రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ ఎన్జీవో నేతలతో చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతున్న నేపథ్యంలో ఆయన 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. సమ్మెను విరమించుకోవాలనో, తాత్కాలికంగా ఆపాలనో కోరేందుకే తమను పిలిపిస్తున్నట్లు భావిస్తున్నామని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమ్మెను విరమించుకునే ప్రసక్తి లేనే లేదని ఆయన స్పష్టం చేశారు.
చట్టబద్ధత లేదని మంత్రివర్గ ఉపసంఘంతో ఎలాంటి ప్రయోజనం ఉండదనే తాము భావిస్తున్నట్లు అశోక్ బాబు చెప్పారు. ఈనెల 16వ తేదీన అన్ని ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించబోతున్నామని, ఆ తర్వత వచ్చే వారంలో ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీని కలుస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాము తాడో పేడో తేల్చుకుంటామని అన్నారు. దాదాపు నాలుగున్నర లక్షల మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే సమ్మెలో ఉండగా, కొత్తగా ప్రభుత్వ వైద్యులు, ఇతరులు కూడా ఈ సమ్మెలోకి దిగుతున్నారు.
సమ్మె విరమించేది లేదు.. ఉపసంఘంతో ప్రయోజనం లేదు
Published Wed, Aug 14 2013 11:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement