చిరంజీవి రాజీనామా చేస్తే..నేను కూడా చేస్తా: అశోక్ బాబు సవాల్ | chiranjeevi has no right to demand my resignation, says ashok babu | Sakshi
Sakshi News home page

చిరంజీవి రాజీనామా చేస్తే..నేను కూడా చేస్తా: అశోక్ బాబు సవాల్

Published Sun, Dec 1 2013 3:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చిరంజీవి రాజీనామా చేస్తే..నేను కూడా చేస్తా: అశోక్ బాబు సవాల్ - Sakshi

చిరంజీవి రాజీనామా చేస్తే..నేను కూడా చేస్తా: అశోక్ బాబు సవాల్

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మంత్రి చిరంజీవిపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మండిపడ్డారు. తన రాజీనామాపై డిమాండ్ చేస్తున్న చిరంజీవి రాజీనామా చేసిన మరుక్షణమే తాను కూడా రాజీనామా చేస్తానని అశోక్ బాబు సవాల్ విసిరారు.  సీమాంధ్రకు చెందిన నేతలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని ఏపీఎన్జీవో సంఘం అభిప్రాయపడితే.. చిరంజీవి మాత్రం తనను రాజీనామా చేయమంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారన్నారు. అయినా తనను రాజీనామా చేయమని అడిగే హక్కు చిరంజీవికి లేదన్న విషయం గుర్తించుకోవాలని అశోక్ బాబు స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లోపు సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే ఉద్యోగులు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 

సీపీఎం కార్యదర్శి రాఘవులతో ఆదివారం భేటీ అయిన అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని రాఘవులను కోరినట్లు తెలిపారు.కాగా, రాఘవులు మాత్రం పరిస్థితులను సమీక్షించి, డిసెంబరు 5 వ తేదీన కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement