ఉద్యమం 58వ రోజైన గురువారం కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా సాగింది. అమలాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఖాళీ కుర్చీలు నెత్తిన పెట్టుకుని ‘సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులారా! కుర్చీలు వదలండి! రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించి సమైక్యతను కాపాడండి’ అని నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద మంత్రుల మాస్క్‌లతో సమైక్యవాదులు ప్రదర్శన చేశారు. మంత్రుల మనసు మారాలంటూ పాస్టర్లు రోడ్డుపై ప్రార్థనలు చేశారు. దేవదూతల వేషాల్లోని చిన్నారులు మంత్రులకు జ్ఞానోదయం కలిగించినట్టు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. సామర్లకోటలో మంత్రి తోట నరసింహంను సమైక్యవాదులు అడ్డగించి రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. కోరుకొండలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను సమైక్యవాదులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎన్నడో రాజీనామా చేశానని, సమైక్యాంధ్రప్రదేశ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నానన్న పెందుర్తి జేఏసీ దీక్షలో పాల్గొని వెళ్లిపోయారు. ఏపీఎన్జీఓల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండవ రోజైన గురువారం కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అడ్డుకున్నారు. దీంతో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల నుంచి హైదరాబాద్, విశాఖ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు తిరగలేదు. ధవళేశ్వరంలో ప్రైవేట్ బస్సులను నిలిపివేసిన సమైక్యవాదులు వాటిలో ప్రయాణిస్తున్న తెలంగాణ విద్యార్థులను గుర్తించి వారితో సమైక్య నినాదాలు చేయించారు. సీమాంధ్ర వాసుల సామరస్యాన్ని, రాష్ట్రం విడిపోతే వచ్చే అనర్థాలను వారికి వివరించారు. రాజమండ్రిలో ‘బాలఘోష’ సమైక్యాంధ్రకు మద్దతుగా తాళ్లరేవు మండలం పిల్లంకకు చెందిన పురోహితుడు వేలూరి వెంకట కామేశ్వరశర్మ ధవళేశ్వరంలో తూర్పు డెల్టా ప్రధాన కాలువలో జలదీక్ష చేశారు. రాజమండ్రిలో ఫ్యూచర్స్ కిడ్స్ స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు ఏవీ ఆప్పారావు రోడ్డు నుంచి జాతీయ రహదారిపై స్కేటింగ్ చేస్తూ జేఎన్ రోడ్డు వరకూ ర్యాలీ చేశారు. రాష్ట్ర విభజన తమ భవిష్యత్తును కాలరాస్తుందంటూ చిన్నారులు రాజమండ్రిలో పశు సంవర్ధకశాఖ జేఏసీ ఆధ్వర్యంలో ‘బాలఘోష’ కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ జిల్లా చైర్మన్ రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగుల పిల్లలు సహాయ సంచాలకుల కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీమాంధ్ర జిల్లాలకు చెందిన మున్సిపల్ ఇంజనీర్లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ హోమ్ వద్ద సమావేశమైన ఎన్జీఓలు తమ రాష్ట్ర ఆధ్యక్షుడికి తెలంగాణ వాదుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సంబంధ బాంధవ్యాలు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలని కోరుతూ మండల ఫ్లవర్ డెకరేటర్స ఆధ్వర్యంలో కడియం కెనాల్ రోడ్డులో ఇద్దరు పూల వ్యాపారులను ఇరు ప్రాంతాలకు చెందిన వధూవరులుగా అలంకరించి వివాహం చేశారు. కాకినాడలో బజ్టీలు వేసి ఉపాధ్యాయుడి నిరసన కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల దీక్షా శిబిరం వద్ద వెంకటరావు అనే ఉపాధ్యాయుడు బజ్జీలు వేసి నిరసన తెలి పారు. మరో ఉపాధ్యాయుడు పరసా సత్యనారాయణ తొలి బజ్జీని రూ.530కు కొనుగోలు చేశారు. బజ్జీల అమ్మకం ద్వారా వచ్చిన రూ.2200ను ఉపాధ్యాయ జేఏసీ శిబిరానికి విరాళంగా ఇచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు హృదయాకార గుర్తులు ధరించి దీక్షల్లో పాల్గొన్నారు. దస్తావేజు లేఖరులు పొట్టి శ్రీరాములు వేషధారణతో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. జిల్లా పరిషత్ సెంటర్లో న్యాయశాఖ మహిళా ఉద్యోగులు గాజులు, కుంకుమ పంచి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దిగ్విజయ్ సింగ్ శవయాత్ర సాగించి కాకినాడ కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. కరాటే క్రీడాకారుల విన్యాసాలు అమలాపురంలో డివిజన్ పరిధిలో గురుకుల పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. గడియార స్తంభం సెంటర్లో కొనసాగుతున్న నిరవధిక దీక్షల్లో సాంఘిక, వెనుకబడిన కులాల సంక్షేమ శాఖల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొనగా, శిబిరం వద్ద జాతీయ గీతాలాపనతో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంబంధిత శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధుసూదనరావుతో పాటు జేఏసీ ప్రతినిధులు నక్కా చిట్టిబాబు, ఇతర ఉద్యోగులు డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేశారు. అమలాపురం పవర్కిక్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 మంది క్రీడాకారులు గడియారస్తంభం సెంటర్లో విన్యాసాలు చేశారు. మందపల్లి శనైశ్చరాలయంలో దేవస్థానం చైర్మన్ సిద్దంశెట్టి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర సమైక్యతను కాపాడాలంటూ హోమం చేశారు. రావులపాలెంలో జాతీయ రహదారిపై చేనేత కార్మికులు రోడ్డుపై నేత నేసి, నూలు వడికి నిరసన తెలిపారు. విడిపోతే డెల్టాలు ఎడారే.. మామిడికుదురులో కోనసీమ రైతు జేఏసీ కన్వీనర్ యాళ్ల వెంకటానందం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా గోదావరి డెల్టాలు ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 30న ఎదురులంక నుంచి చించినాడ వరకూ భారీ మోటారు సైకిల్ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. మామిడికుదురులో జాతీయ రహదారిపై వ్యాయామ ఉపాధ్యాయులు కర్రలతో వ్యాయామ విన్యాసాలు చేసి నిరసన తెలిపారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ దీక్షకు మద్దతుగా సాయంత్రం ఆరు గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రాజోలులో దారపురెడ్డి బాబ్జీ చేపట్టిన రిలే దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. రాజోలులో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పూ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మలికిపురంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. సఖినేటిపల్లిలో పొలిటికల్ జేఏసీ రిలే దీక్షలు, టేకిశెట్టిపాలెంలో ఉద్యోగ జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు చేపట్టింది. పిఠాపురం ఆర్ఆర్ బీహెచ్ఆర్ కళాశాల విద్యార్థులు కరాటే విన్యాసాలు ప్రదర్శించారు. జాతీయ దళిత ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో సామర్లకోట స్టేషన్ సెంటర్లో వంటా వార్పూ చేపట్టారు. సామర్లకోట జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను నిలిపి, విద్యార్థులను, ఉపాధ్యాయులను దీక్షా శిబిరం వద్దకు తరలించి సమైక్య నినాదాలు చేయించారు. పెద్దాపురం జేఏసీ దీక్షల్లో ఆ పట్టణానికి చెందిన ఓఎన్జీసీ ఉద్యోగి శేఖర్ భార్య, తెలంగాణ లోని సంగారెడ్డికి చెందిన రాణి సుజాత పాల్గొని సమైక్యరాష్ట్రానికి మద్దతు పలికారు. తునిలో నియోజకవర్గంలోని ఐదు మండలాల వ్యవసాయ శాఖ ఉద్యోగులు, అధికారులు మోటారుసైకిల్ ర్యాలీ చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఏలేశ్వరంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మానవహారంగా ఏర్పడ్డారు. వాహనాలను తుడుస్తూ నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ముస్లింల వంటావార్పు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజానగరంలో జాతీయ రహదారిపై ముస్లింలు వంటా వార్పూ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి విభజనకు వ్యతిరేకంగా ప్రసంగించారు. రామచంద్రపురంలో జేఏసీ నేతలు భిక్షాటన చేశారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థులు మండలంలోని గ్రామాలకు వెళ్లి రైతులను చైతన్యం చేశారు. న్యాయవాదుల జేఏసీ, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీల దీక్షలు కొనసాగుతున్నాయి. కె.గంగవరం మండలం ఎర్రపోతవరంలో జేఏసీ వంటా వార్పూ చేపట్టింది. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల పోరు నిద్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు గురువారం రాత్రి కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై పోరు నిద్ర చేపట్టారు. రిలే నిరాహారదీక్ష ముగించాక ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, తోటకూర సాయిరామకృష్ణ, సుబ్బరాజు, పెద్దిరాజు, కృష్ణమూర్తి తదితరుల నాయకత్వంలో సుమారు 50 మంది ఉపాధ్యాయులు రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. -
ప్రైవేటు ట్రావెల్స్‌పై కొరడా
సాక్షి, రాజమండ్రి :ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే కొందరు సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. అటువంటి ఉల్లంఘనను అడ్డుకునే చర్యలను బుధవారం రాత్రి నుంచి సమైక్యవాదులు చేపట్టారు. జిల్లాలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను నిలువరించే చర్యలను జేఏసీ చేపట్టింది. ఉద్యోగ, ఆర్టీసీ జేఏసీలు, ఏపీ ఎన్జీఓలు ఇతర ఉపాధ్యాయ వర్గాలు రాత్రి హైదరాబాద్ వెళ్లే సర్వీసులను ఎక్కడికక్కడ నిలువరించారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లో జాతీయ, ఇతర ప్రధాన రహదారులపై బస్సులను అడ్డగించారు. బస్సుల టైర్లలో గాలి తీసేశారు. సమైక్యవాదులై ఉండి సమైక్య ద్రోహులుగా వ్యవహరించ వద్దని హితవు పలికారు. జిల్లా నుంచి సుమారు 45 బస్సులు రోజూ హైదరాబాద్‌కు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఇవే కాకుండా వైజాగ్ నుంచి 25 బస్సులు రాజమండ్రి మీదుగా రాజధాని వెళుతున్నాయి. మరో 20 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి అనధికారికంగా తిప్పుతున్నట్టు తెలుస్తోంది. రోజుకు ఈ బస్సులు 3200 నుంచి 3600 మంది ప్రయాణికులను హైదరాబాద్ చేరవేస్తున్నాయి. సాధారణ రోజుల్లో బస్సు తరగతిని బట్టి రూ. 450 నుంచి రూ. 850 వసూలు చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె కారణంగా రూ.850 నుంచి రూ.1200కి పైగా చార్జీ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. -
జగన్‌ను ఢిల్లీకి ఆహ్వానించిన సీమాంధ్ర ఉద్యోగులు
-
జగన్‌తో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం భేటీ
-
సీమాంధ్ర బంద్ సంపూర్ణం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా ఏపీఎన్జీవోల పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. విద్యాసంస్థలు, వర్తక, వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు, ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు, పెట్రోలుబంకులు మూసివేశారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడ జాతీయరహదారులను దిగ్బంధించారు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోర్టు కార్యకలాపాలను అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్ అండ్ బీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య గల చించినాడ బ్రిడ్జిపై జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రాకపోకలు గంటలతరబడి నిలిచిపోయూరుు. కలకత్తా-చెన్నయ్ జాతీయ రహదారిని జిల్లాలో పలుచోట్ల దిగ్బంధించారు. విశాఖనగరంలో ఈపీడీసీఎల్ కార్యాల యంలో చేపట్టే బోర్డు మీటింగ్‌ను విద్యుత్ జేఏసీ, ఆర్టీసీ నేతలు అడ్డుకున్నారు. విజయనగరంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించగా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మహేంద్రతనయ వంతెనపై సమైక్యవాదులు ైటె ర్లు కాల్చి నిరసన తెలిపారు. హౌరా-చెన్నై జాతీయ రహదారిపై అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లాలోని బంటుమిల్లి రోడ్డు, బందరు వెళ్లే రోడ్డు, గుడివాడ రోడ్డులపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వంటావార్పు చేశారు. విజయవాడలోని గొల్లపూడి, కనకదుర్గమ్మ వారధి, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్ వద్ద ఎన్జీవో నేతలు రోడ్లపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. తిరువూరులో విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిపై కట్టెలేరు వంతెన వద్ద బైఠాయించిన జేఏసీ నాయకులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గుంటూరులోని ఆటోనగర్, వీఎస్సార్ కళాశాల, కఠెవరం గ్రామాల వద్ద తెనాలి విజయవాడ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు చర్చి సెంటర్లో క్రైస్తవులు మానవహారం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీరాలలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించారు. ఎనిమిది వేల మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి గండికి పాదయాత్రను చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 24 మంది వికలాంగులు 24 గంటల దీక్ష చేపట్టారు. బంద్ నేపథ్యంలో బెంగళూరు-హైదరాబాద్(44వ), కర్నూలు-చెన్నై(18) జాతీయ రవాహదారులను సమైక్యవాదులు దిగ్బంధించి వాహనల రాకపోకలను అడ్డుకున్నారు. డోన్‌లో జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం కూడలిలో దర్జీలు నడిరోడ్డుపై కుట్టు మిషన్లతో నిరసన తెలిపారు. యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలను పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి. 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’ సమైక్యాంధ్ర ప్రకటనే ప్రధాన డిమాండ్‌గా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు అక్టోబర్ 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’ నిర్వహించనున్నారు. 13 జిల్లాల్లోని విద్యుత్ ఉద్యోగులతో పాటు హైదరాబాద్ విద్యుత్‌సౌధలోని ఉద్యోగులందరూ కుటుంబ సమేతంగా గర్జన కార్యక్రమానికి హాజరు కావాలని గుంటూరులో జరిగిన రాష్ట్ర విద్యుత్ జేఏసీ సమావేశం నిర్ణయించింది. నేడు అనంత రైతు రంకె అనంతపురం: సమైక్యాంధ్ర వాణిని వినిపించేందుకు బుధవారం అనంతపురంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘అనంత రైతు రంకె’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
బంద్ విజయవంతానికి సహకరించాలి
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: విభజనకు నిరసనగా మంగళవారం తలపెట్టిన రాష్ట్రబంద్ విజయంతానికి అన్ని వర్గాలు సహకరించాలని ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.రవీంద్రబాబు పిలుపు నిచ్చారు. బంద్‌కు ప్రజలను సమాయత్తం చేసేందుకు సోమవారం రాత్రి ఆటోల్లో మైకు ప్రచారం, మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఎన్జీఓ భవన్ వద్ద ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటల నుంచే జాతీయ రహదారుల దిగ్బంధం చేపడతామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాణిజ్య, వర్తక వర్గాలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసేయాలన్నారు. విద్యా సంస్థల బంద్ యథాతథంగా కొనసాగుతుందన్నారు. బుధ, గురువారాల్లో ట్రావెల్స్ వాహనాల బంద్ నిర్వహిస్తామన్నారు. శుక్ర, శనివారాల్లో కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలను స్వచ్ఛందంగా మూసేయాలన్నారు. మోటారు సైకిళ్ల ప్రదర్శన నగరంలోని ప్రధాన వీధుల్లో సాగింది. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, సుధాకరరావు, శ్రీకాంత్, శేఖరరావు, సతీష్, శివప్రసాద్, వెంకమరాజు, ఆంజనేయవర్మ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె విరమిస్తారా? కొనసాగిస్తారా? చెప్పండి
-
ఏపీ ఎన్జీవో సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ
-
త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన: అశోక్ బాబు
సమైక్య రాష్ట్రం కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఈ నెల 21 విశాఖపట్నం, 23న హిందుపూర్, 24న కడప నగరాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. తమ ప్రాంతాల్లో కూడా సమైక్య సభలు పెట్టాలని నల్లగొండ, నిజామాబాద్ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ బొగ్గు, నీరు తీసుకుంటున్నామని ఆరోపిస్తున్నా వాటిని విద్యుత్ రూపంలో తెలంగాణ ప్రాంతానికే తిరిగి అందిస్తున్నట్లు అశోక్‌బాబు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ కొరత సమస్య తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపైన, కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావడంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అశోక్‌బాబు మండిపడ్డారు. -
కెసిఆర్‌ని వణికించిన APNGO: శైలజానాథ్
-
సీఎం కార్యాలయం ఎదుట ధర్నా
ఖమ్మం కలెక్టరేట్: ఇద్దరు ఎంపీడీఓల అక్రమ బ దిలీని రద్దు చేయాలన్న డిమాండుతో టీజీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, ఏలూరి శ్రీనివాసరావు, టీ-ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రర్రావు తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె.మహంతి, పంచాయతీరాజ్ కార్యదర్శి నాగిరెడ్డి, కమిషనర్ వరప్రసాద్, పం చాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఎంపీడీఓల బదిలీ వెనుక రాజ కీయ కుట్ర ఉందని అన్నారు. బదిలీల రద్దు జీఓకు విరుద్ధంగా, పాత జీఓలతో ఎలా బదిలీ చేశారని ప్రశ్నించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఇద్దరు ఎంపీడీఓలను అక్రమంగా బదిలీ చేయడం సరికాదని అన్నారు. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు ప్రభుత్వ నిబంధనలకువిరుద్ధంగా తమను బదిలీ చేశారని మానవ హక్కుల కమిషన్‌కు ముదిగొం డ, బోనకల్లు ఎంపీడీఓలు సన్యాసయ్య, చంద్రశేఖర్ మంగళవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశా రు. ఎలాంటి అవినీతి ఆరోపణలులేని తమను పాత జీఓలతో అక్రమంగా బదిలీ చేశారని వివరించారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణను అడ్డుకునే శక్తి ఎవరికి లేదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రస్థానం విజయ తీరాలకు చేరబోతున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు అన్నారు. అయితే లక్ష్యాన్ని ముద్దాడేంత వరకు ఉద్యమాన్ని వీడేది లేదు ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు కే కేశవరావు నివాసంలో ఢిల్లీ పరిమాణాలపై జేఏసీ, టీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. కేకే నివాసంలో సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని.. దానిని ఆపే శక్తి ఎవరికి లేదని ఆయన అన్నారు. కాని తెలంగాణ ఉద్యమ సంస్థలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. ఏపీఎన్జీఓల సభ అంత గొప్పదేమి కాదని ఆయన వ్యాఖ్యాలు చేశారు. 10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలకు తాను వివరించానని కేసీఆర్ తెలిపారు. ఏప్రాంతమైతే ఆంధ్రతో కలిసిందో.. ఆ ప్రాంతమే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడాలని, ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించబోమని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో సదస్సు నిర్వహించడానికి ప్రయత్నాలు చేపట్టామని.. వేదికపై పలు సూచనలు వచ్చాయని.. అయితే సెప్టెంబర్ 12వ తేదిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపై స్పష్టమైన సమాచారం తేలుతుందన్నారు. హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తాం.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించాలని వచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అనేక అవమానాలకు తాను గురైనానని.. అయితే తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి అవమానాలకైనా సిద్ధమని, 10 జిల్లాలతో కూడిన, ఆంక్షలు లేని తెలంగాణ కావాలని మరోమారు స్పష్టం చేశారు. -
ఉక్రోషంతో దాడులు
తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు హాజరైన ‘పశ్చిమ’ ఏపీఎన్జీవోలు ఆదివారం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలోనూ అడుగడుగునా తెలంగాణవాదులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీమాంధ్ర భవిష్యత్ కోసం ప్రాణాలకు తెగించి ముందుకు సాగినట్లు ఉద్యోగులు తెలిపారు. సభ పూర్తిస్థాయిలో సక్సెస్ కావడంతో తెలంగాణవాదులు ఉక్రోషాన్ని ఆపుకోలేక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సభకు తణుకు నుంచి 5 బస్సులో ఏపీఎన్జీవోలు వెళ్లారు. హైదారాబాద్ నుంచి తిరిగివస్తుండగా చౌటుప్పల్ వద్ద తెలంగాణవాదులు చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు. బస్సులపై జరిగిన రాళ్ల దాడిలో వైవీ సత్యనారాయణమూర్తి, కొమరవరం వీఆర్వో ఏజేబీవీ నారాయణ, ఎస్ ఇల్లింద్రపర్రు వీఆర్వో వి.ముత్యాలరావు, బస్సు డ్రైవర్ వీరింకి ఏడుకొండలు గాయపడ్డారు. నారాయణకు నుదుటిపై తీవ్ర గాయం కావడంతో ఏడు కుట్లు, ముత్యాలరావుకు చెవికి గాయమై ఐదు కుట్లు పడినట్లు ఎన్జీవోలు చెప్పారు. ఎన్జీవోలు వైవీ సత్యనారాయణమూర్తి, పితాని వెంకటరమణ మాట్లాడుతూ సభను అడ్డుకునేందుకు తెలంగాణలో బంద్ ప్రకటించిన కోదండరాం, కేసీఆర్, హరీష్‌రావులే ఈ దాడులకు కారణమని ఆరోపించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దాడులకు పాల్పడినవారిని ఎన్జీవోల నాయకులు తెలంగాణ పోలీసులకు చూపించినా పట్టించుకోలేదన్నారు. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సుపై అకస్మాత్తుగా జరిగిన రాళ్లదాడిలో బస్సు డ్రైవర్ వీరంకి ఏడుకొండలు గాయపడినా చాకచక్యంగా బస్సును నిలువరించడంతో బస్సులో ఉన్న 40 మంది ఎన్జీవోలు సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు. ఎన్జీవోలకు పలువురి పరామర్శ గాయపడిన ఎన్జీవోలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య పరామర్శించారు. పైడిపర్రు ఆర్వోబీ ప్రాంతంలో బస్సులను ఆపి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సభ సక్సెస్‌పై అభినందనలు తెలిపారు. తహసిల్దార్ ఎం.హరిహర బ్రహ్మాజీ, జేఏసీ నాయకులు ఎన్జీవోలను పరామర్శించారు. ఊపిరి పీల్పుకున్న కుటుంబ సభ్యులు చింతలపూడి: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు వెళ్లిన చింతలపూడి ఏపీ ఎన్జీవోలు ఆదివారం సురక్షితంగా తమ ప్రాంతానికి చేరడంతో వారి కుటుంబ సభ్యులు ఊపీరి పీల్చుకున్నారు. శుక్రవారం రాత్రి చింతలపూడి నుంచి ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై ఖమ్మం జిల్లా మండాలపాడు గ్రామం వద్ద రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. సభ జరగకూడదని తెలంగాణవాదులు తమపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినా సీమాంధ్ర భవిష్యత్ కోసం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఉద్యోగులు తెలిపారు. సదస్సులో సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మేథావుల ప్రసంగాల ద్వారా తెలుసుకునే వీలు కలిగిందని చెప్పారు. -
ఒకే మాట.. ఒకటే బాట
కాంగ్రెస్ పార్టీ రేపిన రాష్ట్ర విభజన జ్వాల 40 రోజులు కావస్తున్నా ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ‘పశ్చిమ’ ప్రజలు హస్తిన పెద్దలపై కళ్లెర్రజేస్తున్నారు. ఎన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లినా జిల్లాలో ఉద్యమ వేడి ఏ మాత్రం తగ్గలేదు. అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మార్మోగించారు. ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో ఎవరిని కదిపినా ‘సమైక్యాంధ్ర’ అంటున్నారు. ఉద్యమ పథమే తమ బాట అని ఘంటాపథంగా చెబుతున్నారు. లక్ష్యాన్ని సాధిం చేందుకు కడవరకూ పోరాడతామని విస్పష్టంగా చెబుతున్నారు. 39వ రోజైన శనివారం కూడా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సాగారుు. వేలాది ఉద్యోగులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు తరలివెళ్లినా ఆందోళన కార్యక్రమాల్లో ఆ లోటు ఎక్కడా కని పించలేదు. ఏపీ ఎన్జీవోల ఉద్యమానికి మద్దతుగా తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు పట్టణాలతోపాటు దేవరపల్లి, సిద్ధాం తం, గుమ్ములూరు గ్రామాల్లో శనివా రం చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. ఏలూరు శ్రీశ్రీ విద్యార్థులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించి ‘జై సమైకాంధ్ర’ అక్షర రూపంలో కూర్చున్నారు. తూర్పుకాపు విద్యా, విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంట ర్లో మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో స్వర్ణకారులు, బం గారు వ్యాపారులు త్రివర్ణ బెలూన్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ముస్లింలు రిలే దీక్షలో పాల్గొన్నారు. అక్కడే నమాజు చేశారు. తణుకు మండలం దువ్వలో రైతులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అత్తిలిలో ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఇరగవరం, తూర్పువిప్పర్రులో నిరాహార దీక్షలు కొనసాగాయి. భీమవ రం కాకతీయ స్కూల్ విద్యార్థులు ప్రకా శం చౌక్‌లో మానవహారం నిర్మించారు. జీవీఐటీ ఇంజినీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రిక్షాలు తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆదిత్య స్కూల్ ఉపాధ్యాయులు ఏసుక్రీస్తు, అల్లా, బ్రహ్మ, వివేకానంద, పుట్టపర్తి సాయిబాబా వేషధారణలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వీరవాసరంలో ఉపాధ్యాయులు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు మానవహారం నిర్మించారు. పాలకొల్లులో న్యాయవాదులు మౌన ప్రదర్శన చేశారు. బ్రాహ్మణగూడెం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జంగారె డ్డిగూడెంలో రైతులు రాస్తారోకో చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సుకు తెలంగాణ వాదులు ఆటంకం కల్గిస్తే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని నరసాపురంలో ఆరుగురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మునిసిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కడంతో ఉత్కంఠ ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నాలుగు గంటల అనంతరం వారు దిగివచ్చారు. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామస్తులు ఉదయం 6నుంచి సాయంత్రం వరకు రాస్తారోకో చేశారు. బుట్టాయగూడెంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఒంటికాలితో జపం చేశారు. పెనుగొండలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. మార్టేరు వరి పరిశోధనా సంస్థకు చెం దిన 25 మంది శాస్త్రవేత్తలు సామూహిక సెలవు పెట్టి నిరసన తెలిపారు. కొవ్వూరు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో స్వర్ణాంధ్ర కళాశాల విద్యార్థులు కూర్చున్నారు. ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, రోడ్డుపై ఆటలు ఆడారు. వైఎస్ కుటుంబం స్ఫూర్తితో... నరసాపురం బస్టాండ్ సెంటర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ దీక్షల స్ఫూర్తితో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు 17వ రోజుకు చేరారుు. వీరవాసరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దెందులూరు మండలం గాలాయగూడెంలో వైఎస్సార్ సీపీ నాయకుడు ముసునూరి సీతారామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగించారు. తాడేపల్లిగూడెం పోలీ స్ ఐలండ్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన పార్టీ కార్యకర్తలు శనివారం రిలే దీక్షలో పాల్గొన్నారు. -
సభకు అడ్డంకులు కల్పించొద్దు : ఉద్యోగులు
-
7th టెన్షన్‌పై చర్చ
-
సమైక్య సభను అడ్డుకుంటే.. తెలంగాణను అడ్డుకుంటాం: అశోక్‌బాబు
సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని, హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే ఢిల్లీలో తాము తెలంగాణను అడ్డుకుంటామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ వాదాన్ని వినిపించడానికే సభ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకంగా కాదని పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సభను అడ్డుకుంటామంటూ కొంత మంది నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. ప్రత్యేకవాదంలో బలముంటే.. తమ సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని చెప్పారు. సభ సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఉద్యోగులకు మాత్రమే అనుమతి లభించిందన్నారు. ‘గుర్తింపు కార్డులతో పాటు మేం జారీ చేసిన ప్రత్యేక కార్డులు ఉన్న ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియంలోకి వస్తారు. అయితే, వారికి వేదికపై ప్రసంగించే అవకాశం ఉండదు’ అని తెలిపారు. రాజకీయ నేతలు తమ సభకు వస్తే తప్పేముందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభ నిర్వహణకు పోలీసులు అనుమతించినా ఎల్బీ స్టేడియం అధికారులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోటా సభ నిర్వహణ ఏర్పాట్లకు అవరోధం కల్పిస్తున్న స్టేడియం అధికారుల తీరును తప్పుపట్టారు. ఎల్బీ స్టేడియంలో సభకు ఏవైనా ఆటంకాలు తలపెడితే స్టేడియం బయటే సభను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు పి.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికలో ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేసే శాశ్వత కార్యాచరణను త్వరలో రూపొందించనున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. తర్వాతి దశలో హైదరాబాద్‌లో భారీ మానవహారం, సమైక్య ఆవశ్యకతను తెలియజేసేలా అన్ని కాలనీలలో సమావేశాలు నిర్వహణతో పాటు నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు, సాంస్కృతిక కళావేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. ముఖద్వార వేదికకు కాకతీయ ద్వారం అని, వీఐపీ ద్వారానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ద్వారం అని పేరు పెట్టారు. సభ ప్రాంగణంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోని పోరాట యోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. నవంబర్‌లో భారీ సభ.. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట నిర్వహిస్తున్న సభను ఉద్యోగ వర్గాలకే పరిమితం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో జన సమీకరణ అవసరం లేదని, 50-60 వేల మంది ఉద్యోగులతో సభ జరిపితే విజయవంతమయినట్లుగానే భావిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీసీఎం, ఎంఐఎం పార్టీలనే సభకు ఆహ్వానించారు. రాజకీయ నాయకులను సభకు తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించకూడదనే నిర్ణయానికి వచ్చారు. సమైక్యవాదాన్ని నమ్ముతున్న అన్ని వర్గాల ప్రజలు, విభజనను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను కలిసి, నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే దిశగా ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. -
బంద్‌కు సన్నద్ధం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు బంద్ నిర్వహించేందుకు టీ జేఏసీ జిల్లా నేతలు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీఓస్ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతిని నిరసిస్తూ టీజేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా టీ జేఏసీ పశ్చిమ జిల్లా కమిటీ అధ్యక్షుడు వై. అశోక్ కుమార్, టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టి. రాజేందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా వివిధ వర్గాల నుంచి మద్దతు కోరుతూ టీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ‘హైదరాబాద్‌లో సభ నిర్వహణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకు బంద్ కు పిలుపునిచ్చాం. రాష్ట్ర ఏర్పాటుపై కసరత్తు వేగవంతమవుతున్న తరుణంలో పోలీసు యంత్రాంగాన్ని, ఏపీ ఎన్జీఓలను అడ్డుపెట్టి కుట్రలకు పాల్పడుతున్నారు. సీఎం కుట్రలను తిప్పికొట్టే శక్తి టీజేఏసీ, తెలంగాణ సమాజానికి వుందని’ అశోక్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆందోళనకు దిగాల్సిందిగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో సీఎం కిరణ్ సభకు అనుమతి ఇచ్చి తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
టీజేఏసీ బంద్ ను విజయవంతం చేయండి: కేసీఆర్
తెలంగాణ పొలిటికల్ జేఏసీ (టీజేఏసీ) ప్రకటించిన బంద్ కు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్ 7న జేఏసీ ప్రకటించిన బంద్ ను విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కేసీఆర్ తెలంగాణవాదులకు విజ్క్షప్తి చేశారు. తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే సెప్టెంబర్ 7 తేదిన బంద్ కు పిలుపునిచ్చామని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర సభకు వ్యతిరేకంగా బంద్ కాదని, విభజనకు సహకరిస్తే ఏపీఎన్జీవోల సభను తామే విజయవంతం చేస్తామని కోదండ్ స్పష్టం చేశారు. -
సభకు రాజకీయ నేతలొస్తే తప్పేంటి?: ఆశోక్‌బాబు
తమ సభకు రావాలని రాజకీయ నేతలను ఆహ్వానించామని ఎపీఎన్జీవో నాయకుడు ఆశోక్‌బాబు తెలిపారు. తమ సభకు రాజకీయ నేతలు వస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ తమ సభను అడ్డుకుంటే ఢిల్లీలో తెలంగాణను అడ్డుకోగలమని అన్నారు. శాంతియుతంగానే సభ జరుపుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. సభ ఏర్పాట్ల విషయంలో అధికారులు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. రేపు సాయంత్రం నుంచి ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులు చెబుతున్నారని వాపోయారు. సభకు ఒకరోజు ముందునుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తే సకాలానికి పూర్తికావని చెప్పారు. కొందరు అధికారులు, పోలీసులు ప్రాంతీయ వాదాన్ని చూపిస్తున్నారని అన్నారు. 7న ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న సభకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. సభకు ఆటంకం కలిగించాలని కొందరు మంత్రులు చూస్తున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. -
సమైక్య సభ నేపథ్యంలో పోలీసుల అలర్ట్
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించనున్న నేపథ్యంలో నిరసనలు తెలిపేందుకు తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు సిద్ధం కావడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించుకునేందుకు ఏపీ ఎన్జీవోలకు పోలీసు శాఖ ఇప్పటికే అనుమతించింది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ, తెలంగాణ జేఏసీ తలపెట్టిన ర్యాలీలకు మాత్రం అనుమతి సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఎల్బీ స్టేడియంలో 6వ తేదీన ఎమ్మార్పీఎస్ తలపెట్టిన సభకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో తెలంగాణ జేఏసీ, విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఏపీఎన్జీవోల సభకు సీమాంధ్రలోని పలు జిల్లాల నుంచి ఉద్యోగులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఏపీఎన్జీవోల సభను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని తెలంగాణవాదులు భావిస్తున్నారు. దాంతో శనివారం సభ సందర్భంగా ఘర్షణలు తలెత్తవచ్చని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, అన్ని రీజియన్ల ఐజీలతో డీజీపీ వి.దినేశ్‌రెడ్డి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఏపీఎన్జీవో భవన్ ముట్టడికి యత్నం
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏపీఎన్జీఓల తీరుకు నిరసనగా ఏపీఎన్జీవో భవన్‌ను ముట్టడించేందుకు తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు బుధవారం ప్రయత్నించారు. కార్యాలయం ముందు బైఠాయించి అన్నదమ్ముల్లా కలిసుందామని... రాష్ట్రాలుగా విడిపోదామని వారు కోరారు. సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పారు. ఈ నెల 7న ఏపీఎన్జీఓలు నిర్వహించ తలపెట్టిన సభను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. ఏపీ ఎన్జీవోలు ఏడో తేదీన తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. -
దద్దరిల్లిన కార్యాలయాలు
పంజగుట్ట/సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కార్యాలయాలు హోరెత్తాయి. పోటాపోటీ నినాదాలతో మార్మోగాయి. ప్రత్యేక, సమైక్య ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలతో పలు ప్రభుత్వ కార్యాలయాలు హోరెత్తాయి. టీఎన్జీవోలు, ఏపీఎన్జీవోల ధర్నాలతో దద్దరిల్లాయి. సచివాలయం, విద్యుత్ సౌధలలో నిరసనలు మిన్నంటాయి. ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీ నిరసనలు చేపట్టారు. సీమాంధ్ర ఉద్యోగులు ఉదయం నుంచి కార్యాలయ ఆవరణలో బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఒంటికాలిపై నిల్చొని, సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అటు తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఎంఈ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్, డెరైక్టర్ ఆఫ్‌హెల్త్, ఎపిసాక్, వైద్యవిధాన పరిషత్ తదితర కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీని నిర్వహించారు. అనంతరం వంటావార్పు కార్యక్రమం చేపట్టి సహపంక్తి భోజనాలు చేశారు.తెలంగాణ ఉద్యోగులు సైతం డీఎంహెచ్ఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్‌లోని ఏపీజీఎల్‌ఐసీ, డీటీవో, ఆయూష్, పీఏవో తదితర విభాగాల సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించారు. బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టిఎన్జీవోలు ధర్నా నిర్వహించారు. సీమాంధ్ర ఉద్యోగులు నోటికి నల్లగుడ్డలుకట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. టీఎన్జీవోలు భోజన విరామ సమయంలో కాకుండా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో ఏపీఎన్జీవోలు పోటా పోటీ నినాదాలు చేశారు. -
ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతి
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ‘ఇది కేవలం ఉద్యోగులు నిర్వహిస్తున్న సభ’ అంటూ అనుమతి కోరిన నేపథ్యంలో కేవలం గుర్తింపు కార్డులు చూపించిన ఉద్యోగుల్ని మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను కూడా అనుమతించబోమన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని, ర్యాలీలు తీయడం మాత్రం నిషేధమని పేర్కొన్నారు. భద్రతా కారణాల నేపథ్యంలో సభా ప్రాంగణంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగులు తదితర వస్తువులను తీసుకురావటానికి అనుమతించబోమని చెప్పారు. ఏపీఎన్జీవోలు నిర్వహించే సభను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని కొందరు ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపడుతున్నారు. నగర పోలీసులతోపాటు సాయుధ విభాగం, కేంద్ర బలగాలను సైతం స్టేడియం చుట్టూ మోహరించనున్నారు. స్టేడియానికి దారి తీసే అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక నిఘా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి అపశ్రుతులు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సభను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలనుంచీ ప్రముఖుల హాజరు! ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తెలంగాణ జిల్లాల నుంచి కొంతమంది ప్రముఖులను సభావేదికపైకి తేవడం ద్వారా తమ సభ కేవలం 13 జిల్లాల సభ కాదన్న సందేశం ఇవ్వడానికి ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జంట నగరాల్లో సమైక్యవాదం వినిపిస్తున్న ఎమ్మెల్యేలను గుర్తించడానికి ఇప్పటికే కసరత్తు మొదలైంది. సభకు ఎమ్మెల్యేలను పంపించాలని ఎంఐఎం నాయకత్వానికి విజ్ఞప్తి చేయగా.. సభకు తమ ప్రతినిధులను పంపిస్తామని, అరుుతే, ఎమ్మెల్యేలను పంపించే విషయమై తర్వాత తవు నిర్ణయం చెబుతామని ఆ పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులును కూడా సభకు ఆహ్వానించగా, పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతామని ఆయన చెప్పారని సమాచారం. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న తెలంగాణ నేతలను సభకు తీసుకురావడానికి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సారధ్యంలో 25 మందితో సమన్వయ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని పలు కాలనీవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు తరలించే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లాల నుంచి జన సమీకరణకు కూడా కసరత్తు చేస్తున్నారు. శాంతి ర్యాలీలకు అనుమతి ఇస్తారా? హైదరాబాద్‌లో 7వ తేదీనాడే శాంతిర్యాలీల నిర్వహణకు అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) జేఏసీ, తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిజాం కళాశాల నుంచి గన్‌పార్కు వరకు శాంతి ర్యాలీకి ఓయూ జేఏసీ, సిటీ కాలేజీ నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీకి తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించారుు. రెండు ర్యాలీలూ ఎల్బీ స్టేడియం మీదుగానే సాగనున్నాయి. అయితే ఈ ర్యాలీలకు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎల్బీ స్టేడియం మీదుగా సాగే ర్యాలీలకు అనుమతి వచ్చే అవకాశం లేదని పోలీసు వర్గాలు చెప్పాయి. అయితే ర్యాలీ వూర్గాన్ని మార్చుకుంటే అనుమతి విషయం పరిశీలించే అవకాశం ఉందని ఆవర్గాలు పేర్కొన్నాయి. -
ఖాకీలకు సెప్టెంబరు 7 భయం
ఈ నెల 7వ తేదీ అంటే హైదరాబాద్ పోలీసులు హడలిపోతున్నారు. ఆ రోజున ఏపిఎన్జిఓలు, తెలంగాణవాదులు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున వేరువేరు కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్ శాఖ అనుమతి ఇస్తే ఎల్బి స్టేడియం లోపల, అనుమతి ఇవ్వకపోతే బయట 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సదస్సు నిర్వహించాలన్న పట్టుదలతో ఏపి ఎన్జిఓ సంఘం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి ప్రకటించింది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నిజాం కాలేజీ వరకు వేలాది మందితో శాంతి ర్యాలీ నిర్వహించాలన్న పట్టుదలతో తెలంగాణ జేఏసీ నాయకులు ఉన్నారు. సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని, లేకపోతే కోర్టు ద్వారా అనుమతిని తెచ్చుకుంటామని ఇప్పటికే ఏపీఎన్జీఓలు స్పష్టం చేశారు. అనుమతి రాకపోయినా సదస్సును నిర్వహించి తీరుతామని వారు చెబుతున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు కేవలం 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల సభ అని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని వినిపించే ఈ సభలో అన్ని ప్రాంతాలవారు పాల్గొంటారని చెప్పారు. ''ఉద్యోగుల సభను అడ్డుకుంటామంటున్నవారికి ఒకటే చెబుతున్నాం. మా సభ ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, విభజన వల్ల జరిగే నష్టాలు, ఎదురయ్యే ఇబ్బందులను వివరించడానికే దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. సభ పెట్టొద్దనే హక్కు ఎవరికీ లేదు. మా సభ విజయవంతం అయితే విభజన వాదనకు బలం లేనట్లే’’ అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా తమ సభకు రావచ్చని, అయితే పార్టీల జెండా, ఎజెండాలను పక్కనబెట్టి వస్తేనే ఆహ్వానిస్తామని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికే ఏ ప్రాంతం నాయకులైనా సభకు రావచ్చని తెలిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీఎన్జీఓల సభకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ప్రక్రియను కేంద్రం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 7న హైదరాబాదులో ముల్కీ అమరవీరుల శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిటీ కాలేజ్ నుంచి ఇందిరా పార్కు వరకు శాంతి ర్యాలీ జరుపుతామని చెప్పారు. తర్వాత ముగింపు సభ ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఇప్పటికే రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు రెండు వర్గాలు చీలిపోయారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో రెండు ప్రాంతాల వారు ఒకే రోజు హైదరాబాద్ చేరుకుంటే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు పక్షాలకూ అనుమతి ఇవ్వవద్దని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు నివేదికను పంపించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ చర్చలు జరిపారు. ఏ ప్రాంతం వారైనా సచివాలయం ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని మహంతి తెలిపారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేసేందుకు రెండు వేర్వేరు ప్రదేశాలను కేటాయించారు. సచివాలయం జే బ్లాక్ వద్ద తెలంగాణ ఉద్యోగులు శాంతియుత నిరసనకు అవకాశం కల్పించారు. సీమాంధ్ర ఉద్యోగులకు అమ్మవారి ఆలయం దగ్గర నిరసనకు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఈనెల 10 తేదీ వరకు ఎలాంటి సభలు, ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఈనెల 10 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల వారు సభలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంటే, పోలీసులు అందుకు అనుమతి ఇవ్వని పరిస్థితులలో 7వ తేదీన ఏం జరుగుతుందో వేచిచూడవలసిందే. -
వారి సభకు అనుమతివ్వొద్దు: టీ అడ్వకేట్ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈనెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్యసభకు అనుమతి ఇవ్వవద్దని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డిని సోమవారం కలసి వినతిపత్రం సమర్పించారు. కొందరు పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు సమైక్య నినాదం తో హైదరాబాద్‌లో సభలు పెట్టించడం ద్వారా ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జేఏసీ నాయకులు సీహెచ్ ఉపేంద్ర, కె.గోవర్ధన్‌రెడ్డి, జనార్దనగౌడ్, శ్రీధర్‌రెడ్డి తదితరులు అదనపు డీజీని కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రుల సభను అడ్డుకుంటాం: పిడమర్తి రవి 7వ తేదీన సీమాంధ్రులు నగరంలో నిర్వహించ తలపెట్టిన సభను అడ్డుకుంటామని టీఎస్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. సోమవారం ఓయూ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణను అడ్డుకుంటే భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ నెల 4న అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో 7న జరిగేది 23 జిల్లాల సమైక్య సభ: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహనా సదస్సు’ కేవలం 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల సభ అని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని వినిపించే ఈ సభలో అన్ని ప్రాంతాలవారు పాల్గొంటారని చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రైవేటు ఉద్యోగుల సంఘాల నాయకులు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల జేఏసీ నేతలతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఆర్టీసీ ఈయూ సీమాంధ్ర పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. తాము నిర్వహించ తలపెట్టిన సభకు ఇప్పటి వరకు అనుమతి రాలేదన్నారు. అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించనున్నామని చెప్పారు. సభను శాంతియుతంగా నిర్వహిస్తామని ప్రభుత్వానికి, హైకోర్టుకు హామీ ఇవ్వనున్నామని తెలిపారు. తాము తెలంగాణవాదానికి, ఉద్యమానికి వ్యతిరేకం కాదని, ఎవరినీ కించపరచడానికి ఈ సభను పెట్టడం లేదని, అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తమ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీల మీద అనుమానం కలిగే అవకాశం ఉందని అశోక్‌బాబు అన్నారు. సమైక్యవాదాన్ని నమ్మినవాళ్లంతా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులు కూడా సభకు రావచ్చని, అయితే పార్టీ రహితంగా రావాలని సూచించారు. సమన్వయ కమిటీ ఏర్పాటు: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు అశోక్‌బాబు అధ్యక్షతన 25 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. సభ తర్వాత అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి దాదాపు ఇదే కమిటీని సమైక్య ఉద్యమ జేఏసీగా మార్చనున్నారు. కమిటీ కోచైర్మన్లుగా పి.దామోదరరావు(ఆర్టీసీ ఈయూ), ఆర్వీఎస్ఎస్డీ ప్రసాదరావు (ఆర్టీసీ ఎన్ఎంయూ) ఎస్వీబీ రాజేంద్రప్రసాద్ (ఈయూ), పి.వి.రమణారెడ్డి (ఎన్ఎంయూ), కమలాకర్ (టీచర్స్ ఫెడరేషన్), వి.శ్రీకాంత్‌రెడ్డి (ఎస్వీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్), నరసింహారావు (నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్), బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), ఎ.వెంకటేశ్వరరావు (ఇండస్ట్రియలిస్టుల ఫోరం), బి.మధుసూదన్‌రెడ్డి (సినీ నిర్మాత), ఎం.వంశీకృష్ణ (జర్నలిస్టుల అసోసియేషన్), జాయింట్ కన్వీనర్లుగా ఎన్.చంద్రశేఖరరెడ్డి (ఏపీఎన్జీవో), డాక్టర్ కె.రాజేంద్ర (డాక్టర్స్ అసోసియేషన్), కె.శ్రీనివాసరెడ్డి (విశాలాంధ్ర మహాసభ), ఎం.జయకర్ (అడ్వొకేట్స్ అసోసియేషన్), ఎ.విజయ్‌కుమార్ (ఫ్యాప్సియా) కె.విజయ్‌కుమార్ (దళిత ఫోరం), కె.చిరంజీవిరెడ్డి (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్), జి.కుమార్‌చౌదరి యాదవ్ (సమైక్య ఏపీ సంరక్షక పార్టీ), కో-కన్వీనర్లుగా డేవిడ్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్ల అసోసియేషన్), దినకర్ (సీఏల సంఘం), హేమలత (ఆలిండియా మహిళా సంఘం), కె.నాగరాజు (ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్), ఎన్.శ్రీహరి (సమైక్య రాష్ట్ర సంరక్షణ సమితి) నియమితులయ్యారు. హైకోర్టు అడ్వొకేట్ సి.వి.మోహన్‌రెడ్డి, బార్‌కౌన్సిల్ సభ్యుడు కె.చిదంబరం, ఆంధ్ర మేధావులసంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్ సలహాదారులుగా వ్యవహరిస్తారు. -
రాజీనామాలు చేయండి: కేంద్రమంత్రులకు ఏపీఎన్జీఓల అల్టిమేటం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల (ఎపీఎన్జీఓ)లను బుజ్జగించ లేక సీమాంధ్ర మంత్రులు, ఎంపీల తల ప్రాణం తోకకు వస్తున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీఎన్జీఓ, సీమాంధ్ర ప్రాంత నాయకుల మధ్య వాడివేడి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గంటకుపైగా సాగిన ఈ సమావేశానికి కిషోర్ చంద్ర దేవ్ తప్ప మిగితా కేంద్ర మంత్రులందరూ హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎపీఎన్జీఓ నాయకులు సంధించిన ప్రశ్నలకు సీమాంధ్ర నేతల వద్ద సమాధానం కరువైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీమాంధ్ర మంత్రుల, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయకుండా..మౌనం పాటించడంపై ఎపీఎన్జీఓ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వెంటనే రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ఏపీఎన్జీఓలు సూచించినట్టు తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి పెరుగుతుందని, హైదరాబాద్ లో సెప్టెంబర్ 7 తేదిన తలపెట్టే సభకు అనుమతి వచ్చేలా చూడాలని విజ్క్షప్తి చేయగా, రాష్ట విభజన చేసేందుకు కేంద్రం ముందుకెళితే తాము రాజీనామాలు సమర్పిస్తామని ఎపీఎన్జీఓలు బుజ్జగించినట్టు తెలిసింది. -
ఏపీఎన్జీవోల సభకు అభ్యంతరం లేదు: మంత్రి గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడానికే ఒప్పుకున్న వాళ్లం... ఏపీ ఎన్జీవోలు సభలు పెట్టుకోవడానికి ఎందుకు అభ్యంతరం చెబుతామని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే, శాంతిభద్రతల పరిస్థితిని బట్టి సభకు అనుమతి ఇచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. గీతారెడ్డి నివాసంలో బుధవారం జరిగిన ఒక శుభకార్యానికి పలువురు తెలంగాణ ప్రాంత మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలు హాజరయ్యారు. అదే సందర్భంగా తాజా పరిణామాలపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, బసవరాజు సారయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్ అనిల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, ఇతర నేతలతో కలసి గీతారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ ఏడో తేదీన ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామంటున్నారని విలేకరులు ప్రస్తావించగా... శాంతియుతంగా ఎవరు ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని బదులిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో నేతలు, ప్రజలు సంయమనం పాటిస్తున్నారని.. కోస్తా, సీమ ప్రాంతంలోనూ నేతలు, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం మేరకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణనే కావాలని, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఇరుప్రాంతాల ఉద్యోగుల మధ్య దాడులు మంచిది కాదని హితవు పలికారు. అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలని ప్రార్థిస్తూ గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండలంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులందరితో పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో గ్రామస్థాయి నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రులు, పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. -
ప్రధానిని కలిసిన ఎన్జీవోలు
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంగళవారం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించామని ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ ‘న్యూస్‌లైన్’కు ఫోన్లో తెలిపారు. సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని పునః పరిశీలించే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేనని, సీమాంధ్రుల విద్యా, ఉపాధి, సాగునీరు, హైదరాబాద్ అంశాలపై కేంద్ర కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర విభజన చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. సమైక్యాంధ్రే సీమాంధ్రుల ఆకాంక్షని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ప్రధానికి వివరించారన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్, ఏలూరు నగరశాఖ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి రమేష్‌కుమార్, నాయకులు సందీప్‌గౌడ్, ఎన్ఎంయూ ఏలూరు రీజినల్ కార్యదర్శి ప్రసాద్ ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారన్నారు. -
కిరాయి రౌడీలతో దాడి: అశోక్ బాబు
-
దాడులు జరిపితే ఉద్యమం మరింత బలోపేతం: సీమాంధ్ర అడ్వొకేట్స్
తెలంగాణ న్యాయవాదుల తీరును ఖండిస్తున్నామని సీమాంధ్ర అడ్వొకేట్స్ అన్నారు. మా ఆఫీసులో తెలంగాణ లాయర్లు దౌర్జన్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కలిసుండగానే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక విడిపోతే ఎలాంటి స్థితి వస్తుందోనని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని..అయితే తాము తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమను అడ్డుకుంటే, తమపై దాడి చేస్తే సమైక్య ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని..ఇప్పటికే ఈ ఘటన తర్వాత చాలామంది ఫోన్ చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో కోటి మందితో తాము సభ పెట్టుకోవడానికి సిద్దమని ఆయన అన్నారు. కొందరు కిరాయి రౌడీలతో దాడి చేయించడాన్ని ఆయన ఖండించారు. తాము తిట్టినా, కొట్టినా తాము పడేందుకు సిద్దంగా ఉన్నామని.. ఎందుకంటే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరిగితే తెలంగాణ దూరమవుతుందని ఆయన హెచ్చరించారు. -
