'కేంద్ర మంత్రుల్ని రాజకీయంగా సమాధి చేస్తాం' | ashok babu takes on seemandhra cabinet ministers | Sakshi
Sakshi News home page

'కేంద్ర మంత్రుల్ని రాజకీయంగా సమాధి చేస్తాం'

Published Thu, Dec 26 2013 4:24 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

'కేంద్ర మంత్రుల్ని రాజకీయంగా సమాధి చేస్తాం'

'కేంద్ర మంత్రుల్ని రాజకీయంగా సమాధి చేస్తాం'

విజయనగరం: కేంద్ర మంత్రుల్ని రాజకీయంగా సమాధి చేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులే దౌర్భగ్యమే రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కారణమని మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర విభజన అంశంపై అవసరమైతే మరోసారి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత దుస్థితికి కేంద్ర మంత్రులు ప్రధాన కారణమన్నారు. వారి వైఖరి ఇలానే ఉంటే రాజకీయంగా సమాధి కాకతప్పదని ఘాటుగా విమర్శించారు. ఈ నెల 28 వ తేదీన మరోసారి రాజకీయ పార్టీలతో సమావేశమవుతామని అశోక్ బాబు తెలిపారు. తాము ఎప్పటికీ విభజనను వ్యతిరేకమన్నారు. అందరూ కలిసి వస్తేనే ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement