సమైక్య రాష్ట్రం కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.
సమైక్య రాష్ట్రం కోసం త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఈ నెల 21 విశాఖపట్నం, 23న హిందుపూర్, 24న కడప నగరాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. తమ ప్రాంతాల్లో కూడా సమైక్య సభలు పెట్టాలని నల్లగొండ, నిజామాబాద్ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
తెలంగాణ బొగ్గు, నీరు తీసుకుంటున్నామని ఆరోపిస్తున్నా వాటిని విద్యుత్ రూపంలో తెలంగాణ ప్రాంతానికే తిరిగి అందిస్తున్నట్లు అశోక్బాబు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ కొరత సమస్య తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపైన, కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావడంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అశోక్‌బాబు మండిపడ్డారు.