కూచిపూడిలో ఏపీఎన్జీవోలు, విద్యార్థుల ర్యాలీ
గుంటూరు: జిల్లాలోని అమృతలూరు మండలంలో ఏపీఎన్జీవోలు, విద్యార్థులు శుక్రవారం భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. గత కొన్నిరోజులుగా సీమాంధ్ర జిల్లాలో జరుగుతున్న ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ సమైక్యాంధ్రా గళం కలుపుతున్నారు. తెనాలిలో సమైక్యాంధ్రాకు మద్దతుగా ప్రైవేటు విద్యా సంస్థల బాలికల సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. కాలువలో కార్తీక దీపాలను వదులుతూ విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు. వారం రోజులలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్ నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. నిన్నటి వరకు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన మంత్రులు కూడా ఈరోజు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం గమనార్హం. -
నోటిసిచ్చే హక్కు అశోక్‌బాబుకు లేదు: టీఎన్జీవో
సెప్టెంబర్ రెండో తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఏపీ ఎన్జీవోలు నోటీసు ఇవ్వడంపై టీఎన్జీవోలు మండిపడుతున్నారు. అసలు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు సమ్మె నోటీసు ఇచ్చే హక్కు లేదని చెబుతున్నారు. అశోక్‌బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను సర్వీస్ నుంచి బర్తరఫ్ చేయాలని టీఎన్జీవో సెంట్రల్ అసోసియేషన్ డిమాండు చేసింది. ఈ మేరకు టీఎన్జీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీఎన్జీవో సమ్మె నోటీసుపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. మరోవైపు, సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడిని సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నరేందర్ ఖండించారు. అసలు రెండు ప్రాంతాలు కలిసుంటే తెలంగాణకు లాభమేంటని ఆయన ప్రశ్నించారు. -
‘విభజన పాపం సీమాంధ్ర నేతలదే’
విజయనగరం: రాష్ట్రాన్ని విభజించిన పాపం సీమాంధ్ర నేతలదేనని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు విమర్శించారు. విభజనకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల అలసత్వం వల్లే రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిందన్నారు. భారత మాజీ ప్రధాని నెహ్రూ ఆనాడు చెప్పిన ఆంధ్ర, తెలంగాణను విడదీసిన పాపం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వర్తింస్తుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే మూడు ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చించాలని గతంలోనే శ్రీకృష్ణ కమిటీ సూచించిందని, ఒకవేళ అలాకాకపోతే పౌరవిప్లవాన్ని చవిచూడాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పదవులకు రాజీనామా చేసిన వారి వెంటే ఉద్యోగ సంఘాల జేఏసీ ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా భయపడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. -
నినదిస్తూ.. నిలదీస్తూ..
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర నినాదాలతో ‘పశ్చి మ’ హోరెత్తుతోంది. ఉద్యమ పథంలోకి రాని రాజకీయ పార్టీల నాయకుల్ని నిలదీ స్తూ ప్రజాశ్రేణి ముందుకు సాగుతోంది. ఎన్జీవోల ఉద్యమ స్ఫూర్తి ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కిస్తోంది. 18వ రోజైన శనివారం అన్నిచోట్లా వినూత్న పంథాలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ప్రభు త్వ శాఖల ఉద్యోగులతో జేఏసీలు ఏర్పాటవుతుండటంతో ఉద్యమం మరింతగా వేడెక్కుతోంది. పెనుమంట్ర మండలం మార్టేరులో రైతు సత్తి చంద్రారెడ్డి ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. వైఎస్సా ర్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరింది. ఏలూరు నగ రంలో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించాయి. జేఏసీ నాయకులు ఎల్.విద్యాసాగర్, జీవీవీ సత్యనారాయణ, ఆర్ఎస్ హరనాథ్,చోడగిరి శ్రీనివాస్ ప్రదర్శనలో పాల్గొన్నారు. 108 ఉద్యోగులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరి మానవహారం ఏర్పాటు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోర్టులోని ఉద్యోగులందరూ ప్రదర్వన నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు భారీ ర్యాలీ చేశారు. ఐఏడీపీ హాలు వద్ద వ్యవసాయ అధికారుల సంఘం, ఆర్ అండ్ బీ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ప్రభుత్వాసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ భవన్ వద్ద సర్వేయర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి. పాలాభిషేకాలు.. ప్రదర్శనలు... ఏలూరు, పరిసర గ్రామాలకు చెందిన పాల వ్యాపారులు మోటారు సైకిళ్ళ ర్యాలీని తీన్ మార్ వాయిద్యాలతో నిర్వహించారు. వైఎంహెచ్ఏ హాలు వద్ద తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి సమైక్య నినాదాలు చేశారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్లో దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి 50 లీటర్ల పాలతో క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నుదుటికి సమైక్యాంధ్ర రిబ్బన్లు కట్టుకుని పాల క్యాన్లను భుజానికి ఎత్తుకొని సమైంక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములం అవుతామంటూ నినాదాలు చేశారు. 500 అడుగుల జెండాతో ప్రదర్శన భీమవరంలో శశి మెరిట్ స్కూల్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు 500 అడుగుల జాతీయజెండా ను ప్రదర్శించారు. వీరమ్మ పార్కు వద తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. నాయకులు గ్రంధి వెంకటేశ్వరరావు, కోడే యుగంధర్ కేసీఆర్ దిష్టి బొమ్మను ప్రకాశంచౌక్‌లో దహనం చేశారు. రాష్ట్రాన్ని సమై క్యంగా ఉంచాలని అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వికలాంగుడు కేతా శ్రీనివాసరావు మోటారు సైకిల్‌పై చేస్తున్న యాత్రకు భీమవరంలో జేఏసీ నాయకులు స్వాగతం పలికి అభినందించారు. మునిసిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగుల రిలే దీక్షా శిబిరంలో మునిసిపల్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కృష్ణమోహన్ ప్రసంగించా రు. నరసాపురం మండలం రుస్తుంబాద లెప్రసీ కాలనీకి చెందిన 23 కుటుంబాలకు చెందిన పిల్లలు, మహిళలు, వృద్ధులు దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద కేసీఆర్‌ను ఉరితీస్తున్నట్లు, సోని యా రాక్షస అవతారంతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. రోడ్లపై వంటావార్పులు పాలకొల్లులో శునకానికి సన్మానం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుడ్గాజంగాలు, నీటిపారుదల శాఖ సిబ్బంది, టాటా మ్యాజిక్ వాహనాల డ్రైవర్లు, యజమానులు ర్యాలీలు చేశారు. పోడూరు మండలం కవిటంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అత్తిలిలో ముస్లింలు మానవహారం ఏర్పాటు చేశారు. ఇరగవరంలో టీచర్లు వంటావార్పు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆచంట, పెనుగొండ బంద్ విజయవంైతమెంది. పెనుమంట్రలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వంటావార్పులో మహిళా సర్పంచ్‌లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొవ్వూరులో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మెరకవీధిలోని ఈజీకే రోడ్డుపై దళిత సంఘాల నాయకులు దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మ, నిడదవోలు-పంగిడి రహదారిపై రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. జంగారెడ్డిగూడెం రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, కర్రా రాజారావు ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు ఆటలతో వినూత్న నిరసన యలమంచిలి మండలం చించినాడలో జాతీయ రహదారిపై మహిళలు కబడ్డీ ఆడి, వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. తణుకులో జుట్టు కార్మికులు రోడ్డుపై కర్రసాము, యోగా విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. తణుకు వైజంక్షన్ వద్ద జాతీయరహదారిపై ఆర్టీసీ ఉద్యోగులు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ ఉద్యోగులు బస్సులపై ఎక్కి ప్రదర్శన చే శారు. ప్రజ్ఞ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డుపై పాఠాలు చెప్పారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్డుపై అర్ధనగ్నంగా స్నానాలు చేశారు. జేఏసీ శిబిరాన్ని సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు సందర్శించి సంఘీబావం తెలిపారు. -
ఎస్మా ప్రయోగిస్తే జైళ్లు చాలవు
ఉద్యోగుల సమ్మె మీద ఎస్మా ప్రయోగించినా వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించాలనుకుంటే ఉద్యోగులను పెట్టడానికి జైళ్లు సరిపోవన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఉద్యోగులను అణచివేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా వెరవమని చెప్పారు. ‘నో వర్క్.. నో పే’ కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రభుత్వం ఈ విధానాన్నే అవలంబించిందని గుర్తు చేశారు. సమ్మె కాలానికి జీతం వస్తుందా రాదా అన్న ఆలోచన సీమాంధ్ర ఉద్యోగుల్లో లేదన్నారు. ఇది జీతం కోసం చేస్తున్న ఉద్యమం కాదని, జీవితం కోసం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయండి ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని అశోక్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె వల్ల ప్రభుత్వ, రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందన్నారు. ‘విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థ పనిచేయడం లేదు. విద్యార్థులు గ్రామాల నుంచి కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకోవడానికి రవాణా వ్యవస్థ లేదు. కౌన్సెలింగ్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే ఒక సెంటర్ నుంచి మరో సెంటర్‌కు వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు. ఈ పరిస్థితుల్లో కౌన్సెలింగ్ వాయిదా వేయకుంటే విద్యార్థులు నష్టపోతారు’ అని పేర్కొన్నారు. వాయిదా వేయడం కొత్తకాదని, తెలంగాణ ఉద్యమం సమయంలోనూ వాయిదా వేశారని గుర్తు చేశారు. -
సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి
-
విజయమ్మను కలిసిన ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు
-
అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరాం: అశోక్‌బాబు
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసినట్లు ఆయన తెలిపారు. విజయమ్మతో భేటీ అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చూడాలన్నది విజయమ్మ గారి అభిప్రాయమన్నారు. న్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని యథాతధంగా ఉంచాలని విజయమ్మ డిమాండ్ చేస్తున్నారన్నారు. ఉద్యోగు సంఘాల ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిదింగా ఆమెను కోరినట్లు తెలిపారు. విజయమ్మ చేపట్టబోయే దీక్షకు ఏపీఎన్జీవోలు మద్దతు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డి అన్నారు. -
అనంతపురం జిల్లాలో సమ్మె మరింత ఉధృతం
అనంతపురం: జిల్లాలో సమైక్య ఉద్యమాలు మరింత ఉధృతమైయ్యాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలో గురువారం వేలాదిమంది ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా ఏపీఎన్జీవో, మున్సిపల్, రెవిన్యూ ఉద్యోగుల చేపట్టిన నిరాహారదీక్షలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. జాక్టో, ఎస్టీ, బీసీ సంఘాలు వినూత్న ప్రదర్శన చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ ఉద్యోగుల దీక్షకు వైఎస్సార్సీపీ నేత వివేకానంద రెడ్డి తన సంఘీభావాన్ని ప్రకటించారు. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థుల చేపట్టిన రిలే దీక్షలు 16వ రోజు కూడా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. . సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితిల్లోనూ సమ్మె ఆపేది లేదని ఎస్కేయూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు -
సమ్మె విరమించేది లేదు.. ఉపసంఘంతో ప్రయోజనం లేదు
రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ ఎన్జీవో నేతలతో చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతున్న నేపథ్యంలో ఆయన 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. సమ్మెను విరమించుకోవాలనో, తాత్కాలికంగా ఆపాలనో కోరేందుకే తమను పిలిపిస్తున్నట్లు భావిస్తున్నామని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమ్మెను విరమించుకునే ప్రసక్తి లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధత లేదని మంత్రివర్గ ఉపసంఘంతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే తాము భావిస్తున్నట్లు అశోక్ బాబు చెప్పారు. ఈనెల 16వ తేదీన అన్ని ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించబోతున్నామని, ఆ తర్వత వచ్చే వారంలో ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీని కలుస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాము తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు. దాదాపు నాలుగున్నర లక్షల మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే సమ్మెలో ఉండగా, కొత్తగా ప్రభుత్వ వైద్యులు, ఇతరులు కూడా ఈ సమ్మెలోకి దిగుతున్నారు. -
14డిపోల్లోనే నిల్చిపోయిన 1356 బస్సులు
-
తొలి రోజు సమ్మె విజయవంతం
-
సీమాంధ్ర నుంచి నిలిచిపోయిన ఆర్టీసి బస్సులు
-
వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ఏపీఎన్జీఓలు గత అర్థరాత్రి నుంచి బంద్‌ను తీవ్రతరం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీ.కే.మహంతి మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏపీఎన్జీఓలు బంద్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశమై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో ప్రజలకు అందించే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో సీఎస్ పలు శాఖ ఉన్నతాధికారులో సమావేశమై ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. అయితే ఆరోగ్యం, మున్సిఫల్ పరిపాలన, విద్యుత్ సమ్మె నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీఎన్జీఓలు ప్రకటించారు. సీమాంధ్రలో ఏపీఎన్జీఓలు చేపట్టిన సమ్మెకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. -
ఏపి ఎన్జీఓల ఆందోళన దృశ్యాలు
సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ సచివాలయంలో సోమవారం కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన చేశారు. -
మంత్రుల వినతిని తిరస్కరించిన ఏపీ ఎన్జీఓలు
హైదరాబాద్: సమ్మె విరమించాలన్న మంత్రుల విజ్ఞప్తిని ఏపి ఎన్జిఓలు తీరస్కరించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణలు సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించుకుని విధులకు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు సమ్మె విరమించమని మంత్రులు కోరారు. మంత్రుల బృందం వినతిని ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. సమ్మె వాయిదా వేయడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని చెప్పారు. చర్చల అనంతరం ఏపి ఎన్జీఓ సంఘం నేత అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సమ్మె వాయిదా వేసుకునే ప్రసక్తిలేదని మంత్రులకు చెప్పినట్లు తెలిపారు. జై సమైక్యాంధ్ర - విభజన వద్దు అంటూ ఏపి ఎన్జీఓ నేతలు నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. -
ఏపి ఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబుతో సాక్షి న్యూస్ మేకర్
-
జలసౌధ, విద్యుత్ సౌధ ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు
విభజన ప్రకటన నేపథ్యంలో రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మొన్నటికి మొన్న అబిడ్స్‌లోని బీమా భవన్లో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, మంగళవారం జలసౌధ, విద్యుత్సౌధలతో అదే దృశ్యం పునరావృతమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయింది. టీఎన్జీఓ ఉద్యోగులకు, ఏపీఎన్జీవో ఉద్యోగులకు మధ్య తోపులాట తీవ్ర వాగ్వాదానికి చోటుచేసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జరుపుకునేందుకు టీఎన్జీఓలు భోజన విరామ సమయంలో సన్నద్ధమయ్యారు. మరోవైపు అదేసమయంలో ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఎన్జీవోలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టివేసుకునేవరకు పరిస్థితి రావడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించేందుకు యత్నించారు. వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, అడీషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీలు వెంకటనర్సయ్య, వినోద్‌కుమార్, ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ప్రభాకర్ తదితరులు వచ్చి పరిస్థితిని చక్కబెట్టారు. ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మరో పది సంవత్సరాలు తమతో కలిసి ఉండాల్సిన ఉద్యోగులు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడకు పిలిపించుకొని కవ్వింపు చర్యలకు పాల్పడడం తగదని విమర్శించారు. 42రోజులు సకలజనుల సమ్మె సమయంలో కూడా ఏ ఉద్యోగికి ఎటువంటి ఇబ్బందులు కల్గించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి జరిగే సమ్మె గురించి చర్చించుకునేందుకు తాము సమావేశమైతే ‘సీమాంధ్ర గోబ్యాక్’ అంటూ టీఎన్జీవో నాయకులు రెచ్చగొట్టారని ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పయ్యావుల రాకతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విద్యుత్‌సౌధకు వచ్చి ఇక్కడి సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇంతలో అక్కడకు చేరుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఉద్యోగులను, పయ్యావుల కేశవ్‌ను చుట్టుముట్టారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చావా? మా కార్యాలయంలో నీకేం పని? అంటూ కేశవ్‌ను నిలదీశారు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాల వారిని సముదాయించి కేశవ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఉద్యోగులు కూడా ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.